| |
అక్కినేనితో సహా సినిమావారికి ‘పద్మ’ పురస్కారాలు
కేంద్రప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. అక్కినేని నాగేశ్వరరావుకు
పద్మవిభూషణ్, గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వహిదారహ్మాన్, శశికపూర్, సంగీత
దర్శకుడు ఖయ్యూంకు పద్మభూషణ్, టబు, కాజోల్, ఇర్ఫాన్ ఖాన్, కన్నడ దర్శకుడు గిరీష్
కాసరవెల్లి, గాయని ఉషా ఉతప్, తమిళ సినీ ప్రముఖుడు జయరాం సుబ్రమణ్యంలకు పద్మశ్రీ
పురస్కారాలు లభించాయి.
|
రవితేజ 'నిప్పు'... ఇబ్బందుల్లో రాంచరణ్ 'మెరుపు'
'మిరపకాయ' హిట్ తో ఆనందంగా ఉన్న రవితేజ కాజల్ తో 'వీర' చేస్తున్నాడు.
ఫిబ్రవరిలో రాంగోపాల్ వర్మ 'దొంగల ముటా' చేస్తున్నాడు. దాని తర్వాత గుణశేఖర్ దర్సకత్వంలో
'నిప్పు'లో నటిస్తున్నాడు. దీన్ని ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి నిర్మించడం విశేషం.
ధరణి దర్సకత్వంలో రాంచరణ్ 'మెరుపు'లో చేస్తున్న విషయం తెలిసిందే. ఫుట్ బాల్
ఆట నేపధ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో ఇటీవల చాలా మార్పులు చోటు
చేసుకున్నాయి. స్క్రిప్ట్ పట్ల సంతృప్తిగా ఉన్నప్పటికీ ఈచిత్రం భారీ బడ్జెట్ విషయంలో మాత్రం
చిరంజీవి సంతోషంగా లేరట. బడ్జెట్ తగ్గించకపోతే ఈ సినిమానే కాన్సిల్ చేస్తానని చెప్పారట. |
నాగచైతన్యతో రామానాయుడు... సుమంత్ అశ్విన్ తో ఎంఎస్ రాజు
ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు నాగచైతన్యతో ఓ భారీ చిత్ర నిర్మాణం
చేస్తున్నారు. సుకుమార్, అజయ్ భుయాన్ ల దర్సకత్వంలో ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్న
నాగచైతన్య వాటి తర్వాత రాంగోపాల్ వర్మ 'బెజవాడ రౌడీలు' చేసే అవకాశం ఉంది .
భారీ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం
చేస్తున్నారు. దానికి మొదట ఆదిత్యని దర్శకుడిగా పెట్టాలనుకున్నారు. అయితే ఇప్పుడు రాజు
తనే దర్సకత్వం చేయాలనుకుంటున్నారట. మహాబలేశ్వర్ లో త్వరలో ఈ చిత్రం షూటింగ్
ప్రారంభం అవుతుంది. |
ఫిబ్రవరిలో సూర్య 'రాస్కెల్స్'... సిద్ధూ 'ఓ మై ఫ్రెండ్' ప్రారంభం
'త్రీ ఇడేయేట్స్' ఆధారంగా శంకర్ దర్శకత్వంలో తీస్తున్న 'రాస్కెల్స్' ఫిబ్రవరిలో
జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభం అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించే ఈచిత్రంలో సూర్య
హీరోగా, ఇలియానా హీరోయిన్ గా చేస్తున్నారు. ప్రిన్సిపాల్ గా సత్యరాజ్ నటిస్తారు. హరీస్
జయరాజ్ సంగీతాన్ని అందిస్తారు.
సిద్దార్ధ హీరోగా దిల్ రాజు నిర్మించే చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. వేణు శ్రీరాం
దర్సకత్వం వహించే ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' అని పేరు పెడుతున్నారు. 'అతిధి' అమృత రావు
ఇందులో హీరోయిన్. |
ముదురుతున్న 'జై బోలో తెలంగాణ' సెన్సార్ వివాదం
ప్రత్యేక తెలంగాణా కోరుతూ శంకర్ దర్శకత్వంలో నిర్మించిన ఉద్యమ చిత్రం 'జై బోలో
తెలంగాణ' సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాల పట్ల సెన్సార్
వారు కఠినంగా వ్యవహరించడంతో ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సజావుగా
విడుదలకు అనుమతించకపోతే సీమాంధ్ర చిత్రాలను తెలంగాణలో ప్రదర్శించకుండా
అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమ కారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల సినిమా ప్రదర్సనను
అడ్డుకుంటున్నారు కూడా. త్వరగా ఈ సమస్యను పరిష్కరించకపోతే పరిశ్రమ ఆర్ధికంగా
ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.
|
------------------------------------------------------ |
‘బెజవాడ రౌడీ’ నాగచైతన్య... ‘బాడీగార్డ్’ గోపీచంద్?
రౌడీయిజానికి అర్థం చెప్పిన బెజవాడ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘బెజవాడ
రౌడీలు’ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇందులో హీరో పాత్రను నాగచైతన్య పోషిస్తారని
అంటున్నారు. ‘శివ’ చిత్రానికి స్ఫూర్తి అయిన బెజవాడ కాలేజి వాతావరణంతో ఈ చిత్రం కూడా
నాగచైతన్యకు ‘శివ’ అంత హిట్ ఇస్తుందని అభిమానుల ఆశ.
