ఏ సినిమాకు వెళ్దాం? అనే ప్రశ్నతో ‘ఎవరు తీశారు’ అనే ఆలోచనా వస్తుంది. ఏ కల్చరల్ ఈవెంట్‌కు వెళ్దాం? అనే ప్రశ్నకు ‘ఎవరు
నిర్వహిస్తున్నారు’ అనే ఆలోచనా సహజం. ‘యువకళావాహిని’ నిర్వహించే కార్యక్రమాలు కళాభిమానులను ఇట్టే ఆకర్షిస్తాయి. దీని
వెనుక మూడున్నర దశాబ్దాల కృషి ఉంది. వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు, దర్శకుడు యార్లగడ్డ కృష్ణ నాగేశ్వరరావు (వైకే) శ్రమా
ఉంది. ఇటీవలే సంస్థ పక్షాన ‘పౌరాణిక చలనచిత్ర సప్తాహం’ దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా వైకేతో మాటా మంతీ...
ఈ తరానికి అవగాహన
రోజూ ఏ ఛానెల్ తిప్పినా ఏదో ఒక పాత చిత్రం వస్తుంది. అటువంటప్పుడు పాత చిత్రాలు మళ్లీ ఎందుకు? అనుకున్నవారు లేకపోలేదు.
చిత్రప్రదర్శనతోపాటు చిత్రం ప్రత్యేతను ప్రముఖులు వివరించారు. ఆ మాటకు అర్థం ఏమిటి? ఈ పాట ప్రత్యేకత ఏమిటి? ఒక పాత్రను
ఎలా రూపకల్పన చేశారు? తది తర అంశాలను నటీనటులు, నిపుణులు వెల్లడించారు. తెలుగు భాష- ఉచ్చారణ-కట్టు-బొట్టు-సంస్కృతీ
సంప్రదాయాలపై ఈ తరానికి అవగాహన కలిగించాం. మాయాబజార్, శ్రీవేంకటేశ్వరమహాత్మ్యం, లవకుశ, పాండవవనవాసం తదితర
సినిమాలను రోజూ కనీసం మూడు వందల మంది తిలకించారు. విశేషాలను ఆలకించారు. పాత చిత్రాలూ కొత్త ఆలోచనలను
ఇచ్చాయని మా విశ్వాసం.
నూరు నాటికల ప్రచురణ
1975లో ఔత్సాహిక నాటక సమాజంగా సాంస్కృతిక రంగంలో ప్రవేశించిన ‘యువకళావాహిని’ 1979 నుంచి కార్యక్రమాలను నిర్వ
హిస్తోంది. వెండినందిని బహుమతిగా పొం దిన రాణాప్రతాప్, గౌతమబుద్ధ, అశోక, నేతా జీ తదితర చారిత్రక పురుషుల నాటకాలు
వేస్తూనే ఇతర సంస్థలతో కలసి సంయుక్త కార్యక్రమాలను చేపట్టింది. రాష్ట్ర నాటకపరిషత్ స్థాయికి తగ్గకుండా 16 ఏళ్లుగా ‘డాక్టర్
అక్కినేని నాటక కళాపరిషత్’ ద్వారా నాటికల పోటీ లు నిర్వహిస్తోంది. పదేళ్లుగా ప్రదర్శించిన వం దకు పైగా నాటికలను పుస్తకరూపంలో
తీసుకొచ్చాం. ‘స్వర చక్రవర్తులు’ కార్యక్రమం ద్వారా 25 నెలలు తెలుగు సంగీత దర్శకుల విభావరిని (సాలూరి రాజేశ్వరరావు నుంచి
కీరవాణి వరకూ) నిర్వహించాం.
త్వరలో జాలాదికి నీరాజనం
సముద్రాల నుంచి డాక్టర్ సినారె వరకూ రచిం చిన సినీ పాటలతో కార్యక్రమాలను నిర్వహిం చాం. ఇటీవలనే స్వర్గస్తులయిన జాలాదిని స
త్కరించుకునే భాగ్యమూ మాకు కలిగింది. వా రి గీతాల ఆలాపనతో...ఆయన అభిమానులందరూ హర్షించే రీతిలో జాలాదికి నీరాజనంగా
త్వరలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
గౌరవం, ప్రోత్సాహం మా ఆదేశికసూత్రం
బాగా పేరున్నవారినీ, ఉన్నత స్థాయిల్లో ఉన్నవారిని మాత్రమే మేము సత్కరిస్తాం అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. లలిత క ళల్లో
విశేష కృషి చేసిన పెద్దలను గౌరవించడం, యువకులను ప్రోత్సహించడం మేము విధించుకున్న ఆ దేశిక సూత్రం. సుమ, జ్యోతిరెడ్డి,
డీఏ. మిత్ర తదితరులు కళాకారులుగా రూపొందడంలో ‘యువకళావాహిని’ బంగారపు పళ్ల్లేరానికి గోడచేర్పుగా దోహద పడిందని
కళాభిమానులు మమ్మల్ని గుర్తుంచుకుంటారు. భవిష్యత్తులోనూ ‘యువ’కళకు వన్నె తెచ్చే బాధ్యతను కొనసాగిస్తాం.