మసాలా
 
 
 
 
హాలీవుడ్‌లో బెస్ట్ సౌష్టవ తారలు
అతివలు ముఖ సౌందర్యం గురించే కాదు తమ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకుంటే వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇటీవల లండన్‌లోని డైలీ మెయిల్‌ మ్యాగజైన్‌‌‌ నిర్విహంచిన బెస్ట్‌ బాడీస్‌ లిస్ట్‌లో ఆ సంస్థ అందంతో పాటు ఆరోగ్యవంతంగా ఉన్న మగువల గురించి వెల్లడించింది. కేవలం అందానికే పెద్దపీట వేయకుండా...మహిళల ఆరోగ్యంపైన, కొలతలపైన దృష్టి పెట్టి ఈ సర్వేని నిర్వహించింది. ఆ సర్వేలో పలువురు హాలీవుడ్‌ స్టార్లు అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ అందాల తారలు తమ అందచందాలు, గ్లామర్‌తో ఈ లిస్ట్‌లో ఇతర సుందరీమణులను పక్కకు నెట్టి పైకి వచ్చారు. హిట్‌ సినిమాలతో యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ అందాల రాణులు నేడు గ్లామర్‌ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమాలను సంపాదించుకున్న ఈ హాలీవుడ్‌ స్టార్ల గురించి...

కెల్లీ బ్రూక్‌...
మోడల్‌గా మంచి పేరు తెచ్చుకున్న కెల్లీ పుట్టింది ఇంగ్లాండ్‌లో. 16 ఏళ్ల వయసులో మోడలింగ్‌ బ్యూటీ కాంపిటీషన్‌లో విజేతగా అవార్డుకొట్టేసిన బ్రూక్‌ 2005లో ఎఫ్‌హెచ్‌ఎం విడుదల చేసిన 100 సెక్సియస్ట్‌ వుమన్‌ ఇన్‌ ద వరల్డ్‌ లిస్ట్‌లో మొదటిస్థానంలో నిలిచింది. స్విమ్‌వేర్‌, స్పోర్ట్స్‌వేర్‌ని ధరించటంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చెప్పే అందాల తారకు లండన్‌లో ఓ స్టోర్‌ కూడా ఉంది. సిని మా జీవితంలో అంతగా పాపులారిటీ లేని కెల్లీ 2000 లో వచ్చిన సార్‌టేడ్‌ చిత్రం తో తెరంగేట్రం చేసింది. టెలివిజన్‌ మూవీస్‌, టివి సీరీస్‌లో ఈమె ఎక్కువగా నటించింది.

డ్యాన్స్‌ అంటే తెగ ఇష్టపడే కెల్లీ ఎన్నో రియాలటీ షోలకు జడ్జీగానూ చేసింది. అందమైన పేజ్‌ త్రీ గర్ల్‌గా ఆమెను డైలీ స్టార్‌ టాబ్లాయిడ్‌ కీర్తించింది. అనంతరం జిక్యూ, లోడెడ్‌, ఎఫ్‌హెచ్‌ఎం వంటి పాపులర్‌ మ్యాగ జైన్లలో ఆమె గ్లామర్‌ ఫొటోలు రెగ్యులర్‌గా కనిపించాయి. ఆ తర్వాత గ్రేజియా మ్యాగజైన్‌ ఆమెను బెస్ట్‌ బ్రిటిష్‌ ఫిమేల్‌ బాడీగా ప్రకటించింది. 2007లో బిబిసి లో నిర్వహించిన సెలబ్రిటీ డ్యాన్సింగ్‌ కాంపిటీషన్‌ ‘స్ట్రిక్ట్‌లీ కమ్‌ డ్యాన్సింగ్‌’ షోలో ఆమె పాల్గొంది. ఇందులో ఆమె బ్రెండన్‌ కోల్‌తో పార్ట్‌నర్‌గా కనువిందుగా డ్యాన్స్‌ చేసి సందర్శ కులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ షోలో ఆమె ఇచ్చిన డ్యాన్స్‌ ప్రదర్శన ఆమెను ఓ ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా నిలబెట్టింది. సినీతారగా, మంచి డ్యాన్సర్‌గా నేడు కెల్లీ యువకుల హృదయాలను కొల్లగొడుతోంది.

కేట్‌ విన్‌స్లెట్‌...
టైటానిక్‌ సినిమాలో ప్రేయసిగా నటించి యువత మదిలో కలవరం రేపిన కేట్‌ విన్‌స్లెట్‌ పుట్టింది ఇంగ్లాండ్‌లో. ఇప్పటి వరకు ఆరు అస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన కేట్‌ 2008లో వచ్చిన ది రీడర్‌ సినిమాతో అకాడమీ అవార్డును సొంతం చేసుకుంది. హాలీవుడ్‌ చరిత్రలో చిన్నవయసులోనే ఆరు ఆస్కార్‌ నామినేషన్లకు ఎంపికైన తొలి నటిగానూ ఆమె రికార్డుని సృష్టించింది. 1991లో వచ్చిన డార్క్‌ సీజన్‌ టీవీ సీరీస్‌లో మొదటగా కనిపించిన కేట్‌ విన్‌స్లెట్‌ హెవెన్లీ క్రీచర్స్‌ సినిమాతో వెండితెరపై తొలిసారిగా కనిపించింది. విన్‌స్లెట్‌ సినిమాలో ఉందంటే చాలు ఆమె నటనకుగాను ఎదో ఒక అవార్డు రావాల్సిందే.

