మసాలా
 
 
 
 
చిక్కుల్లో మార్ఫింగ్ ఫొటో నటి వీణా మాలిక్
ఓ భారతీయ మేగజైన్ నుంచి పాకిస్తానీ మోడల్, నటి వీణా మాలిక్ రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది. ఎఫ్.హెచ్.ఎమ్. ఇండియా మేగజైన్ తాజా ముఖచిత్రంపై మార్ఫింగ్ చేసిన తన నగ్నచిత్రాన్ని ప్రచురించడం ద్వారా తనని మోసం చేశారని ఆరోపిస్తూ ఆమె ఆ పత్రికకు ఓ నోటీసు పంపింది. ఈ చర్య ఇటు భారతదేశంలో, అటు తన మాతృభూమి పాకిస్తాన్‌లో తన కీర్తి ప్రతిష్ఠలకు తీవ్ర భంగం కలిగించిందని ఆ నోటీసులో పేర్కొంది వీణ.డిసెంబర్ సంచిక ముఖచిత్రంపై అలంకరించిన వీణ నగ్నరూపంతో పాటు 'ఆసిఫ్, బుర్ఖాలు, వర్క్ వీసాలపై పాకిస్తానీ డబ్ల్యుఎండీ వీణా మాలిక్' అనే కేప్షన్‌ని ప్రచరించింది ఎఫ్.హెచ్.ఎమ్. ఇండియా మేగజైన్. ఆ ఫొటోలోని చేతిపై 'ఐఎస్ఐ' అనే టాట్టూ కూడా ఉంది. "నేను నగ్నంగా ఎప్పుడూ పోజివ్వలేదు. అలాంటి చర్యకు ఎన్నడూ పాల్పడలేదు. అది మార్ఫింగ్ చేసిన ఫొటో. అది కచ్చితంగా నాది కాదు'' అని చెప్పింది వీణ.

అయితే ఆమె మాటల్ని ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ కబీర్ శర్మ తోసిపుచ్చారు. "వీణతో చేసిన ఫొటో షూట్‌కి సంబంధించిన వీడియో మా దగ్గర ఉంది. పైగా ఆ ఫొటోగ్రాఫ్‌ను ప్రచురించుకోవడానికి అంగీకరిస్తూ ఆమె పంపిన ఇ-మెయిల్ కూడా ఉంది. ఆ ఫొటోల్ని తను చూశాననీ, వాటి విషయంలో సంతోషంగా ఉన్నాననీ, ముఖచిత్రం గురించి ఎదురు చూస్తున్నాననీ అందులో ఆమె తెలిపింది. నవంబర్ 22న ముంబైలో ఆ ఫొటో షూట్ జరిగింది'' అని ఆయన స్పష్టం చేసారు. నగ్న చిత్రాల కోసం తన ఫొటోలను మార్ఫింగ్ చేశారని ఓ మేగజీన్‌పై కేసు పెట్టిన పాక్ నటి వీణా మాలిక్ చిక్కుల్లో పడ్డారు. నగ్న చిత్రాల కోసం ఆమెనే తమను సంప్రదించారని వాటిని ప్రచురించిన ఎఫ్‌హెచ్ఎం ఇండియా తెలిపింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై రూ. 25 కోట్లకు కోర్టులో దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు వీనామాలిక్‌కు 11 పేజీల లీగల్ నోటీసు పంపించింది. వీనామాలిక్ ఫొటోలను మార్ఫింగ్ చేయలేదని, ఆమె అంగీకారంతోనే ఫొటోలతో పాటు వీడియో చిత్రీకరణ కూడా చేశామని అందులో పేర్కొంది. సెక్సీగా కనిపించాలని ఆమె ఆశించారని, ఇందుకోసం తన బికినీ చిత్రాలను కూడా తమకు పంపారని ఎఫ్‌హెచ్ఎం తెలిపింది. నిరాధార ఆరోపణలపై రూ. 25కోట్ల పరిహారం చెల్లించాలని, క్షమాపణ చెప్పాలని తన నోటీసులో పేర్కొంది.