Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
బాలీవుడ్ త్రిషకు ‘కట్టా’నా, ‘మీఠా’నా?

     సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరున్న త్రిష అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో తయారవుతున్న ‘కట్టా మీఠా’ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో ఇప్పటికే 35కు పైగా చిత్రాల్లో నటించిన త్రిష బాలీవుడ్లో మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తుండగా, ‘కట్టా మీఠా’ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలా వుంటుందనే కథతో ఆ చిత్రం రూపొందుతోంది.

త్రిష మాట్లాడుతూ- ‘ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘లేసా లేసా’ చిత్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. ిప్పుడు ఆయన డైరెక్షన్లో రూపొందుతున్న ‘కట్టా మీఠా’ ద్వారా బాలీవుడ్లో పరిచయం కావడం చాలా హ్యాపీగా వుంది.’ అని చెప్పింది. తన రియల్ లైఫ్ కి భిన్నంగా త్రిష ఆ సినిమాలో కనిపిస్తుంది.

తొలి బాలీవుడ్ చిత్రంలో తన హీరో అక్షయ్ కుమార్ గురించి త్రిష మాట్లాడుతూ- ‘ఆయన నా హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా’ అని చెప్పింది. ఇక త్రిష ఎంట్రీ గురించి బాలీవుడ్లో ఇప్పటికే ఆసక్తి మొదలయ్యింది. ‘ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయగలిగే తారల్లో త్రిష కూడా వుంది. ఇమేజ్ చట్రానికి బందీ కాకపోవటం ఆమెకు ప్లస్ పాయింట్. అదే ఆమెను బాలీవుడ్లో చాలాకాలంపాటు వుంచుతుంది’ అని సినీ పండితుడు ఒకరు విశ్లేషించారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005