న్యూస్/వ్యూస్
 
 
 
 

హిందీలో చిరంజీవి ‘ఠాగూర్‌’... సూర్య బాలీవుడ్‌ ప్రవేశం
చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్‌ దర్శత్వంలో విడుదలై విజయం సాధించిన ‘ఠాగూర్‌’ త్వరలో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఠాగూర్‌కు ముందుగా... తొలుత ఈ చిత్రాన్ని తమిళంలో ‘రమణ’గా ఏ.ఆర్‌.మురుగాదాస్‌ తీయగా విజయం సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయమని కొందరు బాలీవుడ్‌ కథానాయకులు మురుగాదాస్‌ను సంప్రదించినట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
తమిళ కథానాయకుడు సూర్య త్వరలో బాలీవుడ్‌ ప్రవేశం చేయనున్నాడు. తమ్ముడు కార్తీ నటించిన 'పయ్యా' సినిమాను హిందీలో రీమేక్‌ చేయడానికి డిసైడ్‌ అయ్యాడంట! తెలుగులో 'ఆవారా' అనే పేరుతో విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. త్వరలో సూర్య స్వంత చిత్ర నిర్మాణ సంస్థని కూడా ప్రారంభిస్తున్నారు.

కత్రినాకైఫ్ తొలి సారి స్టంట్‌లు చేస్తోంది
అక్షయ్‌కుమార్‌తో ఫరాఖాన్ రూపొందించిన ‘తీస్‌మార్‌ఖాన్’ చిత్రంలో ‘షీలా కీ జవానీ’ అంటూ చిందులేసి కుర్రకారు మతి పోగొట్టిన కత్రినా కైఫ్ తొలి సారిగా ఫైట్‌లు చేయబోతోంది. రాజీవ్ రుయ రూపొందిస్తున్న ‘మై కృష్ణా హూం’ అనే యానిమేషన్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించబోతున్న కత్రినా ఈ చిత్రం కోసం ఎప్పుడూ లేని విధంగా స్టంట్‌లు చేస్తుండటంతో ఈ చిత్రం బాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ పాత్ర గురించి దర్శకుడు రాజీవ్ రుయ వివరిస్తూ- ‘ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన కత్రినా ఇందులో తొలి సారిగా స్టంట్‌లు చేస్తోంది. ఇటీవల ఆమెపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఓ పిల్లవాడి నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో మరో అతిథి పాత్రలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఇందులో వచ్చే క్లెమాక్స్ సన్నివేశాల్లో కత్రినా కైఫ్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొంటాడని తెలిపాడు. కత్రినా కైఫ్ ‘బాడీగార్డ్’ లో హుషారెత్తించే ప్రత్యేక గీతంలో నర్తించిన విషయం తెలిసిందే.

త్రిషకు ‘మంకతా’ సక్సెస్... రేటు పెంచిన 'కందిరీగ' హన్సిక
‘వ్నై తాండి వరువాయ’ చిత్రం తర్వాత చాలా కాలంగా తెలుగు, తమిళ భాషల్లో సరైన విజయం లభించని త్రిషకు అజిత్ ‘మంకతా’ రూపంలో విజయం లభించింది. ఆగస్ట్ 31న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోందట. అజిత్ నటించిన 50వ చిత్రం కావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని, రానున్న రోజుల్లో ‘మంకత’కు మరింత బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు చెబుతుండటంతో త్రిష ఆనందానికి అంతులేకుండా పోతోందట. అంతే కాకుండా ఈ చిత్రం తెలుగులో ‘గేంబ్లర్’గా విడుదల కాబోతుండటంతో ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయాన్ని సాధించి తనకు పూర్వ వైభవాన్ని అందిస్తుందని త్రిష భావిస్తోందట. త్రిషకు పవన్‌కళ్యాన్ నటించిన ‘తీన్‌మార్’ ఆశించిన విజయాన్ని అందించలేక పోయిన విషయం తెలిసిందే. కాగా ‘గేంబ్లర్’గా తెలుగులో అనువాదం కానున్న చిత్రాన్ని ఇటీవల 'కాంచన' వంటి విజయవంతమైన అనువాద చిత్రాన్ని అందించిన బెల్లం కొండ సురేష్ తెలుగులో అందిస్తున్నారు.
మొన్నటి వరకు తెలుగులో సినిమాలే లేని హన్సిక, ఇటీవల వచ్చిన 'కందిరీగ' విజయంతో తన పారితోషికం పెంచేస్తోంది. కాజల్‌, తమన్నాలతో తనని తాను పోల్చుకుంటూ... 80 లక్షలనుండి, కోటి రూపాయలు అడుగుతోందని అంటున్నారు.

రవితేజ - గుణశేఖర్ ల 'నిప్పు'... జె.డి.చక్రవర్తి 'గాడ్పు'
రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వైవియస్‌.చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'నిప్పు'. షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని వికారాబాద్‌లో జరుగుతోంది. ఇందులో దీక్షాసేథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా విడుదలైన 'మనీ మనీ మోర్‌ మనీ' చిత్రానికి దర్శకత్వం వహించిన జె.డి.చక్రవర్తి, మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. హారర్‌ నేపథ్యంలో సాగే 'గాడ్పు' అన్న టైటిల్‌తో మరో చిత్రాన్ని తీయబోతున్నాడు.

మణిరత్నం రొమాంటిక్ లవ్ చిత్రంలో అక్షర హాసన్
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా భావించి మూడు భాషల్లో విడుదల చేసిన ‘రావణ్’ ఆశించిన విజయం దక్కించుకోలేకపోయింది. దీంతో ఎలాగైనా ఓ విజయవంతమైన చిత్రాన్ని అందించాలన్న పట్టుదలతో గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు మొదలు పెట్టిన మణిరత్నం త్వరలో తన పాత పంథాలో రూపొందించిన ‘గీతాంజలి’, సఖి చిత్రాల తరహాలో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్‌ని కథానాయకుడిగా పరిచయంచేయబోతున్నాడు. ఇందులో గౌతమ్‌కు జోడీగా నటించే కొత్త ముఖం కోసం గత కొన్ని రోజులుగా అన్వేషిస్తున్న మణిరత్నం చివరికి కమల్ హాసన్ రెండవ కూతురు అక్షర హాసన్ అయితే బాగుంటుందని భావించి ఆ విషయాన్ని కమల్‌కు చెప్పాడట. బాలీవుడ్ దర్శకుడు రాహుల్ దోలాకియా దగ్గర దర్శకత్వ శాఖలో మెలకువలు నేర్చుకుంటున్న అక్షర హాసన్ వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాదన లేక, నటిగా ఇష్టం లేకపోయినా- కేవలం మణిరత్నం చిత్రం కావడం వల్లే అంగీకరించిందని సినీవర్గాల సమాచారం.


విజయవాడలో సావిత్రి విగ్రహాన్ని ఆవిష్కరించిన వాణిశ్రీ
సావిత్రి కళాపీఠం, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సావిత్రి కాంస్య విగ్రహాన్ని కళాభినేత్రి వాణిశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రితో తన అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. 'నీలాగా నటించాలని ఉంది' అని సావిత్రితో అంటే - 'నాలాగా చేయకు, నీలాగానే నువ్వు నటించు' అని ఆమె సూచించారన్నారు. ప్రస్తుత చిత్రాల్లో కథానాయికల ఎక్స్‌పోజింగ్ గురించి ప్రస్తావిస్తూ- పొట్టిడ్రెస్‌లతో కనిపించే సినిమాలను చూస్తున్నారు కాబట్టే, తీస్తున్నారని వ్యాఖ్యానించారు. అటువంటి చిత్రాలను ప్రేక్షకులు ఎందుకు బాయ్‌కాట్ చేయరని ప్రశ్నించారు. ఇప్పుడు పద్మశ్రీలు, పద్మభూషణ్‌లను కొనుక్కుంటున్నారన్నారు. రాజకీయ నేతలు పదవిలో ఉన్నప్పుడే జనానికి గుర్తంటారని, నటులు నిత్యం గుర్తుకు వస్తారని చెప్పారు.

సెప్టెంబర్ 24నుండి అల్లు అర్జున్- ఇలియానా కలయికలో చిత్రం
అల్లు అర్జున్- త్రివిక్రం శ్రీనివాస్ కలయికలో త్వరలో ఓ చిత్రం రూపొందనుంది. డి.వి.వి.దానయ్య, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా ఇలియానా నటించనుంది. సెప్టెంబర్ 24న లాంఛనంగా షూటింగ్ ప్రారంభంకాబోతోంది. ఈ మధ్యే ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న అల్లు అర్జున్ నెల రోజులు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా అల్లు అర్జున్ అక్టోబర్ మొదటి వారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు . ఈ చిత్రం రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'మేం వయసుకు వచ్చాం'
వయసుకొచ్చిన యవతీయువకుల మనోభావాలకు అద్దం పడుతూ ఓ ప్రేమకథా చిత్రం ఈ నెలలో ప్రారంభం కానుంది. ఆ చిత్రం పేరు 'మేం వయసుకు వచ్చాం'. తనీష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా 'నీతి టేలర్‌' అనే ముద్దుగుమ్మ తెరంగేట్రం చేస్తున్నది. 'లక్ష్మణ్‌ సినీ విజన్‌' సమర్పణలో 'లక్కీ మీడియా' పతాకంపై బెక్కం వేణుగోపాల్‌-లక్ష్మణ్‌ కేదారి సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రం ద్వారా త్రినాధరావు నక్కిన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈనెల నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకునే ఈ చిత్రం- ప్రేమలోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించే ఓ వినూత్న ప్రేమకధతో నిర్మిస్తున్నామని - దర్శకుడు త్రినాధరావు నక్కిన అంటున్నారు. ఈ చిత్రానికి పోటోగ్రఫి: సాయిశ్రీరాం, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌, రచనా సహకారం: సాయికృష్ణ, మాటలు: నివాస్‌, పాటలు: భాస్కర్‌భట్ల , కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

ప్రేక్షకాదరణ పొందుతున్న ప్రభుసాల్మన్ ‘ప్రేమఖైదీ’
విదార్థ్, అమలాపాల్ జంటగా... ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘మైనా’. ఈ చిత్రం ‘ప్రేమఖైదీ’ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందు తోందని- నిర్మాత సుబ్రహ్మణ్యం ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ మా సంస్థ నుంచి చాలా అనువాద చిత్రాలొచ్చాయి. అన్నీ ఒక ఎత్తు అయితే... ‘ప్రేమఖైదీ’ ఒక్కటీ ఓ ఎత్తు. నా జీవితంలో మరచిపోలేని సినిమా ఇది’’ అన్నారు. ఈ సినిమా చూసి మహానటుడు కమల్‌హాసన్ గారు ఎంతో మెచ్చుకున్నారు. ఇక రజనీకాంత్‌గారైతే... ‘ఇంత మంచి సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా చేయలేకపోయానే అని బాధగా ఉంది’ అన్నారు. అందరూ ప్రేమించి ఈ సినిమా చేశారు. అందుకే ఇంత పెద్ద విజయం లభించింది. ఈ సినిమాను హిందీలో ట్వంటీయత్ సెంచరీ వారు రీమేక్ చేస్తున్నారు’’ అని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా తనకు ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చిందని, ఇంత సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అమలాపాల్ చెప్పారు.

సల్మాన్‌ఖాన్‌ ఆరోగ్యం ఓకే.... యలమంచిలి రవిచంద్ ఫై దాడి
బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఆరోగ్యం కుదుట పడుతోంది. తలనొప్పి, గొంతు నొప్పితో బాధపడుతూ, ఆపరేషన్‌ కోసం ఆయన అమెరికా వచ్చారు. లాస్‌ ఏంజెల్స్‌లో ఆపరేషన్‌ చేయించుకున్నారు. అతడి ఆరోగ్యం కుదుట పడుతుందని అతడికి ఆపరేషన్‌ చేసిన వైద్యులు పేర్కొన్నారు. తాను నటించిన ' బాడీగార్డు' విడుదలకు ఒక్క రోజు ముందే ఆయన ఆమెరికా వచ్చారు. తిరిగి భారత్‌కు ఎప్పుడు వెళ్లేది తెలియరాలేదు.
సినీ నిర్మాత యలమంచలి రవిపై గురువారం తెల్లవారు జామున బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న రవిచంద్‌ను చికిత్స నిమిత్తం అపోలో అస్పత్రికి తరలించారు. ఓ పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తెలిసిన వారే ఈ పని చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


మహేష్‌బాబు ‘దూకుడు’కి విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌
మహేష్‌బాబు ‘దూకుడు’కి విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ఓవర్‌ అందిస్తున్నారు. ఈ సినిమాలో అత్యంత కీలకఘట్టం అయిన మాఫియా పరిచయం అంతా...వెంకీ స్వరంలోనే వినిపిస్తుందని సమాచారం. ఇటీవలే పతాకసన్నివేశాల చిత్రణ పూర్తిచేసుకుని.. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోందీ సినిమా. వెంకటేష్‌, మహేష్‌ల కాంబినేషన్‌లో శ్రీనువైట్ల ఓ మల్టీస్టారర్‌ ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ దోస్తీ.. సినీవర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. మల్టీస్టారర్‌ సినిమాలంటే వెంకటేష్‌కు ఆసక్తి ఎక్కువ. కొత్త కథలు ఎప్పుడొచ్చినా ఆయన పచ్చ జెండా ఊపడానికి సిద్ధమే. మహేష్‌బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తారనే ప్రచారం గత కొంత కాలంగా టాలీవుడ్‌లో బాగా సాగుతోంది. ఆ మధ్య వెంకటేష్‌ కూడా ఈ విషయాన్ని కొద్దిగా మీడియాతో పంచుకున్నారు. 'మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇందుకు సంబంధించి కొన్ని కథలు కూడా విన్నా. కథ ఓకే అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు కూడా జరుగుతున్నాయి. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తారు' అని వెంకీ చెప్పుకొస్తున్నారు. ఇందులో వీరిద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారని ఇండస్టీ టాక్‌ !

రజనీ 'రాణా'లో ఖరీదైన అతిధి పాత్రలో ఇలియానా ?
తెలుగులో ఆ మధ్య ఓ వెలుగు వెలిగిన ఇలియానా జోరు ఈ మధ్య కాస్తా తగ్గిన విషయం తెలిసిందే. నితిన్‌తో నటించిన ‘రెచ్చిపో’, విష్ణుతో నటించిన ‘సలీమ్, జూ.ఎన్టీఆర్‌తో నటించిన శక్తి, రానాతో నటించిన ‘నేనూ నా రాక్షసి’ చిత్రాలు పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. తెలుగులో కేవలం రవితేజ-పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో రానున్న ‘ఇడియట్-2’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఇలియానా ప్రస్తుతం తమిళంలో శంకర్ తెరకెక్కిస్తున్న ‘త్రీఇడియట్స్’ రీమేక్‌లోనూ అలాగే బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘బర్ఫీ’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటు ఈ గోవా సుందరి మరో బంపర్ ఆఫర్‌ను కొట్టేసిందట. . రజనీకాంత్ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ‘రాణా’ చిత్రంలో దీపికా పదుకునే కథానాయికగా నటించనున్న విషయం తెలిసిందే. అయితే అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రంలో అతిథి పాత్రలో ఇలియానా నటించబోతోందని, కథానాయికగా ఈ చిత్రం కోసం 90రోజుల కాల్షీట్లకు దీపికా పదుకునే రెండు కోట్లు పారితోషికం తీసుకుంటుంటే, ఆమెకు ధీటుగా ఇలియానా కేవలం పదిహేను రోజులకే 60 లక్షలు తీసుకోబోతోందని చెన్నై వర్గాల కథనం.

తాప్సీ ప్రేమ వ్యవహారంఫై తమిళ మీడియా ప్రచారం
తెలుగు, తమిళ చిత్రాల్లో చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్న తాప్సీ ప్రేమ వ్యవహారం చెన్నైలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఓ వర్థమాన తమిళ నటుడుతో ఈ భామ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని తమిళ మీడియా ప్రచారం చేస్తోంది. వివరాల్లోకి వెళితే... తమిళ యువ నటుడు మహత్ రాఘవేంద్రతో ఈ భామ ప్రేమాయణం నడుపుతోందని, వీరిద్దరూ కలసి చెన్నై పబ్బుల్లో సన్నిహితులతో కలసి సరదాగా గడుపుతున్నారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా వుంచడానికి ప్రయత్నిస్తోందట ఈ సుందరి. తెలుగులో గోపిచంద్ సరసన ‘మొగుడు’ చిత్రంలో నటిస్తున్న ఈ సుందరి తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా వరుస ఆఫర్లతో బిజీగా వుంది. వరుసగా తీరిక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉందట తాప్సీ. దాంతో కాస్త సన్నబడిందట. స్లిమ్ కావడానికి ఏమైనా డైటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తే "ఇటీవలనే 'వందన్ వెండ్రన్' చిత్రం షూటింగ్ పూర్తయింది. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నా. దాంతో నాకు తెలియకుండానే వెయిట్‌లాస్ అయ్యా. ఈ మధ్య వర్కవుట్స్ కూడా చేయడం లేదు. ప్రత్యేకంగా ఆహార నియమాలు పాటించడంలేదు. కేవలం హార్డ్‌వర్క్ చేయడమే నా స్లిమ్ రహస్యం'' అని ముక్తాయించింది. కెరీర్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఈ భామ తాజా ప్రేమాయణం ఎక్కడికి వెళ్తుందోనని సినీ జనాలు చర్చించుకుంటున్నారు.

‘రంపచోడవరం’లో చారిత్రక వీరనారిగా అనుష్క
నాగార్జునతో నటించిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన బెంగుళూరు బొమ్మాళీ అనుష్క. తన తొలి చిత్రంలోనే గ్లామర్‌గా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత నటించిన చిత్రాల్లోనూ గ్లామర్ పాత్రలు పోషించి అందాలు ఆరబోసింది. అయితే ఆ మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన ‘అరుంధతి’ చిత్రంతో అనుష్క మైండ్ సెట్‌ని పూర్తిగా మార్చేసిందట. అప్పటి నుంచే అనుష్క గ్లామర్ పాత్రల కంటే పెర్ఫార్మెన్స్‌కే ఎక్కువ స్కోప్ వున్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించడం మొదలు పెట్టిందని- ఆమె ఈ మధ్య ఎంచుకుంటున్న సినిమాలు చూస్తే అర్థమవుతోంది. ఆమెలో వచ్చిన మార్పుకు ఉదాహరణలే ఆనుష్క ఇటీవల నటించిన ‘వేదం, పంచాక్షరి, నాన్న చిత్రాలు. రొటీన్ గ్లామర్ పాత్రలు నచ్చకే ఈ మధ్య ఆమె కొన్ని ఆఫర్లని కూడా వదులుకుందని తెలుస్తోంది. నాగార్జునతో శ్రీనివాసరెడ్డి రూపొందిస్తున్న ‘డమరుకం’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అనుష్క దృష్టంతా ప్రస్తుతం చైతన్య దంతులూరి రూ పొందించనున్న లేడీ ఒరియెంటెడ్ చిత్రం ‘రంపచోడవరం’ పైనే వుందట. కొండా కృష్ణంరాజు నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతోంది. చారిత్రక నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో అనుష్క వీరనారిగా కనిపించబోతోంది.

ఎంతో ఇఫ్టమైన చాక్లెట్లకు సైతం దూరంగా షకీరా
పాప్‌ స్టార్‌ షకీరా గురించి తెలియని పాప్‌ అభిమాను లుండరంటే అతిశయోక్తికాదు. ఇప్పటివరకు పలు హిట్‌ ఆల్బమ్స్‌లో తన గానమాధుర్యాన్ని అందించిన షకీ రా పాటేకాదు అందం కూడా మత్తెక్కిస్తుంది. అయితే హాలీ వుడ్‌ సుందరాంగులంతా డైటింగ్‌ చేస్తూ తమ శరీర సౌష్ట వాన్ని అదుపులో ఉంచుకోవడం సహజం. దానిని షకీరా కూడా తూ.చ. తప్పకుండా పాటిస్తోంది. అయితే ఇటీవల ఒకానొక సందర్భంలో తనకు చాక్లెట్లంటే ఎంత ఇష్టమో తెలిపింది. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎంతో ఇఫ్టమైన చాక్లెట్లకు సైతం దూరంగా ఉంటోందట. ‘‘శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతో అవసరం. కానీ దాని కోసం ఒక్కోసారి మనం ఎన్నో అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే నా ప్రాణానికి ప్రాణమైన చాక్లెట్లను కూడా వదులుకున్నాను. నాకు చాక్లెట్లంటే ఎం తిష్టమో చెప్పలేను’’. అని తనకు చాక్లెట్లపై ఉన్న మోజును చాటుకుంది షకీరా. ముప్పై రెండేళ్ళ వయస్సులో కూడా ఎంతో ఆకర్షణీయమైన శరీరాన్ని మెయింటెన్‌ చేస్తున్న ఈ కొలంబియన్‌ బ్యూటీ 'షీ వోల్ఫ్‌' ఆల్బమ్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.


ఈ వారం ఏ సినిమాకి ప్రేక్షకులు లేరు
ఈ వారం ఆరు సినిమాలు విడుదల అయ్యాయి. అయితే దేనికీ జనం లేరు. వున్నంతలో తమిళ్ 'మైనా' డబ్బింగ్ 'ప్రేమ ఖైదీ' కి మంచి టాక్ వచ్చింది. విడుదలైన వాటిలో 'మనీ మనీ మోర్ మనీ' కి వసూళ్లు కాస్త బాగున్నాయి. అయితే సినిమా మాత్రం గోల గోలగా... భరించలేని విధంగా ఉందంటున్నారు. 'దగ్గరగా దూరంగా' బోర్ కొట్టిందని అంటున్నారు. 'కెరటం' లో వినోదం విషయం పక్కన పెడితే... సందేశాన్ని మాత్రం భరించలేకపోతున్నారు. 'మిస్టర్ రాస్కెల్' గురించి మాట్లాడే వాళ్ళే లేరు. ఇంగ్లీష్ డబ్బింగ్ 'ఒక్క వీరుడు' కూడా ఈ వారం విడుదలయ్యింది.

వర్మ చిత్రానికి 'బెజవాడ రౌడీలు' మారి 'బెజవాడ' ఖరారు
రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న చిత్రానికి 'బెజవాడ రౌడీలు' అన్న పేరు మార్చి 'బెజవాడ' అన్న టైటిల్‌ ఖరారు చేశాడు. వివేక్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య, అమాలాపాల్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ... 'బెజవాడ'లో నాగచైతన్య లుక్‌ అదిరింది. 'ఈ బెజవాడ నాదిరా!' అంటూ నాగచైతన్య చెప్పే ఎమోషనల్‌ డైలాగ్స్‌ ఆడియన్స్‌తో క్లాప్స్‌ కొట్టిస్తాయి. నాగచైతన్య, అమలాపాల్‌ల కాంబినేషన్‌ సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. బెజవాడలో చిత్రీకరించిన దుర్గమ్మ పాట ఈ సినిమాకి చాలా పెద్ద హైలైట్‌ అవుతుంది. బెజవాడ, హైదరాబాద్‌లలో నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుగుతుంది. సెప్టెంబర్‌ 10 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్‌, ఇటలీలలో పాటల చిత్రీకరణతో నిర్మాణం పూర్తవుతుంది. అనేకానేక కారణాల వల్ల 'బెజవాడ రౌడీలు' పేరు 'బెజవాడ'గా మార్చాం. ఆ కారణాలు ఏమిటని ఎవరెవరు ఏమేమి ఊహాగానాలు చేసుకున్నా, అసలు కారణం నా ఒక్కడికే తెలుసు. కానీ, ఆ కారణం ఏమిటన్నది ఎప్పటికీ చెప్పను' అని అన్నారు.

రవితేజ హీరోగా మెహర్‌రమేష్‌ దర్శకత్వంలో 'పవర్‌'
రవితేజ హీరోగా మెహర్‌రమేష్‌ దర్శకత్వంలో 'పవర్‌' అనే సినిమా తెరకెక్కనుంది. చిత్ర నిర్మాత మళ్ళ విజయప్రసాద్‌ చిత్ర విశేషాలు వివరిస్తూ... 'వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ సంస్థలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా 'పవర్‌' చిత్రాన్ని రూపొందించనున్నాం. రవితేజ, మెహర్‌రమేష్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర కథని 'వక్కంతం వంశీ' అందించారు. చిత్రం పేరును 'పవర్‌'గా ఖరారు చేశాం. రవితేజ 'ఇడియట్‌-2' తర్వాత మార్చి నెలలో షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం' అన్నారు. దర్శకుడు మెహర్‌రమేష్‌ మాట్లాడుతూ...'వక్కంతం వంశీ అందించిన కథ 'రవితేజ'కు కరెక్ట్‌గా సరిపోతుంది. 'కిక్‌' తర్వాత మరో డైమెన్షన్‌లో రవితేజను ఇందులో చూస్తాం. ప్రధాన హీరో కథే. రవితేజ కెరీర్‌లో అత్యాధునిక టెక్నికల్‌ వాల్యూస్‌తో, హై బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.

'ఆదిశంకర'లో అమరుక మహారాజు గా ఉపేంద్ర
కౌశిక్‌ బాబు హీరోగా జె.కె.భారవి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆదిశంకర'. చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి నాగార్జున అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర 'ఆదిశంకర' కథ వినడం, వెంటనే ఒక ప్రధానపాత్రలో అభినయించడానికి అంగీకరించడం జరిగింది. 'ఆదిశంకర' కథ అద్భుతంగా ఉందని, అమరుక మహారాజు పాత్ర తనను ఎంతో ఆకట్టుకుందని, తన ఇమేజ్‌కి, బాడీలాంగ్వేజ్‌కి అతికినట్టుగా సరిపోతుందని అన్నారు. అన్ని రకాల ప్రేక్షకులనూ ఉర్రూతలూగిస్తుందని ఉపేంద్ర ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించాలన్న చిరకాల వాంఛ తీరబోతోందన్నారు. శ్రీహరి, సాయికుమార్‌, సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, ఆనంద్‌, జయప్రద, రోజా, రోహిణి, తులసి, సంగీత ఇప్పటికి ఎన్నికైన ప్రధాన తారాగణం. సాహిత్యం: ఆదిశంకరాచార్య, శ్రీ వేదవ్యాస,కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.కె.భారవి.

సెప్టెంబర్‌ 9 నుంచి పవన్‌కళ్యాణ్‌ 'గబ్బర్ సింగ్'
సల్మాన్‌ఖాన్‌ హీరోగా హిందీలో రూపొందిన సూపర్‌హిట్‌ మూవీ 'దబాంగ్‌'ను తెలుగులో 'గబ్బర్ సింగ్' పేరుతో బండ్ల గణేష్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి దర్శకుడు హరీష్‌ శంకర్ మాట్లాడుతూ... 'సల్మాన్‌ఖాన్‌ బాడీలాంగ్వేజ్‌కి అనుగుణంగా రూపొందింది. 'దబాంగ్‌' హిందీలో ఎంత సూపర్‌హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌గారి బాడీ లాంగ్వేజ్‌కి, మ్యానరిజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ క్యారెక్టరైజేషన్‌తో ఫుల్‌ మీల్స్‌గా రాబోతున్న సినిమా. పవన్‌కళ్యాణ్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలూ వుంటాయి. ఫైట్స్‌ ఇంతకుముందెన్నడూ రాని విధంగా కొత్తకోణంలో నావెల్టీగా వుంటాయి' అని అన్నారు. సెప్టెంబర్‌ 9 నుంచి రెగ్యులర్‌ షూటంగ్‌ జరుగుతుందనీ, హైదరాబాద్‌, పొల్లాచ్చి, మహాబలేశ్వర్‌, పంచ్‌గని, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ పరిసరాల్లో ఏకధాటిగా జరుగుతుందని చెప్పారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అజరు, అభిమన్యు సింగ్‌, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, ఆలీ, ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌,


పవన్‌కళ్యాణ్‌- విష్ణువర్థన్‌ ల 'కాళి' ప్రొగ్రెస్స్
పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా తమిళ దర్శకుడు విష్ణువర్థన్‌ తీస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రామోజీ ఫిలీం సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. 'కాళి' అనే పేరు ఇండిస్టీలో ప్రచారంలో ఉంది. ప్రస్తుత షూటింగ్‌లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతకొన్నాళ్లుగా షూటింగ్‌ కోల్‌కతా నగరంలో జరిపారు. ఆ తర్వాత తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని గ్రామాలలో కూడా జరిగింది. ఈ చిత్రం టైటిల్‌ సెప్టెంబర్‌ రెండున పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారు. సారాజేన్‌, అంజనీ లావనియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విజయదశిమికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యువన్‌ శంకర్‌ రాజా వివాహం సెప్టెంబర్‌ 1న తిరుపతిలో
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా వివాహం సెప్టెంబర్‌ 1న తిరుపతిలో జరుగనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడైన యువన్‌ పలు భాషలలో ఇప్పటివరకు 85 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యువన్‌ 2005లో సుజాత అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇరువురికి మన స్పర్దలు రావడంతో, ఇద్దరి అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. 2008లో వారికి విడాకులు మంజూరయ్యాయి. అప్పటినుండి యువన్‌ సంగీతంపైనే దృష్టి పెట్టారు. యువన్‌ పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించి ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇంతలో యువన్‌ డాక్టర్‌ శిల్పను ప్రేమించారు. ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో సెప్టెంబర్‌ 1న తిరుపతిలో వారి వివాహం జరుగనుంది. సెప్టెంబర్‌ 2వ తేదిన చెన్నరులోని ఓ స్టార్‌ హోటల్‌లో రిసెప్షన్‌ ఏర్పాటుచేశారు.

ఐటమ్‌సాంగ్‌లో నటించే అందాల భామకు కోటి రూపాయలు
శింబు చిత్రంలో ఐటమ్‌సాంగ్‌లో నటించే అందాల భామకు కోటి రూపాయల పారితోషికం ఇవ్వడానికి నిర్మాత సిద్ధపడినట్లు సమాచారం. విన్నైతాండి వరువాయ్, వానం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తరువాత శింబు నటిస్తున్న చిత్రం 'ఒస్తీ' . ఇది హిందీలో ఘన విజయం సాధించిన దబాంగ్ చిత్రానికి రీమేక్. ధరణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక ఐటమ్‌సాంగ్ ఉంది. హిందీలో మున్ని.. సాంగ్‌లో సెక్స్‌బాంబ్ మలైకా అరోరా ఖాన్ నటించింది. ఆ చిత్ర విజయానికి ఈ సాంగ్ పెద్ద ప్లస్ అయింది. అలాంటి సాంగ్‌ను తమిళంలో చేసేది ఎవరనేది ఆసక్తిగా మారింది. శింబు, విలన్ పాత్రధారి సోమనూర్‌లతో కలసి అందాలు ఆరబోసే ఆ నటి కోసం చాలా మంది ముంబయి హీరోయిన్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా కత్రినా కైఫ్‌ను నటింపజేసే ప్రయత్నాలను శింబు, దర్శకుడు ధరణి చేస్తున్నట్లు సమాచారం. ఆమె ఒప్పుకుంటే 75 లక్షల నుంచి కోటి రూపాయల పారితోషికం చెల్లించడానికి సిద్ధమైనట్లు కోలీవుడ్ టాక్. కత్రినా కాదంటే దీపికా పదుకొనేను నటింపజేసే అవకాశం ఉందని తెలిసింది. దీని గురించి దర్శకుడు ధరణిని అడగ్గా కత్రినాకైఫ్, దీపికాపదుకొనేలతో పాటు మరికొందరు నటీమణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

సూపర్‌స్టార్‌ సంతోషంలో సల్మాన్‌ ఖాన్‌
బాలీవుడ్‌ టాప్‌ హీరోలలో ఒకరైన సల్మాన్‌ ఖాన్‌ నేడు సంతోషంగా ఉన్నారు. వాంటెడ్‌, దబంగ్‌, రెఢీ చిత్రాలు సూపర్‌హిట్‌ కావడంతో బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఆయన వెలుగొందుతున్నారు. త్వరలో విడుదల కాబోతున్న బాడీగార్డ్‌ చిత్రం కూడా మంచి సక్సెస్‌ సాధిస్తుందని సల్మాన్‌ఖాన్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘మంచి స్క్రిప్ట్‌తో రూపుదిద్దుకున్న వాంటెడ్‌, దబంగ్‌, రెఢీ చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రాల విజయానికి అందరూ వంద శాతం సామర్థ్యంతో పనిచేసారు. దీంతో ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి’ అని సల్మాన్‌ వెల్లడించారు. ఈ చిత్రాల సక్సెస్‌తో బాలీవుడ్‌లో అగ్రస్థానంలోకి చేరుకోవడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. త్వరలో విడుదలయ్యే బాడీగార్డ్‌ చిత్రం సూపర్‌హిట్‌గా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

అందుకే దక్షిణాదిని వదులు కోనంటున్నఅసిన్
తనకు నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది దక్షిణాది చిత్ర పరిశ్రమేనని ఈ విషయాన్ని తానెప్పుడూ మరువనని అంటున్నారు అసిన్. కోలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ కేరళ కుట్టి ప్రస్తుతం బాలీవుడ్‌పైనే దృష్టి సారించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటిగా తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన దక్షిణాది చిత్ర పరిశ్రమను, ఇక్కడి అభిమానులను ఎప్పటికీ మరచిపోనన్నారు. మలయాళం ప్రేక్షకులు అసిన్ మా హీరోయిన్ అని ఎలా గొప్పగా చెప్పుకుంటారో తమిళం, తెలుగు ప్రేక్షకులు కూడా అలాగే భావిస్తారన్నారు. తమిళం, తెలుగు భాషలలోని ప్రముఖ హీరోలందరి సరసన నటించి మెప్పిండచమే అందుకు కారణమని పేర్కొన్నారు. తాను తొలిసారిగా ఫిలింఫేర్ అవార్డును, నంది అవార్డును అందుకుంది తెలుగు చిత్రాల ద్వారానేనని గుర్తుచేశారు. అందుకే దక్షిణాదిని వదులుకోనని చెప్పారు. కొత్తదనంతో కూడుకున్న చిత్రాలతో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ప్రస్తుతం హిందీలో సాజిద్‌ఖాన్ చిత్రం హౌస్‌ఫుల్-2, రోహిత్ శెట్టి 'బోల్‌బచ్చాన్' చిత్రాలకు బల్క్ కాల్‌షీట్స్‌ను కేటాయించడంతో 2012 మార్చి వరకు బిజీగా ఉన్నానని వివరించారు. వీటితోపాటు మరో భారీ చిత్రాన్ని చేయనున్నట్లు తెలిపారు.


హీరోగా సోనూసుద్‌.... అమీర్‌ సరసన పెనెలప్‌ క్రూయిజ్‌ ?
క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా తనదైన శైలి ఏర్పరుచుకున్న ఉత్తరాది నటుడు సోనూసుద్‌. త్వరలో హీరోగా రబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్‌ ఆయన్ని హీరోగా ఓ తెలుగు చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన' కందిరీగ' సినిమాలో సోనూసూద్‌ ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మొదటి అర్థభాగంలో విలనిజం, రెండో అర్థభాగంలో కామెడీని సోనూ అద్భుతంగా పండించాడు. ప్రేక్షకులు బాగా ఎంజారు చేశారు. త్వరలో అతన్ని హీరోగా పెట్టి మా బ్యానర్లో సినిమా తీస్తాను 'నంటూ బెల్లకొండ సురేష్‌చెప్పారు.
కుర్రకారును కిర్రెక్కించడమే లక్ష్యంగా బరిలోకి దిగే దర్శకనిర్మాత ఆదిత్య చోప్రా ఈ సారి ‘ధూమ్‌ 3’ని మునుపటి భాగాల కంటే హాట్‌గా వండివార్చుతున్నారు. విజయ్‌ కృష్ణాచార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఉదయ్‌చోప్రా, అభిషేక్‌ బచ్చన్‌, అమీర్‌ఖాన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లోకి అమీర్‌ఖాన్‌ రాక పెద్ద అసెట్ . ఆపై అమీర్‌కి నాయికను ఎంపిక చేయడం మరింత పెద్ద టాపిక్‌ అయింది. తొలుత అమీర్‌ సరసన కత్రినను నాయిక అనుకున్నా..డేట్స్‌ సమస్య వల్ల అర్ధాంతరంగా వైదొలగింది. ప్రస్తుతం ఆ పాత్రకు స్పానిష్‌ ముద్దుగుమ్మ పెనెలప్‌ క్రూయిజ్‌ను ఎంపిక చేశారని సమాచారం. ఆస్కార్‌ విజేతలు నటాలీ పోర్ట్‌మన్‌, ఈవా లాంగొరియాల పేర్లు పరిశీలించినా..దర్శకనిర్మాతలు పెనెలప్‌కే ఓటేశారని తెలుస్తోంది.