అంతే కాదు ఇప్పుడున్న నటీమణుల్లో మంచి ఇంగ్లీష్‌ మాట్లాడే నటి ఈమేనని న్యూయార్క్‌ మ్యాగజైన్‌ ప్రశంసించింది కూడా. మంచి సింగర్‌ కూడా అయిన కేట్‌ బెస్ట్‌ స్పోకెన్‌ వర్డ్‌ ఆల్బమ్‌కు గాను 2000లో గ్రామీ అవార్డును సైతం సొంతం చేసుకోవడం విశేషం. ఆమె వాట్‌ ఇఫ్‌ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌తో సింగర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. క్రిస్ట్‌మస్‌ కరోల్‌ హిట్‌ సింగిల్‌తో ఆమె యూరప్‌ దేశాల్లో స్టార్‌ సింగర్‌గా పేరుతెచ్చుకుంది. మొదట సెలబ్రిటీ జిమ్‌ త్రెప్లటన్‌ను వివాహం చేసుకొని ఆయనకు విడాకులిచ్చిన అనంతరం స్యామ్‌ మెండెస్‌ను పెళ్లిచేసుకుంది. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఆమెకు ప్రస్తుతం ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

హాలీబెరీ...
1999లో వచ్చిన ఇంట్రడ్యూసింగ్‌ డోరతి డాండ్రిడ్జ్‌ సినిమాకి అస్కార్‌ అవార్డుని తీసుకున్న హాలీబెరీ వయస్సు 43. 1986 లో తన యాక్టింగ్‌ కెరీర్‌ని ప్రారంభించిన ఆమె పుట్టింది అమెరికాలో. మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించి 1988లో మిస్‌ ఓహియో విజేతగా నిలిచిన బెరీ ఆఫ్రికన్‌ అమెరికన్‌గా అస్కార్‌ని అందుకున్న మొదటి మహిళగా రికార్డుని సొంతం చేసుకుంది. యాక్షన్‌ ఫిలింస్‌ అయిన ఎక్స్‌మన్‌, క్యాట్‌ ఉమ న్‌ సినిమాలతో పాటు 2002లో వచ్చిన బాండ్‌ ఫిలిం డై అనదర్‌ డే చిత్రంలోనూ నటించి ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది.

సినీ తారగానే కాకుండా అంతకుముందు ఫ్యాషన్‌ మోడల్‌గా, బ్యూటీ క్వీన్‌గా ఆమె ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఎమ్మీ గోల్డెన్‌ గ్లోబ్‌, ఎస్‌ఎజి అవార్డులను సొంతం చేసుకుంది. సినీ రంగంలోకి ప్రవేశించక ముందు హాలీబెరీ 1986లో జరిగిన మిస్‌ యుఎస్‌ఎ పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అనంతరం మిస్‌ యుఎస్‌ఎ వరల్డ్‌ పోటీల్లో విజేతగా నిలిచి అందాల కిరీటాన్ని దక్కించుకుంది. 1991లో విడుదలైన జంగిల్‌ ఫీవర్‌తో సినీతారగా మంచి బ్రేక్‌ను సాధించిన ఆమె అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా పలు హిట్‌ సినిమాలతో సినీతారగా మంచి పేరుతెచ్చుకుంది. ముందుగా బేస్‌బాల్‌ ప్లేయర్‌ డేవిడ్‌ జస్టిస్‌ను పెళ్లిచేసుకొని అతనికి విడాకులిచ్చింది. ఆ తర్వాత మ్యుజీషియన్‌ ఎరిక్‌ బెనెట్‌ను వివాహం చేసుకొని అతనికి కూడా విడాకులిచ్చి ప్రస్తుతం ఫ్రెంచ్‌- కెనడియన్‌ మోడల్‌ గాబ్రియల్‌ అబ్రీతో బెరీ డేటింగ్‌ చేస్తోంది. ప్రస్తుతం హాలీ బెరీకి నహ్లా అరియాల అబ్రీ అనే కూతురు ఉంది.

మెగాన్‌ ఫాక్స్‌...
2001లో వచ్చిన టెలివిజన్‌ షో హాలీడే ఇన్‌ ద సన్‌తో గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫాక్స్‌ ఫేమ్‌ అయింది మాత్రం టాన్స్‌ఫార్మర్స్‌ చిత్రంతోనే. 1986 మే 16న యుస్‌లో పుట్టిన మెగాన్‌ ఫాక్స్‌ నటికాక ముందు మోడల్‌. మోస్ట్‌ సెక్సియస్ట్‌ ఉమన్‌ ఇన్‌ ది వరల్డ్‌ లిస్ట్‌లో ఎన్నోసార్లు టాప్‌ 10లో ఉన్న మెగాన్‌ డేటింగ్‌ చేయటంలో దిట్ట. 2011లో వస్తున్న ట్రాన్స్‌ఫార్మర్స్‌ 3లోనూ ఆమే హీరోయిన్‌. సినీ రంగంలోకి రా ముందు మోడల్‌గా సైతం రాణించింది మెగాన్‌ ఫాక్స్‌.

బియాన్స్‌నోయెల్స్‌...
గర్ల్‌గ్రూప్‌ డెస్టినీ చైల్డ్‌తో మ్యూజిక్‌ కెరీర్‌ని ప్రారంభించిన బియాన్స్‌ సింగర్‌, రైటర్‌, మోడల్‌, నటిగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుంది. 28 ఏళ్ల బియాన్స్‌ నోయెల్స్‌ పుట్టింది అమెరికాలో. పాప్‌, హిప్‌పాప్‌ మ్యూజిక్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందిన ఈమె ఇప్పటివరకు 95 అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఆమె వంద హాట్‌ సింగిల్స్‌ పాటలతో సెలబ్రిటీ సింగర్‌గా ఎంతో పేరుతెచ్చుకుంది. 2000 శతాబ్దపు సక్సెస్‌ఫుల్‌ ఫిమేల్‌ ఆర్టిస్ట్‌గా బిల్‌బోర్డు 2009లో ఆమెను కీర్తించింది.