Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
టాప్ 10 బాలీవుడ్ చిత్రాలు
ఇప్పటిదాకా బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్లపరంగా టాప్ పొజిషన్ గా చెప్పబడుతున్నచిత్రాల గురించి చెప్పుకోవాలంటే... ముందుగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కాజోల్ లు జంటగా నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రం గురించి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. మరోసారి షారుక్, కాజోల్ జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 62 కోట్ల 8 లక్షల 89వేల 48 రూ. వసూలు చేసింది. 2001లో సన్నిడియోల్ , అమీషాపటేల్ నటించిన ‘గదర్ ఏక్ ప్రేమ్ కథ’ చిత్రం రూ.65 కోట్లు వసూలు చేసింది.

అక్షయ్ కుమార్, దీపిక పదుకొనెలు నటించిన ‘హౌస్ ఫుల్’ చిత్రం ఈ సంవత్పరం ఏప్రిల్ 30న దేశవ్యాప్తంగా విడుదలై మంచి హిట్ టాక్ తో రికార్డలు సృష్టించింది. ఈ చిత్రం మొత్తం 67 కోట్ల 74 లక్షల 94 వేల 585 రూపాయలు వసూలు చేసి టాప్ 10 చిత్రంగా నిలబడింది. అలాగే 2007లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ 69,96,01,108, 2006లో వచ్చిన ధూమ్-2 చిత్రం 83,51,87,981 రూ.వసూలు చేశాయి. 2008లో వచ్చిన ‘రబ్ నే బనాది జోడి’ చిత్రం 73,52,37,848 రూ. వసూలు చేసింది. 2010లో వచ్చిన ‘రాజ్ నీతి’ 94,89,66,316 రూ. వసూలు చేసింది. ఇదే సంవత్సరం విడుదలైన ‘దబంగ్’ 106 కోట్లు వసూలు చేసింది. 2008లో వచ్చిన ‘గజిని’చిత్రం 117,48,22,756 రూ. వసూలు చేసింది. 2009లో వచ్చిన ‘3 ఇడియట్స్’ చిత్రం 189,38,74,729 రూ.వసూలు చేసి సరికొత్త అధ్యాయం సృష్టించింది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005