పక్కదారులు పట్టి భార్య చేతిలో మూతి పచ్చడి చేసుకున్న ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్స్ వుడ్స్ కథాకమామిషుపై హాలీవుడ్ కన్నేసింది. అతని జీవితంపై ఓ టెలీ ఫిల్మ్‌ను రూపొందించాలని నిర్మాతలు తెగ ఉత్సాహంతో ఉన్నారు. వుడ్స్‌గా నటించేందుకు అతనిపోలికలున్న నటుడు క్యూబా గుడింగ్ జూనియర్ సిద్ధమయ్యాడు. వుడ్స్ గత రెండు నెలల్లో 14 మంది అతివలతో శృంగార సంబంధాలు నెరిపాడని సమాచారం.
అతని కొత్త ప్రియురాళ్లలో ఓ వెయిట్రెస్, ఓ నీలిచిత్రాల నటి కూడా ఉన్నట్లు భోగట్టా. వుడ్స్‌తో తాము పడక పంచుకున్నట్లు వీరు మీడియాకెక్కారు. దీంతో వుడ్ భార్య ఎలిన్ నార్డెగ్రెన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 'గొప్పవాళ్ల కీర్తి కిరీటాలు, భుజకీర్తులు రాలిపడుతుంటే జనం ఆనందంగా చూస్తారు. వుడ్స్‌పై తీసే సినిమాను కూడా బాగా ఆదరిస్తారు' అని ఓ సినిమాజీవి చెప్పనట్లు 'డైలీ స్టార్' ఆన్‌లైన్ తెలిపింది.
|