మలయాళ హిట్ ‘బాడీ గార్డ్’ను ‘కావలన్’ పేరుతో తమిళంలో నిర్మించారు. దాని ఆధారంగా
బెల్లం కొండ సురేష్ తెలుగులో నిర్మించే చిత్రంలో గోపీచంద్ హీరోగా ఎంపికయ్యారని
వార్తలొస్తున్నాయి. మలయాళ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్థిక్ తెలుగు విర్షన్ కి
కూడా దర్శకత్వం చేస్తారని అంటున్నారు.
|
దాసరి, కోడి రామకృష్ణలతో విజయశాంతి
‘ఒసే రాములయ్య’ కాంబినేషన్ దాసరి నారాయణరావు దర్శకత్వలో విజయశాంతి త్వరలో ఓ
చిత్రం చేస్తోంది. అలాగే గతంలో పలు విజయవంతమైన చిత్రాలను తనకు అందించిన
కోడిరామకృష్ణ దర్శకత్వంలో కూడా విజయశాంతి మరో చిత్రం ప్రారంభిస్తున్నారు. దాసరి చిత్రం
తెలంగాణ నేపధ్యంలో, కోడిరామకృష్ణ చిత్రం నేటి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తూ
ఉంటాయని తెలుస్తోంది. |
వర్మ ‘దొంగల ముఠా’ మార్చి 4న విడుదల
అయిదు రోజుల్లో ప్రయోగాత్మకంగా రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘దొంగల ముఠా’ ప్రారంభమైన
23 రోజుల్లోనే విడుదలై కొత్త రికార్డ్ సృష్టించబోతోంది. రవితేజ, ఛార్మి, ప్రకాష్ రాజ్,
బ్రహ్మానందం, లక్ష్మీ ప్రసన్న, సుబ్బరాజు, అజయ్ నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రారంభమై
13తో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. దర్శకుడితో సహా కేవలం అయిదుగురే సాంకేతిక
నిపుణులతో కేనాన్ 5డి కెమేరాతో ఈ చిత్రం నిర్మిస్తారు. మార్చి 4న ఈ చిత్రం
విడుదలవుతుంది. |
నటకుటుంబంతో తెలుగులో ‘యమ్ల పగ్లా దీవానా’
ధర్మేంద్ర అతని కుమారులు సన్నీడియోల్, బాబీ డియోల్ కలిసి నటించిన ‘యమ్ల పగ్లా
దీవానా’ చిత్రం విజయవంతమైంది. నట కుటుంబం అంతా కలిసి చేసేందుకు అనువుగా ఉండే
ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించడానికి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో అక్కినేని
కుటుంబం లేదా నందమూరి కుటుంబం నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. |
కోటి దర్శకత్వంలో ‘నెపోలియన్’గా సునీల్
‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’లతో విజయాలను అందుకున్న హాస్య నటుడు
సునీల్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా నేపథ్యంల్ నిర్మిస్తున్న సంచలన చిత్రం
‘అప్పలరాజు’లో నటిస్తున్నారు. సునీల్ హీరోగా ఫిబ్రవరి నుండి మరో చిత్రం ప్రారంభం
అవుతుంది. రాజమౌళి అసోసియేట్ కోటి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ‘మిస్ ఫెమీనా’
జనాల్ పాండ్య హీరోయిన్ గా నటిస్తుంది.
|
------------------------------------------------------ |
ఫోటో జర్నలిస్ట్ సతీష్ ఆకస్మిక మృతి!
రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా జర్నలిజంలో ఫోటో గ్రాఫర్ గా ఉదయం, శివరంజని,
మేఘసందేశం, నెంబర్ వన్, సినీస్టార్ మొదలైన పత్రికల్లో పని చేసిన సతీష్ (షఫీ) బందరులో
18న ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. పత్రికా రంగంలోనూ, చిత్ర పరిశ్రమలోనూ
స్నేహశీలిగా మంచి పేరు సంపాయించుకున్న సతీష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సతీష్
మృతికి అంతా తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
|
చిరంజీవి ‘అధినాయకుడు’ దర్శకుడు వినాయక్
చిరంజీవి 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా చేయాలనుకుంటున్న ‘అధినాయకుడు’ దర్శకుడిగా
వినాయక్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి - వినాయక్ ల కాంబినేషన్ లో
‘స్టాలిన్’ వచ్చింది. ప్రస్తుతం వినాయక్ అల్లు అర్జున్ తో ‘బద్రీనాథ్’ చేస్తున్నారు. ఈ చిత్రం రషెస్
చూసిన చిరంజీవి తన చిత్రానికి వినాయక్ ని దర్శకుడిగా ఫైనలైజ్ చేసారని చెబుతున్నారు. |
బాలకృష్ణ ‘బాడీ గార్డ్’... ‘రాణి రుద్రమ’ అనూష్క
మలయాళంలో నయనతార, పృధ్వీ రాజ్ ల సూపర్ హిట్ చిత్రం ‘బాడీ గార్డ్’ని తమిళంలో
విజయ్ అసిన్ తో ‘కావలన్’ పేరుతో చేసారు. ఇప్పుడు దాని తెలుగు హక్కులు బెల్లంకొండ
సురేష్ కొన్నారు. ఇందులో హీరోగా వెంకటేష్ పేరు వినిపించినా, ఇప్పుడు బాలకృష్ణతో చేస్తారని
వార్తలొస్తున్నారు.
విజయశాంతితో భారీ స్థాయిలో ‘రాణి రుద్రమ దేవి’ చిత్రం వస్తోందని ఆ మధ్య చెప్పుకున్నారు.
ఇప్పటి వార్తల ప్రకారం ఆ కథతో గుణశేఖర్ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాడని, పెద్ద బడ్జెట్ తో నిర్మించే
ఈ చిత్రంలో అనూష్క నాయికగా చేస్తుందని తెలుస్తోంది. |
స్వామి నిత్యానందపై రంజిత స్వంత చిత్రం
శృంగార కార్యకలాపాలకు పేరు బడ్డ స్వామి నిత్యానందపై తెలుగులో రాంజేద్ర ప్రసాద్ తో
‘అయ్యారే’, కన్నడలో ‘సత్యానంద’ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. నిత్యానంద
సన్నిహితురాలిగా వీడియో క్లిప్పింగ్స్ లో కనిపించిన నటి రంజిత తన నిర్దోషిత్వాన్ని
నిరూపించుకోవడానికి అతనిపై సినిమా తీయాలనుకుంటోందట. మీడియాలో తనపై వచ్చిన
ఆరోపణలకి తగిన సమాధానం ఇవ్వడానికి చిత్ర నిర్మాణమే మార్గమని అనుకుంటోందట. పైగా
నిత్యానందపై సినిమా అంటే వ్యాపారపరంగా కూడా లాభదాయకం అవుతుందని ఆమె
సన్నిహితులు సలహా ఇచ్చారట. |
విమర్శల్ని , పొగడ్తల్ని పట్టించుకోని సల్మాన్
సినిమా రంగంలో విమర్శల్ని, పొగడ్తల్ని పట్టించుకోవడం అంటే సమయం వృధా చేస్తున్నట్లే.
సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ నిర్మాణ సమయంలోను, పూర్తయిన తర్వాత అంతా
విమర్శించిన వాళ్ళే. ‘పల్లెటూరి సినిమా’ తీసిన దర్శక నిర్మాతలకి తెలివి లేదని అన్నారు.
కొనడానికి కూడా ముందుకు రాలేదు. సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత అంతా ఒకటే పొగడ్తలు
- అంటూ సినిమా వాళ్ళ నైజాన్ని చెబుతున్నారు సల్మాన్.
|
------------------------------------------------------ |
ప్రేమికుల రోజు కానుక ఆది, ఇషాల ‘ప్రేమ కావాలి’
మ్యాక్స్ ఇండియా పతాకంపై కె.విజయభాస్కర్ దర్శక్వంలో కె.అచ్చిరెడ్డి నిర్మించిన ‘ప్రేమ
కావాలి’ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరిలో విడుదలవుతోంది. సాయికుమార్ కుమారుడు ఆది,
ఇషా చావ్లా జంటగా నటించిన ఈ చిత్రానికి వీనులవిందైన పాటలు అందించారని, ఛోటా కె
నాయుడు కనుల పండువగా చిత్రీకరించారని, విజయభాస్కర్ ప్రేమ కథల విషయంలో తన
కున్న ప్రతిభను మరో సారి ఈ చిత్రం చాటి చెప్పారని - కె. అచ్చిరెడ్డి అన్నారు.
|
బాలయ్య మూడు పాత్రల చిత్రం రెండవ షెడ్యూల్
పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం రెండవ
షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. బాలకృష్ణ మూడు పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం
అతని బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా ఉంటుందని, వైజాగ్ లో నెల రోజుల షూటింగ్ చేస్తామని -
కుమార్ చౌదరి చెప్పారు. తొలి షెడ్యూల్ లో రామ్ లక్ష్మణ్ ల నేతృత్వంలో ఫైట్స్ చిత్రీకరించమని
తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం కళ్యాణీ మాలిక్. ఫోటో గ్రఫీ విజయ కుమార్ సి, ఎడిటింగ్ :
కోటగిరి. |
‘దొంగల ముఠా’లో లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం
రామ్ గోపాల్ వర్మ ప్రయోగాత్మకంగా 5 రోజుల్లో నిర్మిస్తున్న ‘దొంగల ముఠా’లో రవితేజ, ఛార్మితో
పాటు లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అజయ్ నటిస్తున్నారు. డిజిటల్
టెక్నాలజీతో కేవలం 8 మంది టెక్పీషియన్స్ తో ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఈ
చిత్రానికి ఓ ప్రముఖ దర్శకుడు కో-డైరెక్టర్ గా పనిచేసే అవకాశం ఉంది. డబ్బు కన్నా తెలివితేటలే
చిత్ర నిర్మాణానికి ప్రధానమని నిరూపించేందుకు వర్మ ఈ చిత్రం చేస్తున్నారు. |
అవార్డులంటే గౌరవం పోతోందంటున్న కరీనా
రాను రాను అవార్డులు విశ్వసనీయత కోల్పోతున్నాయి. అవార్డ్ రావాలంటే లాబీయింగ్
తప్పనిసరి అయిపోయింది. ఈ మాట నాకు అవార్డ్ రాలేదని అక్కసుతో చెప్పడం లేదు,
ఆవేదనతో చెబుతున్నాను. అవార్డు వచ్చినవారిని ఆరాధనతో కాకుండా అనుమానంగా చూసే
రోజులొచ్చాయి. ఈ పరిణామం ఎవరికీ మంచిది కాదు - అని అవార్డుల పట్ల తన అభిప్రాయాన్ని
సూటిగా చెబుతోంది కరీనా కపూర్. |
ఫిబ్రవరి 4న ‘అప్పలరాజు’... బాలీవుడ్ కి సల్మా హయక్
సునీల్, సాక్షి, స్వాతి ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం
= అప్పలరాజు’ ఫిబ్రవరి 4న విడుదలవుతోంది. సినిమారంగంపై సెటైరికల్ గా రూపొందించిన ఈ
చిత్రాన్ని కోనేరు కిరణ్ కుమార్ నిర్మించారు.
ప్రముఖ హాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ సల్మా హయక్ బాలీవుడ్ లో ఓ చిత్రం చేస్తోంది. బాలీవుడ్
లో విలన్ పాత్రలకి పేరెన్నిక అయిన గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ది డ్రైవర్’ అనే
హిందీ చిత్రంలో ఈ స్పానిష్ నటి సల్మా హయక్ నటిస్తోంది. |
------------------------------------------------------ |
సంక్రాంతి సినిమాల్లో మళ్ళీ బయటపడ్డ డొల్లతనం
గత సంవత్సరం మనకు మిగిల్చినచేదు అనుభవాలు ఇంకా మర్చిపోనేలేదు. ఈఏడాది
సంక్రాంతికి ఎన్నో అంచనాలతో ఎదురుచూసిన భారీ చిత్రాలు కూడా తీవ్ర నిరాశ పరిచాయి. ఆడంబరాలు... హడావుడి తప్ప విషయంలేని డొల్లతనం మరోసారి బయటపడింది. బాలకృష్ణ తొలి కాంబినేషన్లో దాసరి దర్శకత్వం వహించిన 150వ చిత్రం ‘పరమవీరచక్ర’ పాతికేళ్ళనాటి సినిమా చూసిన అనుభూతినిచ్చింది. రవితేజ ‘మిరపకాయ్’ మరోసారి అతని పాత చిత్రాలు చూసినట్లనిపించింది. ‘అనగనగా ఓ ధీరుడు’ గ్రాఫిక్స్ పటాటోపమే తప్ప కథాబలం లేక చతికిలపడింది.
