ఈ మధ్య త్రిష పెళ్లి వార్తలు దక్షిణాదిన షికార్లు చేశాయి. వాటిని ఆమె చిరునవ్వుతో తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కాగా... ఇటీవల తన పెళ్లి గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పేశారు ఈ చెన్నయ్ చందమామ. తమిళంలో అజిత్‌తో చేస్తున్న ‘మంకత’ త్రిష నలభైయ్యవ సినిమా. యాభై సినిమాలను పూర్తి చేసిన తర్వాత అంటే... ఇంకా పది సినిమాల్లో నటించిన తర్వాత, పెళ్లి గురించి ఆలోచిస్తానని త్రిష చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. నా తరం కథానాయికల్లో ఎవరూ చేయని ఫీట్ చేయాలనేది నా తొలి లక్ష్యం. బాలీవుడ్‌లో నాకు ఎదురైన పరాజయానికి ప్రతిగా... విజయం సాధించి, అక్కడ కూడా శభాష్ అనిపించుకోవాలి.
ఇది నా రెండవ లక్ష్యం. ఇకపోతే ఇక్కడ నాకు కొన్ని తీరని కోరికలు ఉన్నాయి. అవేంటంటే... సౌత్‌లో దాదాపు అందరు స్టార్‌హీరోలతో పనిచేశాను. ఇటీవలే కమల్‌సార్‌తో కూడా నటించాను. ఇక రజనీసార్‌తో నటించాలి. అలాగే... మణిరత్నం దర్శకత్వంలో ‘యువ’లో నటించాను. కానీ అందులో ముగ్గురు నాయికల్లో నేను ఒకదాన్ని.
అలా కాకుండా మణిసార్ దర్శకత్వంలో సోలో హీరోయిన్‌గా నటించాలి. ఇవన్నీ తీరాక, అప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాను. ఆ తర్వాతే పెళ్లి’’ అని తన మనసును ఆవిష్కరించారు త్రిష. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో అజిత్ ‘మంకత’లో, తెలుగులో వెంకటేష్ సినిమాలో, కన్నడంలో ‘బుల్ బుల్’ చిత్రాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు. రెండు బాలీవుడ్ సినిమాలకు కూడా సైన్ చేసినట్టు సమాచారం.