పలు తెలుగు, కన్నడ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ యమున నాటకీయ రీతిలో గురువారం అర్ధరాత్రి బెంగళూరులోని హోటల్ ఐటీసీ రాయల్ గార్డేనియాలో వ్యభిచారానికి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. యమున, ఓ క్యారెక్టర్ నటి, రాజకీయ నేత కొడుకు, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారణ జరుపుతున్నారు. ఈ సెక్స్ రాకెట్‌తో ప్రముఖుల సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సినీ నటి యమునను వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్న మాట నిజమేనని నగర పోలీసు కమిషనర్ శంకర్ బిదరీ «ద్రువీకరించారు. దర్యాప్తు ొనసాగుతున్నందున ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేమని ఆయన చెప్పారు.
మూడు నెలల కిందటే తమకు ఈ హైటెక్ వ్యభిచార వ్యవహారానికి సంబంధించి ఉప్పందిందని, అన్ని విధాల అధారాలు అందిన తర్వాతే గురువారం రాత్రి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని బిదరీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హోటల్ యాజమాన్యం ప్రతినిధులపైనా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. చెన్నై, హైదరాబాద్‌లకు చెందిన ప్రముఖులతో ఈ సెక్స్‌రాకెట్‌కు సంబంధాలు ఉన్నట్లు నగర పోలీసులకు కొన్ని ప్రాథమిక సాక్షాధారాలు లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరింత దర్యాప్తు నిమిత్తం నగర పోలీసుల బృందం హైదరాబాద్‌కు వెళ్ళాలని నిర్ణయించింది
ఉలిక్కి పడ్డ శ్యాండల్‌వుడ్
సినీ నటి యమున వ్యభిచారం చేస్తూ అరెస్టు అయ్యారన్న వార్త శుక్రవారం బెంగళూరులో దావానలంలా వ్యాపించింది. ఈ ఘటనతో శ్యాండల్‌వుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరో వైపు ఒక సినిమా నిర్మాణానికి సంబంధించి తరచూ నగరంలోని రాయల్ గార్డేనియా హోటల్‌లో యమునతో పాటు సినీ ప్రముఖులు సమావేశం అయ్యేవారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుట్ర ప్రకారమే యమునను వ్యభిచారం కేసులో ఇరికించారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై వారు నేరుగా మీడియా వద్దకు రానప్పటికీ.. సినీ పరిశ్రమ ప్రముఖుల ద్వారా యమునను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శనివారం యమునను మీడియా ముందు హాజరు పరిచే అవకాశాలున్నట్టు సమాచారం. యమున పట్టుబడటంతో ఇది మరెందరి పీకలకు చుట్టుకుంటుందోనని సినీ పరిశ్రమలోని పలువురు ఆందోళన చెందుతున్నారు. కాగా.. హోటల్ వర్గాలు మాత్రం ఎలాంటి దాడులూ జరగలేదని చెబుతున్నాయి. ఒక వీఐపీ పార్టీలో పాల్గొనేందుకే పోలీసులు తమ హోటల్‌కు వచ్చారని వివరణిస్తున్నాయి.