|
విజయశాంతి నాయికగా దాసరి చిత్రం
తన 150వ చిత్రంగా ఇటీవల ‘పరమవీరచక్ర’ అందించిన దాసరి నారాయణరావు త్వరలోనే 151వ చిత్రం ప్రారంబించే ప్రయత్నంలో వున్నారు. సంచలన విజయం సాధించిన ‘ఒసేయ్ రాములమ్మ’ కాంబినేషన్లో విజయశాంతిని నాయికగా పెట్టి దాసరి తన బ్యానర్ పై మరో భారీ చిత్రం చేయబోతున్నారు. |
ఉపేంద్ర కొత్త ప్రయోగం ‘సూపర్’
భిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు అయిన కన్నడ హీరో ఉపేంద్ర ‘సూపర్’ అనే చిత్రంతో మరో ప్రయోగం చేసి విజయవంతం అయ్యారు. వివిధ జాఢ్యాలతో మగ్గిపోతున్న మన దేశం 2030 నాటికి పూర్తిగా మారిపోవాలని కలలుగనే ఎన్నారైగా ఉపేంద్ర ఇందులో నటించారు. 2030 నాటికి దేశం యువ రాజకీయవేత్తలతో కళకళలాడుతుంటే, ప్రపంచాన్ని శాసించేస్థాయికి మన రూపాలు ఎదుగుతుంటే ఆనందపడని భారతీయుడెవరుంటారు? ఈ గొప్ప ఊహని సమర్థవంతంగా చిత్రరూపాన్ని ఇచ్చిన ఉపేంద్రని అంతా అభినందిస్తున్నారు. నయనతార ఇందులో నాయికగా చేసింది. |
‘నేను నా రాక్షసి’ మార్చికి... రెబల్ స్టార్స్ తో ‘రెబల్’
‘లీడర్’ రానా హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మించిన ‘నేను నా రాక్షసి’ ఈ సంక్రాంతికి విడుదలకావాల్సింది. కారణాంతరాల వల్ల వేసవి సెలవులను దృష్టిలో వుంచుకుని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్ గా రానా నటిస్తున్న
ఈ చిత్రంలో ఇలియానా నాయికగా చేసింది.
‘బిల్లా’లో కలిసి నటించిన రెబల్ స్టార్స్ కృష్ణంరాజు, ప్రభాస్ ఇప్పుడు లారెన్స్ దర్శకత్వంలో ‘రెబల్’ చిత్రంలో నటిస్తున్నారు. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘బిల్లా’లో నటించిన అనూష్కనే హీరోయిన్ గా చేయడం విశేషం. |
విడాకులు తీసుకుని, తిరిగి వెండితెరపైకి కరిష్మా
సంజయ్ కపూర్ తో ఏడేళ్ళ అనుబంధాన్ని వదులుకోవాలని కరిష్మాకపూర్ నిర్ణయించుకుని ఢిల్లీ నుండి ముంబాయికి వచ్చేసింది. నటిగా తిరిగి వెండితెరపై కనిపించాలనుకుంటున్నఆమె ఇటీవల అందాల ఫొటోసెషన్ చేయించుకుంది. కొన్ని యాడ్ ఫిలింస్ కూడా కరిష్మా అంగీకరించింది. |
------------------------------------------------------ |
దీపిక స్పేహం ఎంత దాకా వెళ్తుందో?
దీపిక పదుకొనే ఇప్సుడు ‘కింగ్ ఫిషర్’ కింగ్ విజయ మాల్యా కొడుకు సిద్దార్థతో
చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. వారి స్నేహం గురించి దీపికను అడిగితే -
ప్రస్తుతానికి మా స్నేహం డేటింగ్ దాకా వచ్చింది. అక్కడి నుండి ఎంత దాకా వెళ్తుందో తెలియదు.
అతని స్నేహంలో గొప్ప అనుభూతి పొందుతున్నానని అంటోంది. ‘ఎంత దాకా?’ అనే మాటకి
‘పెళ్లిదాకా’ అని అర్థం అంటూ వివరించింది.
|
‘జిల్’ ఆల్బమ్ ను ప్రారంభించిన పూరిజగన్నాథ్
రాజాభూపతి రూపొందించిన ‘జిల్’ మ్యూజిక్ ఆల్బమ్ ను, వెబ్ సైట్ ను పూరి జగన్నాథ్
ప్రారంభించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ కూడా అభిరుచితో , ఎంతో క్వాలిటీతో ఈ ఆల్బమ్
చేసిన రాజా భూపతి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని పూరిజగన్నాథ్ అన్నారు. మిత్రుడు
ఇంద్రగంటి శ్రీనివాస్ తో కలిసి కొన్ని ట్యూన్స్ చేశాను. కౌబాయ్ పాటలన్నీ పరిశీలించి ఇందులో ఓ
మంచి కౌబాయ్ పాట చేశాను. చికాగోలో మిక్స్ చేశాను. త్వరలో కొన్ని పాటలకి వీడియో కూడా
చేస్తానని రాజా భూపతి చెప్పారు. |
ఫిబ్రవరి 4న ‘గగనం’... లైవ్ యాక్షన్ లో ‘ఈగ’
నాగార్జున - ప్రకాష్ రాజ్ హీరో విలన్లుగా రాధా మోహన్ దర్శకత్వంలో నటించిన ‘గగనం’ ఫిబ్రవరి
4న తెలుగు తమిళంలో విడుదలవుతుంది. సనాఖాన్ నటించిన ఈ చిత్రాన్ని తెలగులో దిల్
రాజు, తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మించారు.
రాజమౌళి దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్న ‘ఈగ’ యానిమేషన్ చిత్రమని జరుగుతున్న
ప్రచారంలో వాస్తవం లేదని, ఇది రెగ్యులర్ లైవ్ యాక్షన్ చిత్రమేనని రాజమౌళి చెప్పారు.
