స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రిదా పింటో, హెన్రీ కెవిన్ ప్రధానపాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఇమ్మోర్టల్స్’. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘300 యోధులు’ నిర్మాతల నుంచి వస్తున్న తాజా చిత్రమిది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11న విడుదలవుతోంది. తెలుగులో 9స్టూడియోస్ పతాకంపై బి.మురళీమోహన్‌రెడ్డి అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి బ్రోచర్ (ఫస్ట్‌లుక్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాయచోటి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత శ్రీకాంత్‌రెడ్డి ఆవిష్కరించగా, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అందుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘భాషాభేదం లేకుండా మన ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారు. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు నిర్మాతని అభినందిస్తున్నా’ అన్నారు.. పి.పి.నరసింహ, హరికృష్ణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి.. తెలుగు వెర్షన్‌కి సహనిర్మాతలు. మిక్కి రూర్కే, జాన్ హర్ట్ ఇతర ప్రధానపాత్రలు పోషించారు.
|