మసాలా
 
 
 
 
'విశ్వరక్షకుడు' వస్తున్నాడు
హెన్రీ కెవిల్, ‘స్లమ్‌గాడ్ మిలియనీర్’ ఫేం ఫ్రిదా పింటో ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఇమ్మోర్టల్స్’. దాదాపు మూడువేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రానికి భారతీయుడైన తారెమ్స్ సింగ్ దర్శకుడు. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తం ఈ చిత్రం విడుదల కానుంది.

కాగా, ఈ సినిమాను ‘విశ్వరక్షకుడు’ పేరుతో బి.మురళీమోహన్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘ది గాడ్ నీడ్స్ ఎ హీరో’అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ట్రైలర్స్ అవిష్కరణ నిర్మాత కేఎస్‌రామారావు, దర్శకుడు ఎన్.శంకర్ చేతుల మీదుగా మంగళవారం జరిగింది.

నిర్మాత మాట్లాడుతూ- ‘‘‘300 యోధులు’ చిత్రాన్ని నిర్మించిన ఫ్రాంక్ మిల్లర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా ఇది. ఇండియా నేటివిటీతో ఈ చిత్రం రూపొందింది. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బుర పరుస్తాయి’’ అని తెలిపారు. హరికృష్ణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నరసింహ ఈ చిత్రానికి సహనిర్మాతలు.