సందర్భాను సారం ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. నాని, సుదీప్, సమంత
ఇందులో నటీనటులు. |
గల్ఫ్ కార్మికుల నేపథ్యంలో ‘ఎవడేసిన బాటరా’
దక్కన్ హార్ట్స్ ఫౌండేషన్ సమర్పణలో యశ్ నాగ్ సంగీతం, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రశాంత్
మొతాదు రూపొందించిన ‘ఎవడేసిన బాటరా’ మ్యూజిక్ ఆల్బమ్ విడుదలయ్యింది. గల్ఫ్ లో
ఉద్యోగాల కోసం వెళ్ళి జైళ్ళల్లో మగ్గుతున్న వారిని వెనక్కి రప్పించే ప్రయత్నంలో భాగంగా దీన్ని
రూపొందించారు. రానా, వరుణ్ సందేశ్, వంశీ కృష్ణ, నానీ, హర్ష వర్థన్, మధుర శ్రీధర్ రెడ్డి,
నిశాంతి, అనీష్ కురువెల్ల, సాయికిరణ్ అడివి, శేష్ అడివి. భానుశ్రీ మెహ్రా, తషు కౌషిక్,
‘ప్రజారాజ్యం’ ఎమ్మెల్యే బండారు సత్యానంద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. |
డాన్స్ ఇన్సిట్యూట్ ను ప్రారంభిస్తానంటున్న శ్రియ
నా ఫిజిక్ వెనకున్న నిజమైన రహస్యం స్విమ్మింగ్, డాన్సింగ్. త్వరలో ఓ ఫిట్ నెస్ స్టూడియోను,
డాన్స్ ఇన్సిట్యూట్ ను నెలకొల్పాలనుకుంటున్నాను. నేను శాస్త్రీయ నృత్యకారిణిని కూడా.
అందుకే నా కళను నాలోనే దాచుకోకుండా - త్వరలో దేశ విదేశాల్లో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు
ఇవ్వాలనుకుంటున్నాను - అంటూ చెబుతోంది అందాల నటి శ్రియ. |
------------------------------------------------------ |
అతిపెద్ద బడ్జెట్ తో త్వరలో రజనీ ‘హర’
‘రోబో’తో సంచలన విజయం స్వంతం చేసుకున్న రజనీకాంత్ నటిస్తున్న ‘హర’ 3డి
యానిమేషన్ చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. రజనీకాంత్ కుమార్తె సౌదర్య
స్వీయదర్శకత్వంలో ఈ చిత్రం ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దేశంలోనే అతి పెద్ద
బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యానిమేషన్ తో పాటు ఇందులో అరగంట పాటు రెగ్యులర్ సినిమా
కూడా ఉంటుంది. దానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెహమాన్ సంగీతాన్ని
అందిస్తున్న ఈ చిత్రంలో విజయలక్ష్మి, ప్రకాష్ రాజ్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రలు
పోషిస్తున్నారు.
|
ఎన్టీఆర్ - బోయపాటి శ్రీనుల ‘గర్జన’
‘సింహా’ వంటి సూపర్ హిట్ ను అందించిన బోయపాటి శ్రీను ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ చిత్రం
చేస్తున్నారు. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేస్తోంది. దీనికి
‘గర్జన’ అని పేరు పెట్టాలనుకుంటున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. |
‘ఆటో నగర్ సూర్య’ పవన్... ‘మెరుపు’లో మార్పులు
విజయవాడ రౌడీయిజంపై ‘ప్రస్థానం’ దర్శకుడు దేవ్ కట్టా త్వరలో ‘ఆటో నగర్ సూర్య’ అనే
చిత్రం చేస్తున్నారు. రానా హీరోగా చేస్తారని, బాలయ్య చేస్తున్నారని ఇంతకు ముందు
వార్తలొచ్చినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తారని తెలుస్తోంది.
‘ఆరెంజ్’ పెద్ద ఫ్లాప్ కావడంతో రామ్ చరణ్ తన రాబోయ్ చిత్రం ‘మెరుపు’ విషయంలో చాలా
జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. గతంలో ఈ చిత్రం కోసం అనుకున్న స్క్రిప్టును ఇప్పుడు
సమూలంగా సరిదిద్దే పనిలో పడ్డారట దర్శకుడు ధరణి. ఇందులో హీరోయిన్ గా కాజల్
చేస్తుందని అనుకున్నా, సమ్మె కారణంగా కాల్షీట్స్ సమస్య ఏర్పడటంతో ఇప్పుడు వేరే హీరోయిన్
కోసం అన్వేషిస్తున్నారు. |
పైరసీలోనూ రికార్డ్ సృష్టించిన ‘అవతార్’
హాలీవుడ్ చిత్రం ‘అవతార్‘ ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు
నెలకొల్పింది. ఈ చిత్రం పైరసీలోనూ ప్రపంచ రికార్డు నెల కొల్పడం విశేషం. ఈ చిత్రాన్ని ఇప్పటి
వరకూ కోటి అరవై అయిదు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట నెటలో. ఇది కాక సిడిల
రూపంలో ఇంకెంత పైరసీ జరిగుంటుందో ఊహించండి. |
‘మిస్టర్ పర్ ఫెక్ట్’ కథ కోసం రెండేళ్ళ కష్టం
మామూలుగా అనుకున్న ఓ పాయిట్ ను డవలప్ చేసి ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’ చిత్రం కథగా
రూపొందించడానికి రెండేళ్ళు పట్టిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇందులో ప్రభాస్ కొత్తగా
ఉంటాడు, ప్రేక్షకులను అబ్బుర పరుస్తాడని దిల్ రాజు అంటున్నారు. కాజల్, తాప్సి నాయికలుగా
నటించిన ఈ చిత్రంలో కె.విశ్వనాధ్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రధారులు ఫిబ్రవరిలో ఈ చిత్రం
ప్రేక్షకుల ముందుకొస్తుంది. |
------------------------------------------------------ |
నాగార్జున ‘రగడ’ వసూళ్ళ రికార్డులు
వీరు పోట్ల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన ‘రగడ’ మాస్ హిట్ అయ్యింది. ఈ చిత్రం
13 రోజుల్లో 19 కోట్ల 17 లక్షల షేర్ వసూలు చేసి కామాక్షి సంస్థ రజతోత్సవ సంవత్సరంలో
ఘన విజయాన్ని అందించిందని నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి చెప్పారు. నాగార్జున చిత్రాలన్నింటిలో
ఈ చిత్రం వసూళ్ళలో నంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. నైజాంలో ఈ చిత్రం 13 రోజులకు 5
కోట్ల 13 లక్షలు, గుంటూరులో కోటి 10 లక్షలు షేర్ వసూలు చేసి రికార్డ్ నెలకొల్పిందని
సహనిర్మాత చందన్ రెడ్డి చెప్పారు.
|
త్వరలో నాలుగు తరాలు ‘నాగవంశ’ చిత్రం
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ నటించే చిత్రానికి కృష్ణవంశీ మంచి కథ
తయారు చేశారు. అది అక్కినేనికి, నాగార్జునకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయమన్నారు.