‘రేయ్’ సినిమా షూటింగ్ లో సాయిధర్మతేజ్‌ కు ప్రమాదం
చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు పతాకంపై దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి ‘రేయ్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా అమెరికాలో జరుగుతోంది. అక్కడ సాయిధర్మతేజ్‌పై దర్శకుడు కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా నూతన కథానాయకుడు సాయిధర్మ తేజ్‌కు ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో సాయికి బలమైన గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ సాయిధర్మతేజ్‌ను సమీపంలోని ఆసుపవూతికి తరలించారని, గాయాలు మానడానికి నెలరోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని సమాచారం. దీంతో గత ఏడాది దసరా నుంచి అమెరికాలో రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్న చిత్ర యూనిట్ నెల రోజులు షూటింగ్ వాయిదా పడటంతో హైదరాబాద్ చేరుకున్నారని తెలిసింది. మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధర్మతేజ్ సరసన సుబ్రా అయ్యప్ప, అమృత పట్కీ కథానాయికలుగా నటిస్తున్నారు.

శిల్పాశెట్టి 'డిజైర్‌' ... ఇలియానాకు ఆండ్రియా గొంతు
తెలుగులో ఒకటి రెండు సినిమాలలోనే నటించిన బాలీవుడ్‌ యోగా సుందరి శిల్పాశెట్టి కోరిక త్వరలో నెరవేరనుంది. సినిమా ఫీల్డ్‌కొచ్చి 15 సంవత్సరాలు దాటుతున్నా శిల్పా ఇంకా తన హవా కొనసాగిస్తునే ఉంది. పెళ్లిచేసుకుని సినిమాలకు ఎంతగా దూరం అవుదామనుకున్నా ఆమెను నిర్మాతలు వదలడంలేదు. విషయం ఏమిటంటే శిల్పాశెట్టి ఒడిస్సీ నర్తకిగా ఒక కళాత్మక చిత్రంలో నటిస్తోంది. పేరుకు అది కళాత్మకమేగానీ అందులో ఉండే సీన్లన్నీ చాలా వేడి వేడి గా ఉంటాయంటున్నారు. ఒక చైనా యువకునితో శిల్పా సాగించే శృంగార సన్నివేశాలే ఆ చిత్రానికి హైలైట్‌ అంటున్నారంతా. ఆ చిత్రం పేరు ‘ది డిజైర్‌... జర్నీ ఆఫ్‌ ఎ వుమెన్‌’. ఈ చిత్రం ద్వారా శిల్ప అభిమానుల చిరకాల డిజైర్‌ కూడా నెరవేరుతుందని ఆశిద్దాం. ఎందుకంటే శిల్పాశెట్టిని పూర్తిస్థాయి కామసూత్ర వంటి శృంగార పాత్రలో తాము ఇంతవరకూ చూడలేదని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈతరం తారల్లో ఆండ్రియాను మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పొచ్చు. 'పచ్చై కిళి ముత్తుచ్చరం' చిత్రంతో హీరోయిన్‌గా తెరపైకి వచ్చిన ఆండ్రియా ఆ తరువాత' ఆయిరత్తిల్ ఒరువన్' [' యుగానికి ఒక్కడు ' ] చిత్రంలో కార్తీకి జంటగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ చిత్రాలే అయినా ఎక్కువ ప్రచారాన్ని పొం దింది. నటిగా కొనసాగుతూనే తమిళం, తెలుగు భాషల్లో పాటలు పాడి శభాష్ అనిపించుకున్న ఆండ్రియా తాజాగా అనువాద కళాకారిణిగా మారింది.' ఆడుగళం' చిత్రంలో తాప్సీకి గాత్రదానం చేసిన ఆండ్రియా ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం' నన్బన్‌' లో ఇలియానాకు డబ్బింగ్ చెప్పనుంది.

రెండేళ్ళ తర్వాతనే అందాల అనుష్క పెళ్లి
జేజమ్మగా తెలుగు లోగిళ్లలో సందడి చేసిన అనుష్క.... వన్నె తరగని నాయిక అంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షక దేవుళ్ల గుండెల్లో ఆమెకు మంచి స్థానం ఉంది. ప్రస్తుతం ఈ అనుష్క తెలుగు సహా తమిళనాట కూడా తన హవా నడిపిస్తోంది. ఇక్కడో సినిమా, అక్కడో సినిమా అన్న చందాన ఎంపిక చేసుకుంటూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జున సరసన శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఢమరుకం’లో నటిస్తూనే..తమిళనాట కార్తీకి జతగా ఓ చిత్రంలో నటిస్తోంది. అదేగాక కమల్‌హాసన్‌ ‘విశ్వరూపం ’లోనూ నాయికగా ఎంపికైందని ఓ వార్త నడుస్తోంది. ఏదేమైనా.. హైదరాబాద్‌ టు చెనై్, చెనై్ టు హైదరాబాద్‌ బిజీగా తిరుగుతున్న అనూని..ఇటీవల ఓ అభిమాని పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌? అని ప్రశ్నించాడట. ‘‘పెళ్లా! రెండేళ్ల తర్వాతే. ప్రస్తుతం సినిమాలతో బిజీ’’ అని సెలవిచ్చిందిట అనుష్క. సో..స్వీటీ పెళ్లికూతురయ్యే తరుణం కోసం రెండేళ్లు వేచి చూడాల్సిందే!

కమలినీ కవిత అంతర్జాతీయ పోటీకి ఎంపికైంది కూడా .....
ఇటీవలే నీలకంఠ సినిమా 'విరోధి'లో శ్రీకాంత్ సరసన కనిపించిన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ మంచి కవయిత్రి కూడా. "నాకు కవిత్వం రాసే అలవాటుంది. నేను రాసిన ఓ కవిత అంతర్జాతీయ కవితల పోటీకి ఎంపికైంది కూడా. అంతేకాక వాషింగ్టన్‌లో దలైలామా నిర్వహించిన సెమినార్‌కి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానం లభించిన 150 మందిలో నేనూ ఒకదాన్ని. కానీ అదే సమయంలో శేఖర్ కమ్ముల 'ఆనంద్' సినిమాలో రూప పాత్రని ఆఫర్ చేశారు. దాంతో కాస్త సందిగ్ధం. చివరకి సినిమా వైపే మొగ్గుచూపా'' అని అప్పటి పరిస్థితిని తెలియజేసింది. ఆమెకి ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా చిన్నప్పుడే నాటకాల్లో నటించింది. "స్కూల్లో, కాలేజీలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చా. యాడ్స్ కూడా చేశా. ఓ యాడ్‌లో నన్ను చూసిన నటి, దర్శకురాలు రేవతి తన 'ఫిర్ మిలేంగే' సినిమాలో శిల్పాశెట్టి చెల్లెలి పాత్రకు తీసుకున్నారు.వెండి తెర మీద అదే మొదటిసారి కనిపించడం. ఎయిడ్స్ నేపథ్యం కథతో తీసిన ఆ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి'' అని తన తొలి సినిమా ఎంట్రీ గురించి తెలిపింది. 'గోపి గోపిక గోదావరి' తర్వాత కమలినీ వేణుతో 'రామాచారి' లో చేస్తోంది.


తప్పక చూడాల్సిన చిత్రం' ఉరిమి'... దెబ్బతీసిన 'ముగ్గురు'
చాన్నాళ్ళకి ఓ మంచి చిత్రం చూసిన అనుభూతినిచ్చింది 'ఉరిమి'. సంతోష్ శివన్ అద్భుత పనితనం ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అభిరుచి గల ప్రేక్షకులు తప్పక చూడాల్సి చిత్రం ఇది. ఆదిత్య దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు' మరీ ఇబ్బంది కరంగా ఉందని అంటున్నారు. పరమ రొటీన్ మసాలా తో ఈ చిత్రం ప్రేక్షకుల సహనాన్ని దెబ్బతీసింది.

ప్రభాస్‌-లారెన్స్‌ 'రెబల్‌'కు క్రేజ్‌... గౌతమ్‌ 'నిత్య' గా సమంతా
ప్రభాస్‌ హీరోగా లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'రెబల్‌' సినిమాకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. వీరిద్దరూ కూడా సక్సెస్‌లో ఉండటంతో ఈ సినిమా పంపిణి హక్కులు కోసం చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం సుమారు పాతిక కోట్ల రూపాయలు ఆఫర్‌ చేస్తున్నట్టు ఇండిస్టీ టాక్‌ !
తెలుగులో మంచి పొజీషన్లో ఉన్న హీరోయిన్‌ సమంతాకు తమిళనాట పెద్దగా మార్కెట్‌ లేదు. ఈ నేపథ్యంలో గౌతమ్‌మీనన్‌ డైరెక్షన్‌లో జీవా హీరోగా వస్తున్న 'నిత్య' సినిమాలో సమంతా హీరోయిన్‌గా ఎంపికైంది. కోలీవుడ్‌లో ఈ సినిమా తనకు మార్కెట్‌ తెస్తుందని ఆమె నమ్మకం పెట్టుకుంది.

'బెజవాడ రౌడీలు'తో తెలుగులో అనుష్కలా అమలాపాల్‌కు బ్రేక్‌
అనువాద చిత్రం 'నాన్న' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అమలాపాల్‌. ఆ సినిమాలో విక్రమ్‌, బాల నటి సారా, అనుష్కకు మంచి మార్కులే పడ్డాయి. తను కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందే మంచి పాత్ర వేయాలని పట్టుదలతో ఉంది. తెలుగులో నాగచైతన్య సరసన నాయికగా ఓ చిత్రం చేయబోతోంది. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మిస్తున్న 'బెజవాడ రౌడీలు'లో చైతన్య సరసన మొదట ప్రీతికారావు (హిందీ నటి అమృతారావు చెల్లెలు)ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడామె స్థానంలో అమలాపాల్‌ని తీసుకున్నారు. ఈ సినిమాతో తెలుగులో బ్రేక్‌ సాధించాలని అమలాపాల్‌ భావిస్తోంది. అనుష్క తన రోల్ మోడల్ అంటోంది అమలాపాల్. 'దైవతిరుమగళ్' [నాన్న] చిత్రంలో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న అమలాపాల్ అనుష్క గురించి మాట్లాడుతూ- ఆమె ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. నటిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనకు షూటింగ్ సమయంలో తగిన మర్యాద ఇస్తూ, స్నేహంగా మెలిగారని గుర్తు చేసుకున్నారు. ఆమె తనకు పర్‌ఫెక్ట్ రోల్‌మోడల్ అని పేర్కొన్నారు. తామిద్దరం ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుకుంటామని, ఆమెతో మాట్లాడుతుంటే సమయమే తెలిసేది కాదని అన్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో వేళ్లై ముప్పొళుదుమ్ ఉన్ కర్పనైగల్ చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. అమలాపాల్ తెలుగులో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రంలో నాగ చైతన్య సరసన నటిస్తారని వినికిడి. ఈ చిత్రం తెలుగులో మంచి ఎంట్రీ అవుతుందని అమలాపాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట.

వాలి పోతానంటున్న లక్ష్మీరాయ్.... మారిపోతానంటున్న కంగనా
నటిగా నా ఎదుగుదల ఇక్క డే ప్రారంభమైంది. అలాగని ఇతర భాషల్లో నటించకూడదని ఏమీ లేదు. హిందీ చిత్రంలో నటిస్తే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందవచ్చు. అతి త్వరలో బాలీవుడ్ రంగ ప్రవేశం ఉంటుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థతో చర్చలు జరుగుతున్నాయి. అందుకే ఎక్కువ సమయం ముంబయిలో గడుపుతున్నాను. తమిళంలో నటించిన మంగాత్తా చిత్రం ఈ నెలలోనే తెరపైకి రానుంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఒక చిత్రం చేస్తున్నాను. మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో ఒక చిత్రం, నూతన దర్శకుడితో ఒక చిత్రం చేస్తున్నాను. ఎక్కడ మంచి అవకాశం వస్తే అక్కడ వాలిపోతాను. ఆ స్వేచ్ఛ నాకుంది.
‘‘నటిగా ఎన్నో పాత్రల్లో జీవించాను. ఇకనుంచి భారతీయురాలిగా జీవించాలనుకుంటున్నాను’’ అంటున్నారు బాలీవుడ్ భామ కంగనారనౌత్. అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న కంగనా మాట్లాడుతూ -‘‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత నాలో వచ్చిన మార్పును త్వరలోనే చూస్తారు. నటించే పాత్రల విషయంలో కూడా ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా దేశ గౌరవం నిలబడేలా నడుచుకోవాలనుకుంటున్నాను. గ్లామర్ కన్నా, దేశభక్తి, సందేశం మిళితమైన చిత్రాల్లో నటించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అంతేకాక... సేవాకార్యక్రమాలతో నా జన్మను పునీతం చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి మదర థెరిస్సానే నాకు ఆదర్శం. నా కొత్త నిర్ణయం నాకు మంచినే చేకూరుస్తుందని నా నమ్మకం’’ అని చెప్పుకొచ్చారు. సెక్సీ ఇమేజ్ కోసం కొన్నాళ్ల పాటు వెంపర్లాడిన కంగనాలో ‘దేశభక్తి’ తెచ్చిన ఈ మార్పేంటి అన్నది సస్పెన్సే.

'వేలాయుధం' చిత్ర యూనిట్ కి విజయ్ బంగారు గొలుసులు
విజయ్ హీరో గా భారీ స్థాయి లో నిర్మించిన 'వేలాయుధం' చిత్ర సాంకేతిక వర్గానికి ఆ చిత్ర హీరో విజయ్ బంగారు గొలుసులను అందించారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి జయం రాజ దర్శకుడు. విజయ్, జెనీలియా, హన్సిక నటిస్తున్నారు. చెల్లెలి పాత్రలో శరణ్యమోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు పూర్తి అయింది. దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలను ఇటీవల విజయ్ చూశారట. చాలా గొప్పగా వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారట. పక్కనున్న దర్శకుడు జయం రాజాను, కెమెరామన్ ప్రియన్‌ను కౌగిలించుకున్నారట. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గానికి కాసు బంగారు గొలుసులను బహుమతిగా అందించారు. విజయ్ చిత్రాల్లో బెస్ట్ క్లైమాక్స్‌గా ఇది నిలిచిపోతుందని జయం రాజా అంటున్నారు.


‘అధినాయకుడు’ నందమూరి బాలకృష్ణ ?... త్వరలో నాగార్జున ‘రాజన్న’
చిరంజీవి 150వ చిత్రం చేయబోతున్నాడని, ఆ చిత్రానికి ‘అధినాయకుడు’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ టైటిల్‌ ని నందమూరి బాలకృష్ణ తాజా చిత్రానికి పెట్టే అవకాశం కనిపిస్తోంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్.కుమార్ చౌదరి ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మూడు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రం కోసం ముందు ‘మహదేవనాయుడు’ అనే టైటిల్ అనుకున్నారు. అయితే బి.గోపాల్ , బాలకృష్ణ కలయికలో రూపొందుతున్న చిత్రానికి ‘ హర హర మహదేవ’ అనే టైటిల్ పెట్టడంతో దర్శకుడు పరుచూరి మురళి ‘మహదేవనాయుడు’ టైటిల్‌ని పక్కన పెట్టి ‘అధినాయకుడు’ని ఖరారు చేయాలని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఈ టైటిల్‌ని నిర్మాత ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేశారు. బాలయ్య తాజా చిత్రానికి ‘అధినాయకుడు’ టైటిల్ దాదాపుగా ఖరారయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.
నాగార్జున కథానాయకుడిగా ‘రాజన్న’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. అన్నపూర్ణ స్డూడియో పతాకంపై నాగార్జున సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వం వహించారు . రాజ మౌళి కొన్నిపోరాట సన్నివేశాలకు దర్శకత్వం వహించడం ఈ చిత్రం లో విశేషం . స్నేహ నాయికగా చేసిన ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

విక్రమ్ నటనతో శ్రియ ప్రేమలో పడింది
శ్రియ ప్రేమలో పడిందట. ఇక పెళ్లే తరువాయి అనుకోకండి.. ఆమె ప్రేమించేది ఎవరో ఒక వ్యక్తిని కాదు విక్రమ్ నటన నట. దీని గురించి శ్రియ తెలుపుతూ -ఇటీవల' దైవ తిరుమగళ్' [నాన్న] చిత్రంలో విక్రమ్ నటన చూసి ఆశ్చర్యపోయానంది. తాను ఇంతకు ముందు విక్రమ్‌కు జంటగా 'కందస్వామి' [మల్లన్న] చిత్రంలో నటించినా దైవతిరుమగళ్‌లో కృష్ణ పాత్రలో ఆయన అభినయం చూసి అభినందించకుండా ఉండలేకపోయానని చెప్పింది. నటుడిగా ఆయన్ను తాను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు తెలిపింది. అలాగే ' కో' [రంగం], 'అవన్ ఇవన్' [వాడు-వీడు] చిత్రాలు కూడా తనకెంతగానో నచ్చాయంది. కో చిత్ర విజయానికి ముఖ్యమైన అంశం స్క్రిప్టు అని, జీవా అందులోని పాత్రకు వందశాతం న్యాయం చేశారని పేర్కొంది. అవన్ ఇవన్ చిత్రం విషయానికొస్తే విశాల్ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించారని తెలిపింది. ఈ ముగ్గురు హీరోల సరసన నటించిన అనుభవం తనకుందని శ్రియ గుర్తు చేసింది.

సల్మాన్‌ జీవితంలో ఇంకెవారికీ చోటు లేదంటోంది కత్రినా
నేనున్నానని... నీకేం కాదని అంటూ తెగ ఓదార్చేస్తోంది కత్రినాకైఫ్‌ తన కండల బాయ్‌ఫ్రెండ్‌ సల్మాన్‌ఖాన్‌ని. కొంత విరామం తర్వాత ఇటీవల సల్మాన్ తో ఏక త టైగర్ చిత్రం లో నటిస్తున్నకత్రినాకైఫ్‌- కొంతమంది పనిగట్టుకుని మా మధ్య లేని అగాధాన్ని సృష్టించారని... ఒకప్పుడు సల్మాన్‌ బ్యాడ్‌ పీరియడ్‌లో ఉన్నప్పుడు తాను దగ్గరున్నానంటూ గొప్పలు చెప్పేసుకుంటోంది . అంతేనా, ఈ మధ్య పత్రికా విలేకరులతో.... ‘సల్మాన్‌ జీవితంలో ఇంకెవరూ వచ్చే ఛాన్సేలేదు. ఎందుకంటే నేనున్నానుగా...’ అంటూ గడుసుగా మాట్లాడుతోంది. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రావడం వలనే తాము ఎక్కువగా కలుసుకోలేకపోయామంటోంది. అయితే తమ మధ్య దూరం ఇప్పుడిప్పుడే మళ్లీ దగ్గరవుతోందని... తామిద్దరూ ఒక్కటయ్యామని చెబుతోంది కత్రిన. ఏదిఏమైనా బాలీవుడ్‌లో ఇప్పుడు సల్మానే నెంబర్‌వన్‌గా చెలామణి అయిపోతున్నాడు. ఇప్పట్లో ఆయనకు పోటీ వచ్చేవాళ్లెవరూ లేరు. అందుకే కత్రిన మళ్లీ సల్మాన్‌ సరసన చేరిందని బాలీవుడ్‌లో అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రియుడి పుట్టిన రోజు వేడుకను భారీగా జరిపిన కరీనా
కొంచెం విరామం దొరికినా చాలు. ..ప్రియుడు సైఫ్‌అలీఖాన్‌తో విదేశాలకు చెక్కేయడం కరీనాకు అలవాటు . ‘రా.వన్, ఏజంట్ వినోద్, బాడీగార్డ్’ చిత్రాలతో బిజీగా వున్న ఈ సుందరి ఐదు రోజులు బ్రేక్ తీసుకొని ఆదివారం సైఫ్‌తో లండన్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ నెల 16న అతని పుట్టిన రోజు కావడంతో ఆ వేడుకను భారీగా నిర్వహించిందట కరీనా. అందుకోసం తన సినిమాలకు సంబంధించిన అన్ని ప్రచార కార్యక్రమాలను ఆగమేఘాలమీద పూర్తిచేసింది ఈ సుందరి. ప్రతి యేడాది సైఫ్ బర్త్‌డే వేడుకను గ్రాండ్‌గా చేస్తున్న కరీనా ఈసారి బర్త్‌డే ఫంక్షన్‌ను మరింత వినూత్నంగా ప్లాన్‌ చేసిందట. లండన్‌లో ప్రసిద్ధి చెందిన ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో సన్నిహితుల సమక్షంలో పుట్టిన వేడుక భారీగా జరిగిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు సైఫ్‌కు అత్యంత ఖరీదైన బహుమతిని ప్రదానం చేసిందట. సుదీర్ఘ ప్రేమాయణానికి తెరదించుతూ ఈ జంట వచ్చే డిసెంబర్‌లో పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే

మేగాన్‌ ఫాక్స్‌ వ్యక్తిగత విషయాలను తనతోనే ఉంచుకుంటుందట
తాను సెక్స్‌ టేపుల జోలికెళ్లనని ప్రముఖ హాలీవుడ్‌ అందాల నటి మరియు మోడల్‌ మేగాన్‌ ఫాక్స్‌ తేల్చి చెప్పింది. తన శృంగార సన్నివేశాలను తాను చూస్తే.. భవిష్యత్తులో శృంగారానికి దూరమవ్వాల్సి వస్తుందేమోనన్న ఆందోళనను మేగాన్‌ ఫాక్స్‌ వ్యక్తం చేసింది. లాస్‌ ఏంజెలెస్‌లో ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేగాన్‌ ఫాక్స్‌ మాట్లాడింది. వరుసగా రెండో సంవత్సరం శృంగార దేవతగా కిరీటం కైవసం చేసుకున్న సందర్భంగా ఆమె ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. హాలీవుడ్‌ భామలు పమీలా ఆండర్సన్‌, పారిస్‌ హిల్టన్‌ తదితరులు జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నుంచి పాఠాలు మేగాన్‌ ఫాక్స్‌ బాగా నేర్చుకున్నట్లుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ ఆస్టిన్‌గ్రీన్‌తో మళ్లీ ఇప్పుడు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న మేగాన్‌ ఫాక్స్‌.. తన వ్యక్తిగత జీవిత విషయాలను తనతోనే ఉంచుకుంటానని తెలిపింది. ఇలాంటి సెక్స్‌ టేపులు ఒక్కసారి ఇంటర్నెట్‌లో వచ్చాయంటే.. ఇక అవి జీవిత కాలం ప్రపంచం మొత్తం అలా తిరుగుతూనే ఉంటాయని మేగాన్‌ ఫాక్స్‌ అంటోంది.


చేయని తప్పుకు క్షమాపణ చెప్పడానికి ప్రియమణి రెడీ
‘‘ఇక మీదట తమిళ సినిమాలు చేయబోను’’ అని ప్రియమణి ఓ ఇంటర్‌వ్యూలో చెప్పినట్టుగా కోలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీంతో తమిళ పరిశ్రమ ప్రియమణిపై గుర్రుగా ఉందని సమాచారం. అంతేకాదు... ఆమెను పూర్తిగా బ్యాన్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. ‘‘నేను అలా అనలేదు’’ అని ప్రియమణి ఎంత వాపోతున్నా... ఆమె వివరణకు తమిళ పెద్దలు ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదట. ఈ పరిణామానికి షాక్ తిన్న ప్రియమణి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ నేను అలా అనలేదు. తమిళ సినిమా నాకు చాలా చేసింది. నేనంత విశ్వాసం లేనిదాన్ని కాదు. ఆ గాసిప్స్‌ని పట్టుకొని నన్ను నిందించడం తగదు. అవసరమైతే చేయని తప్పుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను’’ అనేది ఆ వివరణ సారాంశం. అంతటితో ఆగని ప్రియమణి... తమిళ నిర్మాతలకు ఫోన్లు చేసి మరీ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారట.

‘కందిరీగ’ నిర్మాత - హీరో ల డిషిం..డిషిం... తేజ 'డాష్... డాష్'
‘కందిరీగ’నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై హీరో రాం ' మూవీ ఆర్టిస్ట్‌‌ అసోసియేషన్‌'లో ఫిర్యాదు చేశారు. ‘కందిరీగ’ బకాయి ఇంకా రూ. కోటి చెల్లించాల్సి ఉందని రామ్‌ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ అసోసియేషన్‌, నిర్మాతల మండలి ఓ సమన్వయ కమిటీ వేసి సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ప్రేమకథా చిత్రాల్లో నూతన ఒరవడిని సృష్టించిన తేజ తన చిత్రాల ద్వారా తెలుగు సినీ పరిక్షిశమకు ఎంతో మంది నటీనటులను పరిచయం చేశాడు. ఉదయ్‌కిరణ్, నితిన్, సదా, అనిత తదితరులు ఆ కోవలోకే వస్తారు. తాజాగా తేజ మరోసారి నూతన తారలతో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించబోయే నటీనటుల ఎంపిక జరుగుతోంది. కాగా ఈ సినిమాకి ‘నీకు నాకు డాష్.. డాష్..’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

హీరోకు అమ్మగా నటి మీనా మళ్లీ నటించడానికి సిద్ధం
నటి మీనా మళ్లీ నటించడానికి సిద్ధం అవుతోంది. ఈమె 1982లో బాల నటిగా తెరంగేట్రం చేసింది. అన్బు ళ్ల రజనీకాంత్ చిత్రంలో బాలనటిగా నటించి రజనీ ప్రశంసలందుకున్న మీనా ఆ తరువాత ఆయన సరసనే హీరోయిన్‌గా నటించే స్థాయికి చేరుకుంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రముఖ హీరోలందరితోనూ జతకట్టి ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందింది.బెంగళూర్‌కు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంది. జనవరిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు నైనిక అని నామకరణం చేసింది. 2009లో నటనకు ఫుల్‌స్టాప్ పెట్టిన మీనా మధ్యలో పలు అవకాశాలు వచ్చినా నిరాకరించింది. ఇప్పుడు మళ్లీ నటించేం దుకు సిద్ధం అయినట్లు సమాచారం. ఒక తెలుగు చిత్రంలో హీరోకు అమ్మగా నటించడానికి మీనా అంగీకరించినట్లు తెలిసింది.

‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో మళ్లీ ‘డార్లింగ్’ కాజల్... కమల్ సరసన సమీరా?
‘డార్లింగ్’ చిత్రంలో ప్రభాస్‌తో తొలిసారి కలిసి నటించిన కాజల్ అగర్వాల్ మరోసారి ఆయనతో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రంలోనూ నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా విజయం సాధించడంతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట ముచ్చటగా మూడోసారి జతకట్టబోతోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ఓ భారీ చిత్రం రూపొందనుంది. కె.రాఘవేంద్రరావు నిర్మించనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటించే అవకాశం కాజల్‌ని వరించిందని తెలుస్తోంది. ‘మగధీర’ చిత్రంతో కథానాయకగా కాజల్‌కు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మంచి గుర్తింపుని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని, సమంతలతో ‘ఈగ’ చిత్రాన్ని రూపొందిస్తున్న ఎస్.ఎస్. రాజమౌళి ఆ చిత్రం పూర్తయిన వెంటనే ప్రభాస్‌తో రూపొందించనున్న చిత్రాన్ని ప్రారంభించనున్నాడని తెలుస్తోంది.
కమలహాసన్‌కు జంటగా 'విశ్వరూపం' లో సమీరారెడ్డి నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కమల్ సరసన నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. మొదట బాలీవుడ్ క్రేజి హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారు. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమె వైదొలిగింది. ఆ తరువాత దీపికా పడుకునేను నటింప చేయాలని చూశారు. ఆమె ఇప్పటికే రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్న'రాణా' చిత్రంలో నటించడానికి అంగీకరించడంతో సారీ చెప్పింది. తరువాత విద్యాబాలన్, సోనం, ఇషా శర్వాణి పేరు కూడా చేరింది. అదే విధంగా ప్రియా ఆనంద్ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఈమెకు కమల్ ఫొటో సెషన్ కూడా చేసినట్లు తెలిసింది. తాజాగా ముంబయి భామ సమీరారెడ్డి కమల్‌హాసన్ సరసన నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

నాజూకు తనం కోసం హన్సిక కాస్మొటిక్‌ సర్జరీ ?
చక్కనమ్మ చిక్కినా అందమే అంటూ కవులు వర్ణిస్తుంటారు. చిక్కితే పర్లేదు కానీ, చిక్కల్లా వాళ్లు మోతాదు మించిన దేహంతో కొవ్వుబట్టి కనిపిస్తేనే. తమిళ తంబిలు అటువంటి అందాలను ఆస్వాదిస్తారేమోగానీ తెలుగువారు మాత్రం హీరోయిన్లు సన్నజాజి మల్లెతీగల్లా ఉండాలని కోరుకుంటారు. ‘దేశముదురు’ పాప హన్సిక ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘కందిరీగ’ చిత్రంలో కూసింత లావుగా నమితలా కనిపించేసరికి అంతా కామెంట్లు చేయడం మొదలెట్టారు. అయితే హన్సిక విదేశాలకు హఠాత్తుగా పయనమయింది. విషయం ఏమిటంటే - ఆటవిడుపు కోసమని హన్సిక చెబుతోంది కానీ... దాని వెనక రహస్యమేమిటంటే - అర్జెంటుగా సన్నబడేందుకు బాడీకి సంబంధించి కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.


రవితేజ -పూరిజగన్నాద్ ల 'ఇడియట్ -2'
సంచలన విజయం సాధించిన 'ఇడియట్’ జంట పూరి జగన్నాద్ - రవితేజ లతో త్వరలో 'ఇడియట్ -2' రానుంది. బి.వి.యస్.యన్. ప్రసాద్ దీన్ని జనవరిలో ప్రారంభిస్తున్నారు. ఇడియట్ నా జీవితాన్ని, రవితేజ జీవితాన్ని మార్చేసింది. దాన్ని మించిన విధంగా రెండవ భాగం వుంటుంది. సుమ్మెర్ లో విడుదల అనుకుంటున్నామని పూరి జగన్నాద్ అన్నారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ - 'ఇడియట్' విడుదల రోజునే 'ఈ అబ్బాయి చాలా మంచోడు' రవితేజ తో ప్రారంభించాను. 'ఇడియట్' విజయం నా చిత్రానికి ఉపయోగపడింది. ఆ జంటతో 'ఇడియట్ -2'ను నిర్మించడం నాకు ఎంతో ఆనందదాయికం అని అన్నారు. ఈ చిత్రాన్ని భోగవల్లి బాపినీడు సమర్పిస్తున్నారు.

ఎ.ఆర్‌.రెహ్మాన్‌ 'సత్యమేవ జయతే'... దక్షిణాదిన ప్రియాంక చోప్రా
గతంలో 'మా తుజే సలాం...' పాటతో భారతీయుల హృదయాలు దోచుకున్న స్వర మాంత్రికుడు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ నేటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'సత్యమేవ జయతే' పేరుతో మరో అల్బం రిలీజ్‌ చేశాడు. ఇందులో ఓ సంస్కృత శ్లోకం కూడా ఉంది.
ప్రియాంక చోప్రా మొదటి సారి మేకప్ వేసుకున్నది దక్షిణాది చిత్రం కోసమే. విజయ్ కథానాయకుడిగా నటించిన ఆ తమిళ సినిమా పేరు 'తమిళన్'. అక్కడి నుంచి బాలీవుడ్‌కెళ్ళి ఓ వెలుగు వెలిగిన ప్రియాంక ఇప్పుడు మరలా దక్షిణాది వైపు చూడనుంది. అదీ మురుగదాస్ దర్శకత్వంలో. దర్శకుడు మురుగదాస్ విజయ్‌తో ఓ సినిమా తీస్తున్నట్లు ఇటీవల వార్త వెలువడింది. ఇందులో హీరోయిన్‌గా అనీల్‌కపూర్ కూతురు సోనమ్‌కపూర్ నటిస్తోందని అనుకున్నారు. అయితే ఆమె కాల్షీట్లు కుదరకపోవడంతో ప్రియాంకను ఇందులో హీరోయిన్‌గా నటింపజేసేందుకు దర్శకుడు ఒప్పించినట్లు సమాచారం. సూర్య, శ్రుతి హాసన్ జంటగా నటిస్తున్న 'ఏళామ్ అరివు' చిత్రం షూటింగ్ ముంబైలో జరిగేటప్పుడు దర్శకుడు మురుగదాస్‌తో ప్రియాంక చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఫలితమే ఈ సినిమా అని కోలీవుడ్ గుసగుసలాడుతోంది. విజయ్ తండ్రి యస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

తమన్నాను అడిగితే - ‘‘టాలీవుడ్ మన్మథుడు" నాగార్జునే
టాలీవుడ్ హీరోల్లో గ్లామర్ పరంగా కింగ్ ఎవరు? అని ఇటీవల తమన్నాను అడిగితే... ‘‘ఇంకెవరు టాలీవుడ్ మన్మథుడు అంటే.. అది నాగార్జునగారు మాత్రమే’’ అంటూ తడుముకోకుండా సమాధానమిచ్చారు తమన్నా. ఇలా డెరైక్ట్‌గా చెప్పేస్తే మిగిలిన హీరోలు ఫీలవ్వరా? అనంటే... ‘‘నా అభిప్రాయం నేను చెప్పాను. అయినా నాగార్జునగారు ఫిఫ్టీ ప్లస్. ఇప్పటికీ ఆయన గ్లామర్ చూడండి... వయసు మీదపడుతున్నా చెక్కుచెదరని గ్లామర్ ఆయన సొంతం. నాగార్జునగారి స్మైల్‌కానీ, ఆయన బాడీలాంగ్వేజ్ కానీ, మాటతీరు కానీ నాకు చాలా ఇష్టం’’ అంటూ ఓ రేంజ్‌లో పొగడ్తలు కురిపించేశారు తమన్నా. ఆయన తనయుడితో జతకట్టారు... మరి ఆయనతో జతకట్టే అవకాశం వస్తే ఓకే అంటారా? అనడిగితే -‘‘అంతకంటే అదృష్టం ఏముంటుందండీ... నిజంగా అలాంటి అవకాశమే వస్తే అది నాకు గొప్ప ప్రమోషన్‌తో సమానం. ఇప్పటివరకూ నేను యంగ్‌హీరోలతోనే చేశాను. ఆయనతో చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకొనే ప్రసక్తేలేదు’’ అన్నారు చేశారు తమన్నా.

నటి అమలాపాల్‌కు సొంత గడ్డపైనే రెడ్‌కార్డ్
నటి అమలాపాల్‌కు సొంత గడ్డపై రెడ్‌కార్డ్ పడనుంది. మైనా చిత్రం తర్వాత అమలాపాల్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వెలువెత్తుతున్నాయి. విక్రమ్ సరసన నటించిన 'దైవతిరుమగళ్' సక్సెస్ కావడంతో ఈ మలయాళీ కుట్టి పేరు టాలీవుడ్‌కూ పాకింది. తెలుగులో ఒక భారీ చిత్రంలో నటించడానికి అమ్మడు సమ్మతించినట్లు తెలిసింది. తమిళం, తెలుగు చిత్రాల్లో అవకాశాలు రావడంతో తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేసినట్లు సమాచారం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను అక్షరాలా పాటిస్తున్న ఈ అమ్మడుకు సొంతగడ్డపై ముప్పు ముంచుకొస్తోంది. దీనికి కారణం మలయాళ చిత్రాలను ఈమె పక్కన పెట్టడమే. మలయాళ చిత్ర పరిశ్రమలో పారితోషికం తక్కువ కావడంతో అమలాపాల్ కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాలకే ప్రాముఖ్యతనిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి ఆగ్రహించిన మలయాళ నిర్మాతల సంఘం తమిళ నిర్మాతల సంఘంతో చర్చించి త్వరలో ఆమెపై నిషేధం ప్రకటించడానికి సిద్ధమవుతోంది. రెడ్‌కార్డ్ ప్రకటిస్తే అమలాపాల్ ఏ భాషా చిత్రంలోనూ నటించే అవకాశం ఉండదు. దీంతో ఆమె ఇటీవల తాను జంటగా నటించిన హీరోతో గోడు చెప్పుకున్నట్లు సమాచారం.

