Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
కొత్తను కోరుతున్న విద్యాబాలన్

      ''తమ అభిమాన తారలు నటించారని సినిమాలకు వచ్చే రోజులు కొండెక్కాయి. ఎంత గొప్ప నటీనటులు ఉన్నా... వారి ఇమేజ్‌ సినిమా ప్రారంభవసూళ్ళకు మాత్రమే పరిమితమవుతున్నారు. తొలి రెండు మూడు షోలను చూసిన ప్రేక్షకుల నోటి నుంచి వచ్చే అభిప్రాయాలతో ఆ సినిమా తలరాత మారిపోతోంది. 'బాగా లేదు' అనే పదం వచ్చిందంటే ఎంత గొప్ప తారలు నటించినా వారం తిరిగే సరికల్లా ఆ సినిమా థియేటర్లలో ఉండట్లేదు. ఎందుకు బాగాలేదో ఒకసారి చూద్దామనుకునే సహనం ప్రజల్లో లేదు.''

''దర్శకుడు కాస్త భిన్నంగా కథ చెబితే నటించడానికి గతంలో నటీనటులు తర్జనభర్జనలుపడేవారు. కానీ ఇప్పుడు కెరీర్‌ ప్రారంభ దశలో ఉన్నవారు కూడా ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. 'వేకప్‌ సిద్‌' సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ నటించడమే ఇందుకు తార్కాణం. నటీనటుల ఆలోచనలు మారాయనడానికి ఇదే ఉదాహరణ.''

''కాస్త వైవిధ్యమైన కథాంశాన్ని ఎన్నుకుంటే అది సమాంతర చిత్రమని పక్కకు నెట్టేసిన రోజులు మనకు తెలుసు. మంచి ఆలోచనలున్నా వాటిని ఆచరణలోపెట్టడానికి వాణిజ్య అంశాలు అడ్డొచ్చిన సందర్భాలు ఎన్నో. వాటన్నింటినీ పరిశీలిస్తే ఇప్పుడు నడుస్తున్న కాలం సినిమా చరిత్రలో చాలా గొప్పది. వైవిధ్యమైన చిత్రాలను, కథాంశాలను ధైర్యంగా తెరకెక్కించే దర్శకనిర్మాతలున్నారు. వారిలోని కొత్త ఆలోచనలు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఆహ్వానిస్తున్నారు. ఆ తరహా చిత్రాల్లో నేనూ భాగస్వామిని అవుతున్నందుకు ఆనందంగా ఉంది'' అని అంటోంది విద్య.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005