ఇప్పుడు స్క్రిప్టు సంతృప్తి కరంగా రెడీ అయ్యిందని, త్వరలో తమ తేజ సినిమా బ్యానర్ పై భారీ
స్థాయిలో ప్రారంభిస్తామని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు. |
బాలయ్యతో లక్ష్మీరాయ్... రవితేజతో కాజల్
పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కుమారచౌదరి చిత్రం నిర్మిస్తున్న విషయం
తెలిసిందే. ఇందులో బాలకృష్ణ మూడు తరాలకు చెందిన మూడు పాత్రలు పోషిస్తున్నారు. అతని
సరసన భూమికతో పాటు లక్ష్మీరాయ్ నాయికగా నటిస్తోంది.
సమ్మెకారణంగా పలువురు నటీనటుల డేట్స్ గదరగోళంలో పడ్డాయి. రామ్ చరణ్ ‘మెరుపు’లో
నటిస్తున్న కాజల్ అందులోంచి తప్పుకోవాల్సి వచ్చింది. రవితేజ ‘వీర’ నుండి అనూష్క కూడా
నిష్క్రమించింది. ఇప్పుడు అనూష్క స్థానంలో కాజల్ రవితేజ సరసన చేస్తోంది. |
17 నుండి తిరిగి ప్రారంభమవుతున్న షూటింగ్స్
ఇటీవల ఫైటర్స్ గొడవతో ప్రారంభమై నిరవధికంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్ లు నెల
రోజుల తర్వాత, ఈ నెల 17 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. సినిమా వర్కర్ల వేతన సవరణ
అంశంతో పాటు, చిత్ర నిర్మాణంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న దుబారా ఖర్చును
నియంత్రించడంపై క్షుణ్ణంగా చర్చించి కొన్ని మార్గ దర్శకాలు రూపొందించారు. దీని ప్రకారం
పనిచేయడమే ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలకి పరిష్కారంగా
భావిస్తున్నారు. |
రాజబాబు విగ్రహావిష్కరణ... 75 మందికి సన్మానం
ప్రముఖ హాస్యనటుడు రాజబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో అతని
కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న
భారీ స్థాయిలో జరుగుతుంది. తెలుగులో చిత్ర పరిశ్రమలోని 75 మంది ప్రముఖ హాస్య
నటీనటులను ఈ సందర్భంగా సత్కరిస్తారు. |
------------------------------------------------------ |
చిరంజీవి సినిమా నిరవధిక వాయిదా
రాజకీయాల్లోకి వచ్చినా సినిమా సరదా తీరని చిరంజీవి తన 150వ చిత్రం పేరుతో కొడుకు రామ్
చరణ్ నిర్మాతగా ‘అధినాయకుడు’ అనే చిత్రాన్ని ఈ ఫిబ్రవరిలో ప్రారంభించాలనుకున్నారు.
అందుకోసం ఈ మద్య అమెరికా వెళ్ళి సన్నబడ్డ చిరంజీవి డాన్స్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు.
అయితే, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ పరిస్థితి సుడిగుండంలో నావలా మారిపోయింది. ఈ
పరిస్థితుల్లో ముఖానికి మేకప్ వేసుకుంటే జనం ‘జై’ కొట్టడం కన్నా ‘ఛీ’ కొట్టే అవకాశాలే
ఎక్కువ కనిపించడంతో చిరంజీవి తన సినిమాని నిరవధికంగా వాయిదా వేసుకున్నారు.
|
విరామ గీతం పాడుతున్న రెహమాన్
ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ నిరవధికంగా సంగీత ప్రపంచంలో శ్రమిస్తుండటంతో - కాస్త
విరామం తీసుకోవాలనే కోరిక కలిగింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘రాక్ స్టార్’కి సంగీతం
అందిస్తున్నాను. ఇంతియాజ్ అలీ దీనికి దర్శకుడు. వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుంది. దీని
తర్వాత నేను కొంతకాలం విరామం తీసుకుంటానంటూ రెహమాన్ ప్రకటించారు. ఈ వార్త
రెహమాన్ కుటుంబాన్ని సంతోష పెడుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. |
‘సావిత్రి’లో వికలాంగుడిగా వెంకటేష్?
హృతిక్ రోషన్ ‘గుజారిష్’లో చేసిన వికలాంగుడి పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. అదే
తరహాలో ‘సావిత్రి’లో వెంకటేష్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. యాక్సిడెంట్ లో రెండుకాళ్ళు
చచ్చుబడిన వ్యక్తిగా వెంకటేష్ ఇందులో నటిస్తారట. త్రిష నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తేజ
దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. |
ఒంగోలు ఉమెన్స్ కాలేజిలో ‘ఫిల్మ్ క్లబ్’ ప్రారంభం
ఒంగోలు ప్రభుత్వం మహిళా కళాశాలలో ‘క్యాంపస్ ఫిల్మ్ క్లబ్’ను వారాల ఆనంద్ ప్రారంభించారు.
‘ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఇండియా’ కార్యదర్శి అయిన వారాల ఆనంద్ ఈ సందర్భంగా -
సినిమా రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను వివరిస్తూ, అంతర్జాతీయ సినిమాపై పవర్
పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సుశీలమ్మ, డా. సుథాకర్
పాల్గొన్నారు. |
మంచి స్క్రిప్టే స్టార్ - అంటున్న ప్రకాష్ రాజ్
జాతీయ స్థాయి అవార్డు అందుకున్న నటుడు ప్రకాష్ రాజ్ పలు చిత్రాలు నిర్మించారు.
