న్యూస్/వ్యూస్
 
 
 
 

కాజల్ పారితోషికాన్ని కోటికి పైగా పెంచేసిందట
కోలీవుడ్, టాలీవుడ్‌లో నటి కాజల్ హవా అంతా ఇంతా కాదు. ఈ రెండు భాషలలోను క్రేజీ హీరోయిన్‌గా మరిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో ప్రస్తుతం కె వి ఆనంద్ దర్శకత్వంలో సూర్య సరసన మాట్రా న్ చిత్రంలోనూ, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్‌కు జంటగా తుపాకీ చిత్రం లోనూ నటిస్తున్నారు. వీటితో పాటు క్లౌడ్‌నౌన్ మూవీస్ సంస్థ నిర్మించనున్న భారీ చిత్రం లోనూ కాజల్ ఎంపికయ్యారు. ఇక ఈ సుందరి తెలుగులో మహేష్‌బాబ్‌తో జతకట్టిన' బిజినెస్‌మ్యాన్' చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావడంతో టాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సింగం చిత్రంలో బాలీవుడ్‌లోనూ విజయకేతనం ఎగురవేసిన కాజల్ ప్రస్తుతం తన పారితోషికాన్ని కోటికి పైగా పెంచేసిందట. దీంతో తమ చిత్రాల్లో ఆమెను ఎంపిక చేసుకోవ డానికి ప్రయత్నించిననిర్మాతలు కాజల్ పారితోషికం చూసి కంగుతింటున్నారని బోగట్టా .కాజల్ సమంత, తమన్నాలతో పాటు పోటీపడి సినిమా అవకాశాలను దక్కించుకుంది ఈ పంజాబీ గాళ్. ప్రస్తుతం 'బిజినెస్‌మేన్' హిట్‌తో మంచి ఊపు మీద ఉన్న కాజల్ ఇక నుంచి దక్షిణాది చిత్రాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తానంటోంది.ఎందుకని ప్రశ్నిస్తే "ఆ మధ్య 'సింఘం' చిత్రంలో నటించా. సినిమా బాగానే సక్సెస్ అయింది కానీ తగినంత పేరు రాలేదు. దాంతో ఉత్తరాది సినిమాగురించిఆలోచించకూడదనుకుంటున్నాను.ప్రస్తుతం నా దృష్టి అంతా తెలుగు, తమిళ చిత్రాలమీదనే. ప్రస్తుతం తమిళంలో సూర్యతో కలిసి 'మాట్రాన్' చిత్రంలోనూ, ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ సరసన 'తుపాకీ'లో నటిస్తున్నా. అలాగే రామ్‌చరణ్‌తో కలిసి ఓ చిత్రంలోనూ, ఎన్టీఆర్‌తో కలిసి శ్రీనువైట్ల చిత్రంలోనూ నటిస్తున్నా. వీటిని ఈ ఏడాదికి పూర్తి చేసుకుంటే చాలు. ఇక దాని(బాలీవుడ్) గురించి ఆలోచించను'' అంటోంది కాజల్.

జాన్ అబ్రహమ్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘హ్యాపీబర్త్‌డే’లో ఐశ్వర్యారాయ్ ?
పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని తనివితీరా అనుభవిస్తున్న అందాల సుందరి ఐశ్వర్యారాయ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రెండేళ్లక్షికితం విడుదలైన ‘గుజారిష్’ తర్వాత ఐష్ మరే చిత్రంలోనూ నటించలేదు. ప్రెగ్సెన్సీ కారణంగా మధుర్‌బండార్కర్ ‘హీరోయిన్’ చిత్రం నుంచి ఐశ్వర్య తప్పుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రీ ఎంట్రీ ఇస్తూ తను నటించబోయే చిత్రం చాలా గ్రాండ్‌గా వుండేలా సన్నాహాలు చేసుకుంటుందట ఐశ్వర్యారాయ్. పెద్ద సంస్థతో పాటు అగ్రక్షిశేణి దర్శకుడితో సినిమా చేయాలనే ఆలోచనలో ఐశ్వర్య వున్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహమ్ హీరోగా తెరకెక్కనున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘హ్యాపీబర్త్‌డే’లో నటించడానికి ఐశ్వర్య సుముఖత చూపుతున్నట్లు ముంబై సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ‘ఏజెంట్ వినోద్’ చిత్రానికి దర్శకత్వ వహిస్తున్న శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రంలో నటించడానికి ఐశ్వర్యరాయ్ సూత్రవూపాయంగా అంగీకరించిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే బచ్చన్ కుటుంబ సన్నిహితుల సమాచారం ప్రకారం షారూఖ్‌ఖాన్‌తో నటించబోయే ఓ భారీ చిత్రం ద్వారా ఐశ్వర్య పునరాగమనం వుంటుందని తెలిసింది.