మనవడు రణ్‌బీర్ తో షమ్మీ కపూర్ చివరి చిత్రం 'రాక్‌స్టార్'
అద్భుత నటన, ప్రతిభా సామర్థ్యాలతో ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత్వంగా నిలిచిపోయిన షమ్మీ కపూర్ తన చివరి కోరికను కూడా నెరవేర్చుకున్నారు. తన మనవడు రణ్‌బీర్ కపూర్‌తో 'రాక్‌స్టార్' అనే చిత్రం లో చివరిసారిగా నటించారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా నవంబరు 11న విడుదలవుతోంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి, చివరి సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాదు వీరిద్దరూ జుగల్‌బందీలో కనిపిస్తారట. ఈ సీన్‌లో రణ్‌బీర్ గిటార్ వాయిస్తే.. షమ్మీ షెహనాయ్‌తో కనిపిస్తారు. రాక్‌స్టార్‌ను కావాలని కలలుగనే పట్టణప్రాంత యువకుడిగా ఇందులో రణ్‌బీర్ కనిపిస్తాడు. రాక్‌స్టార్‌లో రణ్‌బీర్‌తో కలిసి పనిచేసేటప్పుడు షమ్మీ డయాలసిస్ చేయించుకుంటూనే ఉన్నారు. షెహనాయ్ వాయించడం అంటే తనకు ఎంతో ఇష్టమని ఓ సందర్భంలో షమ్మీ చెప్పారు. రాక్‌స్టార్ వంటి అత్యాధునిక సినిమాలో కనిపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


నాగార్జున - అనుష్కలకు మరోసారి కలిసొచ్చిన కాంబినేషన్
నాగార్జునతో తొలిసారిగా ‘సూపర్‌’ చిత్రంతో జతకట్టిన అనుష్క తర్వాత ' కేడి' , 'రగడ' చిత్రాలలో నటించింది. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న ‘డమరుకం’ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత కామాక్షి క్రియేషన్స్‌ చిత్రంలో నాగార్జున సరసన హీరోయిన్‌గా మళ్లీ అనుష్కను తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. నాగార్జున ప్రస్తుతం షిర్డీసాయిగా నటిస్తున్న విషయం విదితమే. రచయిత జె.కే .భారవి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆదిశంకర’ చిత్రంలో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రను చేయబోతున్నారు. 'హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆదిశంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఓ మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. భారతీయుడిగా ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను' అన్నారు నాగార్జున.

చెన్నైలో రీమాసేన్ అశ్లీల పోస్టర్ల కలకలం
నటి రీమాసేన్ అశ్లీల ఫొటోలతో కూడిన పోస్టర్లు చెన్నైలో కలకలం పుట్టిస్తున్నాయి. ఆ పోస్టర్లను వెంటనే తొలగించకుంటే నిర్మాతపై కేసు వేస్తానని నటి రీమాసేన్ ధ్వజమెత్తారు. ఈమె ' ఆయిరత్తిల్ ఒరువన్' చిత్రం తరువాత తమిళంలో నటించలేదు. ప్రస్తుతం మలయాళం, తెలుగు భాషలలో నటిస్తున్నారు. తాను కొన్నేళ్ల క్రితం ఒక బెంగాలీ చిత్రంలో నటించానని, ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి డబ్బింగ్ చేస్తున్నారని, దానికి సంబంధించిన పోస్టర్లే అవి- అని రీమాసేన్ తెలిపారు. ఆ చిత్రంలో వేశ్య పాత్రలో నటించానని చెప్పారు. అయితే పోస్టర్లలో చూపిస్తున్నట్లుగా అశ్లీలంగా నటించలేదని స్పష్టం చేశారు. ఇదిలావుండగా రీమాసేన్ అశ్లీల పోస్టర్లను పలువురు దర్శక నిర్మాతలు చూసి , ఆ తరహా చిత్రాల్లో నటించమని ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అసహనానికి గురైన రీమాసేన్ ఈ అశ్లీల పోస్టర్లకు సంబంధించిన చిత్ర నిర్మాతపై ధ్వజమెత్తారు. ఈ పోస్టర్లను వెంటనే తొలగించకుంటే కేసు వేస్తానని హెచ్చరించారు. దీంతో రీమాసేన్ అశ్లీల పోస్టర్ల తొలగింపు ప్రక్రియను ఆ నిర్మాత ప్రారంభించారు.

బికినీ ధరించేది లేదని చెబుతున్న బొద్దుగుమ్మ హన్సిక
బికినీ ధరించేది లేదని ఖరాఖండిగా చెబుతోంది బొద్దుగుమ్మ హన్సిక,' ఎంగేయుమ్ కాదల్' చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో కాస్త నిరాశ చెందిన ఈమె ఇప్పుడు విజయ్ సరసన నటించిన' వేలాయుధం', ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన' ఒరుకల్ ఒరు కన్నాడి' చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ ఉత్తరాది భామ మాట్లాడుతూ- ఈ వయసులో తాను బికినీ ధరించడం సరైన పద్ధతి కాదని అనుకుంటున్నానని పేర్కొంది. అలాంటి దుస్తులు ధరించడం తనతోపాటు తన కుటుంబ వ్యక్తులకు కూడా ఇష్టంలేదంది. ఇక గ్లామర్‌గా నటిస్తారా? అని అడుగుతున్నారని, పాత్రలను బట్టి గ్లామర్‌గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.గ్లామర్‌కు- వల్గర్‌కు మధ్య తేడా తనకు తెలుసని చెప్పింది. తమిళ చిత్ర పరిశ్రమలో తనను అందరూ చిన్న ఖుష్బూ అని పిలుస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఆమెను కలిశానని తెలిపింది. అంతకుముందే దర్శకుడు ప్రభుదేవా నుంచి ఖుష్బూ తన ఫోన్ నెంబర్ తీసుకుని తనతో మాట్లాడారని చెప్పింది. ఒక సీనియర్ నటిగా ఆమె తనకు నటనకు సంబంధించి మంచి సూచనలు, సలహాలు ఇచ్చారని హన్సిక తెలిపింది. ఇటీవల విడుదలైన హన్సిక నటించిన తెలుగు చిత్రం 'కందిరీగ' విజయవంతం కావడం విశేషం

శంకర్ ' నన్భన్' హీరోల సంఖ్య అరడజను దాటుతోంది
భారతీయ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులలో శంకర్ ఒకరు. ప్రస్తుతం శంకర్ ' నన్భన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హిందీ ' త్రీ ఇడియట్స్' చిత్రానికి రీమేక్ . అలాగే శంకర్ దర్శకత్వం వహిస్తున్న తొలి రీమేక్ చిత్రం కూడా. జెమినీ ఫిలిం సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం హీరోల మయంగా మారింది. ఈ చిత్రంలో హీరోల సంఖ్య అరడజను దాటుతోంది. మొదట ఇందులో విజయ్, జీవా, శ్రీకాంత్ హీరోలుగా నటిస్తున్నారన్నారు. హీరోయిన్‌గా క్రేజీ స్టార్ ఇలియానాను ఎంపిక చేశారు. ఆ తరువాత సీనియర్ నటుడు సత్యరాజ్ చేరారు. ఆ తరువాత నటి అనూష, ఎస్‌జే.సూర్య వచ్చి చేరారు. తాజాగా ఈ జాబితాలో 'కాంచన' చిత్ర సృష్టికర్త లారెన్స్ కలిశారు. ఇంతపెద్ద తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలని దర్శక నిర్మాతల ప్రయత్నం.

బాలీవుడ్ లో మరో వివాదం... షాహిద్, సోనమ్ ల ‘మౌసమ్’
ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు వివాదాస్పద మవుతున్న విషయం తెలిసిందే. వర్మ ‘నాట్ ఎ లవ్ స్టోరీ’, అజయ్‌దేవ్‌గన్ ‘సింగం’, రిజర్వేషన్లపై రూపొందించిన ‘అరక్షణ్’ చిత్రాలు వివాదాలు సృష్టిస్తే తాజాగా షాహిద్ కపూర్, సోనమ్ కపూర్ జంటగా శీతల్ వినోద్ తల్వార్, సునీల్ లుల్లా నిర్మిస్తున్న చిత్రం ‘మౌసమ్’ కూడా వీటి వరుసలో చేరింది. షాహిద్‌కపూర్ తండ్రి పంకజ్‌కపూర్ డైరెక్టోరియల్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. పంకజ్ కపూర్ మిత్రుడు నౌమన్ మాలిక్ ‘మౌసమ్’ టైటిల్ తనదని, పైగా కథ కూడా తనదేనని వాదిస్తున్నాడు.కొన్నేళ్ళ క్రితం ఈ కథని ఓ సందర్భంలో పంకజ్ కపూర్‌కు చెప్పానని, కథ నచ్చడంతో దీన్ని షాహిద్‌తో రూపొందిస్తే బాగుంటుందని తను సలహా ఇచ్చాడని ఆయన చెబుతున్నారు. అయితే కథ అంతా సిద్దం చేశాక, షాహిద్ కపూర్ ఆ కథపై అంతగా ఆసక్తిచూపనట్లు- తనను మభ్యపెట్టిన పంకజ్‌కపూర్ ఇప్పుడు అదే కథతో సినిమా తీశాడని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదని నౌమన్ మాలిక్ అంటున్నాడు.


సూర్య- శృతిల 'సెవెంత్ సెన్స్'.... సిద్ధార్థ్‌తో సమంత
‘గజిని’ చిత్రంతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించిన దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్, సూర్యల కాంబినేషన్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తమిళ్‌లో ‘7ఆమ్ ఆరివు’ అనే టైటిల్‌తో రూపొందీస్తున్న చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. సూర్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. అమీర్‌ఖాన్‌తో రూపొందించిన ‘గజిని’ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో బారీ ఆఫర్లు వచ్చినా వాటిని పక్కన పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో మురుగదాస్ ఈ చిత్రాన్ని ‘సూపర్ మిషన్’ బాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడట. కాగా ‘గజిని’ చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీలాస్ పేషెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్‌గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో నిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నుందని... దీనికి తెలుగు లో సెవెంత్ సెన్స్ అని పేరు పెడుతున్నారని సమాచారం.
‘ఏం మాయ చేసావె’ చిత్రంలో జెస్సీగా సమంత చూపిన అభినయానికి కుర్రకారంతా ఆమె మాయలో పడిపోయారు. తొలి చిత్రంలో చీరకట్టుతో మురిపించిన సమంత ఆ తర్వాత ‘బృందావనం’లో మోడ్రన్ స్తులతో, గ్లామరస్‌గా కనిపించి, ప్రస్తుతం మహేష్‌తో కలిసి ‘దూకుడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా తన పాత్ర తొలి రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుందని, తన పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని తన సన్నిహితులతో చెబుతున్నారట సమంత. అయితే ఈ క్రేజీగర్ల్ ఈ సినిమాలో కూడా హాట్ హాట్‌గా కనిపించబోతుందని తెలిసింది. ఇక ఈ చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్‌ను పూర్తిచేయాలని భావించిన ఈ అందాల సుందరి త్వరలో సిద్ధార్థ్‌తో కలిసి ఓ చిత్రంలో జతకట్టనుందని తెలిసింది. ఇంతకు ముందు ‘ఆవకాయ్ బిర్యానీ’ చిత్రాన్ని తెరకెక్కించిన అనీష్ కురువిల్లా ఈ చిత్రానికి దర్శకుడు. వైజాగ్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు.

చిత్ర నిర్మాణంలోకి సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా
ప్రముఖ యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా చిత్ర నిర్మాణ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఆయన సంగీత దర్శకుడిగా బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలను నిర్మించాలనుకుంటున్నారు. తొలి చిత్రాన్ని తన కజిన్ బ్రదర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రముఖ హీరో హీరోయిన్లే నటిస్తారంటున్న యువన్ శంకర్ రాజా. అందుకు స్క్రిప్టు సిద్ధం అయిందంటున్నారు.ప్రస్తుతం మంగాత్తా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వెంకట్ ప్రభు బిజీగా ఉన్నారు. తర్వాత యువన్ శంకర్‌రాజా చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. ఈ చిత్రానికి పేరు నిర్ణయించే బాధ్యతను సంగీత జ్ఞాని ఇళయరాజాకు అప్పగించారట. తన కొడుకు తొలిసారిగా నిర్మించనున్న చిత్రానికి మంచి పేరు నిర్ణయించే విషయంలో ఇళయరాజా నిమగ్నమయ్యారని తెలిసింది.

అమితాబ్ కుదరదన్నారు... మా ఆయన ఒప్పుకున్నారు!
‘టెల్ మీ ఓ ఖుదా’ చిత్రంలో నటించేందుకు అమితాబ్‌కు కుదరకపోవడంవల్లే తన భర్త ధర్మేంద్ర నటించాడని- అలనాటి అందాల నటి హేమమాలిని చెప్పింది. ఈ చిత్రంలో కూతురు ఇషాడియోల్, భర్త ధర్మేంద్ర తొలిసారి కలిసి నటిస్తున్నారని, చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడు వారి నటనను ఆస్వాదిద్దామా? అన్న ఆత్రుత తనలో ఉందని చెప్పింది.. ‘అమితాబ్‌కు షెడ్యూల్ బిజీగా ఉండడం, ఆయన అంగీకరించకపోవడం, ధర్మేంద్ర నటించేందుకు అంగీకరించడం.. ఈ పరిణామాలన్నీ నన్నెంతో ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. చిత్రంలో నటించిన వినోద్‌ఖన్నా, రిషి కపూర్, అర్జన్ బాజ్వా, సుధాంషు పాండే తదితరుల నటన కూడా నన్నెంతగానో ఆకట్టుకుంద’ని హేమ చెప్పింది. తన భర్తను తానే స్వయంగా డెరైక్ట్ చేయడం కూడా కొత్తగా ఉందని, నిర్మాత కూడా తానే అయినందున ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పింది. కొడుకులు సన్నీ, బాబీలతో కలిసి నటించిన ధర్మేంద్ర తొలిసారిగా కూతురుతో కలిసి నటిస్తున్నాడని, ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో వేచిచూడాల్సిందేనని చెప్పింది.

ముగ్గురు హీరోలు గిలిగింతలు పెట్టారంటున్న అసిన్
అసిన్ సల్మాన్‌ఖాన్‌తో నటించిన 'రెడీ' చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టింది. ఈ సినిమా తరువాత అసిన్ సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న 'హౌస్‌ఫుల్-2'లోనూ, అజయ్‌దేవగణ్ సరసన 'బోల్ బచ్చన్'లోనూ నటిస్తోంది. ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్‌లో మొదటిసారిగా 'హౌస్‌ఫుల్-2'లో నటిస్తోంది. అక్షయ్‌కుమార్, జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం సాజిద్‌ఖాన్. 'హౌస్‌ఫుల్' చిత్రానికి సీక్వెల్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కూడా ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వించే కామెడీ ఉంటుంది అంటున్నాడు దర్శకుడు. ఇందులో చిత్రీకరించిన హాస్య సన్నివేశాల్లో అసిన్ అభిమానులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది అంటున్నాడు. ఈ చిత్రం గురించి అసిన్ మాట్లాడుతూ "ఇందులో ఓ సన్నివేశంలో బాగా నవ్వించాలి. అయితే ఎంతకూ షాట్ ఓకే కాలేదు. అప్పుడు ముగ్గురు హీరోలు నాకు గిలిగింతలు పెట్టి నవ్వు తెప్పించారు. దాంతో షాట్ ఓకే అయింది. దీనిని మీరు తెరపై చూస్తారుగా'' అంటోంది అసిన్.

టెక్కలిలో మంచి సినిమాని ప్రోత్సహించే ఫిలిం వర్క్ షాప్
మంచి సినిమాని ప్రోత్సహించే కృషిలో భాగం గా ఈ నెల 6,7 తేదీల్లో ' ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం Societies అఫ్ ఇండియా ', శ్రీకాకుళంఫిలిం Societie [ఆదిత్య కాలేజీ] ల ఆధ్వర్యం లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఫిలిం మేకింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. 120మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ కార్యక్రమం లోవారాల ఆనంద్, రేలంగి నరసింహారావు , బి. హెచ్ .యస్.యస్.ప్రకాష్ రెడ్డి, కే.యల్.ప్రసాద్, యం.వి.రఘు, సి.ఉమామహేశ్వరరావు - చిత్ర నిర్మాణం, ప్రపంచ సినిమా, మంచి సినిమా, ఫిలింక్లబ్ ల గురించి వివరించారు. శ్రీకాకుళం ఫిలిం క్లబ్ కన్వీనర్ సంతోష్ గుడ్ల , ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నాగేశ్వరరావు ఇందులో పాల్గొన్నారు.


'కేడి' స్థాయిలో 'దడ'... 'రెడీ' రేంజిలో 'కందిరీగ'
నాగ చైతన్య నటించిన' దడ' .....రామ్ నటించిన' కందిరీగ' ఈ వారం విడుదలయ్యాయి. అజయ్ భూయాన్ దర్శకత్వం వహించిన' దడ' నిజం గానే ప్రేక్షకుల్లో దడ పుట్టించింది. సినిమా చూసిన వారంతా తలలు పట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన కామాక్షి సంస్థ గతం లో నాగార్జున తో నిర్మించిన 'కేడి' లానే ఈ చిత్రం కూడా పెద్ద పరాజయం పాలు అవుతుందని అంచనా. ఇక సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకత్వం వహించిన' కందిరీగ' ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. రామ్ గతం లో నటించిన వినోదాత్మక చిత్రం 'రెడీ' రేంజిలో ఈ చిత్రం విజయం సాధిస్తుందని అంచనా.

వెంకీ జోడీగా త్రిష... ‘గంగ ది బాడీగార్డ్’
సిద్ధిక్ దర్శకత్వంలో నయనతార, దిలీప్ జంటగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘బాడీగార్డ్’. ఈ చిత్రాన్ని వెంక కథానాయకుడిగా ‘డాన్‌శీను’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకీ జోడీగా త్రిష, సలోని నటిస్తున్నారు. ఆయన నటించిన గత చిత్రాలకు భిన్నంగా చాలా స్టయిలిష్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాడీగార్డ్‌గా వెంక సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ నెల 14తో వెంక కథానాయకుడిగా ఇండవూస్టీలో ప్రవేశించి 25 ఏళ్ళు పూర్తి కాబోతోంది.కాగా సిల్వర్ జూబ్లీ ఇయర్ కానుకగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళయాల మాతృకకు భిన్నంగా సరికొత్త రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి ‘గంగ ది బాడీగార్డ్’ అనే టైటిల్‌ని దర్శకనిర్మాతలు ఖరారు చేసే అవకాశం వుందని తెలుస్తోంది.

'గుండమ్మ కధ' రీమేక్ లో ఎన్టీఆర్‌ తో నాగచైతన్య
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు చేతినిండా సినిమాలతో దాదాపు రెండేళ్లదాకా బిజీ షెడ్యూల్స్‌తో ఉండేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఊసరవెల్లి’ బ్యాంకాక్‌, స్విడ్జర్లాండ్‌లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్‌ పనులను పూర్తిచేసుకుని దసరాకు విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఇవిగాక పూరీజగన్నాధ్‌, శ్రీనువైట్ల చిత్రాలలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ‘గుండమ్మ కథ’ను రీమేక్‌ చేసే యోచనలో ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, నాగచైతన్యలను హీరోలుగా అనుకుంటున్నారంతా. గుండమ్మగా అలనాటి అందాల తార రాధను నటింపజేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్‌తో చిత్రాన్ని నిర్మించాలంటే కచ్చితంగా మరో రెండేళ్లు ఆగాల్సిందేనంటున్నారు. అప్పటిదాకా ఎన్టీఆర్‌ డైరీ ఫుల్‌.

మతం మార్చుకోవడంలో ప్రభుదేవా ఒత్తిడి లేదు
తాను మనస్ఫూర్తిగా మతం మార్చుకున్నానని ఇందులో ప్రభుదేవా ఒత్తిడి లేదని నటి నయనతార స్పష్టం చేశారు. ప్రభుదేవా, నయనతారల పెళ్లికి మతం సమస్యగా మారరిందనే ప్రచారం జరిగింది. ప్రభుదేవా హిందువు, నయనతార క్రిస్టియన్ కావడంతో వీరిద్దరిలో ఎవరు మతం మార్చుకుంటారు? లేక రెండు మతాల సంప్రదాయం ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు నయనతార హిందూమతం స్వీకరించడంతో అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం లభించినట్లయింది. అయితే ఆమె మతం మార్పిడి వెనుక ప్రభుదేవా ఒత్తిడి ఏమైనా ఉందా? అనే మరో ప్రశ్నకు ఆస్కారం లేకుండా తాను మనస్ఫూర్తిగా హిందూమతాన్ని స్వీకరించానని నయనతార వెల్లడించారు. ఆదివారం కొచ్చి నుంచి చెన్నైకి చేరుకుని ఆర్య సమాజ ఆలయంలో మతం మార్పుకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేశారు. శాస్త్రోక్తంగా హిందూ మతాన్ని స్వీకరించారు. యాదృచ్ఛికమే అయినా నయనతార చివరి చిత్రంలో హిందువులు మహాసాధ్విగా ఆరాధించే సీత పాత్రలో నటించారు. ఈ పాత్ర పోషిస్తున్నంత కాలం దేవాలయాలను సందర్శిస్తూ గడిపారు. నయనతార, ప్రభుదేవా త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

డబ్బింగ్ చెప్పుకుందట త్రిష... సమీరా రెడ్డికి ప్రమాదం
'మంగాత్తా'లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారట త్రిష. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు తెలుపుతూ అజిత్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం మంగాత్త అని తెలిపారు. ఇతర పాత్రల్లో సీనియర్ నటుడు అర్జున్ ఒక కీలక పాత్ర పోషించగా ఆయనకు జంటగా లక్ష్మీరాయ్ నటించారని తెలిపారు. హీరోయిన్‌గా త్రిష చాలా చక్కగా నటించారని పేర్కొన్నారు. ఆమెది ఈ చిత్రంలో చాలా క్యూట్ పాత్ర అని, అజిత్‌ను పిచ్చిగా ప్రేమించే ఈ పాత్ర అని , ఈ పాత్ర కోసం త్రిష చాలా శ్రమించారని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఆమె పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారని తెలిపారు.' ఆయుద ఎళుత్తు' చిత్రం తరువాత త్రిష డబ్బింగ్ చెప్పిన చిత్రం ఇదేనని వివరిం చారు.
విశాల్‌తో ‘పందెంకోడి’ కార్తీతో ‘ఆవారా’ చిత్రాలని రూపొందించిన దర్శకుడు ఎన్.లింగుస్వామి మాధవన్,ఆర్య కథానాయకులుగా తమిళంలో రూపొందిస్తున్న చిత్రం ‘వెట్టె’ ఈ చిత్రంలో అమలాపాల్‌తో పాటు సమీరా రెడ్డి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కుట్రాలం జలపాతం లో జరుగుతోంది. ఇక్కడ ఓ కొండపై అమలాపాల్, సమీరాడ్డిలపై ఓ సన్నివేశాన్ని దర్శకుడు లింగుస్వామి చిత్రీకరిస్తుండగా అమలాపాల్ నడుపుతున్న కారు అదుపు తప్పి సమీరాను ఢీకొట్టిందట. సమీరాను దగ్గరలో వున్న ఓ ఆసుపత్రికి తరలించారట. ఆమెని పరీక్షించిన డాక్టర్లు ప్రమాదమేమీ లేదనిచెప్పారు. అయితే అమలాపాల్ మాత్రం జరిగన ప్రమాదాన్ని తలచుకొని కంగారుపడిపోయి ఏడ్చేసిందని, అది చూసిన సమీరానే ఆమెని ఊదార్చిందట.


'అరుంధతి' అనుష్కకు 'బిల్లా' ప్రభాస్ తో బెడిసిందా?
అరుంధతి చిత్రంతో తెలుగులో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయిన అనుష్క ‘రెబల్’ చిత్రం నుంచి తప్పుకొని ప్రభాస్‌కు టాటా చెప్పేసిందని తెలుస్తోంది. ఇటీవల రాఘవలారేన్స్ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాతగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా అనుష్క, దీక్షాసేథ్‌లను కథానాయికలుగా ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు రాఘవలాన్స్. ఇప్పటి వరకు జరిగిన ఈ సినిమా షూటింగ్ అనుష్క పాత్ర ప్రవేశించకుండానే జరుగుతోంది. అయితే అనుష్క ‘రెబల్’ షూటింగ్‌లో పాల్గొనకుండా తప్పుకొందన్న వార్త ప్రస్తుతం ఫిలింసర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. కాగా తెలుగులో నాగార్జునతో ‘డమరుకం’ చిత్రంతో బిజీగా వున్న అనుష్క ఈ చిత్రంతోపాటు ‘బాణం’ దర్శకుడు చైతన్యదంతులూరి రూపొందించనున్న ‘రంపచోడవరం’ చిత్రంలోనూ, అలాగే త్వరలో ‘ఆవారా’ ఫేమ్ కార్తీ కథానాయకుడిగా సూరజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందనున్న ఓ చిత్రం లోనూ నటించడానికి అంగీకరించింది. అనుష్క ‘రెబల్’ చిత్రం నుంచి తప్పుకోవడానికి కారణం ఆమెకు డేట్స్ కుదరకపోవడమేనా... లేక మరేదైనా కారణం వుందోనని పరిశ్రమలో గుస గుసలు.

లారెన్స్‌కు భగవంతుడంటే భక్తితో పాటు భయం కూడా...
భగవంతుడికి భయపడే వ్యక్తి లారెన్స్ అని నటి లక్ష్మీరాయ్ పేర్కొంది. వీరిద్దరూ కలిసి కాంచన చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సమయంలో లక్ష్మీరాయ్, లారెన్స్ చెట్టాపట్టాలేసుకుని షికార్లు కొట్టారని వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని లక్ష్మీరాయ్ ఖండించారు. లారెన్స్‌కు, తనకు మధ్య ప్రేమంటూ వచ్చిన వార్తలను చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు. లారెన్స్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. ఆయన మానవత్వం కలిగిన మనిషి అని కొనియాడారు. లారెన్స్‌కు భగవంతుడంటే భక్తితో పాటు భయం కూడా ఉందన్నారు. లారెన్స్ నిరంతర శ్రమ జీవి అని చెప్పారు. కాంచన చిత్రంలో తమ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని, అందువల్లే ఇలాంటి వదంతులు వస్తున్నాయని వివరించారు. అజిత్ సరసన నటించిన మంగాత్తా విడుదలకు సిద్ధమవుతోందని తెలిపారు. మలయాళంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. తెలుగులో బాలకృష్ణ సరసన నటించిన చిత్రం షూటింగ్ పూర్తయిందని చెప్పారు.

కత్రీనాకు అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌పై మక్కువ ఎక్కువ
కత్రీనాకు అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌పై మక్కువ ఎక్కువ. ఈ ఇష్టంతోనే ఆమె రాక్‌ క్లైంబింగ్‌ను నేర్చుకున్నారు. అంతేకాదు రివర్‌ రాఫ్టింగ్‌తో పాటు ఎకె-56 రైఫిల్‌ ఫైరింగ్‌ను కూడా అభ్యసించారు. కొద్ది రోజుల క్రితం ఆమె జవాన్లను కలిసి తన విన్యాసాలను ప్రదర్శించారు. దీంతో జవాన్లు ఆమె ఫిట్‌నెస్‌, ధైర్యాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కత్రీనాకు కొత్త అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌ అంటే ఎంతో ఇష్టం. తీరిక సమయాల్లో తన సినిమాల కోసం వీటిని నేర్చుకుంటుంటారు. కొత్త సినిమాల్లో గ్లామరస్‌గా ప్రేక్షకులను అలరించడమే కాదు కొత్త స్టంట్లతో వారిని మంత్రముగ్దులను చేయాలని కత్రీనా కోరుకుంటున్నారు. ‘అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌ అంటే ఎంతో ఇష్టం. దీంతో రాక్‌ క్లైంబింగ్‌, వాటర్‌ రాఫ్టింగ్‌ను నేర్చుకున్నాను. కొత్త సినిమాల్లో ఈ స్పోర్ట్స్‌ విన్యాసాలను ప్రదర్శించి అభిమానులను మైమరపించాలన్నదే నా కోరిక’ అని కత్రీనా పేర్కొన్నారు.

వివాదాల్లో వర్మ వివాదాస్పద చిత్రం ‘నాట్ ఎ లవ్ స్టోరీ’
ఎప్పుడూ వివాదాలని తనకు అనుకూలంగా మార్చుకుంటూ తద్వారా దర్శకుడిగా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం నిర్మాతగా ఓ పక్క నాగచైతన్యతో ‘బెజవాడ రౌడీలు’ చిత్రాన్ని నిర్మిస్తూనే మరో పక్క ఆయన దర్శకుడిగా వివాదాస్పద చిత్రం ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ని రూపొందిస్తున్నారు. కన్నడ నటి మరియా సుసైరాజ్, నీరజ్ గ్రోవర్‌ల వివాదాస్పద ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిక్కుల్లోపడింది. ఈ చిత్రంలో నెగెటీవ్‌గా చూపించాడని ఇప్పటికే మరియా సుసైరాజ్ కోర్టు ద్వారా వర్మకు నోటీసులు ఇచ్చింది. అయితే ,ఈ కథలోని కీలక వ్యక్తి అయినటువంటి జెరోమ్ మాథ్యూస్ (మరియా సుసైరాజ్ ప్రేమికుడు) వర్మ తీస్తున్న ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయడానికి వీల్లేదని రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు పంపించాడట. నీరజ్ గ్రోవర్ హత్య 2008 మే 7న జరిగింది ఆ హత్యోదంతం ఆధారంగానే సినిమా తీస్తున్నానే గానీ ఎవరి వ్యక్తిగత విషయాలను ఇందులో చర్చించడం లేదని రామ్‌గోపాల్ వర్మ అంటున్నాడు .

అలాంటి పాత్రలు ఎందుకు చెయ్యాలంటున్నహన్సిక
‘కందిరీగ’ సినిమాని ఒప్పుకోవడానికి రామ్ కూడా ఓ కారణం. సీరియస్ పాత్రలు చేయాలంటే అంతగా ఆసక్తి వుండదు. అల్లరిచిల్లర సరదా పాత్రలు చేయడం నా కిష్టం. ప్రస్తుతం తమిళంలో నేను నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. తెలుగు కొంచెం కష్టమనిపించినా నేర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. ట్విట్టర్ ద్వారా అభిమానులను కలుసుకోవడం మంచి అనుభూతినిస్తోంది. నేను ఏ సినిమాలోనూ రెండో కథానాయిక పాత్రలు చేయడానికి అంగీకరించను. మనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం వున్నప్పుడు అలాంటి పాత్రలు ఎందుకు చేయాలి?. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞతగా వుంటాను’ అని హన్సిక అంటోంది.


'సీనియర్స్'లో వెంకటేష్, శ్రీకాంత్, జే.డి.చక్రవర్తి, సునీల్? ... సునీల్‌తో ఇషాచావ్లా?
ఇటీవల 'విరోధి' చిత్రం నిర్మించిన శ్రీకాంత్ సోదరుడు అనిల్ 'సీనియర్స్' అనే ఓ మళయాళ చిత్రం తెలుగు హక్కులు కొన్నారు. త్వరలో ప్రారంభించే ఈ తెలుగు 'సీనియర్స్'లో వెంకటేష్ , శ్రీకాంత్, జే.డి.చక్రవర్తి, సునీల్ ప్రధాన పాత్రలు పోషించే అవకాశం ఉంది.
‘ప్రేమకావాలి’ చిత్రంతో నాయికగా పరిచయమైన ఇషాచావ్లా త్వరలో హాస్య కథానాయకుడు సునీల్‌తో జతకట్టనుందని తెలిసింది. ‘అహ నా పెళ్ళంట’ చిత్రాన్ని తెరకెక్కించిన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తారని తెలుస్తోంది.

యూటీవీ స్టార్స్ చానెల్‌లో హోస్ట్ గా ప్రీతిజింతా
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్న సొట్ట బుగ్గల సుందరి ప్రీతిజింతా యూటీవీ సంస్థ ప్రారంభిస్తున్న యూటీవీ స్టార్స్ చానెల్‌లో ఓ కార్యక్షికమానికి హోస్ట్ అవతారమెత్తనుంది. రెండు సంవత్సరాలుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్‌గా క్రికెట్‌లో తలమునకలై వున్న ఈ భామ ఈ షో ద్వారా మళ్లీ సినీ పరిశ్రమ కి దగ్గరవుతానంటోంది. బిగ్ బి అమితాబ్, దర్శకుడు కరణ్‌జోహర్‌లు తనకు ఈ షో నిర్వహించడానికి స్ఫూర్తినిచ్చారంటోంది ఈ సుందరి. 'ఈ కార్యక్రమం ద్వారా సరికొత్త రూపంలో మీ ముందుకు వస్తున్నాను...మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి’ -అని ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌ను అభ్యర్థించింది ఈ సుందరి. అభిషేక్ బచ్చన్‌ను ఈ కార్యక్షికమానికి మొదటి అతిథిగా ఆహ్వానించడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటోంది. గతంలో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అబ్ ఇండియా తోడేగా లాంటి బుల్లితెర కార్యక్రమాలని నిర్వహించిన ప్రీతి అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. తాజా షో తనకు పాపులారిటీని తెచ్చిపెడుతుందని ఆశిస్తోంది . దీంతో పాటు స్వీయనిర్మాణ సంస్థలో ఓ సినిమాని నిర్మించడానికి సిద్ధమవుతోంది ప్రీతి.

సైంటిస్ట్‌, బౌద్ధ సన్యాసి, సర్కస్ కళాకారుడిగా మూడు పాత్రల్లో సూర్య
మురుగదాస్, సూర్యల కాంబినేషన్లో మరో భారీ చిత్రం రాబోతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తమిళ్‌లో ‘7ఆమ్ ఆరివు’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య సైంటిస్ట్‌గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసి పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని, అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుకోవడమే కాకుండా ఆరుపలకల దేహంతో కనిపించబోతుండటం విశేషం. సూర్య, ఎ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిన ‘గజిని’ చిత్రాన్ని మరిపించే స్థాయిలో ఈ సినిమా వుండబోతోందని అప్పుడే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర ఆడియోని ఈ నెల 20న చెన్నై లో విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమం లో హీరో సూర్య స్టేజ్‌పై సర్కస్ కళాకారుడి గెటప్‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నాడట.

'స్టైల్ ఐకాన్' అవార్డు సర్వేలో త్రిషకే ఎక్కువ ఓట్లు
'తీన్‌మార్' చిత్రంలో త్రిష చేసిన లిప్‌లాక్‌కి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో ఒక్కసారిగా హాట్ గాళ్‌గా పొట్టి దుస్తుల్లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది ఈ చెన్నై సోయగం. అందుకే ఇటీవల ఓ నేషనల్ టీవీ, ఇంగ్లిష్ పత్రిక 'స్టైల్ ఐకాన్' అవార్డు పేరుతో నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది త్రిషకు ఓటేశారు.ఈ విషయంపై త్రిష మీడియాతో మాట్లాడుతూ "దశాబ్దకాలంగా వెండితెరపై కనిపిస్తున్నా నా మీద ఇసుమంత కూడా అభిమానం తగ్గలేదనడానికి ఈ అవార్డే నిదర్శనం. నాకు మద్దతు పలికిన అభిమానులకు కృతజ్ఞతలు. మీ కొండంత అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటా. మీరు చూపిన ఆదరణతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా'' అంటోంది. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్‌తో కలిసి నటిస్తోంది త్రిష. తమిళంలో అజిత్ సరసన 'మన్‌గాత్తా' చిత్రంలో నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ .. పెళ్లి చేసుకొలేదంటున్న సాక్షి
తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాని తానింకా పెళ్లి చేసుకోలేదని నటి సాక్షి శివానంద్ వెల్లడించారు. గతంలో తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్‌గా నటించిన ఈ ఉత్తరాది భామ కొంతకాలంగా తెరపై కనిపించడం లేదు. ఆమె రహస్య వివాహం చేసుకుని నటనకు స్వస్తి చెప్పిందనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఆమె అమీద్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్న ఆది భగవాన్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాను రహస్య వివాహం చేసుకున్నాననే వార్తలను ఆమె ఖండించారు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం నిజమేకాని.. పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. మధ్యలో నటనకు దూరమైన విషయం వాస్తవమేనని తెలిపారు. ఈ గ్యాప్‌లో అమెరికా వెళ్లి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ చదివొచ్చానని వెల్లడించారు. తన తండ్రి వ్యాపారంలో సహాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడంలో రవిచంద్రన్ సరసన 24/7 అనే చిత్రంలో నటిస్తున్నానని సాక్షి పేర్కొన్నారు.


రాంచరణ్ 'రచ్చ'... పవన్ 'గబ్బర్ సింగ్' ప్రోగ్రెస్స్
రామ్‌చరణ్‌ తేజ-తమన్నా జంటగా నటిస్తున్న ‘రచ్చ’శ్రీలంక లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు థాయ్‌లాండ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.దీని తర్వాత చైనా లో షూటింగ్ చేస్తారు. అక్టోబర్‌ నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. తమన్నా నాయికగా చేస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకుడు. మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్బీచౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌, పరాస్‌ జైన్‌ నిర్మిస్తున్నారు.
పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గబ్బర్‌ సింగ్‌’. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. చిత్రయూనిట్‌ ఇటీవల కేరళలోని అనువైన లొకేషన్లకోసం వేట సాగించినట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక చిత్రబృందం అక్కడ చిత్రీకరణకు వెళుతుంది.