‘ఆకాశమంత’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కన్నడలో చేసి ప్రశంసలందుకున్నారు. త్వరలో
రానున్న ‘గగనం’ తమిళ వెర్షన్ కి నిర్మాత అయిన ప్రకాష్ రాజ్ మంచి స్క్రిప్టే స్టార్ - అని
అంటున్నారు. మంచి స్క్రిప్టు అద్భుతాలు చేస్తుందని అంటున్న ప్రకాష్ రాజ్ త్వరలో దేశంలోని
విద్యావ్యవస్థ పై తమిళ - తెలుగు భాషల్లో స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. |
------------------------------------------------------ |
లవర్ బోయ్ పాత్రలకి నాగచైతన్య గుడ్ బై
‘ఏ మాయ చేశావె’తో ప్రేమికుడిగా విజయం సాధించిన నాగచైతన్య ఇకపై లవర్ బోయ్ పాత్రలు
చేయకూడదని నిర్ణయించుకున్నాడట. నా నటనా ప్రతిభను చూపే కొత్త తరహా పాత్రలు ఇకపై
చెయ్యాలనుకుంటున్నాను - అని నాగచైతన్య అంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో
చేస్తున్న చిత్రం సున్నితమైన ప్రేమ కథా చిత్రం. ఇందులో తమన్నా నాయిక. అజయ్
భూయాన్ దర్శకత్వంలో మరో చక్కటి యాక్షన్ చిత్రం చేస్తున్నానని చెప్పారు.
|
త్రిష ప్రేమ కథలకి గట్టి వార్పింగ్
నటి త్రిష మందు మజాలకి, ప్రేమకథలకి పెట్టింది పేరు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి
మనవడు ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగులో ‘దోపిడి’గా అనువాదం అయిన ‘కురివి’ చిత్ర నిర్మాణం సమయం నుండే
ఉదయనిధితో త్రిషకు ప్రేమ సంబంధం ఉందట. ఇటీవల ఆమెని హీరోయిన్ గా పెట్టి
‘మన్మధబాణం’ తీసాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా త్రిష ‘మన్మధబాణం’ నుండి
బయట పడలేకపోతున్న ఉదయనిధి పరిస్థితి గమనించి అతని కుటుంబీకులు త్రిషకు గట్టి
వార్నింగ్ ఇచ్చారట. |
‘జి.తెలుగు’లో కొత్త సీరియల్ ‘రాధాకళ్యాణం’
‘చిన్న కోడలు’, ‘పుసుపు కుంకుమ’ వంటి సెంటిమెంట్ సీరియల్స్ విజయవంతం
కావడంతో ‘జి తెలుగు’ ఛానెల్ లో ‘రాధాకళ్యాణం’ అనే మరో సీరియల్ ప్రారంభం
అయ్యింది. మన వివాహ వ్యవస్థ, మహిళపై దాని ప్రభావం అనే అంశంతో నిర్మించిన ఈ డైలీ
సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ‘జి.తెలుగు’ క్రియేటివ్ హెడ్ అనురాధ
చెబుతున్నారు. |
మితిమీరిన కోరికల్లేవంటున్న సమంత
నా విజయాల పట్ల ఆనందాన్ని నేను నా నటనలో చూపిస్తాను. అలాగని నటన విషయంలో
అత్యున్నత స్థాయికి ఎదగాలనే మితిమీరిన కోరికల్లేవు. దర్శకుడు ఎలా చెబితే అలా, వంద
శాతం ప్రతిభ చూపాలనే తపన ఉంది. అందుకు తగిన సాధన చేస్తున్నాను. తెలుగు భాషతో
నాకు దగ్గరి అనుబంధం ఉంది. నాన్న తరపు వాళ్ళు ఇక్కడి వారే. తమిళనాట స్థిరపడటంతో
తెలుగుకి దూరం అయ్యాను. ఇప్పుడు పట్టుబట్టి తెలుగు నేర్చుకుంటున్నా. త్వరలో గడగడ
మాట్లాడేస్తా - నని అంటోంది సమంత. |
అంత గ్యాప్ మంచిది కాదంటున్న మహేష్ బాబు
మూడేళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత ‘ఖలేజా’తో నేను తెరపై కనిపించాను. అది నేను చేసిన
తప్పు. అంత గ్యాప్ ఏ స్టార్ కీ మంచిది కాదు. అదే ‘ఖాలేజా’పై ప్రభావం చూపింది.
‘ఖలేజా’ థియేటర్స్ లోకి వచ్చేటప్పటికి ఆ సినిమాపై అంచనాలు గరిష్ట స్థాయికి
చేరుకున్నాయి. దాంతో ఫలితం తారుమారైంది- అని అంటున్న మహేష్ బాబు.
‘దూకుడు’ ఎవరినీ నిరాశ పరచదు. శ్రీనువైట్ల యాక్షన్ ఎంటర్ టైనర్ గా అద్భుతంగా
చేస్తున్నారని చెబుతున్నారు. |
------------------------------------------------------ |
షూటింగ్స్ కి సిద్ధమంటున్న సినిమా కార్మికులు
వివాదాలతో ఇటీవల ఆగిపోయిన సినిమా షూటింగ్స్ లో తిరిగి పాల్గొనేందుకు సిద్ధమేనంటున్నారు
ఫిలిం ఫెడరేషన్ కార్మికులు. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో కార్మికుల వేతన
సవరణ అంగీకారం కుదిరినందు వల్ల షూటింగ్స్ కి హాజరవుతామని ఫెడరేషన్ ప్రకటించింది.
అయితే ఈ విషయమై నిర్మాతల మండలి సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటుంది. సమ్మె
సమయంలో కొందరు విదేశాల్లో షూటింగ్ జరుపుకోవడానికి, రీరికార్డింగ్స్ చేసుకోవడానికి
అనుమతి ఇచ్చిన విషయం ఇందులో చర్చిస్తారు.
|
నాగచైతన్య ‘ఐ లవ్ యు’... సంపత్ నందితో రవితేజ
సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య - తమన్నా జంటగా చేస్తున్న చిత్రం దాదాపు పూర్తి
కావచ్చింది. ఈ చిత్రానికి ‘ఐ లవ్ యు’ అనే పేరు పరిశీలనలో ఉంది. మార్చిలో ఈ చిత్రం
విడుదలవుతుంది.
