Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
బాలీవుడ్ లో త్రిష తొలి భంగపాటు

     వర్షం’లో తడిసిన అందాలతో ‘నువ్వొస్తానంటె.. నేనొద్దంటానా’ అంటూ దక్షిణాది చిత్రాలలో తన కెరీర్‌గ్రాఫ్‌ను అమాంతం పెంచేసుకుని ఇప్పుడు ఉత్తరాదిన కూడా తన అందాలతో బాలీవుడ్‌ అభిమానుల హృదయాలను దోచుకోవడానికి త్రిష చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్లేనని తెలుస్తోంది. ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన త్రిషకు శుక్రవారం భారీఎత్తున విడుదల అయిన ‘కట్టా...మీఠా’ చిత్రం యావరేజ్‌ చిత్రంగా ప్రేక్షకుల చెంత నిలిచింది. ప్రియదర్శన్‌ ఎప్పుడో మలయాళంలో హిట్‌ అయిన ‘వెలనాకులుడె నాడు’ చిత్రంకు కొద్ది మార్పులు చేసి హిందీలో ‘కట్టా..మీఠా’గా రూపొందించాడు. అయితే ఈ సినిమాకు త్రిష యాక్షనే పెద్ద మైనస్‌గా మారిందని బాలీవుడ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష ఐఎఎస్‌ అధికారిణి(మున్సిపల్‌ కమిషనర్‌) పాత్రలో అంత ఠీవీగా కనిపించలేదని...పైగా అక్షయ్‌కుమార్‌తో అంతగా కెమిస్ట్రీ వర్కవుట్‌ కాలేదని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు మరో కొత్త వివాదం చుట్టుకుంది. సినిమాలో ఒక సన్నివేశంలో ఏనుగుతో బుల్‌డోజర్‌ను తోయించే సన్నివేశం ఉంది.

స్వచ్ఛంద జంతు సంరక్షణ సంస్థ నిర్వాహకులు అసలు ఈ సినిమాలో జంతువులను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని...ఈ చిత్రాన్ని నిలిపేయాలని గొడవ చేస్తున్నారట. ఏది ఏమైనా త్రిష ఎన్నెన్నో ఆశలు పెట్టుకుని తమ సహచరులు అసిన్‌, శ్రీయల కన్నా ఓ అడుగు ముందుకు వేయాలనుకున్న లక్ష్యానికి తూట్లు పొడిచింది ‘కట్టా-మీఠా’ చిత్రం. ఇప్పుడు త్రిష తొలి చిత్రం యావరేజ్‌ కావడంతో బాలీవుడ్‌లో ఆమె భవిష్యత్‌ అంత సజావుగా సాగదని అర్థమవుతోంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005