అభిమానుల కోసం ఆసుపత్రి నిర్మిస్తున్న రజనీకాంత్
అభిమానుల కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో ఓ ఆసుపత్రిని నిర్మించనున్నట్టు ఆ యన సోదరుడు సత్యనారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు. సింగపూర్‌లో చికిత్స పొంది చెన్నైకి తిరిగి వచ్చిన రజనీ ప్రస్తుతం ఆళ్వార్‌పేటలోని తన కుమార్తె ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. సింగపూర్ ఆసుపత్రిలో చేరిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు చేసిన పూజలు రజనీని కదిలించాయన్నారు. అభిమానుల ప్రార్థనల వల్లే తాను తిరిగి కోలుకున్నానని రజనీ తెలిపారని చెప్పారు. తన అభిమానుల కోసం ఏదైనా మంచిపని చేయాలని రజనీ కొన్ని రోజులుగా ఆలోచించారని, వారికోసం ఓ ఆసుపత్రిని నిర్మించాలని తుది నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అభిమానులకు తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యాన్ని అందించనున్న ఈ ఆసుపత్రిని చెన్నై వండలూర్ సమీపంలో ఉన్న రజనీ సొంత స్థలంలో నిర్మించాలని యోచిస్తున్నట్లు సత్యనారాయణరావు తెలిపారు.

‘పీప్లీ లైవ్’కు గొల్లపూడి శ్రీనివాస్ స్మారక జాతీయ అవార్డు
పాత్రికేయుల దైనందిన జీవన విధానాన్ని వివరిస్తూ తెరకెక్కిన హిందీ చిత్రం ‘పీప్లీ లైవ్’ ఈ ఏడాదికిగాను గొల్లపూడి శ్రీనివాస్ స్మారక జాతీయ అవార్డుకు ఎంపికైంది. చిత్ర దర్శకురాలు అనూషా రిజ్వీకి ఈ నెల 12న తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో అవార్డును అందిస్తారు. ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ పేరిట కొత్త దర్శకులను ప్రోత్సహించేలా ప్రతి ఏటా ఈ అవార్డును అందజేస్తున్నారు. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రతినిధులు శుక్రవారమిక్కడ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఫౌండేషన్ ట్రస్టీ గొల్లపూడి రామకృష్ణ మాట్లాడుతూ..‘మా సోదరుడు గొల్లపూడి శ్రీనివాస్ స్మారకార్థం 14 ఏళ్లుగా అవార్డులను అందిస్తున్నాం. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ముఖ్య అతిథిగా హాజరై అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు గ్రహీతకు రూ.1.5 లక్షల నగదు, మెమొంటోను అందించనున్నాం. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రముఖ నటీమణులు శ్రీదేవి, గౌతమి, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ హాజరుకానున్నారు’ అని వివరించారు.

‘ఉరుమి’ సంతోష్‌శివన్ దర్శకత్వంలో మహేష్‌బాబు?
ప్రముఖ దర్శకుడు సంతోష్‌శివన్ త్వరలో ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. మహేష్‌బాబు కథానాయకుడిగా ఆయన ఓ సినిమాని రూపొందిచడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. మలయాళంలో సంతోష్‌శివన్ దర్శకత్వం వహించి విజయవంతమైన ‘ఉరుమి’ చిత్రం తెలుగులోవిడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆ చిత్ర ఆడియో వేడుకలో సంతోష్‌శివన్ సన్నిహితుల వద్ద మహేష్‌తో సినిమా విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. మహేష్‌బాబు హీరోగా త్వరలో తెలుగు సినిమా చేయబోతున్నానని, మహేష్ భార్య నమ్రతా ఈ విషయమై తనను సంప్రదించిందని సంతోష్‌శివన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ఖాన్‌ కలిసి చూస్తున్న'కాంచన'
ఇటీవల ఘనవిజయం సాధించిన 'కాంచన' చిత్రాన్ని బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ఖాన్‌ కలిసి చూడనున్నారు. దర్శకుడు లారెన్స్‌ కోరికపై సల్మాన్‌ ఈ సినిమాని చూడటానికి సిద్ధమయ్యాడు. అయితే తనతోబాటు అమీర్‌ఖాన్‌ను కూడా షోకి ఆహ్వానిస్తున్నాడు. వీరికోసం ఆ వారాంతంలో ముంబైలో ప్రత్యేక షో వేస్తున్నారు. ఈ పనిమీద లారెన్స్‌ అప్పుడే ముంబై చేరుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌ కూడా వేస్తున్నారు. ఇటీవల సౌత్‌ సినిమాలని బాగా ఇష్టపడి చేస్తూ.. విజయ వంతమవుతున్న సల్మాన్‌, హిందీలో 'కాంచన'ను రీమేక్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడంట!


ఆగస్ట్ 6న భారీగా 'సంతోషం' అవార్డ్ ల ఉత్సవం‌
తెలుగు సినిమాలకు ప్రతి ఏటా ఇచ్చే 'సంతోషం' అవార్డుల ఉత్సవం ఆగస్టు 6న జరగనుంది. 'సంతోషం' పత్రికాధినేత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ- ''ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 'సంతోషం' ఆదరణ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. మమ్మల్నింతగా ఆదరిస్తున్న చిత్ర పరిశ్రమకు ఏదైనా చేయాలనే ఆకాంక్షతో 'సంతోషం ఫిల్మ్‌ అవార్డ్సు'ని ఆరంభించడం జరిగింది. గత తొమ్మిదేళ్లుగా ఈ అవార్డు వేడుకను వినూత్న రీతిలో అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. ఈసారి ఫిల్మ్‌ అవార్డ్సు కార్యక్రమాన్ని ఆగస్టు 6న హైదరాబాద్‌ హైటెక్స్‌లోగల నోవాటెల్‌ హెచ్‌.ఐ.సి.సి నందు భారీగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

ఎన్టీఆర్‌ ‘ఊసరవెల్లి’ ప్రోగ్రెస్స్... అడవి శేషు అదృష్టం
జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఊసరవెల్లి’. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఈ సినిమా యూనిట్‌ ఆగస్టు 4న బ్యాంకాక్‌ వెళ్లనుంది. అక్కడ ప్రకాష్‌రాజ్‌-ఎన్టీఆర్‌లపై కొన్ని ముఖ్యసన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆపై ఎన్టీఆర్‌- తమన్నా జంటపై ఓ పాట చిత్రీకరణకు స్విట్జర్‌లాండ్‌ వెళతారు. విదేశీ చిత్రీకరణ అగస్టు 15 నాటికి పూర్తిచేసి తిరిగి హైదరాబాద్‌ వస్తారు. ఈ చిత్రంలో హారిక రెండో హీరోయిన్‌. రామజోగయ్యశాస్ర్తి ఈ సినిమాలో రెండు పాటలు రాశారు. తెలుగు తెరకు 'కర్మ' అనే చిత్రంతో పరిచయమైన కుర్రాడు అడవి శేషు. బాక్సాఫీస్‌ వద్ద నిరాశపర్చినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్‌గా అడవి శేషుకి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాను టీవీలో చూసిన దర్శకుడు విష్ణువర్థన్‌ పవన్‌కళ్యాన్‌తో నటిస్తావా...అని అడిగారంట ! ఏదో చిన్నపాత్ర దొరుకుతుందని వెళ్తే, ఎంతో ముఖ్యమైన పాత్ర ఇచ్చారని శేషు తెలుపుతున్నాడు. ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత అడవి బాపిరాజు మనవడు అడవి శేషు.

మరో మాజీ విశ్వసుందరి లారా దత్తా తల్లి కాబోతోంది
ఈ మధ్యే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తల్లి కాబోతున్న వార్త విన్నాం. ఇప్పుడు మరో మాజీ విశ్వ సుందరి తల్లి కాబోతున్న సంగతి తెలిసింది. ఆమె లారా దత్తా. కొద్ది రోజులుగా ఆమె గర్భం దాల్చిందనే ప్రచారం జరుగుతున్నా ఇప్పుడే అధికారికంగా ఆ సంగతి వెల్లడైంది. కొంత కాలం క్రితం ఆమె, ఇండియన్ టాప్ డబుల్స్ టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి దంపతులైన సంగతి విదితమే. తను తల్లి కాబోతున్నాననే సంగతి లారా ధృవీకరించగానే అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనల వెల్లువ మొదలైంది.దీంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన ఆమె "మీ అభినందనలు, ప్రార్థనలకి కృతజ్ఞతలు. జీవితంలో ఇదో ప్రధాన ఘట్టం. పుట్టబోయే బిడ్డ కోసం మహేశ్, నేను ఎంతగానో ఎగ్జయిట్ అవుతున్నాం'' అంటూ ట్విట్టర్‌లో తెలిపింది. త్వరలో ఐశ్వర్య వల్ల తండ్రి కాబోతున్న అభిషేక్ బచ్చన్ సైతం ఆమెకి ట్విట్టర్ ద్వారానే 'కంగ్రాచ్యులేషన్స్' చెప్పడం విశేషం.

సినిమా సమీక్షల పై విరుచుకు పడ్డ నిర్మాత అంబికాకృష్ణ
‘‘రిలీజై ఒక్కరోజైనా ముగియకముందే సినిమాపై రివ్యూలు రాసేస్తున్నారు. స్టార్‌ రేటింగులతో జీవితాల్నే మార్చేస్తున్నారు! వెబ్‌సైట్లలో ఇష్టమొచ్చినట్టు రేటింగులిస్తున్నారు. టు స్టార్‌, త్రి స్టార్‌ అని రేటింగులిచ్చి...కోట్ల ఖర్చుతో తీసిన సినిమాని నాశనం చేస్తున్నారు. మీ దగ్గర డబ్బులు తీసుకునేం తీయలేదే. ఇలా అయితే మేం బతకాలా వద్దా? పైరసీ కంటే ఘోరంగా సినిమాని నాశనం చేస్తున్నది సమీక్షకులే!!’’- అని సినీవిమర్శకులు, సమీక్షకులపై విరుచుకుపడ్డారు నిర్మాత, మాజీ ఏలూరు శాసన సభ్యుడు అంబికా కృష్ణ. ‘సంతోషం’ సినిమా పత్రిక 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ..జరిగిన ఓ కార్యక్రమంలో సినిమా సమీక్షకుల పై అంబికాకృష్ణ ఈ విధంగా ధుమధుమలాడారు. మీడియా గురించి ...వారి హక్కుల గురించి తెలియని అమాయకులు ఇంకా కొందరున్నారు మరి.

పాపం శ్రియను దురదృష్టం వెంటాడుతోంది
'శివాజీ' లో సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌ రజనీ సరసన హీరోయిన్‌గా నటించి అనతికాలంలోనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి ,గోడకుకొట్టిన బంతిలాగా మళ్లీ టాలీవుడ్‌కు చేరుకున్న శ్రీయకు ఇప్పుడంతా బ్యాడ్‌ పీరియడ్‌ నడుస్తోంది. ఆ మధ్య ఐటం సాంగ్స్‌కైనా ఓకే అన్న శ్రీయకు కనీసం ఐటం సాంగ్‌ ఆఫర్లు కూడా రావడం లేదు. పెద్ద హీరోలతో సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నాయి. ఆమె కమల్‌హాసన్‌ సరసన ‘విశ్వరూపం’లో నటిస్తోందని పుకార్లు వచ్చాయి.ఆ తర్వాత అందులో ఎంతమాత్రం నిజం లేదని తేలింది. మంచు మనోజ్‌ సరసన కూడా నటిస్తోందన్నారు. ఆ ప్రాజెక్టు కూడా బెడిసికొట్టింది. లేటెస్ట్‌గా ప్రభాస్‌ సరసన నటిస్తోందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదికూడా హుష్‌ మంది.


100 కోట్ల 'విశ్వరూపం' లో కమల్ హసన్ నెగిటివ్‌ రోల్‌
ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై కమల్‌హాసన్‌ చేసినన్ని వెరైటీ పాత్రలు మరో నటుడు చేసి ఉండడు . అయినా ఇప్పటికీ కొత్తదనం కోసం, వైవిధ్యం కోసం తపనపడుతుంటాడు. తన సినిమా కోసం వచ్చే ప్రేక్షకుడ్ని తృప్తి పర్చటం ఆయన ప్రధాన లక్ష్యం. కమల్‌ ఇది కొత్తగా చేశాడ్ర..అని సామాన్య ప్రేక్షకుడి నుంచి అందే ప్రశంసే అతని చేత మరిన్ని ప్రయోగాలు చేయిస్తోంది. తాజా ప్రాజెక్ట్‌ 'విశ్వరూపం' భారీ బడ్జెట్‌ కూడిన కథాంశం. అయినా వెకకాడకుండా, పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యాయక కెనడాలో షూటింగ్‌ మొదలెట్టాలనుకుంటున్నాడు. దాదాపు రూ.100 కోట్లు ఖర్చు అయ్యేట్టుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో కమల్‌ ఓ నెగిటివ్‌ రోల్‌ ధరిస్తున్నాడంట! అదేంటి ఎలా ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ తరహా ఆయనకి కొత్తకాకపోయినా, పాత్ర పోషణలో చాలా స్కోప్‌ ఉందని టాక్‌ ! ఇందులో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా నటిస్తుందనే ప్రచారం జరిగినా, వర్కవుట్ కాలేదు . మంచి అభినయం చూపగల నటి కోసం కమల్‌ వేట సాగిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌ పాత్ర కూడా చాలా ముఖ్యమైందట.

ఊపుమీదున్నసల్మాన్‌ఖాన్ డిమాండ్ 50 కోట్లు
'దబాంగ్', 'రెడీ' చిత్రాల భారీ సక్సెస్‌తో మంచి ఊపుమీదున్న సల్మాన్‌ఖాన్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. ఇప్పటి వరకు సినిమాకి 40 కోట్ల పారితోషికం తీసుకున్న సల్మాన్ ప్రస్తుతం తను అంగీకరిస్తున్న ఒక్కో సినిమాకి 50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతే కాదు ఇక నుండి తన సినిమాల ప్రమోషన్‌లో కూడా కొత్త పంథాను అనుసరించాలని భావిస్తున్నాడట. ఈ విషయంలో సహచర హీరోలు షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్‌ల తరహాలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక నుంచి సినిమా విడుదల వరకు తన చెప్పిందే చెల్లుబాటయ్యేలా నిర్మాతలకు షరతులు పెట్టాలని సల్మాన్ నిర్ణయించుకున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తన సినిమాకు దర్శకుడ్ని, హీరోయిన్‌ను అతనే నిర్ణయిస్తున్నాడు. వీటిని ఒప్పుకునే వారికే సినిమాలు చేస్తానన్నాడంట !

వేణుమాధవ్‌ మెగాఫోన్‌... 'మేడమ్‌ టుసాడ్స్' మ్యూజియంలో కరీనా
హాస్య నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ సొంతం చేసుకున్న వేణుమాధవ్‌ మెగాఫోన్‌ పట్టాలని ఉత్సాహపడుతున్నాడు. స్వియ దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. కాస్త ఖర్చెక్కువైనా క్వాలిటీతో సినిమా తీయాలని భావిస్తున్నాడు. ఇందు కోసం ఓ ప్రముఖ హీరోయిన్‌ను కూడా సంప్రదించాడు. సెప్టెంబర్‌లో షూటింగ్‌ మొదలెట్టబోతున్నట్టు టాక్‌ !
కరీనాకపూర్‌ మైనపు బొమ్మను మేడమ్‌ టుసౌడ్స్‌ లండన్‌ మ్యూజియం నిర్వాహకులు ఏర్పాటుచేసే దిశలో మార్గం సుగమమైంది. కొంతకాలం క్రిందటే కరీనా మైనపు బొమ్మను ఏర్పాటుచేయాలని నిర్ణయం జరిగినా ఇంకా ఎటువంటి ఫోజులో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేదానిపై ఎటువంటి నిర్ణయం జరగలేదు. దేశవ్యాప్తంగా కరీనా అభిమానులు కూడా తమ అభిమాన తార విగ్రహాన్ని ఎలా చూడబోతున్నామా అన్న టెన్షన్‌తో ఉన్నారు. ఫైనల్‌గా కరీనా నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘చమేలీ’ చిత్రంలోని గెటప్‌ను ఎట్టకేలకు ఓకే చేశారు. చమేలీ సినిమాకు కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా మనీష్‌ మల్హోత్రా వ్యవహరించారు. త్వరలో మన కరీనా తన బాడీ కొలతలు ఇచ్చేందుకు రెడీ అయిపోతోంది.

‘జిందగీ న మిలేగీ దుబారా’... రీమేక్‌ రైట్స్‌ కోసం హీరోల పోటీ
జీవన నైరాశ్యాలని జీవితం చేసుకుని... రాజీపడిన జీవితంలో ఆనందం వెతుక్కుంటున్న ముగ్గురు స్నేహితులు, ఎప్పుడో చేసుకున్న బాస కారణంగా ఒక విహారయాత్రని మొదలుపెడతారు. ఆ విహారం వినోదమై, వినోదం విన్నూత్న అనుభవమై, ఆ అనుభవం హృదయసంగమమై, ఆ సంగమంలో గుబులుతీరి, భయంపోయి జీవన సత్యాల్ని నూతన జవసత్వాల్ని కూర్చుకునే ఒక హాయైన ప్రయాణమే ‘జిందగీ న మిలేగీ దుబారా’... హృతిక్‌రోషన్‌, కత్రినాకైఫ్‌, అభయ్‌డియోల్‌లు వారి వారి పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ఈ చిత్రం విడుదలైన తొలి పదిరోజులకే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇది మరో వంద కోట్ల మేరకు బిజినెస్‌ చేసే అవకాశం ఉందని బాలీవుడ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని మన హీరోలు పోటీ పడుతున్నారు. ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ కోసం టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ఫ్యాన్సీ రేట్‌ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.

‘ధూమ్ 3’లో జిమ్నాసిస్ట్‌, మార్షియల్ ఆర్ట్స్ గురువుగా అమీర్‌
పాత్రలో ఒదిగిపోవడమనేది అమీర్‌కు ‘రీలు’తో పెట్టిన విద్య. క్యారెక్టర్ రక్తి కట్టేందుకు ఎంత కష్టమైన పడేందుకు సిద్ధమవుతాడు ఈ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ . ‘గజిని’లో కండలవీరుడిగా కనిపించి... ఆ తర్వాత వచ్చిన ‘3 ఇడియెట్స్’లో కాలేజీ కుర్రాడిగా మారిపోయాడు. తాజాగా ‘ధూమ్ 3’లో నటించేందుకు అమీర్ తన బాడీఫిట్‌నెస్ కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. . ‘ధూమ్ 3’లో ఆయన జిమ్నాసిస్ట్‌గా, మార్షియల్ ఆర్ట్స్ గురువుగా కనిపించనున్నాడు.ఈ పాత్ర కోసం గెరాల్డ్ జర్సిల్లా అనే ట్రెయినర్ నేతృత్వంలో అమీర్ తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘గజిని’ సినిమా చేసేప్పుడు 73 కిలోల బరువున్న అమీర్ ఆ తర్వాత ‘3 ఇడియెట్స్’లోని పాత్ర కోసం 5 నుంచి 6 కిలోలు తగ్గాడు. ఈసారి తన బరువును 60 కిలోలకు తేవడం కష్టసాధ్యంగా మారిందని అమీర్ చెబుతున్నాడు. ఆయన బరువు తగ్గించేందుకు ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేశామని ట్రైనర్స్ చెబుతున్నారు. ఫుడ్‌ను కంట్రోల్ చేసుకోవడమేగాక... ప్రతీ రోజు రెండు గంటలపాటు జిమ్, మార్షియల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ తీసుకుంటూ, గంటపాటు స్విమ్మింగ్ కూడా చేస్తున్నాడట.


'బద్రీనాథ్‌' 187 సెంటర్లలో యాభై రోజులంటే నమ్మరే...‌
'బన్నీ బాగా చేశాడని అందరూ అంటుంటే తండ్రిగా చాలా గర్వపడుతున్నా. ఈ సినిమాకోసం దర్శకుడు వినాయక్‌ అందర్నీ బాగా కష్టపెట్టాడు. ఇంత మంచి విజయం సాధించిందంటే కారణమూ ఆయనే. అందుకు అభినందలు' అని బద్రినాద్ 50 రోజుల సభలో నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. భారీగా తీసినా బాడ్ టాక్ వచ్చిన ఈ చిత్రం 187 సెంటర్లలో అడిందంటే ఎవరు నమ్మడం లేదు. సినిమా విడుదల మూడు రోజులుందనగా చాలా టెన్షన్‌పడ్డాను. మొదటి రోజు టాక్ విని దర్శకత్వం మానేద్దామని అనుకున్నా. చాలా డిప్రెషన్‌కు గురయ్యా. మూడురోజుల తర్వాత కలెక్షన్లు పెరగడంతో ధైర్యం వచ్చింది. బన్నీ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఎంతో కష్టపడి ఇందులో చేశాడు.-అని వినాయక్ అన్నారు. .ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ సినిమా చేశానని, నా సినీ కెరీర్‌లో డబుల్‌ కలెక్షన్లు నమోదు చేసుకున్న సినిమా ఇదని, ఇందుకు కారణమైన దర్శకులు వినాయక్‌ అని అల్లు అర్జున్‌ అన్నారు.

‘రా వన్’ బైక్ రైడింగ్‌ ఎంజాయ్ చేసిన షారుక్‌
‘జిందగీ మిలేగి నా దొబారా’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ముంబాయ్ వీధుల్లో హాట్‌గాళ్ కత్రినా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ముంబయ్ బైక్ టూర్ సినిమా పబ్లిసిటీకి బాగా తోడ్పడిందని ట్రేడ్ వర్గాలు సైతం అంగీకరించాయి. స్వీయనిర్మాణంలో షారుక్‌ఖాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘రా వన్’లో ఆయన ఓ ఫ్యాన్సీ బైక్‌పై రోమాంచిత విన్యాసాలు చేస్తూ కనిపిస్తారట. సూపర్‌హీరో కథాంశంతో ఫాంటసీ నేపథ్యంలో షారుక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పిల్లల్ని, కాలేజీ యూత్‌ని ఆకట్టుకునేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడు షారుక్. ఈ చిత్రంలో ఆయనే నడిపే బైక్ ఫోటోను తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడాయన. ఈ బైక్‌ను ఆర్ట్ డైరెక్టర్ సబూ సిరిల్ డిజైన్ చేశాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి బైక్‌లు నడపడమంటే మహా సరదా. కానీ ఎక్కడ దెబ్బలు తగులుతాయోనని మా ఆమ్మ అస్సలు బైక్‌పై వెళ్లనిచ్చేది కాదు. రా వన్ సినిమాలో మాత్రం అలాంటి టెన్షన్ లేకుండా యాక్షన్ డైరెక్టర్ పర్యవేక్షణలో బైక్ రైడింగ్‌ను ఎంజాయ్ చేశాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారాయన.

హత్య కేసులో మీరాచోప్రా.... లక్కీగర్ల్ అమలాపాల్
‘బంగారం’, ‘వాన’, ‘జగన్ మోహిని’ చిత్రాలతో తెలుగు తెరపై సందడి చేసిన కథానాయిక మీరాచోప్రా. ఈ సుందరి ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. అచ్చం సినిమాలోలా ..ఓ హత్య కేసులో ఇరుక్కున్న ఈ భామ ..ప్రస్తుతం ఇంటరాగేషన్‌ పేరుతో జైలు ఊచలమధ్య కన్నీరు మున్నీరవుతోంది. రుచి భూటన్‌ అనే యువతిని ఆమె భర్త సుమిత్‌తో కలిసి హత్య చేసిందనే ఆరోపణలతో మీరా జైలు కెళ్లింది. బెయిల్‌కి ప్రయత్నించినా.. ఇటీవల కోర్ట్‌ నుంచి తిరస్కారం ఎదురవ్వడంతో మీరా అయో మయంలో ఉన్నట్లు సమాచారం. అదృష్టమంటే అమలాపాల్‌దే. మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలోనే విక్రమ్ వంటి పెద్ద హీరో సరసన 'నాన్న' లో నటించే అవకాశం కొట్టేసిన ఈ మలయాళీ కుట్టి తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. ధనుష్ ఆయన అర్ధాంగి ఐశ్వర్య దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో ధనుష్‌కు జంటగా శృతిహాసన్ నటించనున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆమె మూడు తెలుగు చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల కాల్‌షీట్స్ కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ స్థానాన్ని లక్కీగర్ల్ అమలాపాల్ భర్తీ చేస్తున్నట్లు తెలిసింది.

రాజకీయాల్లో అంత బాగా నటించలేననిపించింది
తన తండ్రి సునీల్‌దత్‌ మాదిరిగా రాజకీయాల్లో ఉండాలని కోరుకోవడం లేదు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. ఆయన కొంత కాలం ఓ రాజకీయ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాల్లో నటించడమే తనకిష్టమని సంజూ అంటున్నారు. తిరిగి రాజకీయాల్లోకి పోదల్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ‘మూడు నెలల పాటు ఉత్తరప్రదేశ్‌లో ఓ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అక్కడ రాజకీయ కార్యక్రమాలను చూసిన నాకు బాలీవుడ్‌ సినిమాల్లో నటించడమే ఉత్తమమనిపించింది. వేదికపై నేను అంత బాగా నటించలేననిపించింది’ అని సంజూ స్పష్టం చేశారు. ఇక లక్నో పార్లమెంటరీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఆయన గతంలో పోటీచేశారు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ ఆయన్ని పార్టీ ప్రధానకార్యదర్శిగా కూడా నియమించింది. కానీ కొంత కాలం తర్వాత తనను పార్టీలోకి తీసుకువచ్చిన అమర్‌సింగ్‌ పరిస్థితి చూసిన తర్వాత విషాదంతో సంజయ్‌దత్‌ పార్టీకి రాజీనామా చేశారు.

రామోజీ ఫిలీం సిటిలో 'రాణా'... కామెడీ కష్టమంటున్న అజయ్
రజనీ తాజా చిత్రం 'రాణా' షూటింగ్‌ అక్టోబర్‌ మూడు నుంచి ప్రారంభం కానుంది. మూడు నెలలపాటు ఈ సినిమా షూటింగ్‌ నిరంతరాయంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిలీం సిటిలో నిర్వహించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఫిలీం సిటిలో దర్శకుడి సూచనలమేరకు భారీ సెట్స్‌ వేయిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభంనాడే రజనీకాంత్‌ అనారోగ్యానికి గురై, సింగపూర్లో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నరులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇందులో బాలీవుడ్‌ భామ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. పోరాట సన్నివేశాల్లో నటించటం ఈ రోజుల్లో చాలా తేలిక. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత రిస్కు తక్కువైపోయింది. సాహసాలు చేయటం చిటికెలో పని. వినోద ప్రధాన చిత్రాల్లో నటించాలంటే మంచి టైమింగ్‌ అవసరం. అది అంత తేలికగా అబ్బే విద్య కాదు. అందుకే కామెడీ సినిమాల్లో నటించటం కష్టం. 'సింగమ్‌' కోసం రోజుకి రెండు గంటలు జిమ్‌లో కసరత్తులు చేశానంతే. అదే నవ్వించే సినిమా అనుకోండి. స్క్రిప్ట్‌ పట్టుకొని అది జీర్ణించుకోవడానికి కష్టపడవలసి వచ్చేది.-అంటున్నాడు 'సింగం'తో ఇటీవల విజయం సాధించిన అజయ్ దేవగన్.


భారీగా పరుచూరి సోదరుల సినిమా రజతోత్సవ వేడుకలు
300కు ఫై గా చిత్రాలకు పని చేసిన ప్రముఖ సినిమా రచయితలు పరుచూరి సోదరుల సినిమా రజతోత్సవ వేడుకలు వైభవం గా ఆగస్ట్ 14 న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగుతాయి. 'టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్ 'ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పలువురు రాజకీయరంగ ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమంలో శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి తారాగణం భారీ సంఖ్యలో పాల్గొంటారు.

శివప్రసాద్ రెడ్డి తో నాగార్జున నాల్గవ చిత్రం
నాగార్జున బిజీబిజీ! ఒకేసారి 3 చిత్రాల్లో నటించాల్సి రావడమే అందుకు కారణం. నాగ్‌ హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ నిర్మిస్తున్న ‘డమరుకం’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. అనుష్క ఈ చిత్రంలో కథానాయిక. ఆర్‌.ఆర్‌.వెంకట్‌ నిర్మాత. మరో సినిమా..విజయేంద్రప్రసాద్‌ (ఎస్‌.ఎస్‌.రాజమౌళి తండ్రి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజన్న’ ప్రస్తుతం పతాకసన్నివేశాల చిత్రీకరణలో ఉంది. అన్నపూర్ణ ఏడు ఎకరాలలో షూటింగ్‌ జరుగుతోంది. నాగ్‌ సొంత ప్రొడక్షన్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇవి రెండూ సెట్స్‌లో ఉండగానే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ‘షిరిడీ సాయిబాబా’ కోసం నాగ్‌ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ షిరిడీలో ప్రారంభమయ్యాయి. మిత్రుడు శివప్రసాద్ రెడ్డి తో నాగార్జున జనవరి నుండి మరో భారీ చిత్రం చేస్తున్నారు. దీనికి సురేంద్ర రెడ్డి దర్శకత్వం చేసే అవకాశం ఉంది.

త్రివిక్రమ్ - ఇలియానాల తో 'హనీ'గా అల్లు అర్జున్
ఇప్పటి వరకు ప్రేమకథలతో పాటు యాక్షన్ సినిమాలు కూడా చేసి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తొలిసారిగా ఓ పూర్తి వినోదాత్మక చిత్రాన్ని చెయ్యడానికి రెడీ అయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో గోవా సుందరి ఇలియానా కథానాయిక. యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన అల్లు అర్జున్ సెప్టెంబరు 7 నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ‘హనీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది.

మోహన్ బాబు - సునీల్ ‘రాయుడు గారికి కోపమొచ్చింది’
గత కొంత కాలం నుంచి నటనకు దూరంగా వుంటున్న డా.మోహన్‌బాబు మళ్ళీ నూతనోత్సాహంతో ఓ సినిమా చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు. ‘రాయుడు గారికి కోపమొచ్చింది’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు టైటిల్ పాత్రలో నటించనున్నాడు. హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మెహన్ కథను అందిస్తున్నారు. మోహన్‌బాబు, సునీల్ మామ అల్లుళ్లుగా నటించనున్న ఈ చిత్రానికి ఇ.నివాస్ దర్శకత్వం వహిస్తాడు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

వెండి తెర ఫైకి తిరిగి సీనియర్ నటి 'రాడాన్' రాధిక
బుల్లితెరకే పరిమితమైన నటి రాధిక వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఒక సినిమాలో ఆమె ముఖ్య భూమిక పోషించనున్నారు. రాడాన్ సంస్థ నిర్వహణ బాధ్యత, బుల్లితెరపై నటనతో బిజీగా ఉన్న రాధిక చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శకుని'లో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అక్కగా, అమ్మగా పాజిటివ్ పాత్రలు పోషించి మెప్పించిన ఈమె 'శకుని'లో నెగిటివ్ ఛాయలున్న పాత్రలో నటిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ - ఇలాంటి పాత్ర కోసం తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను . ఇందులో నాది ఇంచుమించు నాయకురాలి పాత్ర . నాకు, కార్తీకి మధ్య వచ్చే సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏమిటని అడగ్గా మంచి పాత్రల కోసం వేచి ఉన్నానని తెలిపారు.


ముగ్గురు కొరియోగ్రాఫర్లతో ఎన్టీఆర్ డిఫెరెంట్ సాంగ్‌
ఎన్టీఆర్ ప్రస్తుతం తను నటిస్తున్న'ఊసర వెల్లి' చిత్రంలో ఓ కొత్త ఫీట్‌ని చేయబోతున్నాడు. తనదైన మార్క్ యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే క్రేజీ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు, డాన్సుల్లోనూ అదరగొడతాడన్న విషయం తెలిసిందే. సురేందర్‌డ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్‌ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాటకు తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ డాన్స్ మాస్టర్లలో ముగ్గురు నృత్యరీతులు సమకూర్చనున్నారని, క్లాసికల్, వెస్ట్రన్, రీమిక్స్, బీట్ ఇలా మూడు వేరియేషన్స్‌లో సాగే ఈ పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందని సమాచారం. ఇదిలావుంటే రామ్‌చరణ్ , అల్లు అర్జున్ డాన్సుల్లో గట్టిపోటీనివ్వడం వల్లే ఎన్టీఆర్ తన తాజా చిత్రం కోసం ముగ్గురు కొరియోగ్రాఫర్లతో తన సత్తా చూపడానికి సాంగ్‌ని ప్లాన్ చేశాడని అంటున్నారు.

తాప్సి అవకాశాన్ని కాజల్ అగర్వాల్ తన్నుకుపోయిందట?
'గజని', 'రక్తచరిత్ర' చిత్రాలు చూసిన తర్వాత సూర్య నాకే కాదు చాలామంది ఉత్తరాది హీరోయిన్లకు డ్రీమ్ హీరో అయ్యారు. రజనీకాంత్ తర్వాత నార్త్‌లో చాలామంది కోరుకుంటున్న హీరో సూర్య అని సూర్యని పోగిడేస్తోంది తాప్సి. సూర్య సరసన 'మాట్రాన్' చిత్రంలో మీరు నటించాల్సిన అవకాశాన్ని కాజల్ అగర్వాల్ తన్నుకుపోయారట? నిజమా అని అడిగితే - నిజం చెప్పాలంటే ఆ చిత్రం కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో నాతో పాటు కాజల్ కూడా ఉన్నారు. ఆ ముగ్గురిలో నా పేరే టాప్‌లిస్టులో ఉన్నట్లు తెలిసింది. నేను ఒకసారి దర్శకుడు కె.వి.ఆనంద్‌తో మాట్లాడాను. చివరకు ఏమయిందో ఏమో కాజల్‌కు అవకాశం దక్కింది. అయితే సూర్య సరసన నటించే అవకాశం చివరి దశలో చేయి దాటిపోయిందనే బాధ కొంచెం లేకపోలేదు. భవిష్యత్తులో సూర్య సరసన తప్పక నటిస్తాను.-అని ఎంతో నమ్మకంగా చెప్పింది తాప్సి .

ఆర్పీ పట్నాయక్‌ 'ఫేస్‌బుక్‌'... శేఖర్‌ కమ్ముల 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌'
నటన, దర్శకత్వం, సంగీతం...ఇలా పలు వైపులా తన ప్రతిభను ప్రదర్శించిన కళాకారుడు ఆర్పీ పట్నాయక్‌. 'బ్రోకర్‌' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈసారి 'ఫేస్‌బుక్‌'లో ఏముందో చూపిస్తానంటున్నాడు. ఆయన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కనున్న చిత్రమే 'ఫేస్‌బుక్‌'. కొత్తవారిని నటీనటులుగా ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. అయితే సినిమాలో ఆర్పీ నటించటం లేదు. ఈసారికి దర్శకత్వం, సంగీతం బాధ్యతల్ని చూసుకుంటున్నారు. 'ఫేస్‌బుక్‌'తో పాటు మరో కథ కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. 'రిమిక్స్' అని పేరు సైతం నిర్ణయించారు. పూర్తిగా సంగీత, సాహిత్యాలతో నడిచే కథనం. నూతన నటీనటులతో ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్లో జరుగుతోంది.

బికినీ కారణంగా అసిన్ ఒక చిత్రాన్నే వదులుకుంది
బికినీ కారణంగా అసిన్ ఒక చిత్రాన్నే వదులుకోవాల్సి వచ్చిందట. దక్షిణాదిలో నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందిన అసిన్ గజని చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన విషయం విదితమే. అక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. తదుపరి చిత్రం 'లండన్ డ్రీమ్స్' నిరాశపరచడంతో ఆమె డ్రీమ్స్‌కు కొంచెం భంగం కలిగిందనే చెప్పాలి. అయినా 'హౌస్‌పుల్-2' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్ర దర్శకుడు సాజల్‌ఖాన్ ఒక నిబంధన పెట్టారట. బికినీ ధరించి నటించాలని చెప్పడంతో దానికి అసిన్ అంగీకరించలేదట. దీంతో ఆమె చిత్రాన్నే వదులుకోవాల్సి వచ్చిందట. అసిన్ నిర్ణయానికి ఆ బాలీవుడ్ దర్శకుడు షాక్‌కు గురయ్యారట.

ఆర్‌.నారాయణమూర్తి 'పోరు తెలంగాణా' .... లారెన్స్‌ 'ఫుల్‌మాస్‌'
విప్లవ కథాంశాల్ని ఉద్వేగభరితంగా తెరకెక్కించే కథానాయకుడు ఆర్‌.నారాయణమూర్తి. అలాంటి మరో కథాంశమైన 'పోరు తెలంగాణా' అనే సబ్జెక్ట్‌తో ఆయన ఓ చిత్రం తీస్తున్నారు. 1952 తర్వాత తెలంగాణాలో జరిగిన అనేక ముఖ్యమైన సంఘటనల సమాహారమిది. ప్రత్యేక తెలంగాణా అంశాన్ని బలపరిచే విధంగా అన్నదమ్ముల్లా విడిపోదాం... ఆత్మీయుల్లా కలిసుందాం అన్న అంశాన్ని నారాయణమూర్తి చెప్పదల్చు కున్నాడు. షూటింగ్‌ పార్ట్‌ దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు నడుస్తున్నాయి. 'కాంచన' సినిమాని డైరెక్ట్‌ చేసిన లారెన్స్‌, త్వరలో 'ఫుల్‌మాస్‌' పేరుతో మరో చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా సునీల్‌ నటిస్తాడని మొదట్లో వార్తలొచ్చాయి. తాజాగా రవితేజ కోసమూ ప్రయత్నిస్తున్నారు.


జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పోటీలో విశాల్...విక్రమ్
విశాల్...విక్రమ్...ఈ ఇద్దరిలో ఈ యేడాది జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎవరిని వరించనుంది? కమర్షియల్ హీరో అనే ఇమేజ్ నుంచి బయటపడి విశాల్ అవన్ ఇవన్ (తెలుగులో వాడు-వీడు)లో ప్రయోగాత్మక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ యేడాది జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యేందుకు ఆయన అన్ని విధాల అర్హుడని జాతీయ మీడియా సైతం అభిప్రాయ పడింది. అయితే ఇప్పుడు తాజాగా విశాల్‌కు విక్రమ్ రూపంలో పోటీ ఎదురుకాబోతుంది. దేవ తిరుమగన్ (నాన్న) చిత్రంలో మానసిక వైకల్యంతో బాధపడుతూ, ఐదేళ్ల పసిపిల్లాడి మనస్తత్వాన్ని ప్రతిబింబించే పాత్రకు జీవం పోసిన విక్రమ్ జాతీయ అవార్డుకు విశాల్‌తో పోటీగా నిలిచాడని అంటున్నాయి ఇదే సమయంలో దర్శకుడు బాలపై ప్రశంసలు కురిపించాడు విశాల్...బాల నాలోన నాకే తెలియని నటుడిని వెలికితీశారు. మొదట మూమూలు పాత్రలో అనుకున్నా సినిమాలో ఏదో కొత్తదనం వుండాలని మెల్ల కన్ను పాత్రను డిజైన్ చేశారాయన. ఆ ప్రయోగమే ఈ రోజు నాకు ఇంతటి గుర్తింపును తీసుకువచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా మెల్లకన్ను పాత్రలో నటించింది తనేనని, ఈ విషయమై గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు అప్లె చేయనున్నట్లు విశాల్ తెలిపాడు.

వేశ్య పాత్రలో ఏమిటని బిందుమాధవిని భయపెట్టారు
వేశ్య పాత్ర పోషించడానికి చాలామంది సంకోచిస్తారు. ఇమేజ్‌కు భంగం కలుగుతుందేమోనని భయపడతారు. అయితే నటి అనుష్క ఇటీవల' వానం' చిత్రం లో ఆ తరహా పాత్రను పోషించి మెప్పించారు. ఇప్పుడు వర్ధమాన నటి బిందుమాధవి అదేదారిలో వెళుతోంది. ఫోటాన్ కథాస్ పతాకంపై దర్శకుడు గౌతమ్‌మీనన్, రేష్మా, వెంకి, మదన సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం' వెప్పమ్'[సెగ ] . గౌతమ్‌మీనన్ శిష్యురాలు అంజన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్‌కుమార్, నాని, నిత్యామీనన్, బిందుమాధవి, ముత్తుకుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29 విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో నటించిన అనుభవం గురించి నటి బిందుమాధవి తెలుపుతూ తాను విజి అనే వేశ్య పాత్రలో నటించానని తెలిపింది. చెన్నైలోని గుడిసె ప్రాంతాల్లో నివసించే యువతిగా నటించడం సరికొత్త అనుభవమని పేర్కొంది. తమిళంలో తొలి చిత్రం లోనే వేశ్య పాత్రలో నటించడం ఏమిటని కొందరు భయపెట్టారని, స్క్రిప్టుపై ఉన్న నమ్మకంతో నటించేందుకు సాహసించానని చెప్పింది.

పుట్టుమచ్చ వల్ల పవిత్రత దెబ్బతింటుందని భావించిన బాపు
పుట్టుమచ్చలు అతివల అందానికి మరింత వన్నె తెస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వెండితెర కథానాయికలు ఈ బ్యూటీస్పాట్స్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తారు. వాటిని తమలోని సెక్సప్పీల్‌కు సూచికగా భావిస్తారు. అయితే బాపు దర్శకత్వంలో ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీత పాత్ర పోషించిన నయనతారకు పుట్టు మచ్చ చిన్న అవరోధంలా మారింది. ఈ చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో నయనతార అద్భుతమైన అభినయాన్ని కనబర్చిందని యూనిట్ మొత్తం ముక్తకం ప్రశంసించారు. ఈ పాత్ర చేస్తున్నంతకాలం శాకాహారిగా వుందట నయనతార. అయితే ఆమె పై పెదవిపై వుండే పుట్టు మచ్చ విషయంలో దర్శకుడు బాపుకు కొంత అభ్యంతరం వుండేదట. సీతలాంటి మహిమాన్వితమైన పాత్రకు సెక్సప్పీల్‌ను సూచించే పుట్టుమచ్చ వుండటం వల్ల పవిత్రత దెబ్బతింటుందని భావించిన బాపు ఆ పుట్టుమచ్చను గ్రాఫిక్స్ ద్వారా తొలగించాలని నిర్ణయించారు. దీనికి నయనతార కూడా ఒప్పుకోవడంతో ప్రస్తుతం పోస్ట్‌ పొడక్షన్ కార్యక్రమాల్లో పుట్టుమచ్చను తొలగిస్తున్నట్లు తెలిసింది.

ఇమ్రాన్‌ హాష్మితో విద్యాబాలన్‌ ముద్దులాట
అందాల విద్యాబాలన్‌ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హాష్మి చెరలో చిక్కిందా? సుదీర్ఘ అదరచుంబనంలో ఉక్కిరిబిక్కిరి అయిందా?..అంటే అవుననే తెలుస్తోంది. సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా తెరెక్కుతున్న ‘డర్టీపిక్చర్‌’లో విద్యా నాయికగా నటిస్తోంది. ఇటీవల బాలన్‌పై ఘాటు సన్నివేశాల చిత్రీకరణ సైతం జరిగింది. అలనాడు సిల్క్‌ కెరీర్‌లో తారసపడిన నిర్మాతలు, దర్శకులు ఆమె జీవితంలో ఎలా కీలకం అయ్యారో ఈ సినిమాలో చూపిస్తున్నారు. సిల్క్‌ (విద్యాబాలన్‌) సోయగాలకు దాసోహం అయ్యే ఓ సినీనిర్మాతగా హాష్మి ఈ చిత్రంలో నటిస్తున్నాడు. దర్శకుడు మిలన్‌ లుద్రియా...తొలుత ఈ ఇద్దరి మధ్యా సాదాసీదా సన్నివేశాలు చిత్రీకరించి, ఒకరికొకరు సౌకర్యంగా మెలిగాక వేడి వేడి సన్నివేశాల చిత్రణకు ప్లాన్‌ చేశారట. అసలే హాష్మి ‘ముద్దుల’ ప్రియుడు.... ఆపై విద్యా అంతటి అందగత్తెతో లిప్‌లాక్‌ సీన్‌! ఇంకేముంది హాష్మి ...బాలన్‌తో సుదీర్ఘ చుంబనంలో మునిగిపోయాడని, విద్యా పూర్తిగా లీనమైపోయింది.....అని చెబుతున్నారు.

ఇక్కడ సంపాయించి కాజల్ ...అక్కడ ఇల్లు కొంది
నేను జన్మతః నార్త్ అమ్మాయిని. కానీ పుట్టిందీ, పెరిగిందీ ముంబయ్‌లోనే. ఇక్కడే మా బంధువులున్నారు. నా స్నేహితులు కూడా ఉన్నారు. ఓ విధంగా ‘నా’ అనుకున్న వాళ్లందరూ ముంబయ్‌లోనే ఉన్నారు. బాలీవుడ్ సినిమా చేయగానే ముంబయ్‌లో సెటిల్ అవ్వాలని చూస్తోందని మీకు తోచినట్టు రాయొద్దు. వృత్తి పరంగా కూడా నేను ముంబయ్‌లో ఉండటమే కరెక్ట్ అని నా శ్రేయోభిలాషుల అభిప్రాయం కూడా. ముంబయ్‌లో ఉంటూనే సౌత్ సినిమాలు చేస్తాను. అలాగే బాలీవుడ్‌కు కూడా అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. అందుకే ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాను’’ అని చెబుతోంది కాజల్.


మోహన్‌లాల్‌, మమ్ముట్టీల ఇళ్లపై ఐటీ సోదాలు
మోహన్‌లాల్‌, మమ్ముట్టీల ఇళ్లపై ఐటీ సోదాలు మలయాళం సినీ అగ్ర హీరోలు మోహన్‌లాల్‌, మమ్ముట్టీల ఇళ్లు, వ్యాపార కార్యాలయాలపై శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని 18 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగాయి. కోచి, తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు, వూటీ నగరాల్లోని నివాసాలు, వ్యాపార కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకొన్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు దాడులకు నేతృత్వం వహించిన ఆదాయపు పన్నుశాఖ (దర్యాప్తు) అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.మోహన్‌ తెలిపారు. ఐటీ దాడుల సమయంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టీలు ఇద్దరూ కేరళలో లేరు. వీరిద్దరూ వెల్లడించిన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

సల్మాన్‌ఖాన్‌ 'బాడీగార్డ్‌' లో కత్రీనా ఐటమ్‌సాంగ్‌
సల్మాన్‌ఖాన్ 'రెడీ'లో పాపులర్ అయిన 'కేరక్టర్ ఢీలా' పాటలో జరీన్‌ఖాన్ చిందులేయగా, ఇప్పుడు అతనే నటిస్తున్న 'బాడీగార్డ్'లో కత్రినా కైఫ్ ఓ ఐటమ్ సాంగ్ చేయబోతోంది. సల్మాన్ మాజీ ప్రేయసి అయిన కత్రినా ఈ సినిమాలో అతిథి పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఆమె కేవలం అతిథి పాత్ర మాత్రమే చేయడం లేదనీ, ఓ ఐటమ్ సాంగ్‌లో వయ్యారాలు ఒలకబోయనున్నదనేది తాజా ఖబర్. హిమేశ్ రేషమియా సంగీతం సమకూర్చిన ఆ పాట సినిమాలో టైటిల్స్ సందర్భంగా వస్తుంది. గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్. ఆ పాటలో చెయ్యాల్సిందిగా సల్మాన్ స్వయంగా కత్రినాని అడిగాడు. దాంతో ఆమె దానికి ఓకే చెప్పింది. బాండ్‌ గర్ల్స్ స్టైల్‌లో ఈ సాంగ్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం కత్రీనా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలు గోల్డ్‌ ఫింగర్‌, ఆక్టోపసీ సాంగ్స్‌ను చూస్తున్నారు.

సోషియో ఫాంటసీ చిత్రంలో దేవకన్యగా ఇలియానా
బాలీవుడ్‌లో పాదం మోపి ‘బర్ఫీ’ చిత్రంలో నటిస్తున్న ఇలియానా తెలుగులో తొలిసారి వెంకటేష్‌తో కలిసి దశరథ్‌ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్‌ ఓ సాహసవీరుడిగా కనిపించను న్నాడు. వెంకీకి జోడీగా ఇలియానా దేవకన్యగా నటిస్తోంది. కథ చెప్పగానే నచ్చి ఇలియానా వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ కూడా బ్రహ్మపాత్ర వేస్తున్నాడట. ఇక పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాతలు తెరకెక్కించనున్నారు. నాగార్జున నటించిన ‘డమరుకం’ చిత్రం కూడా సోషియో ఫాంటసీ అనే ప్రచారం జరుగుతోంది. ఇక శక్తి, నేను-నా రాక్షసి చిత్రాల తర్వాత ఇలియానా పని అయిపోయింది అనుకునేవారికి ఇలియానా తన హవా ఏ మాత్రం తగ్గలేదని అంటోంది.

నారాయణ దర్శకత్వంలో నరేష్‌, శర్వానంద్‌, శ్రీయ కాంబినేషన్‌
అల్లరి నరేష్‌, శర్వానంద్‌, శ్రీయ కాంబినేషన్‌లోఎస్‌వికె సినిమా పతాకంపై నారాయణ దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మించే ‘ప్రొడక్షన్‌ నెం.2’ షూటింగ్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు నారాయణ మాట్లాడుతూ ‘ఈ చిత్రం సబ్జెక్ట్‌ విభిన్నంగా వుంటుంది. కథ చెప్పగానే అల్లరి నరేష్‌ ఎంతో ఇన్‌సై్పర్‌ అయ్యారు. శర్వానంద్‌ చాలా థ్రిల్‌ అయ్యారు. అలాగే శ్రీయ ఎంతో ఇంప్రెస్‌ అయ్యారు. ఈ మూడు పాత్రల మధ్య చాలా ఇంట్రెస్టింగ్‌ ఇన్సిడెంట్స్‌తో కథ జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత :వంశీకృష్ణ శ్రీనివాస్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: నారాయణ.

ఒకప్పుడు కాదన్న చిత్రంలోనే ఇప్పుడు ‘హీరోయిన్’ కరీనా
రొమాంటిక్ సీన్స్ చేయడం ఇష్టం లేక, హద్దులు దాటి అంగాంగ ప్రదర్శన చేయడం నచ్చకపోవడం... వీటితోపాటు మద్యం పుచ్చుకునే సీన్లు కూడా చేయవలసి ఉండటంతో అందుకు ఇష్టపడక కరీనా మధుర్ బండార్కర్ ‘హీరోయిన్’ చిత్రాన్ని కాదన్నారు. ఆ తర్వాత ఐశ్వర్యరాయ్‌కి అనుగుణంగా మధుర్ సదరు కథను మార్చడం, ఐష్ పచ్చజెండా ఊపడం జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత ఐశ్వర్య జీవితంలో చోటు చేసుకున్న ఓ ప్రధానమైన మార్పు - ఆమె తల్లి కాబోతున్నందున ఆమె స్థానంలో మధుర్ వేరే కథానాయికను ఎన్నుకునే పనిలో ఇప్పుడు ఉన్నారు. కానీ మధుర్ మనసులో మాత్రం ఇంకా కరీనానే ఉన్నారట. ‘హీరోయిన్’ రచయిత నిరంజన్ అయ్యంగార్‌కి కరీనాతో సాన్నిహిత్యం ఉంది. మరి ఆయన ఏ మాయ చేశారో గానీ ఈ చిత్రంలో నటించడానికి కరీనా ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చేశారని సమాచారం. ఒకప్పుడు కాదన్న చిత్రంలోనే ఇప్పుడు కరీనా ఇష్టపడి నటించడానికి అంగీకరించడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.


బాల దర్శకత్వంలో అనుష్క లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం?
'అరుంధతి' సినిమాతో తెలుగునాట తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్న అనుష్కకి, ఆ తర్వాత ఆ రేంజ్‌లో మరో విజయం దక్కలేదు. తెలుగు, తమిళ పరిశ్రమలో కొన్ని కమర్షియల్‌ హిట్స్‌ దక్కాయి. అయితే ఆ స్థాయిలో ఓ లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌తో తమిళ దర్శకుడు బాల సిద్ధమవుతున్నాడు. అందులో అనుష్కను తీసుకోవాలనుకుంటున్నాడు. 'వాడు-వీడు' సినిమాకు ముందే ఈ సబ్జెక్ట్‌ బాల తయారు చేసుకున్నాడు. ఇందులోని ప్రధాన పాత్ర కోసం అనుష్కను సంప్రదించాడంట ! కానీ అనుష్క నుంచి ఇప్పటిదాకా దర్శకుడు బాలకు ఎలాంటి స్పందన రాలేదు. డి-గ్లామరరైజ్డ్‌ సబ్జెక్ట్‌తో ఆయన సినిమాలు తీస్తారని, అందుకే అనుష్క వెనకడుగు వేస్తోందని కోలీవుడ్‌ సమాచారం. అయితే ఆయనకున్న ట్రాక్‌ రికార్డ్‌, సత్తాను దృష్టిలో పెట్టుకొని అనుష్క గ్రీన్‌ సిగ్నల్ ఇద్దామనే ఆలోచనలో పడింది.

మనసు ఎలా గైడ్ చేస్తే శ్రియ అలా నడుస్తోందట
శ్రియ త్వరలో అల్లరి నరేశ్‌కి జోడీగా కనిపించబోతోంది. సక్సెస్ ఉంటేనే సినీ రంగంలో ఉంటాననే సంగతి ఆమెకి బాగా తెలుసు. "ఇక్కడ ఫెయిల్యూర్స్ వస్తే మళ్లీ మన మొహం చూడరనే సంగతి అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా. అందుకే సినిమాల ఎంపికలో పాత్రకే ప్రాధాన్యమిస్తా. పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్, గ్లామరస్ రోల్స్.. రెండూ చేశా. పేరు తెచ్చుకున్నా. సబ్జెక్టు, బేనర్, డైరెక్టర్ వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు ఒప్పుకుంటున్నా'' అని చెప్పిందామె. నా మనసు ఎలా గైడ్ చేస్తే అలా నడుస్తున్నా. ఏదైనా ఓ పనిలో నా మనసు లగ్నమైందంటే దాన్ని సాధించేదాకా వదలను'' అని తెలిపింది శ్రియ.

సంజూ కు షారూఖ్‌ ఇటాలియన్‌ మోడల్‌ క్రూజర్‌ బైక్‌
షారూఖ్‌ ఖాన్‌ తన చిత్రం 'రా.వన్‌'లో నటించాలని సంజూను కోరగా ఆయన వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఈ సినిమాకు సంజూ డబ్బులు తీసుకోలేదు. దీంతో సంజయ్‌కు ఏదైనా చేయాలని షారూఖ్‌ భావించారు. సంజయ్‌దత్‌కు స్పోర్ట్స్‌ బైక్‌లంటే ఎంతో ఇష్టం. దీంతో షారూఖ్‌ ఒక కొత్త మోడల్‌ బైక్‌ను కొనివ్వాలని నిర్ణయించుకున్నారు. సంజూ కు ఇటాలియన్‌ మోడల్‌ క్రూజర్‌ బైక్‌ అంటే ఇష్టమని తెలుసుకున్నారు. వెంటనే ఆయన ఇటలీ నుంచి ఈ బైక్‌ ను తెప్పించారు. దాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడంతో సంజూ ఎంతో సంతోషపడిపోయారు. ' రా.వన్‌' సినిమాలో నటిస్తున్నందుకు ప్రతిఫలంగా ఇష్టమైన క్రూజర్‌ బైక్‌ను కొనిచ్చినందుకు సంజయ్‌దత్‌ షారూఖ్‌కు థాంక్స్‌ చెప్పారు.

కచ్ఛితంగా అలా కనిపించనంటోంది కాజల్
దక్షిణాది తార అంటే హిందీతెరకు ఆదిలోనే చిన్నచూపు. త్రిష, అసిన్‌, శ్రీయ...వీరంతా అపుడో ఇపుడో..ఆ అహంకారాన్ని ఎదుర్కొన్నవారే! తాజాగా వీరి జాబితాలోకి కాజల్‌ చేరబోతోంది. ఇటీవల ఓ సమావేశంలో పాత్రికేయులు ‘బికినీ వేస్తావా, జీరో సైజ్‌లో కనిపిస్తావా?’ అని ప్రశ్నిస్తే కచ్ఛితంగా అలా కనిపించను..అని కరాఖండిగా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాది సినిమాలతో బిజీ అయిన కాజల్‌ ఇక్కడి సంస్కృతిని బానే వంటపట్టించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాది జనుల అభీష్టం మేరకు జీరోసైజ్‌కి దిగి..ఆపై బికినీ వేస్తుందో..లేదో అనే మీమాంశ పరిశ్రమ వర్గాల్లో కొనసాగుతోంది. కాజల్‌ ‘సింగం’ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గన్‌ సరసన హిందీలో చేసింది. . నాగచైతన్యతో చేసిన ‘దడ’ ఆగస్టు 12న విడుదలవుతోంది. ‘వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటినే ఎంచుకుంటాను. దక్షిణాది, బాలీవుడ్‌కు సరిసమాన ప్రాధాన్యం ఇస్తాను. ఇప్పటికే నా చేతిలో కొన్ని హిందీ సినిమాలు ఉన్నాయి కానీ వాటి గురించి వెల్లడించలేను. తెలుగులో మహేశ్‌బాబుతో, తమిళ్‌లో సూర్యతో సినిమాలు చేస్తున్నాను’ అని వివరించింది.

బాడీని సిక్స్‌ ప్యాక్‌గా మలిచే పనిలో అభిషేక్
సినిమాల్లో కండలవీరుడిగా పేరుతెచ్చుకునేందుకు ఇతర హీరోల మాదిరిగా తన బాడీని సిక్స్‌ ప్యాక్‌గా మలిచేందుకు ప్రతిరోజు జిమ్‌లో కొంతసమయం గడుపుతున్నారు అభిషేక్‌. ఇందుకోసం బాడీ బిల్డింగ్‌ ప్రోటీన్లు, స్టెరాయిడ్స్‌ను వాడకుండా సహజసిద్ధంగా శరీరాన్ని సిక్స్‌ప్యాక్‌గా మ లచాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం రోజూ జిమ్‌కు వెళ్తున్న అభిషేక్‌ శరీరాన్ని ధృఢంగా మార్చడంతో నాలుగు కిలోల బరువు తగ్గారు. ఇక అబ్బాస్‌ మస్తాన్‌ థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తున్న అభిషేక్‌ పలు యాక్షన్‌ దృశ్యాల్లో స్టంట్స్‌ చేస్తున్నారు. డూప్‌ లేకుండా స్టంట్స్‌లో పాల్గొం టున్న అభిషేక్‌ ఇందుకోసం తన బాడీని ధృడంగా మలచు కుంటున్నారు. రోజూ జిమ్‌కు వెళ్తున్న అభిషేక్‌ స్టెరాయిడ్స్‌ ను తీసుకోవడం లేదు. వీటిని తీసుకుంటే భవిష్యత్తులో సైడ్‌ఎఫెక్ట్స్‌తో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని భావిం చి సహజసిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామా లు చేస్తున్నారు.


ఎన్టీఆర్‌- శ్రీనువైట్ల 'మాఫియా' ... వెంకటేష్‌ సరసన ఇలియానా
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో' ఊసరవెల్లి', బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న ఎన్టీఆర్‌, వీటి తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్‌లో తదుపరి ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. గణేష్‌బాబు నిర్మించే ఈ చిత్రానికి 'మాఫియా' అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇటీవల వచ్చిన' శక్తి', 'నేను నా రాక్షసి' చిత్రాలు పరాజయం పాలవటంతో ఇలియానా చాలా నిరుత్సాహానికి గురైంది. అంతేకాదు, ఇండస్ట్రీలో ఆమె అవకాశాల్ని తీవ్రంగా దెబ్బతీసింది కూడా ! దాంతో ఈ గోవా బ్యూటీ తమిళ, హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ తరుణంలో అనూహ్యంగా ఓ ఆఫర్‌ వచ్చిపడింది. అదీ విక్టరీ వెంకటేష్‌ సరసన చేసే అవకాశం. ఆయన నటించనున్న ఓ చిత్రంలో కథానాయికగా తీసుకోనున్నట్టు టాలీవుడ్‌ సమాచారం ! ఇటీవల 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌'తో విజయాన్ని అందుకున్న దర్శకుడు దశ్‌రథ్‌, వెంకటేష్‌తో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేశాడు. ఇందులో ఇలియానాను తీసుకోవడం దాదాపు ఓకే అయినట్టు సమాచారం.

2జి స్పెక్ట్రమ్ నీరా రాడియాగా రవీనాటాండన్
‘బుడ్డా హోగయా తెరా బాప్’తో బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ అయిన రవీనాటాండన్ వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. కార్పొరేట్ లాబీయిస్ట్‌గా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన నీరా రాడియాపై దర్శకుడు సోజన్ జోసెఫ్ ‘అపూర్ట్’ అనే సినిమా తీస్తున్నాడు. ఇందులో నీరా రాడియా పాత్రను రవీనాటాండన్ చేస్తున్నట్లు తెలిసింది. దేశాన్ని కుదిపేసిన 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో నీరా నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రవీనా గ్లామరస్, సెక్సీ హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌గా కనిపిస్తుంది. అనేకమంది రాజకీయ నాయకులతో, పారిశ్రామికవేత్తలతో ఆమెకు పరిచయాలుంటాయి. ఈ సినిమాలో ఫోన్ టాపింగ్‌తో సహా అన్ని అంశాలుంటాయని అంటున్నారు.

45 రోజుల పాటు ఏకబిగిన కెనడాలో కమల్ 'విశ్వరూపం'
కమల్‌హాసన్‌ తాజా ప్రాజెక్ట్‌ 'విశ్వరూపం' షూటింగ్‌ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కథ, కథనం విషయంలో, అందుకు తగిన ఏర్పాట్ల విషయంలో రాజీపడని వ్యక్తిత్వం ఉన్న నటుడు కమల్‌హాసన్‌. దాంతో ఈ చిత్రం అనుకున్న సమయంలో మొదలవ్వలేదు. చిత్రానికి సంబంధించిన ప్రతీ లొకేషన్‌నీ కమల్‌ స్వయంగా పరిశీలించి వచ్చారు. ఇదేదో చెన్నై పరిసరాల్లో లేదు. అమెరికా, కెనడాతోపాటు, పలు యూరప్‌ దేశాల్లో షూటింగ్‌ కోసం లొకేషన్ల వేట జరిగింది. చివరికి కెనడాను ఎంచుకున్నట్టు చెన్నయ్ సమాచారం. వచ్చే నెలలో షూటింగ్‌ ఆరంభించి 45 రోజుల పాటు ఏకబిగిన కెనడాలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్‌ జరగనుంది. ఇదిగో అదిగో అన్న...సొనాక్షి సిన్హా కూడా చేయిచ్చింది. ఇప్పుడా పాత్రకు దీపికా పదుకునే చేయనుందని, డేట్స్‌ ఇంకా ఫైనల్‌ కాలేదని సమాచారం.

హేమమాలిని రెండో కూతురుకు 'రోమియో' కావాలి
హేమమాలిని రెండో కూతురు అహనా డియోల్‌ తెరంగేట్రం చేస్తోంది! ప్రేమకథ ‘రోమియో జులియెట్‌’ ప్రేరణగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. అపర్ణాసేన్‌ దర్శకత్వం వహిస్తారు. అలనాటి రోమియో కథాంశాలకు ధీటుగా దర్శకురాలు ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసి హేమమాలినిని ఒప్పించారు. అయితే అహనా జులియెట్‌గా నటించినా..రోమియో ఎవరో అర్థం కావడం లేదు! ‘రోమియో జులియెట్‌’ టైటిల్‌తో పట్టాలెక్కే ఈ సినిమాకి కథానాయకుడు దొరకకపోవడం పెద్ద సమస్యగా మారింది. యువహీరో ప్రతీక్‌ అహనాకి ఈడు జోడు సరిగ్గా సరిపోయే కుర్రాడని భావించినా .. ..అతడికి డేట్స్‌ సమస్య అడ్డంకిగా మారింది. దాంతో ఏమీ తోచని స్థితిలో వేరే రోమియో కోసం వెతుకుతున్నారిప్పుడు. డ్రీమ్‌గర్ల్‌ మాట్లాడుతూ ‘జులియెట్‌కి తగ్గ కుర్రాడు దొరికినా డేట్స్‌ సమస్య. ఇక ఉపేక్షించం. ఓ కొత్త కుర్రాడిని రోమియోగా ఎంచుకుంటాం’ అని కరాఖండిగా చెప్పేశారు.

హాట్ హాట్ గా సోనియా అగర్వాల్ మళ్లీ సినిమాల్లో
‘7/జి బృందావనకాలని’ ఫేమ్ సోనియా అగర్వాల్ మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించటానికి ఆసక్తి చూపుతోంది. ‘7/జి బృందావన కాలని’ చిత్రంలో నటించేటప్పుడే ఈ ముద్దుగుమ్మ ఆ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడటం.. ఆ ప్రేమ కాస్త వివాహబంధంగా మారటం తెలిసిందే. ఇక ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంది. కాగా సెల్వరాఘవన్ సహాయ దర్శకురాలు గీతాంజలిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. సోనియా అగర్వాల్ ఇప్పటి నుంచి తన దృష్టంతా సినిమాలపైనే అంటోంది. ఇటీవల తమిళ ‘వానమ్’ (వేదం రీమేక్)లో నటించిన ఈ తార ప్రస్తుతం తమిళంలో మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. సోనియా తమిళంలో ‘ఓరు నడిగయిన్ వాక్కు మూలం’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అయితే ఇంతకు ముందు ఏ చిత్రంలోనూ కనిపించనంత గ్లామర్‌గా, హాట్ హాట్‌గా ఆమె ఈ చిత్రంలో కనిపించబోతుందని సమాచారం.


సోనీ టెలివిజన్ చేతికి 'ఈనాడు' టీవీ11 ప్రాంతీయ చానళ్ళు
ఈనాడు టీవీకి చెందిన 11 ప్రాంతీయ చానళ్లను సోనీ టెలివిజన్ భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ రూ.2,250 కోట్లు-2,400 కోట్లు(500-600 మిలియన్ డాలర్లు) దాకా ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రకటన వెలువడొచ్చని సమాచారం. ఈ డీల్ కుదిరితే, యూటీవీలో డిస్నీ పెట్టుబడులు, ఎన్‌డీటీవీ ఇమాజిన్‌ను టైమ్‌వార్నర్ సంస్థ కొనుగోలు చేయడానికి మించిన భారీ ఒప్పందం కానుంది. దీంతో సోనీకి దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషా చానళ్లలో ప్రవేశించేం దుకు ఊతం లభిస్తుంది. భారత్‌లో సోనీ టెలివిజన్ నిర్వహణను చూసే మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్‌ఎం) వర్గాలు దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఈటీవీకి ప్రస్తుతం తెలుగు సహా, బంగ్లా, గుజరాతీ తదితర భాషల్లో వినోద చానళ్లు ఉన్నాయి.

మూడు రోజులపాటు జరిగే 'కొరియన్‌ ఫిలిం ఫెస్టివల్‌' ప్రారంభం
హైదరాబాద్‌లో చలనచిత్రాలు నిర్మించేందుకు అన్ని రకాల వసతులు, హంగులున్నాయని -ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే 'కొరియన్‌ ఫిలిం ఫెస్టివల్‌' ప్రారంభానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయనతోపాటుగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వజ, కొరియా కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ సియో హాంగ్‌ లీ, కొరియా కౌన్సిల్‌ ఇన్‌ యంగ్‌ హాంక్‌, హైదరాబాద్‌ కొరియన్స్‌ రెసిడెన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.జె. పార్క్‌, హైదరాబాద్‌ ఫిలిం క్లబ్‌ కార్యదర్శి బీహెచ్‌ఎస్‌ఎస్‌ ప్రకాశ్‌రెడ్డి, హుందాయ్‌ మోటర్స్‌ ఎండీ వై.ఎస్‌. రోహ్‌లు హాజరయ్యారు. తమ్మారెడ్డి భరద్వజ మాట్లాడుతూ -ఎన్నో బాలివుడ్‌ చిత్రాలు సైతం ఇక్కడ నిర్మాణమవుతున్నాయన్నారు. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా 'మై గర్ల్‌ ఫ్రెండ్‌ ఈజ్‌ ఆన్‌ ఏజెంట్‌' అనే చిత్రాన్ని ప్రదర్శించారు.

ముంబాయి పేలుళ్లు కథాంశంగా 'ఆపరేషన్‌ ముంబాయి'
26/11 ముంబారు పేలుళ్ల సంఘటనలను కథాంశంగా 'ఆపరేషన్‌ ముంబారు' అనే సినిమాను తీస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ చుట్టూ కథ నడుస్తుంది. 2008లో జరిగిన ఈ దారుణ సంఘటనల వెనుక ఉన్న విషయాల్ని పలు కోణాల్లో దర్శకుడు అజిత్‌ వర్మ చర్చింబోతున్నాడు. 'ఇది కేవలం హింసను పిక్చరైజ్‌ చేయటం కాదు. కొంతమంది యువకులు టెర్రరిజం వైపు ఎందుకు మోటివేట్‌ అవుతున్నారు ! చాలా రాక్షసంగా, మానవత్వం లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ! అన్న విషయాల్నే ప్రధానంగా కథలో పేర్కొన్నాం. తీవ్రమైన భావేద్వేగంతో ఉగ్రవాదులు తయారవుతున్నారు. ఈ సినిమాలో కూడా ఇవే అంశాలు చూపదల్చుకున్నా' అని వర్మ చెప్పుకొచ్చారు. ఇందులో అజ్మల్‌ కసబ్‌ పాత్రను కూడా ఆయనే వేశారు. త్వరలో విడుదల కానుంది.

పవన్‌- సింగీతం చిత్రం 'ప్రిన్స్‌ ఆఫ్‌ పీస్‌'... రాజ్ కుమార్ కిడ్నాప్ ఫై చిత్రం
పవన్‌కళ్యాణ్‌ హీరోగా సింగీతం శ్రీనివాసరావు ఓ చిత్రం తీస్తున్నారు. చాలా భాగం షూటింగ్‌ ఇజ్రాయిల్‌లో జరిపారు. ఇందులో సినిమా డైరెక్టర్‌గా పవన్‌ నటించాడు. జీసస్‌ జీవిత కథ ఆధారంగా కథ నడుస్తుంది. ఆంగ్ల, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తీస్తున్నారు. ఆంగ్ల వర్షన్‌కు 'ప్రిన్స్‌ ఆఫ్‌ పీస్‌' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం. హీరోయిన్‌గా అనుష్క నటిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని ఆదిత్యా ప్రొడక్షన్‌ అధినేత కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్నారు.
కన్నడ కంటీరవ రాజ్ కుమార్ ను అప్పట్లోగంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతం గుర్తుండే ఉంటుంది. దాని ఆధారం గా 'వీరప్పన్ అట్టహాస' పేరుతో ఏ. యం. ఆర్. రమేష్ కన్నడలో ఓ చిత్రం తీస్తున్నారు. సురేష్ ఒబరాయ్ రాజ్ కుమార్ గా నటించే ఈ చిత్రం లో అర్జున్ సర్జ, రవి కాలే పోలీస్ అధికారులుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

హైదరాబాద్‌ పరిసరాల్లో నాగార్జున 'రాజన్న' చివరి షెడ్యూలు
తెలంగాణా పోరాటయోధుడిగా నాగార్జున నటిస్తున్న చిత్రం 'రాజన్న'. చివరి షెడ్యూలు షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో ప్రారంభమైంది. నెలాఖరు వరకు జరిగే షూటింగ్‌తో పతాక సన్నివేశాల్ని పూర్తిచేస్తారు. వీటిని భారీ ఎత్తున చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి దర్శకుడు రాజమౌళి నేతృత్వం వహిస్తున్నారు. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అన్నపూర్ణా స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్నారు. తెలంగాణా చారిత్రక నేపథ్యంలో కథ నడుస్తున్నందున, భారీ సెట్టింగ్స్‌తో షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. స్నేహ కథానాయికగా నటిస్తోంది. సెప్టెంబర్లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


చికిత్స పొంది చెన్నై తిరిగొచ్చిన రజనీ
అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ బుధవారం రాత్రి సింగపూరు నుంచి చెన్నై చేరుకున్నారు. దాదాపు నెల రోజులపాటు సింగపూర్‌లో చికిత్స పొంది తిరిగి వచ్చిన రజనీతోపాటు ఆయన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఉన్నారు.ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 29న రాణా సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రజనీ శ్వాస సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. తర్వాత మే 28న సింగపూర్‌కు వెళ్లారు.అక్కడ ఉండగానే రాణా చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో రజనీ కథా చర్చలు జరిపారని, వచ్చే వారం నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని కుటుంబ వర్గాలు తెలిపాయి. రజనీని చూసేందుకు అభిమానులు ఎగబడడంతో విమానాశ్రయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.

అది మా సొంత వ్యవహారం....అంటున్న రంజిత
చెన్నైకి చెందిన సన్ టీవీ నెట్‌వర్క్, నక్కీరన్ పత్రిక రూ. 60 కోట్లు ఇవ్వాలంటూ తనను బ్లాక్‌మెయిల్ చేశాయని నిత్యానంద స్వామి ఆరోపించారు. నిత్యానంద, నటి రంజిత శృంగార కార్యకలాపాలు సాగిస్తున్నట్టు చూపే వీడియో దృశ్యాలను అప్పట్లో సన్ టీవీ ప్రసారం చేయడం తెలిసిందే. నిత్యానంద రంజితతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారిద్దరూ కలిసి మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. నిత్యానంద మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉన్నది తాము కాదని, దాన్ని మార్ఫింగ్ చేసి తమ ముఖాలను అందులో చేర్చారని చెప్పారు. ‘ఒకవేళ ఆ వీడియోలో ఉన్నది మేమే అయినా.. అది మా సొంత వ్యవహారం. మా అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేసే హక్కు వారికెక్కడిది?’ అని ప్రశ్నించా రు. ‘తొలుత రూ. 100 కోట్లు ఇవ్వాలని , చివరకు రూ. 60 కోట్లకు దిగి వచ్చారు. మా వద్ద డబ్బులు తీసుకుని కూడా ఆ నకి లీ వీడియోలను ప్రసారం చేశారు’ అని ఆరోపించారు.