క్యూబా కల్చర్ కత్రీనాను బాగా ఆకట్టుకుంది
'అగ్నిపథ్' చిత్రంలో చిక్నీ చమేలీ అంటూ కుర్రకారును వెర్రెత్తించిన కత్రినాకైఫ్ ప్రస్తుతం తన మాజీ ప్రియుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'ఏక్తా టైగర్' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌కోసం ఇటీవలే క్యూబా వెళ్ళొచ్చిందట ఈ లండన్ బ్యూటీ. షూటింగ్‌కి మధ్యలో కొంత విరామం రావడంతో క్యూబా మొత్తం చుట్టేసిందట. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్ తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసిందట. తన క్యూబా ట్రిప్ గురించి చెబుతూ "సెంట్రల్ అమెరికా టూర్ ఎంతో సరదాగా జరిగింది. నాకు ఈ ట్రిప్ తెగ నచ్చేసింది. ఎందుకంటే క్యూబా కల్చర్ నన్ను బాగా ఆకట్టుకుంది. అలాగే అక్కడ ఫ్యాషన్ యాక్ససెరీస్ చాలా బాగున్నాయి. షాపింగ్‌లో నాకు నచ్చినవన్నీ కొనేశా. క్యూబా రుచులు చూశా. క్యూబా క్యూజిన్ ఎంత రుచిగా ఉందో. ఇక నుంచి దర్శకులకు నేను ఒకటే సలహా ఇస్తా. అదేంటంటే క్యూబాలో తప్పకుండా ఓ షెడ్యూల్ ప్లాన్ చేయమని. అక్కడ క్లైమేట్ చాలా కూల్. సినిమా షూటింగ్‌కు అనువైన ప్రదేశాలెన్నో అక్కడ ఉన్నాయి'' అంది కత్రినా.

బాలీవుడ్‌లో ఇలియానా హవా ... దర్శకురాలిగా సెలీనా జైట్లీ
గోవా సుందరి ఇలియానా బాలీవుడ్‌లో వెలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ఓ సినిమా చేస్తున్న ఆమె 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా ఓ కీలక పాత్ర చేస్తోంది.ఆ సినిమాలో ఆమె అభినయం, సెట్స్ మీద ఆమె ప్రవర్తన 'బర్ఫీ' నిర్మాత రోనీ స్క్రూవాలాను బాగా మెప్పించాయి. దాంతో ఆమెతో ఈసారి ఏకంగా రెండు సినిమాల ఒప్పందాన్ని ఆయన కుదుర్చుకున్నాడు. వీటిలో ఒకటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నది. ఇటీవల 'ఖట్టా మీఠా'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన త్రిష నిరాశపరిచిన నేపథ్యంలో అసిన్ తరహాలో ఇలియానా బాలీవుడ్‌లో తనదైన ముద్రను వేస్తుందో, లేదో చూడాలి.
ఇటీవలే పెళ్లి పీటలెక్కిన బాలీవుడ్‌ సెక్సీభామ సెలీనా జైట్లీ దర్శకురాలిగా మారబోతోంది. అప్పట్లో మోడలింగ్‌నుంచి బాలీవుడ్‌కి వచ్చిన సెలీనాజైట్లీ తన అందాలతో కుర్రకారును మత్తెక్కించింది. విష్ణు సినిమాలో మంచు విష్ణుతో జతకట్టిన ఈ భామ ప్రస్తుతం వివాహం చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అయితే భర్త అనుమతితో దర్శకత్వ శాఖలో చక్కని శిక్షణ కూడా తీసుకుంటోందట. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్‌ మీద తన దృష్టిని కేంద్రీకరించింది. ఇందుకు ఆమె భర్త పీటర్‌ కూడా ఓకే చెప్పేశాడట. తన మొదటిచిత్రాన్ని ఓ లవ్‌ స్టోరీతో మొదలెడదామనుకుంటోంది ఈ భామ. అయితే కొందరు బాలీవుడ్‌ విమర్శకులు మాత్రం జైట్లీకి అసలే పబ్లిసిటీ అంటే మక్కువ. అందుకని ఎప్పటికప్పుడు వార్తల్లోకి ఎక్కాలని అలా స్టేట్‌మెంట్‌ ఇస్తుంటుంది. అంతే తప్ప ఆమె దర్శకత్వం చేసేంత సీన్‌ లేదని కొట్టిపారేస్తున్నారు.

రణబీర్‌, షాహిద్‌లు మంచి స్నేహితులయ్యారు
మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రాక్‌స్టార్‌’ సంచలన విజయం సాధించిన తరువాత రణబీర్‌ కపూర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీంతో రణబీర్‌ ఆగస్టులో ఒక వరల్డ్‌ టూర్‌కు బయల్దేరాలని నిర్ణయించుకున్నాడు. దీనికి తన మిత్రుడు షాహిద్‌ కపూర్‌ను కూడా ఆహ్వానించాడు. ఇటీవలే జీ సినీ అవార్డు వేడుకలలో రణబీర్‌, షాహిద్‌లు సంచలనం చేశారు. మౌసం చిత్రంలోని పాటలతో షాహిద్‌ అదరగొడితే, ‘రాక్‌స్టార్‌’లోని సాడ్డా హక్‌ పాటకు రణబీర్‌ మళ్లీ అదేవేశంలో కనిపించి అలరించాడు. పూర్తి స్టేజ్‌ను వాడాకోవడంతో పాటు, ప్రేక్షకుల వద్దకు కూడా వెళ్లి తనదైన శైలిలో అలరించాడు. ఈ ప్రదర్శన తరువాత వీరిద్దరిలో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ విషయంపై రణబీర్‌ తండ్రి రిషి కపూర్‌ స్పందిస్తూ ‘రణబీర్‌, షాహిద్‌లు మంచి స్నేహితులయ్యారు. వీరిద్దరు ప్రపంచయాత్రకు బయల్దేరుతారో లేదో అన్న విషయం గురించి మరింతకాలం వేచి చూడాల్సిందే’ అని తెలిపారు. అన్నీ కుదిరితే ఈ టూర్‌లో కత్రీనా కైఫ్‌, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ కూడా వెళ్లనున్నట్టు సమాచారం.