'ఏమాయ చేసావే' కు సీక్వెల్ ....కనిమొలి కధ తో సినిమా
గత ఏడాది వచ్చిన 'ఏమాయ చేసావే' సినిమా తెలుగు వెర్షన్‌లో నాగచైతన్య, సమంతా నటించారు. తమిళ వెర్షన్‌లో త్రిష, శింబు జంటగా నటించారు. ఇప్పుడు గౌతమ్‌మీనన్‌ ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే ప్రయత్నం చేస్తున్నాడు. రెండు భాషల్లోనూ తీయనున్నాడు. జీవా, సమంతా హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. 2 జి స్పెక్ట్రం గొడవలో ఇరుక్కున్న కరుణా నిధి కూతురు కనిమొలి ఇప్పుడు జైలు లో ఉంది. ఆమె కధ తో ఓ చిత్రం వస్తోంది . '2 జి స్పెక్ట్రం 'పేరుతో నిర్మించే ఈ చిత్రానికి పాత్రికేయుడు జాన్ మనోహర్ దర్శకత్వం వహిస్తారు. కనిమొలి గా లక్ష్మి రామకృష్ణన్ నటిస్తున్న ఈ చిత్రం లో మాజీ మంత్రి రాజా గా రియాజ్ ఖాన్ , నీరా రాడియా గా చాందిని , అళగిరి గా సింగ ముత్తు , ఎన్నికల ప్రధాన అధికారిగా సత్య రాజ్ నటిస్తారు.

కళాత్మక విలువలుంటే... వెనుకాడనంటున్న విద్య
సిల్క్‌స్మిత జీవిత కథతో రూపొందుతోన్న ‘డర్టీ పిక్చర్’లో నటిస్తూ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు విద్యాబాలన్. ఇప్పుడు ‘‘మితిమీరిన ఎక్స్‌పోజింగ్ కన్నా, న్యూడిటీ తప్పేం కాదు’’ అంటూ ఘాటైన స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తోంది. . ‘‘పాత్ర కోసం ఎంతటి త్యాగానికైనా నటి వెనుకాడకూడదు. నేను ఓ పాత్రను ఇష్టపడితే... ఆ సినిమాలో కళాత్మకవిలువలుంటే, పూర్తిగా టాప్‌లెస్‌గా కనిపించడానికి కూడా వెనుకాడను. అయితే సెన్సార్ వాళ్లు కూడా ఒప్పుకోవాలి’’ అంటూ నవ్వేశారు. ‘‘చూడండీ... హాలీవుడ్ సినిమాలు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. అక్కడ కథానాయికలు కొన్ని సందర్భాల్లో పూర్తి న్యూడ్‌గా కనిపిస్తారు. అందుకని వాటిని వల్గర్ సినిమాలు అనలేం. తాము ఏం చెప్పాలనుకున్నారో అది కరాఖండిగా చెబుతారు కాబట్టే అక్కడ నేటికీ గొప్ప సినిమాలు వస్తున్నాయి. మనలో కూడా మార్పు రావాలి. ఆ ట్రెండ్ ఇక్కడ కూడా రావాలి’’ అని చెప్పు కొచ్చారు విద్యాబాలన్.

సల్మాన్ చెప్పాక... క్షణాల్లో పనైంది!
సల్మాన్‌ఖాన్ నుంచి సహాయం పొందినవారిలో బాలీవుడ్ హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు. ముగ్ధా గాడ్సే నటించిన ‘జైల్’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో నటించినందుకుగాను ముగ్ధాకు ముట్టాల్సిన మొత్తంలో ఆరులక్షల రూపాయలు ఆగాయి. సినిమాను నిర్మిం చిన సంస్థ ‘పర్సెప్ట్ పిక్చర్ కంపెనీ’ రేపిస్తాం.. మాపిస్తాం.. అంటూ దాటవేస్తున్నారు.డబ్బులు వసూలు చేయడం ఎలాగబ్బా అని అనుకుంటుండగా సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌లో ఓ అవకాశం సల్మాన్‌ఖాన్ రూపంలో కనిపిం చింది. వెంటనే సల్మాన్ దగ్గరికి వెళ్లి తన సమస్యను చెప్పుకుంది. తీరిగ్గా విన్న సల్మాన్ - పర్సెప్ట్ కంపెనీ అధినేత శైలేంద్ర సింగ్ కూడా అక్కడే ఉండడంతో ముగ్ధా డబ్బుల గురించి నిలదీశాడు. శైలేంద్రతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సల్మాన్ అతణ్ణి కాస్త గట్టిగా మందలించాడు. దీంతో డబ్బులిచ్చేందుకు వెంటనే శైలేంద్ర అంగీకరించాడు.


కొందరు నోరు తప్ప ఏమి కదపలేరంటున్నరామ్‌చరణ్‌
చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతవరకూ వివాదాలకు దూరంగా ఉండేవారు. ఆచితూచి మాట్లాడేవారు. కానీ తనయుడు రామ్‌చరణ్‌ మాత్రం కాస్త దూకుడుగానే వెళ్తున్నాడు. తాజాగా ట్విట్టర్‌లో ఆయన ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అది కాస్తా టాలీవుడ్‌లో వివాదానికి కేంద్రమవుతోంది. 'గొప్ప దర్శకులుగా పిలవబడే దర్శకులు ఈరోజు కేవలం వేదికల మీద ప్రసంగాలకు మాత్రమే పరిమితమైపోతున్నారు. నోళ్లు తప్ప వాళ్లు మరేమీ కదపలేకపోవటం విచారకరం' అన్నది రామ్‌చరణ్‌ పోస్ట్‌. ఇది ఎవరినుద్దేశించి అన్నది సినీ పరిశ్రమలో ఇట్టే చెబుతారు. ఓ ప్రముఖ దర్శకుడ్ని ఉద్దేశించి రామ్‌చరణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఎలాంటి కారణం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు రామ్‌చరణ్‌ చేయరని, దీని వెనుక ఎవరి ప్రోద్బలమో ఉందని టాలీవుడ్‌ టాక్‌ !

తమిళ చిత్రం ' జ్ఞాని' లో నటులుగా 16 మంది దర్శకులు
జ్ఞాని అనే చిత్రంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన 16 మంది దర్శకులు నటిస్తున్నారు. ఇందులో దర్శకుడు తరుణ్‌గోపి హీరోగా నటిస్తుండగా శ్వేత హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో దర్శకులు ఎస్‌ఎస్ స్టాన్లీ, ప్రభు సాల్మన్, తంబిరామయ్య, శరవణ సుబ్బయ్య, సింగంపులి, రవి మరియు అరవింద్ రాజ్, చిత్రా లక్ష్మణన్, శనిమోహన్, మనోబాలా, కె ఆర్, సెల్వభారతి, ప్రవీణ్‌గాంధీ, సంజయ్‌రావు, ఆర్తీకుమార్ నటిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ప్రశాంత్, రాఘవేంద్ర, రాబర్ట్, ఇబ్రహీమ్, అయ్యర్ మొదలయన ఐదుగురు నూతన సంగీత దర్శకులు సంయుక్తంగా పనిచేస్తున్నారు. ఆర్తీకుమార్ కథ, కథనం, సంభాషణలు రాసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ - అన్నయ్య చంపిన వారిపై తమ్ముడు ప్రతీకారం తీర్చుకునే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ ప్రభావంఫై భారీ చిత్రాలు బెంబేలు
తెలంగాణ బంద్‌ సందర్భంగా నిలిచిపోయిన షూటింగ్‌ల షెడ్యూల్స్‌తో లక్షల్లో నష్టం వాటిల్లగా దీనికితోడు రాబోయే చిత్రాలపై ముందు ముందు ఉధృతంగా జరగబోయే తెలంగాణ ఉద్యమ ప్రభావం ఏరకంగా చూపనుందోనని నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి భారీ ఎత్తున తీసిన చిత్రాలు వచ్చేనెల ఆగష్టులో విడుదలకు సిద్ధం అయ్యాయి. దాదాపు సంవత్సరకాలం పాటు గ్యాప్‌ తర్వాత‘ఖలేజా’ చిత్రం తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న ‘దూకుడు’, నందమూరి బాలకృష్ణ, బాపు-రమణల కాంబినేషన్‌లో వస్తున్న పౌరాణిక చిత్రం ‘శ్రీరామరాజ్యం’ ఆగష్టులోవిడుదల చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. నాగచైతన్య నటించిన ‘దడ’ ఇప్పటికే ఆగష్టు 11న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇవేగాక నాగార్జున, శ్రీనివాసరెడ్డిల కాంబినేషన్‌లో వస్తున్న ‘డమరుకం’ , ఇంకా నాని నటించిన ‘సెగ’, రామ్‌ హీరోగా నటించిన ‘కందిరీగ’ చిత్రాలు కూడా త్వరలోనే రానున్నాయి. వీటన్నింటిపై రానున్న రోజుల్లో ఉద్యమం ప్రభావం కనిపించే అవకాశం ఉండటంతో ఆందోళన వ్యక్తమౌతోంది

ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వంలో 'ధోని'... ఆర్‌.పి.పట్నాయక్‌ 'ఫేస్‌బుక్‌'
విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్‌ తన దృష్టి ఇప్పుడు దర్శకత్వం మీద పెడుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి రెండు భాషల్లోనూ కూడా 'ధోని' అనే టైటిల్‌ నిర్ణయించారు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్‌ వర్క్‌ సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ అధినేత వెంకట్‌ నిర్మించనున్నారు. ఇదిలా ఉంచితే, ప్రకాష్‌రాజ్‌ ఇప్పటికే కన్నడలో 'నాను నాన్న కానాసు' పేరిట ఓ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో 'ఆకాశమంత' చిత్రానికి రీమేక్‌ అది. సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ త్వరలో మరో చిత్రాన్ని తీయబోతున్నాడు. స్వియ దర్శకత్వంలో 'ఫేస్‌బుక్‌' అనే పేరుతో ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఇందులో తను నటించే అవకాశం లేదని తెలుస్తోంది

షూటింగ్‌ తో సొంతింటికి వచ్చినట్టుగా ఉందన్న శ్రీదేవి
సుమారు రెండు దశాబ్దాలపాటు తన అందచందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శ్రీదేవి, పదిహేను సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఆమె తాజాగా 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' చిత్రంలో నటిస్తోంది. షూటింగ్‌ ముంబైలోని యష్‌రాజ్‌ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. బాలీవుడ్‌ ఫిలీం మేకర్‌ బాల్కీ భార్య గౌరీ షిండే దర్శకత్వంలో ఈ సినిమా తీస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ తను కెమెరా ముందుకు రావటంతో శ్రీదేవి భర్త బోనీకపూర్‌, ఫిలీం మేకర్‌ బాల్కీ కూడా శ్రీదేవి వెన్నంటి ఉంటున్నారు. అలాగే బాలీవుడ్‌ ప్రముఖుడు యశ్‌చోప్రా, అతని తనయుడు ఆదిత్య చోప్రా కూడా స్టూడియోకొచ్చి శ్రీదేవిని కలిశారు. చాలాకాలం తర్వాత సొంతింటికి వచ్చినట్టుగా ఉందని, ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపిస్తోందని శ్రీదేవి వారితో ఆనందాన్ని వ్యక్తం చేసింది ! శ్రీదేవి మళ్లీ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేస్తుందని భర్త బోనీకపూర్‌ ఈ సందర్భంగా నమ్మకాన్ని వెలిబుచ్చారు.


15 నుండి హైదరాబాద్ లో కొరియన్ చిత్రోత్సవం
హైదరాబాద్ ఫిలిం క్లబ్ - హైదరాబాద్ నివాసిత కొరియన్ ల సంఘం నిర్వహణ లో హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రసాద్ లాబ్స్ లో 15 నుండి కొరియన్ చిత్రోత్సవం జరుగుతోంది. ముంబై లోని కొరియన్ రాయభార కార్యాలయం సహకారం తోమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం లో ' మై గర్ల్ ఫ్రెండ్ ఈస్ యాన్ ఏజెంట్ ' ,' ఫర్ ఎవెర్ ది మూమెంట్ ' ,' ఏ బేర్ ఫుట్ డ్రీం ' , 'ఓల్డ్ పార్టనర్ ',' స్కాండల్ మేకెర్స్' చిత్రాలను ప్రదర్శిస్తారు. 15 సాయంత్రం 6.30 కు జరిగే ఈ ప్రారంభోత్సవం లో కొరియన్ రాయభార కార్యాలయ జనరల్ సియో హాంగ్ లీ , అధికారులు ఇన్ యుంగ్ హాన్ ,హన్నా కిం పాల్గొంటారని - హైదరాబాద్ ఫిలిం క్లబ్ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చెప్పారు.

ఆగస్ట్ 6 న' సంతోషం' అవార్డ్ ల ఉత్సవం
తెలుగు సినిమాలకు ప్రతి ఏటా ఇచ్చే ' సంతోషం' అవార్డుల ఉత్సవం ఆగస్టు 6న జరగనుండి. 'సంతోషం' పత్రికాధినేత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ, ''ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 'సంతోషం' ఆదరణ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. మమ్మల్నింతగా ఆదరిస్తున్న చిత్ర పరిశ్రమకు ఏదైనా చేయాలనే ఆకాంక్షతో 'సంతోషం ఫిల్మ్‌ అవార్డ్సు'ని ఆరంభించడం జరిగింది. గత తొమ్మిదేళ్లుగా ఈ అవార్డు వేడుకను వినూత్న రీతిలో అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. ఈసారి ఫిల్మ్‌ అవార్డ్సు కార్యక్రమాన్ని ఆగస్టు 6న హైదరాబాద్‌ హైటెక్స్‌లోగల నోవాటెల్‌ హెచ్‌.ఐ.సి.సి నందు భారీ గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అనిచెప్పారు.

తమిళ చిత్రాల్లో స్థానం కోసం బిందుమాధవి...
తమిళ చిత్ర పరిశ్రమ తనను ఆదరించి ఒక స్థానాన్ని సంపాదించి పెడుతుందనే నమ్మకం ఉందని నటి బిందుమాధవి అంటోంది. టాలీవుడ్ నుంచి కోటి ఆశలతో రెక్కలు కట్టుకుని కోలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ తెలుగమ్మాయి తొలి తమిళ చిత్రం' వెప్పం'. ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బిందుమాధవి మాట్లాడుతూ తెలుగులో ఐదారు చిత్రాల్లో నటించినా ...తమిళంలో గౌతమ్‌మీనన్ నిర్మిస్తున్న' వెప్పం' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని తెలిపింది. ప్రస్తుతం కృష్ణ సరసన'కళుగు' చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. 'ఈరం' ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో నకులన్‌కు జంటగా నటిస్తున్నట్టు తెలిపింది.

కన్నడంలో బిజీగా 'పులి’ నాయిక నికిషా పటేల్
‘పులి’ కథానాయిక నికిషా పటేల్ ప్రస్తుతం ఓ తెలుగు చిత్రంలో, తమిళంలో ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించారని సమాచారం. కన్నడ రంగంలో కూడా ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. కన్నడ క్రేజీ స్టార్ రవిచంద్రన్ సరసన నికిషా పటేల్ ‘నరసింహ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నికిషాని మరో అవకాశం వరించింది. ‘వరదనాయక’ పేరిట అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మల్టీస్టారర్ ఇది. సుదీప్, అర్జున్, సాయికుమార్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా చిరంజీవి సర్జా, నికిషా పటేల్ జంటగా నటిస్తున్నారని వినికిడి.. ఇటీవల ‘కెంపే గౌడ’లాంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శంకర్ గౌడ ఈ చిత్రాన్ని అయ్యప్పశర్మ దర్శకత్వంలోనిర్మిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్నవన్నీ కేవలం గ్లామర్‌కి మాత్రమే కాకుండా నటనకు కూడా అవకాశం ఉన్న పాత్రలు కావడంతో కెరీర్ పుంజుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు నికిషా పటేల్.

కంబాట్‌ కరాటే నేర్చుకుంటున్న అక్షయ్‌కుమార్‌
బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌తో కలిసి ఓ హిందీ సినిమాలో నటించాలని కోరుకుంటున్నట్టు ఓ సందర్భంలో హాలీవుడ్‌ హీరో జాకీచాన్‌ వెల్లడించారు. అంతటి పాపులర్‌ హీరో అక్షయ్‌. తైక్వాండోలో బ్లాక్‌బెల్టు ఉన్న అక్షయ్‌ కుమార్‌ కొత్త చిత్రం ‘రౌడీ రాథోర్‌’ కోసం ప్రత్యేకంగా కంబాట్‌ కరాటే నేర్చుకుంటుండడం విశేషం. సంజయ్‌లీలా భన్సాలీ,రోనీ స్క్రూవాలా నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం రౌడీ రాథోర్‌. ఈ చిత్రంలో హీరో అక్షయ్‌కుమార్‌తో కలిసి' దబంగ్‌ ' ఫేమ్‌ సోనాక్షి సిన్హా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో కంబాట్‌ కరాటే గురించి చూపిస్తున్నారు. దీంతో అక్షయ్‌ ఈ చిత్రంలో ప్రొఫెషనల్‌గా నటించేందుకు రెండు నెలల పాటు కంబాట్‌ కరాటేను నేర్చుకుంటున్నారు.


సిద్దార్థ్ వ్యాఖ్యానాల ఫై ‘న్యూస్‌ కేస్టర్స్‌ అసోసియేషన్‌’ ఫిర్యాదు
కళకు భాషాబేధాలుండరాదని త్రికరణశుద్ధిగా నమ్మేవాళ్లలో తెలుగువారిది ప్రధమ స్థానం. అయితే అది తెలుగువారి మంచితనం అనుకోకుండా.. తన గొప్పతనంగా భావిస్తూ.. సిద్దార్ద చేస్తున్న ఎగస్ట్రాలను సైతం మీడియా ఇన్నాళ్లూ లైట్‌గా తీసుకుంది. అయితే, మీడియాపై సిద్దార్థ చేస్తున్న వ్యాఖ్యానాలు రోజురోజుకూ శృతిమించుతుండడంతో, ఎలక్ట్రానిక్‌ ఛానల్స్‌పై సిద్దార్థ్ద చేసిన వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణిస్తూ.. అతడిపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు, నిర్మాతల మండలికి.. ‘న్యూస్‌ కేస్టర్స్‌ అసోసియేషన్‌’ ఫిర్యాదు చేసింది. అంతేకాదు ‘180’ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిద్దార్థను ఎలక్ట్రానిక్‌ మీడియా బహిష్కరించింది. ‘ఒక గంట ప్రోగ్రాం చేసుకోవడం కోసం ఛానల్స్‌వారు తమ పెళ్లాంబిడ్డల్ని సైతం అమ్మకానికి పెట్టేస్తారు’ అంటూ తన ట్విట్టర్‌లో సిద్దార్థ్ద ఇటీవల పోస్ట్‌ చేసాడు. ఇంతకుముందు కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యానాలు సిదార్థ చేసి ఉన్నాడు!

కెబిసి బెంగాలీ వర్షన్‌లో కోటి గెలుపొందిన అమీర్‌ఖాన్‌
అమీర్‌ఖాన్‌ బెంగాలీలో ప్రసారమవుతున్న కౌన్‌ బనేగా క్రోర్‌పతి షోలో తన భార్య కిరణ్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ వ్యవహరించారు. ఈ షోలో అమీర్‌ ఎంతో తెలివిగా అన్ని లైఫ్‌లైన్స్‌ను వాడుకుంటూ ఫైనల్‌ లెవెల్‌ వరకు చేరుకున్నారు. తన భార్య కిరణ్‌రావుతో చర్చించిన తర్వాత చివరికి అన్ని ప్రశ్నలకు ఆయన కరెక్టుగా సమాధానాలు చెప్పారు.ఆయన చెప్పారు. చివరికి కె హోబీ బంగ్లార్‌ కోటిపతిలో విజేతగా నిలిచి కోటి రూపాయలు దక్కించుకున్నట్టు సమాచారం. కానీ ఈ విషయాన్ని అమీర్‌ఖాన్‌ను అడగ్గా ఆయన సమాధాన్ని దాటవేశారు. బుల్లితెరపై చూస్తేనే నిజం తెలుస్తుందన్నారు. ఏదేమైనా టివిలో కెబిసి ప్రసారమైన తర్వాతే వాస్తవం తెలుస్తుంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో నాని చిత్రం ప్రారంభం
అష్టాచమ్మా', 'అలా మొదలైంది' చిత్రాలతో ఆకట్టుకొన్న కథానాయకుడు నాని. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కలయికలో తెరకెక్కే చిత్రాన్ని రమేష్‌ పుప్పాల నిర్మిస్తున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత మాట్లాడుతూ ''వినోదం, యాక్షన్‌ అంశాలు మేళవించిన కథ ఇది. కృష్ణవంశీ శైలిలోనే ఉంటుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలుంటారు'' అన్నారు. ఈ సినిమా ద్వారా కొత్త సంగీత దర్శకుడు చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల.

రజనీకాంత్ పెద్దకుమార్తె ;ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వం
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దకుమార్తె, ధనుష్ భార్య అయిన ఐశ్వర్యకు దర్శకత్వం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. ఈమె మంచి గాయని కూడా. ధనుష్ అన్న సెల్వరాఘవన్ వద్ద కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు. కాగా కమర్షియల్ అంశాలతో కూడిన ఒక చక్కని రొమాన్సింగ్ లవ్‌స్టోరీని ఐశ్వర్య సిద్ధం చేసుకున్నారని సమాచారం.ఈ చిత్రంలో కమల్‌హాసన్ కుమార్తె శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని ధనుష్ సొంత బ్యానర్‌లో నిర్మించడానికి సిద్ధం అవుతున్నారని వినికిడి.

‘ఊర్వశి’ శారద నిజ జీవిత పాత్రలో పద్మప్రియ
నటి పద్మప్రియ ‘ఊర్వశి’ శారద నిజజీవిత పాత్రను పోషిస్తున్నారు. శారద జీవితం అధారంగా మలయాళంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘నాయకి’ అనే పేరును నిర్ధారించారు. మలయాళంలో తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకొని తన ప్రాభవాన్ని చాటారు శారద. అంతేకాదు మహానటి అనదగ్గ పాత్రలను పోషించి రెండు సార్లు మలయాళం నుంచే ‘ఊర్వశి’ పురస్కారాలను అందుకున్నారామె. మరో విషయం ఏంటంటే... ఈ సినిమాలో వయసులో ఉన్న శారదగా మాత్రమే పద్మప్రియ చేస్తున్నారు. వయసు మీదపడ్డ శారదగా శారదే నటించనుండటం విశేషం.


ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో హాలివుడ్ చిత్రం
‘కిక్‌', 'డాన్‌శీను', 'మిరపకాయ్‌'లాంటి విజయవంతమైన చిత్రాలను అందించిన సంస్థ ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌. ఈ సంస్థ త్వరలోనే ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకి 'డైవర్స్‌ ఇన్విటేషన్‌' అనే పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.150 కోట్ల వ్యయంతో తెరకెక్కించే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. జొనాథన్‌ బెన్నెట్‌, జామిలిన్‌ సిగ్లర్‌, నడియా జార్గిన్‌, ఇలియెట్‌ గౌల్డ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తారు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. చిత్రీకరణ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

వసూళ్ళలో టాప్-5 హిందీ చిత్రాలు
బాలీవుడ్ లో మొదటి వారం అత్యధిక వసూళ్లు చేసిన 5 చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి. సల్మాన్ ఖాన్' దబాంగ్' మొదటి వారం 49 కోట్లు వసూలు చేసి మొదటి స్థానం లో నిలిచింది . సల్మాన్ ఖాన్ తాజా చిత్రం' రెడీ' 41కోట్లు వసూలు చేసి రెండవ స్థానం లో ఉంది. ' 3 ఇదియట్స్' 40 కోట్లు వసూల్ చేసి మూడవ స్థానంలో ఉంది. అలాగే' తీస్ మార్ ఖాన్' కూడా 40 కోట్లు వసూల్ చేసి నాల్గవ స్థానం పొందింది. ' గోల్ మాల్ - 3 ' 36కోట్లు వసూల్ చేసి ఐదవ స్థానం పొందింది.

జనని అయ్యర్ ప్రేమకథా చిత్రాలలో చేస్తుందట
తనను అందరూ అముల్‌బేబిలా ఉన్నావంటున్నారని వర్ధమాన నటి జనని అయ్యర్ అంటోంది. . ఆమె బాలా దర్శకత్వం వహించిన' అవన్ ఇవన్' [వాడు- వీడు] చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి ప్రేమకథా చిత్రాలలో నటించాలని ఉందని తన మనసులోని కోరికను వెల్లడించారు.' అలైపాయుదే ' [సఖి] లాంటి చిత్రాల కోసం ఎదురుచూస్తున్నానని జనని అంటోంది.

వ్యాపారవేత్తతో శ్వేతామీనన్‌ పెళ్లి !
'కాయం’ (తెలుగులో-రగిలే కసి) ఫేం...శ్వేతామీనన్‌ తన చిరకాల స్నేహితుడు శ్రీవల్సన్‌ మీనన్‌ని శ్వేత ఇటీవల వివాహమాడారు. కెరీర్‌ ప్రారంభంలో ‘కామసూత్ర’ ప్రకటనతో.. సంచలనం సృష్టించిన ఈ భామ సినిమాల కంటే ఆ ప్రకటనతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.ఇప్పటికి 25 పైగా మలయాళ చిత్రాలు సహా మొత్తం 50 చిత్రాల్లో(దక్షిణాదిన) పలుపాత్రల్లో దర్శనమిచ్చింది. 1970లో వచ్చిన సంచలనచిత్రం ‘రతినిర్వేదం’ రీమేక్‌లోనూ నటించి.. మల్లూ వుడ్‌లో తన సత్తాను మరోసారి చాటింది శ్వేత. ఇటీవలే ఈ సినిమా విడుదలై అక్కడ విజయవంతంగా కొనసాగు తోంది. ‘పాలేరి మాణిక్యం’ చిత్రంలో తన నటనకు ఉత్తమ కథానాయికగా ప్రతిష్ఠాత్మక కేరళ ప్రభుత్వ అవార్డ్‌ను సైతం అందుకుందీ భామ. శ్వేత ప్రస్తుతం నాగార్జున చిత్రం ‘రాజన్న’లో దొరసాని అనే ఆసక్తికరమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మరో మలయాళ చిత్రం ‘సాల్ట్‌ ఎన్‌ పెప్పర్‌’ త్వరలో విడుదల కానుంది.

నేపాల్‌పై డెమీమూర్ రూపొందించిన ‘స్టోలెన్ చిల్డ్రన్’
వెండితెరపై నాలుగు చిందులేసి డబ్బులు సంపాదించుకోవడంతో మా పనైపోయిందని నేను అనుకోను. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలని ఎప్పుడూ అనుకుంటాను’’ అంటున్నారు హాల్లీ వుడ్ గ్లామర్ క్వీన్ డెమీ మూర్. నేపాల్‌పై ఇటీవల ఆమె ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి ‘స్టోలెన్ చిల్డ్రన్’ అని టైటిల్ పెట్టారు. బాల కార్మికుల జీవితం, వ్యభిచార కూపంలో ఇరుక్కుంటున్న మహిళల గురించి ఆమె ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా డెమీ మూర్ మాట్లాడుతూ - ‘‘ఓ డాక్యుమెంటరీ కొంతమందినైనా ఆలోచింపజేస్తుంది, కదిలిస్తుంది అన్నది నా నమ్మకం’’ అన్నారు.త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


విశాల్ నటనకు అవార్డు రావడం ఖాయమంటున్నారు
'ఆడుగళం' చిత్రంతో ధనుష్ జాతీయ అవార్డును గెలుచుకోవడంతో ఇతర యువ నటుల దృష్టి కూడా అవార్డులపై పడింది. విశాల్, ఆర్య నటించిన'అవన్ ఇవన్' [వాడు -వీడు] చిత్రంలో విశాల్ నటనను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఆయన నటనకు అవార్డు రావడం ఖాయమని అంటున్నారు. విశాల్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో' ప్రభాకరన్' అనే పూర్తి కమర్షియల్ చిత్రలో నటిస్తున్నారు. తెలుగు చిత్రం 'శౌర్యం'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం పూర్తిచేసుకుంది. కాగా తర్వాత విశాల్ ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ కొడుకు జాన్ మహేంద్ర దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం కూడా విశాల్‌కు, దర్శకుడికి అవార్డులు తెచ్చిపెడుతుందని ఇప్పటి నుంచే పరిశ్రమలో టాక్.

సిక్స్‌ప్యాక్‌ మానసిక దృఢత్వంతో అమితాబ్
ఇప్పుడంతా సిక్స్‌ప్యాక్‌ ఫీవర్‌ నడుస్తోంది. దీనిపై బిగ్‌బి అమితాబ్‌ తనదైన శైలిలో స్పందించాడు...'శారీరక దృఢత్వం ఉండాలన్న ఫీలింగ్‌ సరైందే. అయితే సిక్స్‌ప్యాక్‌ ఫిజిక్‌ కోసం అందరూ తాపత్రయపడటం మంచిది కాదు. కొంతమంది శరీరతత్వానికి ఈ ప్రయత్నం సరిపోదు. ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కుర్ర హీరోలు దీని జోలికి వెళ్లొద్దు. అందం, శారీరక దృఢత్వం కథానాయకుడికి చాలా అవసరమైనవే. మానసిక ప్రశాంతతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిజానికి నేను సిక్స్‌ప్యాక్‌ మానసిక దృఢత్వంతో ఉన్నాను. మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నవారంతా ఈ కోవలోకే వస్తారు. ఇంకో పదేళ్ల వరకూ నా కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. దర్శకులు నాకోసం ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు' అని చెప్పుకొచ్చారు.

సల్మాన్ ఖాన్‌ని కాకాపట్టే పనిలో శ్రియ
కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ని కాకాపట్టే ప్రయత్నాల్లో శ్రియ బిజీగా ఉంది. సల్మాన్ ప్రోత్సాహం వల్లే ఆసిన్‌కు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయని గ్రహించిన శ్రియ అతన్ని మంచి చేసుకునే పనిలో నిమగ్నమైంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ తమిళ చిత్ర ఆడియో వేడుకకు సల్మాన్ ముఖ్య అతిధిగా రాగా, శ్రియ కూడా అక్కడకు వెళ్లింది. ఈ సందర్భంగా వారిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆమెకి హిందీలో అవకాశాల కోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని సల్మాన్ ప్రామిస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీపామెహతా తీస్తున్న 'మిడ్‌నైట్ చ్రిల్డన్స్' సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది ఈ అమ్మడు. ఇది ఇంగ్లిష్ సినిమా కావడంతో హాలీవుడ్‌లో మంచి పేరు వస్తుందని భావిస్తోంది. అలాగే తమిళంలో జీవా సరసన 'రేత్తిరం' చిత్రంలో నటిస్తోంది. అలాగే మలయాళంలో మోహన్‌లాల్ తీస్తున్న 'కాసనోవా' చిత్రంలో నటిస్తోంది.

టీనేజ్‌ బాయ్‌గా ‘రాక్‌ ఆఫ్‌ ఏజెస్‌’లో టామ్‌క్రూజ్‌
వయసు పెరుగుతున్నా కూడా టామ్‌క్రూజ్‌లో మాత్రం కుర్రతనం పోలేదు. 48 సంవత్సరాల వయసులో కూడా ఆయన టీనేజ్‌ బాయ్‌గా ‘రాక్‌ ఆఫ్‌ ఏజెస్‌’ చిత్రంలో నటిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మాదిరిగా టామ్‌ క్రూజ్‌ సైతం ఈ మ్యూజికల్‌ సినిమాలో షర్ట్‌ విప్పేసి దర్శనమిస్తున్నాడు. 1980 దశకంలో పాపులారిటీ సంపాదించుకున్న రాక్‌ సింగర్‌ స్టాసీ జాక్స్‌పై రూపుదిద్దుకున్న కథనంతో 'రాక్‌ ఆఫ్‌ ఏజెస్‌' చిత్రం రూపుదిద్దుకుంటోంది. టామ్‌క్రూజ్‌ శరీరంపై వినూత్నంగా టాటూలు వేయించుకొని, వెరైటీ బూట్ల లో ఆయన దర్శనమిస్తాడు. ఇందుకోసం కొంత కాలం పాటు కఠినమైన వ్యాయామాలు చేసి బాడీ బిల్డింగ్‌ చేశాడు.

శేఖర్ కమ్ములతో ఎలాగైనా చెయ్యాలట సిద్దార్ద
ఆనంద్‌, గోదావరి...లాంటి సూపర్‌క్లాస్‌ చిత్రాలు తనలాంటి హీరో చేయాల్సినవని నటుడు సిద్ధార్థ్‌ అనుకునేవాడంట ! అది ఎలానూ వీలు కాదు కాబట్టి... కనీసం ఆయన దర్శకత్వంలోనైనా నటించాలని తెగ ఆరాటపడుతున్నాడు. ఆ అవకాశం ఇప్పట్లో వచ్చేట్టు లేదని గ్రహించిన సిద్ధార్థ్‌, అతని శిష్యుడు అనిష్‌ కురువిల్లా దర్శకత్వంలో ఓ చిత్రంలో పనిచేయడానికి అంగీకరించాడు. అయితే, ఈ సినిమాని శేఖర్‌కమ్ముల నిర్మించాలని ముందే కండిషన్‌ పెట్టాడంట. అనీష్‌ కురువిల్లా ఇంతకుముందు 'ఆవకాయ బిర్యాని' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు శేఖర్‌ కమ్ములే నిర్మాత.


అన్నా హజారే పక్షాన రజనీకాంత్‌
దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కొంత కాలం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడే ఇన్‌ఫెక్షన్‌-ఫ్రీ జోన్‌లో ఆయన కొంతకాలం ఉండి పూర్తి ఆరోగ్యంతో తిరిగి దేశానికి రానున్నారని సమాచారం. రజనీకాంత్‌ అన్నాహజారే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్రజల కోసం జన్‌లోక్‌పాల్‌ బిల్లును తీసుకురావాలని ఉద్యమిస్తున్న హజారే తీరును చూసి ఎంతో ప్రభావితులయ్యారు. అందరి హీరోల మాదిరిగా చూస్తూ ఊరుకోకుండా హజారే ఉద్యమానికి మద్దతునివ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. మానవతావాదిగా పేరొందిన రజనీకాంత్‌ ప్రతిసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రజల కోసం ఉద్యమిస్తున్న అన్నాహజారేకు పూర్తి మద్దతివ్వాలని ఆయన భావిస్తున్నారని అతని సన్నిహితులు అంటున్నారు.

నటనకు అవకాశం ఉన్న పాత్ర ఇస్తే శ్రియ విజృంభిస్తుంది
ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’ గురించి శ్రీయ చెబుతూ - ‘‘శ్రీయ గ్లామర్ పాత్రలకే సూట్ అవుతుందనుకునేవారికి ఈ సినిమా ఓ సమాధానం. ఇందులో నేను మురికివాడకు చెందిన అమ్మాయిగా నటిస్తున్నాను. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను చూస్తే అందరూ షాక్ అవుతారు. ఇప్పటివరకు మీకు కనిపించిన శ్రీయ వేరు.. ఈ చిత్రంలో కనిపించే శ్రీయ వేరు. నటనకు అవకాశం ఉన్న పాత్ర ఇస్తే నేనెంత విజృంభిస్తానో తెలియజేయడానికి ‘మిడ్ నైట్స్ చిల్డ్రన్’లో నేను చేసిన పాత్ర ఓ ఉదాహరణ’’ అన్నారు.

కలర్స్‌ టివి ఛానెల్‌ కార్యక్రమానికి జడ్జీగా ధర్మేంద్ర
తాజాగా టివి ఛానెల్స్‌కు పని చేస్తున్న బాలీవుడ్‌ స్టార్ల లిస్ట్‌లో ధర్మేంద్ర కూడా చేరారు. 40 సంవత్సరాలకు పైగా బాలీవుడ్‌లో కొనసాగుతున్న ధర్మేంద్ర కలర్స్‌ టివి ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ షోకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ‘ప్రస్తుతం బాలీవుడ్‌లోని పలు స్టార్లు బుల్లి తెరపై దర్శనమిస్తూ అలరిస్తున్నారు . నాకు కూడా టివిపై కనిపించేందుకు సమయం వచ్చింది. కలర్స్‌ ఛానెల్‌ వారి ఇండియాస్‌గా టాలెంట్‌ షోకు చేసేందుకు ఒప్పుకున్నాను. జడ్జీగా చేయడం కత్తి మీద సామే. టాలెంట్‌ వారిని ఎంపికచేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను.టాలెంట్‌ ఉన్న వారిని నిరాశపరచను. వారిని ప్రోత్సహించేందుకు కృషిచేస్తాను’ అనిధర్మేంద్ర పేర్కొన్నారు.

నిర్మాతగా తెరవెనక ప్రీతిజింటా కొత్త పాత్ర
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా మరో కొత్త పాత్ర పోషించబోతోంది. తెరమీద కాదు.... నిర్మాతగా తెరవెనుక. కొత్త కథలను సినిమాలుగా మలచాలని కలలు కంటోంది . నిర్మాణ సంస్థను స్థాపించి ఒకేసారి రెండు సినిమాలకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఓ సినిమాలో నాయిక పాత్రలో కూడా కనిపించనుంది. 'ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. అందులో ప్రీతి తీరిక లేకుండా గడుపుతోంది. కొన్ని కథలు ఆమెకు బాగా నచ్చాయి.ప్రతి ఏడాది తప్పకుండా రెండు సినిమాలు రూపొందించేలా సన్నాహాలు చేస్తోంది. తను నిర్మించిన ప్రతి సినిమాలోనూ తనే కథానాయికగా కనిపించాలని అనుకోవటం లేదు. కొత్తవారితో ప్రయోగాలు చేయాలని చూస్తోంది' అని ప్రీతికి అత్యంత సన్నిహితులు చెబుతున్నారు.

‘డర్టీ’ పిక్చర్‌ నుండి ... నిజజీవితంలో కూడా బాలన్‌ భాష
విద్యాబాలన్‌ అనగానే ఓ మంచి బాలికగా బాలీవుడ్‌ సినిమారంగంలో ఇప్పటిదాకా ఆమెకు ఓ మంచి ఇమేజ్‌ ఉంది. దానికి తగినట్లుగానే ఆమె కట్టు, బొట్టు కూడా ఉండేవి. ఒక్కసారిగా ఈ మధ్య ఆమె వేషభాషల్లో తేడా వచ్చేసింది. రఫ్‌ అండ్‌ టఫ్‌ లాంగ్వేజ్‌ని ఎక్కడపడితే అక్కడ ఉపయోగించేస్తోంది. ఇంతకీ కథేంటంటే... ‘డర్టీ పిక్చర్‌’ అనే సినిమాలో సిల్క్‌స్మిత పాత్ర పోషిస్తున్న విద్యాబాలన్‌ ఆ పాత్ర తీరుతెన్నులు బాగా పరిశీలించి... అచ్చంగా మూసపోసిన మాస్‌ పాత్రలో జీవించేస్తోంది. సినిమా వరకూ ఓకే. కానీ సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో కూడా ఆ పాత్ర వదలని విద్య యూనిట్‌ సభ్యులతో కూడా చాలా శృతిమించి మాట్లాడుతోందట.


తమిళ మీడియా అనుష్కకు నిశ్చితార్ధం కానిచ్చేసారు
‘నా పెళ్లి నన్ను చేసుకోనివ్వండి’ అంటూ ప్రాధేయపడుతోంది అనుష్క. ఇప్పటివరకు హీరోయిన్లకు హీరోలతోనూ, దర్శకులతోనూ ఎఫైర్లు మాత్రమే అంటగడుతుండే తమిళ మీడియా ఇప్పుడు అనుష్కకు నిశ్చితార్ధం కానిచ్చేసారు. అయితే తనకు నిశ్చితార్ధం జరిగిందంటూ ప్రచారంలో ఉన్న నాగ చైతన్య పాపులారిటీ దృష్ట్యా ఈ వార్తను ఆమె ఖండించాల్సివచ్చింది. తను గత రెండేళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్‌ చేస్తున్నానని.. మరో రెండేళ్లలో అతడినే పెళ్లి చేసుకుంటానని, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ వ్యక్తి ఎవరన్నది తాను వెల్లడించలేనని అనుష్క చెప్పుకొచ్చింది. మీడియాకు ముందుగాచెప్పి తాను వివాహం చేసుకుంటానని, ఈలోపుగా ఆవేశపడి తన పెళ్లి, లేదా నిశ్చితార్ధం జరిపించేయవద్దని వేడుకుంటోంది!

బెజవాడ రౌడీలే ఖాయం: రామ్‌గోపాల్ వర్మ
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన పట్టు వీడలేదు. బెజవాడ నేపథ్యంలో నిర్మించ తలపెట్టిన తన తాజా చిత్రం ‘బెజవాడ టైటిల్’ విషయంలో వెనక్కు తగ్గలేదు. రాజకీయ నేతలు సహా నలువేపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో ఈ చిత్రం పేరును ‘బెజవాడ కుర్రాళ్ళు’గా మారుస్తున్నట్లు వచ్చిన వార్తలను వర్మ ఖండించారు. ఎవరేమనుకున్నా, ఆరు నూరైనా, నూరు ఆరైనా బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ‘బెజవాడ టైటిల్’ పేరును మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఇలియానా డిమాండ్‌ పడిపోయింది
శక్తి, నేను నా రాక్షసి సినిమాలు పరాజయం పాలవటంతో ఇలియానాకు తెలుగునాట డిమాండ్‌ పడిపోయింది. దాంతో పరిసర పరిశ్రమలపై దృష్టి సారించింది. బాలీవుడ్‌లోనూ మంచి ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఇప్పుడు ఆమె ముందుకు వస్తున్న ప్రతీ ఛాన్సునీ ఒప్పేసుకుంటోంది. ఈ క్రమంలో ఓ మలయాళ సినిమాకి ఓకే చెప్పేసిందట ! మలయాళ సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్‌ తక్కువగా ఉంటుంది. అలాగే హీరోయిన్ల రెమ్యునిరేషన్‌ కూడా అతి తక్కువగా ఇస్తారు. ఆ లెక్కన ఇలియానా రెమ్యున్‌రేషన్‌ విషయంలో చాలా మెట్లే దిగి వచ్చింది.

హాలీవుడ్ సినిమా 'సిటీస్'లో అనిల్ కపూర్
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ డేనీ బోయల్ రూపొందించిన ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'స్లమ్‌డాగ్ మిలియనీర్'లో నటించడంతో అనిల్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. దాని వల్లే ఇప్పుడు ఆయనకు ఒకదాని తర్వాత ఒకటిగా హాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. భారీ సినిమా 'మిషన్ ఇంపాజిబుల్ 4' తర్వాత 'సిటీస్' సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో హాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకడైన క్లైవ్ ఓవెన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో నేను లంచగొండులకు వ్యతిరేకంగా పోరాడే పోలీస్‌గా నటిస్తున్నా'' అని తెలిపాడు అనిల్.

'ఏక్ థా టైగర్'లో కత్రినా కైఫ్ 'సహజ' సౌందర్యం
కత్రినా కైఫ్ మరోసారి 'సహజ' సౌందర్యంతో కనిపించబోతోంది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న 'ఏక్ థా టైగర్' సినిమాలో ఆమె మేకప్ లేకుండా నటిస్తున్నట్లు వినిపిస్తోంది. ఇందులో సల్మాన్‌ఖాన్ హీరో. ముఖానికి ఎలాంటి రంగేయకుండా నటించడం ఆమెకి ఇదే తొలిసరి కాదు. ఇప్పటికే ప్రకాశ్ ఝా సినిమా 'రాజ్‌నీతి'లో ఆమె అసలైన ముఖంతోటే కనిపించింది.


సంజయ్‌గాంధీఫై పూరన్ సింగ్ చౌహాన్ చిత్రం
ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 31 యేళ్ల తరువాత ఆయన జీవితంపైన ఒక సినిమా రాబోతోంది. 'లాహోర్' చిత్ర దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ ఈ పనికి పూనుకున్నారు. "నాకు సంజయ్ గాంధీ అన్నా, ఆయన ఆలోచనా విధానమన్నా ఎంతో ఇష్టం. దేశం పట్ల ఆయన ఆలోచనావిధానం కూడా ఎంతో భిన్నంగా ఉండేది. ఎప్పటినుంచో సంజయ్ గాంధీ జీవితాన్ని సెల్యులాయిడ్ పైకి ఎక్కిద్దామనుకున్నాను. సంజయ్‌గాంధీ జీవితం చుట్టూ ఉన్న వివాదాలన్నింటికీ ఈ సినిమా ద్వారా తెరదించాలనుకుంటున్నాను. ఈ సినిమా చూసిన తరువాత సంజయ్ జీవితం గురించి కాని, ఆయన మరణం గురించి కాని ఎవరికీ అనుమానాలు ఉండకూడదనేదే నా ఉద్దేశం -అన్నాడు డైరెక్టర్ సంజయ్.

చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ గా అమితాబ్ బచ్చన్‌?
ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా వెండితెరకు ఎక్కనుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రభాకర్ శుక్లా దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా టైటిల్‌ను 'హుస్సేన్-ది పెయింటర్'గా నిర్ణయించారు. ఇప్పుడు ఎం.ఎఫ్.హుస్సేన్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో టైటిల్ రోల్‌ని పోషించాలని బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ని కోరారట .ఎం.ఎఫ్.హుస్సేన్ జీవిత కథను తెరకెక్కించాలనే ఆలోచన ఇప్పటికిప్పుడే వచ్చింది కాదు అంటున్నారు దర్శకుడు శుక్లా. ఏడాది కిందటే ఆయన జీవిత కథపై ఓ సినిమాను తీయాలని సంకల్పించారట.

3డి సినిమా 'డేంజరస్‌ ఇష్క్‌'తో తిరిగి తెరపైకి కరిష్మా
కరిష్మాకపూర్‌ విక్రమ్‌ భట్‌ 3డి సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నారు.' ‘కరిష్మాతో తీయనున్న 3డి సినిమా 'డేంజరస్‌ ఇష్క్‌' తప్పకుండా హిట్‌ చిత్రంగా నిలుస్తుంది. ఎంతో విలక్షంగా ఈ నిమాను తెరకెక్కించనున్నాము. ఈ చిత్రం సక్సెస్‌తో కరిష్మా తిరిగి బాలీవుడ్‌లో తన పూర్వ భవాన్ని దక్కించుకుంటుంది’' అని విక్రమ్‌ భట్‌ తెలిపారు. ‘సినిమాల్లో నటించడమంటే నా కెంతో ఇష్టం.. కానీ పిల్లలు పుట్టగానే వారి ఆలనాపాలనా చూసుకునేందుకు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చాను. ఇక రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నాను. విక్రమభట్‌ 3డి చిత్రం' డేంజరస్‌ ఇష్క్‌' నాకు నాటి గుర్తింపును తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. - అని కరిష్మా అన్నారు.

ఈజిప్ట్ రాణి 'క్లియోపాత్రాగా' ఏంజెలినా జోలి
ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాగా ఏంజెలినా జోలి నటించబోతున్నారు. ఈ పాత్ర పోషించే అవకాశం రావడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. క్లియోపాత్ర జీవితం తెరకెక్కడం ఇది తొలిసారి కాదు. 1963లో ఆమె జీవితాన్ని ఆధారం చేసుకుని ‘క్లియోపాత్రా’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో ఎలిజబెత్ టేలర్ క్లియోపాత్రాగా నటించారు. ఈ పాత్ర పోషించే అవకాశం రావడం పట్ల ఏంజెలినా జోలి చాలా ఆనందంగా ఉన్నారు. క్లియోపాత్ర అందగత్తె మాత్రమే కాదు... ఎంత మంచి తల్లో, మంచి నాయకురాలో అర్థం చేసుకుంటారు. ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడగల ప్రతిభాశాలి ఆమె. నా దృష్టిలో క్లియోపాత్ర అత్యంత శక్తివంతురాలు. ఆ పవర్‌ఫుల్ లేడీ ఇమేజ్‌కి ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈ పాత్రను చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అన్నారు ఏంజెలిన.

ఇక నుంచి అందాల ప్రదర్శన చెయ్యనంటున్ననమిత
"ఇక నుంచి అందాల ప్రదర్శనకు నేను దూరం. సినిమాలు వస్తే వచ్చాయి... లేకపోతే లేదు.’’ అని ఘంటాపథంగా చెబుతోంది బొద్దుగుమ్మ నమిత .తొలినాళ్లలో నేను చేసిన ' జెమినీ',' సొంతం', 'ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి' లాంటి సినిమాలను చూస్తే చాలా బాధనిపిస్తుంది. వాటిల్లో ఎంత పద్ధతిగా చేశానో... పోను పోనూ అవకాశాల కోసం నాసిరకం పాత్రలు చేశాను. ఆర్థికంగా అయితే నిలదొక్కుకోగలిగాను కానీ... నటిగా మాత్రం సంతృప్తిని పొందలేకపోయాను. అందుకే ఇక నుంచి అందాల ప్రదర్శన చేయను’’ అని అన్నారు నమిత. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘అభినయానికి ఆస్కారమున్న పాత్రలు వదులుకోను. ముఖ్యంగా యాంటీషేడ్స్ ఉన్న పాత్రలు చేయాలని ఉంది.-అని చెప్పింది.


అల్లు అర్జున్ 'బద్రీనాథ్'ను 'శక్తి నాథ్' అని పిలుస్తున్నారు
భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ -తమన్నా జంట గా వినాయక్ దర్శకత్వం లో నిర్మించిన 'బద్రీనాథ్' ఆసక్తితో ఎదురు చూసిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇలాంటి నేపధ్యంతోనే యన్.టి.ఆర్ -ఇలియానా జంటగా ఇటీవల వచ్చి దారుణ పరాజయం పొందిన 'శక్తి'తో దీన్ని పోలుస్తున్నారు. కొందరు దీన్ని'శక్తినాథ్' అని పిలుస్తున్నారు. భారీ తనం తప్ప మరేమిలేని ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టానికి అభినందించాల్సిందే. కొందరు ఈ చిత్రాన్ని 'అల్లు అర్జున్ ఫ్యాషన్ షో'గా చెప్పుకుంటున్నారు. ప్రతిభావంతుడిగా పేరున్న వినాయక్ ఈ భారీ చిత్రానికి న్యాయం చెయ్యలేక పోయాడు. తమన్నా అందాలు కాస్తంత ఆనందపరిచాయి.

బాలయ్య -త్రిష... అర్జున్ -సమంత... నిత్య -నాగ చైతన్య ...
దక్షిణాదిలో దాదాపు అందరు హీరో లతో జత కట్టిన త్రిష తొలి సారి బాలకృష్ణతో చేస్తోంది . వీరిద్దరూ 'హర హర మహాదేవ'లో కలిసి చెయ్యొచ్చని అంటున్నారు. 'దూకుడు'లో మహేష్ తో చేస్తున్న అందాల నటి సమంత త్వరలో ప్రారంభం కానున్న ఓ చిత్రం లో 'బద్రినాథ్' అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. 'అలా మొదలైంది'తో తెలుగులో ప్రారంభం అయిన నిత్య మీనన్ కెరీర్ ఇంకా ఎత్తుకు ఎదుగు తోంది. '100 %లవ్'తో విజయ పధంలోసాగుతున్న నాగచైతన్యతో త్వరలో ఓ చిత్రం లో చేస్తోంది.

ఆ కల నెరవేర్చుకునేందుకు ప్రియమణి సన్నాహాలు
ప్రియమణి ఇప్పుడు తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించేందుకు తహతహలాడుతోంది. అతి త్వరలోనే మెగాఫోన్‌ పట్టుకునేందుకు తాను ఏర్పాట్లు చేసుకుంటున్నానని ప్రియమణి ప్రకటిస్తోంది. షూటింగ్‌లో యూనిట్‌ మెంబర్స్‌కు సూచనలిచ్చేందుకుగాను డైరెక్టర్స్‌ పట్టుకునే మినీమైక్‌ను మెగాఫోన్‌ అంటారు. మెగాఫోన్‌ పట్టుకోవడమంటే డైరెక్షన్‌ చేయడమని అర్దం. దర్శత్వం చేయాలన్నది తన కలని, ఆ కలను నెరవేర్చుకునేందుకు తాను ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నానని ప్రియమణి చెప్పుకొస్తున్నది.

పరాజయం పొందిన ప్రతిసారి ఇలియానాలో కసి పెరుగుతుంది
"విజయాలకు పొంగి పోవడం... అపజయాలకు కుంగిపోవడం నాకు తెలీదు. రెండింటినీ సమానంగా చూడాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత నేను నేర్చుకున్నది ఇదే. పరాజయం పొందిన ప్రతిసారి విజయం సాధించాలనే కసి నాలో పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అమ్మ కూడా కొండంత ధైర్యం చెబుతుంది. ప్రస్తుతం 'రోబో' శంకర్ దర్శత్వంలో వస్తున్న 'నన్బన్' చిత్రంపైనే ఆశలన్నీ.ఈ చిత్రంతో తప్పకుండా రీఛార్జ్ అవుతా.'బర్ఫీ' చిత్రంలో రణబీర్‌కపూర్ సరసన రొమాంటిక్ గాళ్‌గా నటిస్తున్నా. ఇందులో నా రోల్ ప్రియాంక చోప్రాతో సమానంగా ఉంటుంది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు చేజిక్కించుకుంటాననే నమ్మకం ఉంది'' అంటోంది ఇలియానా.

యాడ్స్ లో బిజీగా మహేష్ బాబు ... ఆర్‌కె.సెల్వమణి 'అఖిల'
తన ఇమేజ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్న తెలుగు కథానాయికుల్లో మహేష్‌బాబు ముందుంటున్నాడు. వివిధ రకాల ప్రొడక్ట్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ప్రస్తుతం సినిమాల కన్నా వీటిలోనే ఎక్కువ బిజీగా ఉన్నాడు. ఈ యాడ్స్‌ మీద ఏడాదికి రూ.25 కోట్లు సంపాదిస్తున్నాడని టాలీవుడ్‌ సమాచారం !
నటి రోజా భర్త ఆర్‌కె.సెల్వమణి చాలా గ్యాప్ తర్వాత 'అఖిల' అనే సినిమాను రూపొందించనున్నారు. ఐదుగురు ఉగ్రవాదులకు, ఒక చిన్న పాపకు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథ అని దర్శకుడు తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదులు హోంమంత్రిని హత్య చేయాలని పథకం వేస్తారని, అందులో భాగంగా ఆ ముఠాలోని ఒక అమ్మాయి నాట్య గురువుగా ఆ మంత్రి ఇంట్లో చేరుతుందని, అక్కడ నాలుగేళ్ల చిన్నారి వారి కబంధ హస్తాల్లో చిక్కుకుంటుందన్నారు.. నాట్య గురువుగా మంత్రి ఇంట్లో ప్రవేశించే యువతిగా కజికిస్తాన్‌కు చెందిన మోడల్ ఉదాఫా నటిస్తున్నారని వెల్లడించారు.


బోడిగుండుతో ప్రియాంక.... క్యారెక్టర్స్‌లో కలర్స్‌ స్వాతి
బాలీవుడ్‌ అందాల భామ ప్రియాంకా చోప్రా వెండితెరపై బోడిగుండుతో కనపించనుంది. ఇందుకోసం సినిమా ట్రిక్స్‌ చేయకుండా, పాత్ర మీద ఇష్టంతో నిజంగానే గుండు కొట్టించుకోవ డానికి ఓకే చెప్పేసిందట ! 'అవును నిజమే..! దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. సహజత్వం కోసం గుండు చేయిస్తున్నా' అని ఓ ఇంటర్వ్యూలో సైతం చెప్పింది. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌ స్టోరీతో రూపొందనుంది.
హీరోయిన్‌గా తెలుగులో సక్సెస్‌ కాలేకపోతున్న కలర్స్‌ స్వాతి, ఇక స్పెషల్‌ క్యారెక్టర్స్‌ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా రామ్‌చరణ్‌ కథానా యకుడిగా రూపొందే 'రచ్చ' సినిమాలో ఓ క్యారెక్టర్‌ ఒప్పుకుందని టాలీవుడ్‌ టాక్‌.

రజనీ 'రాణా'కు 40కోట్లు... శ్రీహరితో దాసరి ...
ఇటీవల రజనీకాంత్‌తో ప్రారంభమైన 'రాణా' సినిమాని నిర్మాతలు రూ.40 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేశారట ! ఒకవేళ 25 శాతం షూటింగ్‌ జరుపుకుని ప్రాజెక్టు ఆగిపోయినా ఆ మొత్తానికి క్లెయిం చేసుకునే వెసులుబాటుందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 'పరమవీరచిక్ర' తర్వాత తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో శ్రీహరి కథానాయకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ మొదలవనుంది.

పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' ఉన్నట్టా? లేనట్టా?
'దబాంగ్‌'హిందీ సినిమాని హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో 'గబ్బర్‌సింగ్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన చేసి చాలా రోజులైనప్పటికీ, ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ ఈ సినిమా ఊసెత్తడం లేదు. తన ఇమేజ్‌కి అది తగిన సబ్జెక్ట్‌ కాదని, పైగా తెలుగు వాతావరణానికి కూడా అది సూట్‌ కాదని పవన్‌ భావిస్తున్నాడట ! అందుకే దానిని తన ఇమేజ్‌కు అనుగుణంగా పూర్తిగా మార్చమని దర్శకుడు హరీష్‌కి సూచించాడట. అయితే ఆ స్క్రిప్ట్‌తో ఎంత కుస్తీ పట్టినా అది ఓ పట్టాన సంతృప్తికరంగా రావటం లేదని డిసైడ్‌ అయ్యాడట దర్శకుడు.

'రెడీ' విజయంతో తెలుగు సినిమాల 'కిక్‌'లో సల్మాన్
ఇటీవల విడుదలైన సల్మాన్‌ చిత్రం 'రెడీ' బాక్సీఫీస్‌ వద్ద మంచి వసూళ్లను నమోదు చేసుకుంటోంది. దీంతో సల్మాన్‌ఖాన్‌ పలు విజయవంతమైన తెలుగు చిత్రాల మీద కన్నేశారు.హిందీ వాతావరణానికి, తనకు సూట్‌ అయ్యే విధంగా మలుచుకొని రీమేక్‌ చెయ్యాలన్న తలంపుతో ముందుకెళుతున్నాడు. ఈ క్రమంలో గతంలో రవితేజ, ఇలియానా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'కిక్‌' సినిమాను రీమేక్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాడు. గతేడాది సూపర్‌హిట్‌ కొట్టిన 'దబాంగ్‌' దర్శకుడు అభినవ్‌ కాశ్యప్‌కు మరోసారి అవకాసం ఇస్తున్నాడు. ఇందులోనూ సోనాక్షి సిన్హా కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది.

సెక్సీ ఎస్ట్ ఉమన్ గా కత్రీన కైఫ్... సిమ్రాన్ మళ్లీ వస్తోంది
బాల్లీ వుడ్ అందాల నటి కత్రీన కైఫ్ సెక్సీ ఎస్ట్ ఉమన్ గా ఎంపికైంది. మెన్స్ లైఫ్ స్టైల్ పత్రిక 'యఫ్.హెచ్.యం 'నిర్వహించిన ఆన్ లైన్, యస్ .యం.యస్ సర్వేలో ఆమె ఎంపిక అయ్యింది. కత్రీన గతంలో 2008, 2009లో కూడా సెక్సీ ఎస్ట్ ఉమన్ గా ఎంపికైంది. గత ఏడాది ఎన్నికైన దీపిక పదుకొనే ను ఈ ఏడాది కత్రీన ఆదిగమించింది.
గత ఏడాది కాలంగా నటనకు దూరంగా ఉన్న సిమ్రాన్‌ మళ్లీ మేకప్‌ వేసుకోబోతోంది. ఓ కన్నడ చిత్రాన్ని అంగీకరించింది. త్వరలోనే తెలుగులోనూ నటించేందుకు అంగీకారం తెలిపింది. ప్రముఖ కథానాయకుడొకరు నటించే చిత్రంలో ప్రాధాన్యమున్న పాత్ర చేయనుంది. ఆ కథానాయకుడితో గతంలో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఈసారి కథానాయికగా మాత్రం కాదు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే ఆమె కనిపిస్తుంది.


నటించే చిత్రాలకు నిబంధనలు పెడుతుందట తమన్నా
సరసమైన ధరలు అంటూ ప్రకటనలు గుప్పిస్తూ చివరిలో చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్థాయి అనే పదాలను మనం చూస్తుంటాం. తమన్నా కూడా ఈ పాలసీని ఫాలో అవుతున్నట్టుంది. తాను నటించే చిత్రాలకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై తప్పకుండా కొన్ని నిబంధనలు పెడతానని అంటోంది.ముఖ్యంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను, బికినీలు ధరించను అనే ఆంక్షలు తప్పకుండా ఉంటాయట.తమిళంలో ధనుష్‌కు జంటగా నటించిన ' వేంగై ' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోందని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్‌కు జంటగా నటిస్తున్న చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశంలో నటించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని చెబుతోంది.

ఫిల్మ్‌నగర్‌లో మహానటి విగ్రహానికి ఏర్పాట్లు
మహానటి సావిత్రి కాంస్య విగ్రహాన్ని ఫిల్మ్‌నగర్ రహదారిలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ అనుమతి కూడా లభించడంతో అధికారులు విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటుచేయాలన్నదానిపై సమీక్ష జరుపుతున్నారు. ఫిల్మ్‌నగర్ రోడ్ నెంబర్-1లోని పద్మాలయా స్టూడియో చౌరస్తానుంచి షేక్‌పేట, టోలిచౌకి వైపు కొత్తగా వేస్తున్న 120 అడుగుల రోడ్డులో ఫిల్మ్‌నగర్ చౌరస్తా వరకు ఎక్కడైనా సావిత్రి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎక్కువమంది అభిప్రాయపడుతుండడంతో అధికారులు కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఫిల్మ్‌నగర్‌కే అరుదైన గౌరవమంటున్నారు.

రమేష్‌వర్మ దర్శకత్వంలో గౌతం - సలోని !
ఎన్నో అంచనాలతో ఇటీవల తెలుగు తెరపైకొచ్చిన 'వీర' బాక్సాఫీస్‌ వద్ద నీరసంగా గా నడుస్తోంది. దీంతో హీరో రవితేజ కొంత నిరాశపడ్డాడు. అయితే ఆ చిత్ర దర్శకుడు రమేష్‌వర్మ తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. స్క్రిప్ట్‌ రెడీ అయింది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్‌ ఇందులో కథానాయకుడు. హీరోయిన్‌గా సలోనిని తాజాగా ఎంపికచేసినట్టు తెలుస్తోంది. గతంలో రమేష్‌వర్మ రూపొందించిన 'ఒక ఊరిలో...' సినిమాలో సలోని కథానాయికగా చేసింది. ప్రస్తుతం 'తెలుగమ్మాయి' సినిమాతోబాటు, బాలకృష్ణ, వెంకటేష్‌ చేస్తున్న చిత్రాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఆ లోపాలు లేకుండా దీపిక జాగ్రత్తపడుతుందట
నా చిత్రాలకు బెస్ట్ క్రిటిక్‌ని నేనే. నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. నా సినిమాలు చూస్తున్నప్పుడు లోపాలను వెతుకుతుంటాను. ఇంచుమించు భూతద్దం పెట్టుకుని వెతికినట్లే వెతుకుతాను. ఆ లోపాలు తదుపరి సినిమాలో లేకుండా జాగ్రత్తపడతానని- అంటోంది దీపిక పదుకొనే . ప్రస్తుతం హిందీలో ' దేశీ బాయ్స్', 'ఆరక్షణ్' చిత్రాల్లో నటిస్తున్నాను. 'దేశీ బాయ్స్' యాక్షన్ కామెడీ ఫిల్మ్. ‘ఆరక్షణ్’ విద్యా రిజర్వేషన్ గురించి చర్చిస్తూ తీస్తున్న చిత్రం. ఈ రెండు చిత్రాల్లో నావి మంచి పాత్రలే.ఈ ఏడాది నన్ను థ్రిల్‌కి గురి చేసిన మరో చిత్రం ‘రాణా’. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం రావడం ఓ ఆనందం-అంటూ చెబుతోంది దీపిక.

నలుగురు హీరోల మలయాళ 'సీనియర్' రీమేక్‌ లో శ్రీకాంత్
మలయాళంలో విజయం సాధించిన ‘సీనియర్‌’ అనే చిత్రం రీమేక్‌ రైట్స్‌ను హీరో శ్రీకాంత్‌ సోదరుడు అనిల్‌ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. మలయాళంలో జయరామ్‌, మనోజ్‌ కె.జయన్‌, బిజు మీనన్‌, అనన్య నటించిన ఈ చిత్రం గత నెల విడుదలై చెప్పుకోదగ్గ విజయం సాధిస్తోంది. నీలకంఠ దర్శకత్వంలో ‘విరోధి’ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీకాంత్ సోదరుడు అనిల్‌.. ఈ చిత్రం అనంతరం ‘సీనియర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం . ఈ చిత్రంలో శ్రీకాంత్‌తోపాటు మరో ముగ్గురు హీరోలు నటించనున్నారని.. కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోందని తెలుస్తోంది.


సెన్సార్ ను మాయచేయాలనుకుని ... పట్టుబడ్డ దొంగ 'వీర'
‘వీర’ చిత్రంలో హింసను ప్రేరేపించే దృశ్యాలున్నాయని, సెన్సార్ బోర్డు కత్తిరించిన దృశ్యాలను ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదుతో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓడియన్ థియేటర్‌లో చిత్రం రీళ్లను సీజ్ చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమాలో హింసను ప్రేరేపించే దృశ్యాలున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ ధనలక్ష్మి ఆదేశంతో బోర్డు సభ్యులు మ్యాట్నీషోను గుట్టుచప్పుడు కాకుండా తిలకించారు. అందులో కత్తిరించిన దృశ్యాలతో పాటు సినిమా ప్రివ్యూ సమయంలో లేని దృశ్యాలను కనుగొన్నారు. అనంతరం పోలీసుల సాయంతో సినిమా రీళ్లను సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

రజనీ వచ్చాకనే ధనుష్ పూర్తిగా ఆస్వాదిస్తాడట
జాతీయ అవార్డు పొందినా ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయానని- సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అల్లుడు, తమిళహీరో ధనుష్‌ అన్నారు.తనకు నటనలో గురువయిన రజినీకాంత్‌ అనారోగ్యంతో ఉండడంతో ఆ అవార్డు సంగతినే మరిచిపోయానన్నారు. సింగపూర్‌లో వైద్యచికిత్సలు పొందుతున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ మరో పది రోజులలో మన ముందుకు వస్తారన్నారు. అపుడు అవార్డు వచ్చిన సందర్భాన్ని ఆనందంగా ఆస్వాదిస్తానని తెలిపారు. తనకు నటన అంటే ఇష్టమని, అన్ని చిత్రాల వలె 'ఆడుకాలమ్‌'కు పనిచేశానన్నారు. ఆ చిత్రానికి అవార్డు వస్తుందని తాను ఊహించలేదన్నారు. తాను చేసే ప్రతి చిత్రంలోను కష్టపడి పనిచేయాలన్నది తన మామ రజినీకాంత్‌ దగ్గరనుండి నేర్చుకొన్న విషయమన్నారు.

ముగ్గురితోనూ చెయ్యాలని ఉందట జెనీలియాకు
మీ చివరి సినిమాని ఏ నటుడితో చేయాలనుకుంటారు? అని జెనీలియాని అడిగితే - ఒక్కరు కాదు. ముగ్గురితో. వారు ఖాన్‌త్రయం - షారుఖ్, అమీర్, సల్మాన్....అని చెప్పింది. లెస్బియన్ రోల్ అవకాశమొస్తే చేస్తారా?అని అడిగితే-నేను నటిని. లెస్బియన్ రోల్ చేయడంలో తప్పేముంది! అయితే దాన్ని గౌరవంగా చూపితేనే... అంది. రాఖీ సావంత్‌తో కలిసి ఒకే విమానంలో ప్రయాణించాల్సి వస్తే..? అని అడిగితే - ఆమె మంచి ఎంటర్‌టైనర్. ఓ వ్యక్తిగా తను నమ్మినదానిపై నిల్చునే మనిషి. కాబట్టి మంచి వినోదం లభిస్తుందనే అనుకుంటా... అని అంది జెనీలియా.

వెంకటేష్‌తో 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' దర్శకుడు దశరథ్‌
కుటుంబకథా చిత్రాలతో విజయాన్ని అందుకుంటోన్న దర్శకుడు దశరథ్‌. ఇటీవల ఆయన రూపొందించిన 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఇకపై ఇదే బాటలో వెళ్లాలనే ఆలోచనతో దశ్‌రథ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో హీరో వెంకటేష్‌తో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. దశరథ్‌ చెప్పిన స్టోరీలైన్‌ వెంకీకి బాగా నచ్చిందని, తదుపరి పని చేపట్టమని వెంకీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని టాక్‌.దీన్ని 'సింహా' చిత్రాన్ని నిర్మించిన యునైటెడ్‌ మూవీస్‌ అధినేత పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతోంది.

దక్షిణాదిలోనూ దూసుకుపోతున్న సోనాక్షి సిన్హా
'దబాంగ్’తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈ బాలీవుడ్ భామ అక్షయ్‌కుమార్‌తో ‘జోకర్’ చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్‌లో రూపొందనున్న రేస్-2, కిక్ చిత్రాలతో పాటు కమల్‌హాసన్ ‘విశ్వరూపమ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం కూడా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఉంది. అలాగే తమిళంలో సూర్య, శింబుల చిత్రాల్లో, తెలుగులో వెంకటేష్ చిత్రంలో కూడా సోనాక్షి నటించనున్నట్టు సమాచారం. ‘‘నేను ఆర్టిస్టుని. ప్రాతీయ భేదాలు కళలకు అంటవు. ప్రస్తుతం సౌత్ సినిమా బాలీవుడ్ సినిమాకు ధీటుగా దూసుకుపోతోంది. సౌత్ సినిమాపై ఇంట్రస్ట్ పెరగడానికి కారణం అదే. ఇప్పటికే నాలుగు సౌత్ సినిమాలకు సైన్ చేశాను.‘‘విశ్వరూపమ్’లో కమల్‌సార్‌కి జోడీగా నటిస్తున్నాను. సౌత్‌లో నా తొలి సినిమా కమల్‌సార్‌ది కావడం అదృష్టంగా భావిస్తున్నాను. అన్నారు సోనాక్షి.


'ఎన్టీఆర్ తెలుగుదేశం' పార్టీ వస్తోందా ?
తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయి బాలకృష్ణకు ప్రాధాన్యత పెరిగిపోవడంతో హరికృష్ణ ఆలోచనలోపడ్డారు. చంద్రబాబుకు నానాటికి ప్రజల్లో ఆదరణ తగ్గి పోవడం.... జగన్ వంటి యువనేతకు ఆదరణ పెరిగిపోవడం కూడా అతన్ని ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచింపజేసాయి. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని నమ్ముకోవడం అనర్ధమని అతనికి అర్ధమైంది. అందుకనే... జనాకర్షణ శక్తి ఉన్న తన కుమారుడు ఎన్టీఆర్ని ప్రధాన బలంగా పెట్టుకుని 'ఎన్టీఆర్ తెలుగు దేశం'పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో పట్టు సాధించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకనే ఇటీవల జరిగిన మహానాడులో హరికృష్ణ అలగడం... ఎన్టీఆర్ డుమ్మా కొట్టడం జరిగాయని అంటున్నారు.

భర్త అర్బాజ్ కు బై బై చెప్పిన మలైకా అరోరా
'దబంగ్‌' సినిమా ఇచ్చిన కిక్కుతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న సల్మాన్‌ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌లకు రీసెంట్‌గా జాతీయ అవార్డు సైతం గెలుచుకోవడంతో ఆ ఆనందం రెట్టింపయింది. అయితే బయటకు ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నా అర్బాజ్‌ఖాన్‌కు ఇంటిపోరు మాత్రం తప్పడంలేదు. ‘దబంగ్‌’ చిత్రంలో 'మున్నీ బద్నామ్‌ హుయీ ... అంటూ ఐటం సాంగ్‌లో హాట్‌ హాట్‌గా కనిపించి ఆ చిత్ర విజయంలో పరోక్షంగా పాలుపంచుకున్న మలైకాఅరోరా తన భర్త అర్బాజ్‌ఖాన్‌కు దూరమవ్వాలనుకుంటున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ మధ్యనే అర్బాజ్‌ఖాన్‌ తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని... తమది ఆదర్శ దాంపత్యమని చెప్పడం విశేషం. విషయం ఏమిటంటే... ఈ మధ్య మలైకా అరోరా తన బిడ్డను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అమితాబ్ తో ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’లో అందాల రాశి శ్రీదేవి
అందాల రాశి శ్రీదేవి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. మళ్లీ 14 సంవత్సరాల తర్వాత మేకప్‌ వేసుకుంటోంది. శ్రీదేవి మళ్లీ బాలీవుడ్‌ సినిమాతోనే రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. అమితాబ్‌బచ్చన్‌ హీరోగా ‘పా’ చిత్రం రూపొందించిన దర్శకుడు బాల్కీ భార్య గౌరీ షిండే దర్శకత్వంలో రూపొందనున్న ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంలో లీడ్‌ పాత్రలో నటించనుంది. ఇప్పటికీ శ్రీదేవి తన స్లిమ్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదు. పైగా తన కుమార్తెలకు కూడా స్లిమ్‌ లెసన్స్‌ బోధిస్తోందట.

శంకర్ 'త్రీ ఇడియట్స్‌'లో 16 భాషల్లో పాట
'త్రీ ఇడియట్స్‌' చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ , ఇలియానా, జీవా, శ్రీకాంత్‌ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం కోయంబత్తూర్‌లో షూటింగ్‌ జరుగుతోంది. వెరైటీ కోసం పలు భాషల్లోని పదాలతో కూడిన ఓ పాటను రాయించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో కలిపి మొత్తం పదహారు భాషల్లో ఈ పాట సాగుతుంది. విజయ ప్రకాష్‌ పాడగా, సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ ఇటీవలే రికార్డ్‌ చేశాడు. దీనిని ప్రపంచంలోని వివిధ దేశాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించాలని శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. తమిళంలో 'నన్బన్‌'కాగా, తెలుగులో 'త్రీ రాస్కెల్స్‌'గా నిర్ణయించారు.

విలక్షణ నటుడు విక్రమ్‌కు ఇటలీ యూనివర్శిటీ డాక్టరేట్
విలక్షణ నటుడు 'చియాన్‌ విక్రమ్‌'కు ఇటలీలోని యూనివర్శిటీ ఆఫ్‌ పొపలర్‌ డెగ్లీ స్టడీ డి మిలానో(యుయుపిఎన్‌) డాక్టరేట్‌తో గౌరవించింది. ఇటలీలో 110 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యూనివర్శిటీ 'పీపుల్స్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మిలన్‌' పేరుతో ప్రాముఖ్యత కలిగివుంది. ఫైన్‌ ఆర్ట్స్‌, యాక్టింగ్‌ విభాగంలో విక్రమ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందజేశారు. ఈ సంధర్బంగా విక్రమ్‌ మాట్లాడుతూ...'నటనకు సంబంధించి యూరోపియన్‌ యూనివర్శిటీల నుండి డాక్టరేట్‌ను అందుకున్న తొలి భారతదేశ నటుడ్ని. ఇది ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది- అని ఆనందపడ్డాడు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మార్కో గ్రాపేసియా డాక్టరేట్‌ను విక్రమ్‌కు అందించారు.


హింసించిన పోసాని దుశ్శాసన ... 'గుండెల్లో గోదారి'లో అల్లరి నరేష్‌
శ్రీకాంత్ హీరోగా పోసాని క్రిష్ణ మురళి దర్శకత్వం లో నిర్మించిన' దుశ్శాసన' విడుదలయి ఈ మధ్య కాలం లో ఏ చిత్రానికి రానంత ఘోరమైన విమర్సల పాలయ్యింది. ఓ వెబ్ సైట్ ఈ చిత్రానికి 0 రేటింగ్ ఇచ్చిన్దంటేనే దీని దయనీయ పరిస్థితి అర్ధమౌతుంది. అర్ధం పర్ధం లేని కధ తో , ఆచరణ సాధ్యం కాని సందేశం తో .....అసహనానికి గురి చేసే సన్నివేశాలతో ఈ దుశ్శాసన ప్రేక్షకులను హింసించడం లో మాత్రం విజయవంతం అయ్యాడు.
లక్ష్మీ ప్రసన్న తాజాగా 'గుండెల్లో గోదారి'లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తోంది. కృష్ణవంశీ శిష్యుడు రాజ్‌ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో లక్ష్మీ ప్రసన్న ఓ పల్లెటూరి అమ్మాయిగా విభిన్నమైన రోల్‌ పోషిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది ఇంకా నిర్ణయం కాలేదు. కానీ ఓ ముఖ్యమైన పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్నాడని సమాచారం. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చనున్నారు.

సినిమా ప్రచారానికి ఎప్పుడూ నిరాకరించనన్న ఇలియానా
సినిమా నచ్చకుంటే ప్రచారానికి సహకరించనని అంటున్నారట... అని 'శక్తి' చిత్రం విషయం అడిగితే - నా మాటలు వక్రీకరించార. 'శక్తి' నాకు నచ్చడం వల్లనే ఆ చిత్రం చేసాను. ఆ చిత్రం ఆడియో విడుదల సభలో తొలిసారిగా నేను పాటకు డాన్స్ కూడా చేశాను. నేను ఎప్పుడూ సినిమా ప్రచారానికి విముఖత చూపను. ఇక ఆ చిత్రం పరాజయం విషయం చెప్పాలంటే -విజయం కోసమే అంత కష్టపడతారు. ఫలితం మన చేతుల్లో ఉండదు. ప్రతి సినిమా నాకు ఓ అనుభవమే. ఎన్నో కొత్త విషయాలు నేర్పుతుంది- అంటూ చెబుతోంది ఇలియానా.

ఎ.ఆర్‌.రహ్మాన్‌ మ్యూజిక్‌ షో లో పోలీసు అలజడి
నాగ్‌పూర్‌లో ఎ.ఆర్‌.రహ్మాన్‌ మ్యూజిక్‌ షోను నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు దాదాపు 40వేలమందికి పైగా మ్యూజిక్‌ లవర్స్‌ హాజరయ్యారు. షో రసవత్తరంగా కొనసాగుతున్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా రంగ ప్రవేశం చూసి లైట్స్‌, సౌండ్‌ను ఆపివేశారు. దీంతో ప్రేక్షకులు బిత్తరపోయారు. పోలీసు నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల వరకే షో జరగాల్సి ఉండగా ఇంకా ప్రదర్శన కొనసాగుతోంది. దీంతో పోలుసులు ఎటువంటి ఆలోచన లేకుండా లైట్స్‌, సౌండ్‌ను నిలిపివేశారు. ప్రదర్శనను కొనసాగించేందుకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టంచేశారు. చివరికి ఎ.ఆర్‌.రహ్మాన్‌ సైతం పోలీసులతో మాట్లాడితే- నిబంధనలను తెలియజేసి షో కొనసాగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇంకా 30 నిమిషాల పాటు మ్యూజిక్‌ షో కొనసాగాల్సి ఉండడంతో రహ్మాన్‌ స్టేజ్‌ పైకి వచ్చి పోలీసు నిబంధనల ప్రకారం షోను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రేక్షకులను అర్థించారు.

ఐటమ్‌ సాంగ్స్‌తో హృదయాలను కొల్లగొట్టాలని ... బిపాసా
బిపాసాకు ఈ మధ్య ఏ సినిమా కూడా పెద్ద బ్రేక్‌ను ఇవ్వలేకపోయింది. కత్రీనా, కరీనా, దీపికాలో పలు చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌తో యువకుల హృదయాను కొల్లగొట్టారు.వారి లానే తానుకూడా ఐటమ్‌ సాంగ్‌ చేసి బాలీవుడ్‌లో తిరిగి తన స్థానాన్ని దక్కించుకోవాలని బిపాసా ఉబలాటపడుతున్నారు. మొదటి ఐటమ్‌ సాంగ్‌ కాబట్టి ఎంతో ప్రత్యేకంగా ఉండాలని బిపాసా కోరుకుంటున్నారు. ‘ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్‌ కోసం యానాగుప్తా, రాఖీసావంత్‌ వంటి వారు ప్రత్యేకంగా ఉండేవారు. కానీ నేడు ప్రేక్షకుల అభిరుచుల మేరకు హీరోయిన్లే ఐటమ్‌ సాంగ్స్‌ చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఇదే తరహాలో ఐటమ్‌ సాంగ్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని బిపాసాబసు అంటోంది.

మూడు చిత్రాల్లో కరీనా వీరోచిత పోరాటాలు
ఇప్పుడు హీరోయిన్ లు సినిమాల్లో కేవలం గ్లామర్ కోసమే ఉపయోగపడుతున్నారు తప్ప, వారికి ప్రాధాన్యత లేదనే విషయం అందరికి తెలిసిందే . అయితే కరీనా కపూర్ విషయం మాత్రం అందుకు మినహాయింపు. ఆమె నటిస్తున్న మూడు చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వం లో 'ఏజెంట్ వినోద్ ', సిద్దిఖ్ దర్శకత్వంలో 'బాడీ గార్డ్ ', అనుభవ సిన్హా దర్శకత్వంలో 'రా -వన్'లో కరీనా హీరోలతో సమానంగా వీరోచిత పోరాటాలు చేసిందట. ఈ చిత్రాలతో కరీనా ఇమజ్ లో చాలా మార్పు వస్తుందని అంటున్నారు.


త్వరలో ఉపాసనతో రాంచరణ్ ప్రేమ పెళ్లి
మెగాస్టార్ కుటుంబంలో మరో ప్రేమ వ్యవహారం నడుస్తోందని వార్తలొస్తున్నాయి. యువ హీరో రాంచరణ్ కూడా ప్రేమలో పడ్డాడని, త్వరలోనే ఈ విషయం మీడియా ముందుకొస్తుందని అంటున్నారు. కామినేని హాస్పిటల్స్ చైర్మన్ మనవరాలు ఉపాసన కామినేనితో రాంచరణ్ ప్రేమలో ఉన్నారని, ఈ విషయం అతని ఇంటిలో వారికి కూడా తెలుసని చెబుతున్నారు. వినాయక్‌ తాజాగా రామ్‌చరణ్‌తో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ‘బద్రినాధ్‌’ అనంతరం వినాయక్‌ దర్శకత్వం వహించే చిత్రమిదే. ‘ఆరెంజ్‌’ అనంతరం రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహిస్తుండడం తెలిసిందే. ‘రచ్చ’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంతోపాటు వినాయక్‌ చిత్రం కూడా సమాంతరగా షూటింగ్‌ జరుపుకోనుంది.

'రెడీ'లో సల్మాన్‌తో అసిన్ ‘లిప్‌లాక్’ లేదట
'రెడీ'లో సల్మాన్‌తో ‘లిప్‌లాక్’ సీన్స్ లేవు. అదంతా పబ్లిసిటీ కోసం చేసే హైప్ కావచ్చు. సినిమాలో జస్ట్ నా బుగ్గమీద ఓ టచ్ ఇస్తాడు సల్మాన్. అంతకు మించి అందరనుకుంటున్నట్లు మోతాదుకు మించిన దృశ్యాలేవీ లేవు. సల్మాన్ తో ఇది రెండో సినిమా నేను చేయడం. అతని వ్యక్తిత్వం చాలా మంచిది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సరదాగా జోకులు వేసి మనందర్నీ నవ్విస్తారు. అతనికి నచ్చితే ఏమైనా చేస్తాడు. ఎలాంటి సపోర్ట్ ఇవ్వడానికైనా వెనుకాడరు. మనసులో మంచి అభిప్రాయం కలిగితే ఎదుటివారి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేస్తారాయన. నేనంటే అతనికి బాగా ఇష్టం- అంటూ సల్మాన్ ని ఆకాశానికిఎత్తేసింది అసిన్.

'బెజవాడ రౌడీలు' షూటింగ్ ఆగిపోలేదంటున్న వర్మ
విజయవాడలో షూటింగ్ చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా 'బెజవాడ రౌడీలు' షూటింగ్ ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ చిత్ర నిర్మాత రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. ముందుగా ప్లాన్ చేసినట్లే విజయవాడ షెడ్యూలుని పూర్తి చేసుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూలు కొనసాగిస్తున్నామన్నారు. "ఆగస్టు వరకు జరిగే మరో మూడు షెడ్యూళ్లతో సినిమా పూర్తవుతుంది. విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు. నాగచైతన్య హీరోగా, ఓ పేరున్న నాయిక నటించే ఈ చిత్రం శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై రాంగోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అనుష్కకు ఆ అవార్డు ఫంక్షన్ గురించి నిజంగా తెలీదు
మనం చేసిన కష్టానికి ఇచ్చే ప్రతి ఫలం అవార్డు ఇస్తారు. అవార్డు రావడం వల్ల మన బాధ్యతను మరింత పెంచుతుంది. ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌కి మీరు వెళ్లకపోవడానికి కారణం?- ఏమిటని అనుష్కను అడిగితే ఇలా చెప్పింది. నాకు ఆ అవార్డు ఫంక్షన్ గురించి నిజంగా తెలీదు. అవార్డుల ఇన్విటేషన్ ఇంటికి వస్తే మా ఇంట్లో వంట మనిషి అందుకున్నాడు. నేను ఆ సమయంలో ఆవుట్ ఆఫ్ స్టేషన్. అందుకే వెళ్లలేకపోయా. నాకు తెలిసివుంటే తప్పకుండా వెళ్లేదాన్ని-అని అంది. .మీకు ఓ ప్రముఖ దర్శకుడు హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రను ఆఫర్ చేస్తే తిరస్కరించారట?-అని అడిగితే .... 'అరుంధతి' తరువాత హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు చాలానే వచ్చాయి. 'పంచాక్షరి' స్క్రిప్టునచ్చితే చేశా. అయితే మీరు అంటున్న దర్శకుడు మాత్రం నాకు ఎలాంటి ఆఫర్ చేయలేదు. అసలు మీరు చెబుతున్న సినిమా నా దృష్టికే రాలేదు-అని చెప్పింది.

నయనతార ఆంతర్యం ఏమిటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు
దక్షిణాది భాషలన్నింటిలోనూ హీరోయిన్‌గా సక్సెస్ అయిన ఏకైక నటి నయనతార. ఇటీవల పలు అవకాశాలను నిరాకరిస్తున్న ఆమె ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ సరసన 'శ్రీరామరాజ్యం' అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వస్తున్న అవకాశాలను ప్రభుదేవా అడ్డుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె సడన్‌గా చెన్నైలో కొత్త మేనేజరును ఏర్పాటు చేసుకుంది. దీంతో ఆమె మళ్లీ మనసు మార్చుకుందా? నటనను కొనసాగించనుందా! లేకుంటే కొత్త మేనేజరును ఎందుకు నియమించుకుంది? అసలు నయనతార ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


డ్యాన్స్‌ రియాల్టీ షోకు హోస్ట్‌గా హృతిక్ రోషన్
హృతిక్‌ ఓ టివి ఛానెల్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్‌ రియాల్టీ షోకు హోస్ట్‌గా చేసేందుకు సైన్‌ చేశారు. దీంతో ఆయన గత కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వివిధ డ్యాన్స్‌లకు సంబంధించి అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. ఇందులో 50మంది కంటెస్టెంట్‌లు పాల్గొంటున్నారు. డ్యాన్సర్లు ఎన్నో ఆశలతో ఈ షోలో పాల్గొని పోటీపడతారు. మంచి డ్యాన్సర్‌ను విజేతగా ఎంపికచేసినప్పుడే ఈ షోకు హోస్ట్‌గా, జడ్జీగా పూర్తి న్యాయం చేయగల్గుతా. ఇందు కోసం అన్ని రకాల డ్యాన్సులపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవడంతో పాటు సొంతంగా ప్రాక్టీస్‌ కూడా చేశా’ అని హృతిక్‌ వెల్లడించారు

బంగారానికి బ్రాండ్ అంబాసిడర్లు మన హీరో లు
ఇటీవల కాలంలో మన తెలుగు హీరోలను తమ ప్రచారకర్తలుగా నియమించుకుంటూ తమ బంగారు ఆభరణాల విక్రయాలను పెంచుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. నాగార్జున అక్కినేని 'కళ్యాణ్‌ జ్యుయలర్స్‌'కు బ్రాండ్‌ అంబాసడర్‌గా వ్యవహరిస్తుంటే.. బంగారంపై అప్పులిచ్చే ‘మణప్పురం’ అనే సంస్థకు వెంకటేష్‌ ప్రచారం చేస్తున్నారు. ఇక మహేష్‌బాబు ‘జోయ్‌ ల్యూకాస్‌’ అనే గొలుసు గోల్డ్‌షాప్స్‌ (చైన్‌ ఆఫ్‌ గోల్డ్‌ షాప్స్‌)కు బ్రాండ్‌ అంబాసడర్‌గా నియమితులు కాగా, ఎన్టీఆర్‌ ‘మలబార్‌ గోల్డ్‌’ అనే సంస్థకు అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక జగపతిబాబు కూడా 'సి.యం.ఆర్‌' ఆనే సంస్థకు బ్రాండ్‌ ఎండార్సమెంట్‌ చేస్తున్నారు.

సల్మాన్‌ఖాన్ నిర్మాతగా బాలల చిత్రం 'చిల్లర్ పార్టీ'
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ తొలిసారి నిర్మాత అవతారమెత్తి ఓ బాలల చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రం పేరు 'చిల్లర్ పార్టీ'. యుటీవీ స్పాట్‌బాయ్, సల్మాన్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే సల్మాన్ కుటుంబం చిత్ర నిర్మాణంలో ఉన్నప్పటికీ సల్మాన్ తన పేరిట మరో సంస్థని నెలకొల్పి ఈ చిత్రాన్ని అందిస్తుండటం గమనార్హం. బాలలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ ఓ స్పెషల్ సాంగ్ చేయడం ఆసక్తికరమైన అంశం. రోనీ స్క్రూవాలా, సల్మాన్‌ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారీ, వికాస్ బెహల్ దర్శకులు. అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. జూలై 8న ఈ చిత్రం విడుదల కానున్నది.

కత్రీనాలో ఓ డాషింగ్ లేడీ దాగుందని తెలుసుకుంటారు
‘‘కత్రినా గులాబీ రేకులాంటిది. చక్కగా డ్యుయెట్లు పాడుకుంటూ, సింపుల్‌గా ఉండే సీన్స్ మాత్రమే చేయగలదనుకునేవారికి ‘జిందగీ నా మిలేగీ దొబారా’ ఓ సమాధానం అవుతుంది. నాగురించి మీరు ఓ నిర్ణయానికి రాకండి. నేను ఏమైనా చేయగలను. నాలో ఓ డాషింగ్ లేడీ దాగుందని తెలుసుకుంటారు. ఈ చిత్రంలో నేను ‘డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్’గా నటిస్తున్నాను. ఈ పాత్రను పండించడం కోసం స్కూబా డైవింగ్, బైక్ నడపడం నేర్చుకున్నాను. ఈ చిత్రంలో నేను చేసిన రిస్కులు చూసి మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం’’ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో కత్రినా ఏ మేరకు రిస్క్ చేశారో శాంపిల్ చూపించారు.

రేఖ ఫై సినిమా 'సితారే '... నటిగా ఫరాఖాన్
అలనాటి అందాల నటి, అందానికి అర్ధం చెప్పిన రేఖ జీవిత కధ తో ఓ చిత్రం రానుంది. కపిల్ శర్మ దర్శకత్వం లో వచ్చే ఈ చిత్రానికి 'సితారే 'అని పేరు పెట్టారు. ఇందులో రాణి ముఖర్జీ, బిపాసా బసు, శ్రీదేవి లో ఒకరు ప్రధాన పాత్ర పోషిస్తారు.
డాన్స్ డైరెక్టర్ గా , సినిమా డైరెక్టర్ గా రాణించిన ఫరాఖాన్ ఇప్పుడు నటిగా కూడా తెరఫై కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం లో రానున్న.'షిరిన్ ఫరాక్ 'లో ఫరా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. నటిగా తన తొలి చిత్రం మంచి పేరు తెస్తుందని ఫరా నమ్మకంగా ఉందట.


బోర్ కొట్టించిన రవితేజ 'వీర '
'విక్రమార్కుడు' తర్వాత రవితేజ ద్విపాత్రాభినయంతో రమేష్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన 'వీర' ప్రేక్షకులను బోర్ కొట్టించింది. ఈ చిత్రం భవిష్యత్తు ముందే తెలిసిపోవడం వల్లనేమో మొదటినుండి మీడియాకు దూరంగా ఉన్నారు. మంచి నటనతో రవితేజ తన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ .... గతంలో అంతంత మాత్రం సినిమాలను చేసిన దర్శకుడు రమేష్ వర్మ కాలదోషం పట్టిన కధ, స్క్రీన్ ప్లే, యాక్షన్, సెంటిమెంట్ తో సినిమాని చెడగొట్టాడు. సినిమా రెండవ భాగంలో మరీ హింసించారు. హీరోయిన్లు కాజల్, తాప్సి ల అందాలు, చోటా.కే.నాయుడు ఫోటోగ్రఫీ ఈ చిత్రం లో హై లైట్స్.

దర్శకురాలిగా భూమిక... ఆర్పీ దర్శకత్వంలో 'మ్యూజిక్'
నటిగా అవకాశాలు తగ్గిన భూమిక దర్సకురాలు కావాలనుకుంటోంది. ఆ మధ్య భూమిక తన భర్త భరత్ టాగోర్ తో కలిసి ఓ సినిమా పత్రిక, వెబ్ సైట్ తో పాటు.... 'తకిట -తకిట' అనే సినిమాను తీసి చేతులు కాల్చుకుంది. ఇప్పుడు తన చిరకాల కోరిక దర్శకత్వం చేయడానికి సిద్ధపడి అమెరికాలో శిక్షణ పొందుతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నట, దర్శకుడు ఆర్పీ పట్నాయిక్ ఇటీవల 'బ్రోకర్' చిత్రానికి ప్రసంశలు అందుకున్నారు. ఆర్పీ ఇప్పుడు సంగీత నేపధ్యం లో 'మ్యూజిక్' (కొంచం రాగం -కొంచం రిమిక్స్ ) అనే చిత్రం చేస్తున్నారు. జూన్ లో ప్రారంభం అయ్యే ఈ చిత్రం లో 12కు ఫై గా పాటలు ఉంటాయట.

'క్రిష్ 3'లో హృతిక్ రోషన్ త్రిపాత్రాభినయం?
రాకేశ్ రోషన్ రూపొందించే 'క్రిష్ 3'లో హృతిక్ రోషన్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద బాలీవుడ్. ఇందులో అతను తాత, తండ్రి, కొడుకు పాత్రల్ని పోషించబోతున్నాడు. ఇందులోని విలన్ పాత్రని రాకేశ్ స్వయంగా చేస్తాడని ఇదివరకు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ పాత్రకి వివేక్ ఓబరాయ్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం లొకేషన్ల వేటలో ఉన్నాడు రాకేశ్. 'క్రిష్' సీరిస్‌లో తొలి రెండూ పెద్ద హిట్టవడంతో ఇప్పుడు మూడో సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

బుల్లితెరపై హోస్ట్‌గా అజయ్‌దేవ్‌గణ్‌..!
బాలీవుడ్‌లో పలు హిట్‌ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న హీరో అజయ్‌ దేవ్‌గణ్‌. ఈ స్టార్‌ హీరో యాక్షన్‌ సినిమాతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇక ఈ స్టార్‌ హీరో ప్రస్తుతం బుల్లితెరపై తన దృష్టిని సారిస్తున్నారు. స్టంట్‌లతో కూడిన రియాల్టీ షో ‘హై దమ్‌’కు అజయ్‌ దేవ్‌గణ్‌ హోస్ట్‌గా చేయనున్నారు. ఈ షోలో యాంకర్‌ ప్రీతి దేశాయ్‌తో కలిసి ఆయన పాల్గొననున్నారు. ఓకె అయితే అజయ్‌దేవ్‌గణ్‌ ఒకేసారి రెండు, మూడు కార్యక్రమాల్లో హోస్ట్‌గా చేయనున్నారు

ప్రియాంకాచోప్రా బ్లాగ్ లో పదిలక్షల మంది
సాంఘిక సమస్య అయినా లేదంటే కొత్త సినిమాలైనా ఏదో ఒక విషయంపై బాలీవుడ్‌ తార ప్రియాంకా చోప్రా బ్లాగ్‌లో సమాచారాన్ని అందజేస్తారు. ఆమెకు బాలీవుడ్‌లో ఎవరికీ లేనంతగా తన బ్లాగ్‌లో పదిలక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ‘బ్లాగ్‌లో మిలియన్‌ మార్క్‌ను అధిగమించడం ఆనందంగా ఉంది. ప్రతిరోజు బ్లాగ్‌లో అభిమానులను పలకరిస్తుంటాను. నెట్‌ ముందు కూర్చుంటే నాకు సమయమే తెలియదు’ అని ప్రియాంకా పేర్కొన్నారు.


రజనీకి ఊపిరితిత్తుల వ్యాధి, లివర్ సిరోసిస్
రజనీ ఆరోగ్యం గురించి ఏదో దాస్తున్నారు. బహుశా పరిస్థితి తీవ్రత గురించి తెలిస్తే అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే వారలా చెప్తుండవచ్చు అని వి శ్వసనీయ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. కుటుంబసభ్యులు ఆయన్ను అత్యుత్తమ చికిత్స నిమిత్తం విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారని ఆస్ప త్రి వర్గాల సమాచారం.. రజనీ చైన్ స్మోకర్ కావడం, ఆయనకు మద్యం అలవాటు ఉండటం వల్ల ఊపిరితిత్తులు, ఉదర సమస్యలున్నట్లు వైద్యులు గుర్తించిన మాట వాస్తవమన్నారు.

ఏంజెలీనా జోలీ సినిమా కథకి నేపథ్యం బోస్నియా యుద్ధం
తన అందచందాలు, అభినయ సామర్థ్యంతో ప్రపంచ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వచ్చిన హాలీవుడ్ అందాల రాణి ఏంజెలీనా జోలీ దర్శకురాలిగా మారబోతోంది. ఆమె డైరెక్ట్ చేయబోతున్నది ఆషామాషీ సినిమానో, మామూలు ఎంటర్‌టైనరో కాదు. ఓ సీరియస్ సినిమా. దాని పేరు 'ఇన్ ద లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ’. "ఈ సినిమా కథకి నేపథ్యం బోస్నియా యుద్ధం. అయినా ఈ కథ విశ్వజనీనం. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో నివసించే ప్రజల మధ్య మానవ సంబంధాలు, ప్రవర్తన ఎలా గాఢంగా ఆ యుద్ధానికి ప్రభావితమవుతాయో ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నా'' అని తెలిపింది ఏంజెలీనా.

డా. సినారె ఆధ్వర్యంలో 'సినీ గీత రచన'పై అధ్యయన శిబిరం
ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ, ఆంధ్ర సారస్వత పరిషత్తు సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 19 నుంచి 25 వరకు తిలక్‌రోడ్‌లోని ఆంధ్ర సారస్వత ప్రాంగణంలోజరిగే ఈ శిబిరంలో 18 మంది ప్రముఖ సినీ గీత రచయితలు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులుపాల్గొంటారు. రాష్ట్రంనుంచి 100 మందికిపైగా అభ్యర్థులు పాల్గొంటారు. 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు కే . విశ్వనాథ్‌ ప్రారంభిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా 25వ తేదీన ధృవీకరణ పత్రాల అందజేస్తారు.

ఇలియానా పనితో, పరాజయాలతో బాగా అలసిపోయింది
ఈ ఏడాదిలో అందాల ఇలియానా నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. 'శక్తి', 'నేను నా రాక్ష్ససి'పెద్ద పరాజయం పాలయ్యాయి. మరో రెండు చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది ఈ గోవా బ్యూటీ. బాలీవుడ్‌లో అనురాగ్ బసు దర్శకత్వంలో రణబీర్ కపూర్ సరసన 'బర్ఫీ' చిత్రంలోనూ, శంకర్ దర్శకత్వంలో 'త్రీ ఇడియట్స్' రీమేక్‌లోనూ నటిస్తోంది. ఇలా తీరిక లేకుండా బిజీ షెడ్యూల్స్‌తో గడిపేయడం వల్ల బాగా అలసిపోయిందట. దీంతో కొంత అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇలియానా సోదరి ఫరా డిసౌజా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. "సారీ... ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నందుకు చింతిస్తున్నా. గత కొంత కాలంగా తీరికలేకుండా షూటింగ్స్‌లో పాల్గొనడం వల్ల ఇలియానా బాగా అలసిపోయి కొంత అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది' అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది.

జూన్‌ 10న 'బద్రీనాథ్‌'.... త్వరలో ఓ తెలుగు సినిమాలో సోనాలి
అల్లు అర్జున్‌, తమన్నా కాంబినేషన్‌లో వి.వి.వినాయక్‌ దర్సకత్వంలో చేసిన చిత్రం 'బద్రీనాథ్‌'. గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్రాన్ని జూన్‌ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఇంద్ర', ‘ఖడ్గం ', ‘మన్మదుడు' వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు వదులుకుంది. ఇటీవల కళ్యాన్ కంచి వారి యాడ్ లో అందరిని ఆకట్టుకుని తన అందాలలో తరుగుదల లేదని నిరూపించుకుంది. సోనాలి త్వరలో ఓ తెలుగు చిత్రంలో దర్శనమివ్వనుంది. 30-40 లక్షల పారితోషికం కావాలని సదరు నిర్మాతను కోరినట్టు టాలీవుడ్‌ సమాచారం !


'మెగాస్టార్' కన్నా... విజయకాంత్ ఎంతో మిన్న
సినిమాల ద్వారా వచ్చే పాపులారిటీని ఉపయోగించి రాజకీయాల్లోకి రావాలనుకోవడం.... పదవుల అందలాలు ఎక్కాలనుకోవడం సినిమా తారల్లో ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ లా తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకొచ్చి ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్న'మెగా స్టార్ ' చిరంజీవి బొక్కబోర్ల పడ్డారు. అదే తమిళనాడులో రాజకీయాల్లోకి వచ్చిన విజయకాంత్ కూడా మొదట చేదు అనుభవాన్నే చవి చూసారు. అయితే పట్టువదలకుండా కొనసాగుతూ .... ఇటీవల జరిగిన ఎన్నికల్లో 29స్థానాల్లో గెలిచి, ఇప్పుడు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని సంపాయించారు. ఇక్కడ మన మెగాస్టార్ మాత్రం తట్ట బుట్ట సర్దుకుని, పార్టీ ని కాంగ్రెస్స్ కి అమ్మేసి ... వారు ఇచ్చే బిక్ష కోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తున్నారు.

ప్రయోగాల పేరిట పాడుచేసుకోనంటున్న కాజల్
మీరు ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించొచ్చు కదా...? అని కాజల్ అగర్వాల్‌ని అడిగితే- ‘‘ప్రయోగాలు చేయడం నటీనటులకు మంచిదే, నిర్మాతలకు కాదు. అవి బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువ. నిర్మాత క్షేమాన్ని కోరుకోవడం నటిగా నా బాధ్యత. అనవసరంగా ప్రయోగాల జోలికి పోయి నిర్మాతలకు నష్టాన్ని తీసుకురాలేను. అందుకే ప్రయోగాలు చేయను. అంతేకాదు... ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్న స్టార్ డమ్ నా ఎన్నో ఏళ్ల కల. ఈ స్థాయికి వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి పొజిషన్‌ని ప్రయోగాల పేరిట పాడు చేసుకోవడం నాకిష్టం లేదు’’ అని తేల్చి చెప్పేశారు.

ప్రత్యేకంగా ఎదగాలంటే... కొన్ని కావాలంటున్న బాలచందర్
రజనీకాంత్, కమల్ హసన్, సచిన్ టెండూల్కర్... ఇలా ఎవరైనా గాని, అందరికంటే ప్రత్యేకంగా ఎదగాలంటే కొన్ని లక్షణాలు అవసరం - అని అంటున్నారు కె.బాలచందర్. నువ్వు ఏపని మొదలు పెట్టినా 'ఎవడ్రా వీడు' అనే విధంగా ఆరంభంలోనే అందరిని ఆకర్షించాలి. తరువాత 'వీడొక్కడే ఇలా చేయగలడు' అనుకునే విధంగా చెయ్యాలి. ఆ ఫై న 'ఇలాంటి వాడు ఉంటె చాలు' అనిపించుకోగాలగాలి. ఏ రంగంలోని వారికైనా విజయ రహస్యం ఇదే- అని ఆయన చెప్పారు.

దాసరి దర్శకత్వంలో 'వెంకటేశ్వరస్వామి'
ఇప్పుడు టాలీవుడ్‌లో భక్తిరస కథా చిత్రాల ఒరవడి కొనసాగుతోంది. ప్రముఖ దర్శకులంతా ఈ కోవలో సినిమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కూడా ఇప్పుడు ఈ తరహా చిత్ర నిర్మాణానికి ఉపక్రమిస్తున్నారు. ఈ విషయాన్ని దాసరి మీడియాకు తెలియజేశారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ చిత్రాల రచయిత జె.కె.భారవి రాసిన 'వెంకటేశ్వరస్వామి' కథను దాసరి తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు టాలీవుడ్‌ టాక్‌ ! ఎన్నో కమర్షియల్‌ సినిమాలను తనదైన స్టైల్లో తీసిన దాసరి, ఈసారి చూపనున్న భక్తిరసం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి !

తల్లి కాబోతున్న శిల్పశెట్టి
శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రా దంపతులు ఐపిఎల్‌లో రాజస్తాన్‌ టీం విజయాలతో ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాల వివాహం జరిగింది. ఈ జంటకు ఇంతకంటే ఆనందం మరొకటి ఉంది. అదేంటంటే ప్రస్తుతం శిల్పాశెట్టి గర్భంతో ఉండడం. ఈ నేపథ్యంలో మాతృత్వపు మధురిమల కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని శిల్పా పేర్కొంది. యుకెలో జరిగిన 'బిగ్‌ బ్రదర్‌' రియాల్టీ షో విజయంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శిల్పా తన వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. వివాహానంతరం ఈ జంట ఐపిఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టీంను కొనుగోలుచేసింది. ఈసారి కూడా ఐపిఎల్‌ కప్‌ను తమ టీం చేజిక్కించుకోవాలని ఆమె కోరుకుంటోంది.


రాంచరణ్ తో తమన్నా... మహేష్ బాబుతో కాజల్
'ఆరంజి' ప్రభావంతో రామ్ చరణ్ ధరణితో చెయ్యాలనుకున్న'మెరుపు'ను పక్కన పెట్టి, ఇప్పుడు'రచ్చ' చేస్తున్నాడు. 22నుండి ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి 'ఏమైంది ఈ వేళ' దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారు. ఇందులో తమన్నాను నాయికగా ఎంపిక చేసారు. ఈచిత్రం కోసం రాంచరణ్ ఈ మధ్య అమెరికాలో యుద్ధ విద్యలు అధ్యయనం చేసి వచ్చారు.
పూరి జగన్నాద్ దర్శకత్వం లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న'ది బిజినెస్ మాన్' చిత్రంలో మహేష్ సరసన కాజల్ నాయికగా ఎంపికయ్యింది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో ప్రారంభమవుతుంది.

తెలుగు లో రామానాయుడు నిర్మిస్తున్న 'త్రీ ఇడియట్స్‌'
ఆ మధ్య బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సినిమా 'త్రీ ఇడియట్స్‌'. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో శంకర్‌ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పుడీ పాపులర్‌ టైటిల్‌తో ఓ తెలుగు సినిమా రాబోతోంది. అయితే తీయబోయే తెలుగు సినిమాకు, హిందీలో వచ్చిన 'త్రీ ఇడియట్స్‌'కు ఏమాత్రం సంబంధం లేదు. వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌పతాకం ఫై రామానాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నవదీప్‌, రాహుల్‌, శ్రీనివాస్‌ అవసరాల హీరోలుగా చేయనున్నారు. శ్రద్ధాదాస్‌, సంజన, సౌమ్య కథానాయికలుగా నటిస్తున్నారు. శివాజీ -రీమా సేన్ ఇందులో జంటగా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోటీ సంగీతాన్ని అందిస్తారు.

సునీల్ -ఛార్మి'తను వెడ్స్ మను'... మళ్లీ 'గమ్యం' కాంబినేషన్లో...
హాస్య నటుడు సునీల్‌ హీరోగా గణేష్‌ ఇందుకూరి ఓ చిత్రాన్ని తీయబోతున్నారు. ఇటీవల హిందీలో వచ్చిన 'తను వెడ్స్‌ మను' ఆధారంగా ఇది రూపొందనుందని, చార్మి హీరోయిన్‌గా నటంచనుందని టాలీవుడ్‌ సమాచారం.
అల్లరి నరేష్‌, శర్వానంద్‌ కాంబినేషన్లో ఆమధ్య జాగర్లమూడి రాధాకృష్ణ తీసిన 'గమ్యం' మంచి విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. మళ్లీ ఇప్పుడు అల్లరి నరేష్‌, శర్వానంద్‌ హీరోలుగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నరేష్‌ మీడియాకు చెప్పారు. 'గమ్యం'లానే ఇది కూడా వైవిధ్యమంతో కూడిన సబ్జెక్టు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు.

రజనితో అవకాశం వస్తుందని కలలోనైనా అనుకోలేదు
సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీతో నటించడం ఎలా ఉందిఅని బాలీవుడ్ బ్యూటి దీపికను అడిగితే- "రాణా'లో నటించాలని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ వచ్చి అడగ్గానే మరో మాట మాట్లాడకుండానే ఒప్పుకున్నా. అంతకు ముందు రజనీకాంత్ నటించిన 'రోబో' సినిమా చూశా. అందులో ఆయన ఎంత ఎనర్జిటిక్‌గా నటించారో సిల్వర్ స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది. అందుకే 'రాణా'లో అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తుందని కలలోనైనా అనుకోలేదు' అంటోంది దీపికా పదుకొనే .