‘ఏమైంది ఈ వేళ’ చిత్రంతో యువ ప్రేక్షకులను అలరించిన సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ
ఓ చిత్రం చేస్తున్నారు. సంపత్ చెప్పిన కథ నచ్చి రవితేజ అతనితో చిత్రం చేసేందుకు ‘ఓకే’
చేసారు. |
భారీ సెటిల్ మెంట్ తో ప్రభుదేవాకు విడాకులు
నయనతార ప్రేమలో పడ్డ ప్రభుదేవా భార్య రమాలత్ తో విడాకుల కోసం కోర్టుకెక్కడం, అందుకు
రమాలత్ తిరస్కరించడం తెలిసిందే. అయితే, తాజాగా భారీ మొత్తం ప్రభుదేవా
ఇవ్వంజూపడంతో రమాలత్ విడాకులకు అంగీకారం తెలిపింది. దాదాపు 30 కోట్లు రమాలత్
కు ప్రభుదేవా ముట్ట జెప్పినట్లు తెలుస్తోంది. జనవరిలో ప్రభుదేవా - నయనతారల పెళ్ళి జరిగే
అవకాశం కనిపిస్తోంది. |
నాగార్జున ‘ఢమరుకం’ ఫిబ్రవరి 12 నుండి
‘రగడ’తో విజయాన్ని అందుకున్న నాగార్జున ‘ఢమరుకం’ పేరుతో భారీ సోషియో ఫాంటసీ
చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీమేకర్స్ వెంకట్
నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ‘రాజన్న’ షూటింగ్ లో
ఉన్న నాగార్జున ఫిబ్రవరి 12 నుండి ‘ఢమరుకం’ షూటింగ్ లో పాల్గొంటారు. |
ఒక్క ఫ్లాప్ తో పోయేదేం లేదంటున్న జెన్నీ
‘ఆరెంజ్’ నా ఇమేజ్ ని డామేజ్ చేసిందని, జెన్నీ పని అయిపోయిందని మీడియాలో
కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. హిట్ రాగానే ఎత్తేయడం, ఫ్లాప్ రాగానే
పడేయడం మీడియాకు మామూలే. అయితే ఒక్క ఫ్లాప్ తో తరిగిపోయే క్రేజ్ కాదు నాది. హిట్
కి పొంగిపోయి, ఫ్లాప్ కి కుంగిపోవడం నాకు తెలీదు. సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న
నాకు ఫ్లాపుల గురించి ఆలోచించేందుకు టైమ్ లేదంటోంది - జెనీలియా. |
------------------------------------------------------ |
నీలకంఠ ‘విరోధి’గా శ్రీకాంత్... గౌతంమీనన్ తో రామ్
ఇటీవల వైవిధ్యమున్న చిత్రాల్లో నటిస్తున్న శ్రీకాంత్ ప్రస్తుతం ‘సేవకుడు’, ‘దుశ్శాసన’,
‘అనుచరుడు’ చిత్రాలు చేస్తున్నాడు. త్వరలో నీలకంఠ దర్శకత్వంలో ‘విరోధి’ అనే చిత్రం
చేస్తున్నట్లు చెప్పారు. దీనికి అతని తమ్ముడు అనిల్ నిర్మాత. నక్సలైట్ నేపథ్యంలో ఉండే ఈ
చిత్రంలో శ్రీకాంత్ జర్నలిస్ట్ గా నటిస్తారు.
‘ఏం మాయ చేశావె’తో తెలుగులో విజయవంతమైన చిత్రాన్ని అందించిన గౌతం మీనన్
త్వరలో మరో చిత్రం చేస్తున్నారు. ఇందులో రామ్ హీరోగా నటిస్తారు. ఎ.ఆర్.రెహమాన్
సంగీతాన్ని అందించే ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని నిర్మిస్తారు. |
పక్కా ప్లానింగ్ తోనే హాలీవుడ్ అంటున్న శ్రియ
‘ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్’ చిత్రంతో హాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రియ - హాలీవుడ్
చిత్రాలకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఒకసారి స్క్రిప్టు ఓకె అయితే, ఆ తర్వాత ఒక్క పదాన్ని
కూడా మార్చరు. షూటింగ్ కి ముందు వర్క్ షాప్ ఉంటుంది. రిహార్సల్ చేస్తారు. అయితే
ఇక్కడ మన చిత్రాల వర్కింగ్ విధానం వేరు. షూటింగ్ స్పాట్ లో కూడా మార్పులు చేర్పులు
చేస్తారు. ఒక్కోసారి అవి సినిమాకి లాభదాయకం కూడా అవుతుంటాయని -అంటోంది శ్రియ. |
‘బెజవాడ రైడీల’కు పోటీగా ‘ఆటో నగర్ సూర్య’
విజయవాడ రౌడీల కథాంశంతో రాంగోపాల్ వర్మ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో
ఈ చిత్రం ప్రారంభం అవుతోంది. అయితే, దాదాపు ఇదే నేపథ్యంతో ‘వెన్నెల’,
‘ప్రస్థానం’ దర్శకుడు దేవ్ కట్టా ఓ చిత్రం ప్రారంభిస్తున్నారు. దీనికి ‘ఆటో నగర్ సూర్య’
అని పేరు పెట్టారు. నటీనటుల ఎంపిక చేసుకుని త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం
రౌడీయిజం గురించి కాకుండా, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల నేపధ్యంలో ఉంటుందని దేవ్
కట్టా చెబుతున్నారు. |
మాధురి బాలీవుడ్ కి ‘ఓకె’... అనూష్క ‘నో’
కొన్నేళ్ళ పాటు బాలీవుడ్ ని తన అందచందాలతో అలరించిన మాధురీ దీక్షిత్ పెళ్ళి తర్వాత చేసిన
చిత్రం నిరుత్సాహ పరిచింది. ప్రస్తుతం ఆమె ఓ టివి షోకి యాంకర్ గా చేస్తోంది. త్వరలో మరో
భారీ చిత్రంలో ఆమె నటించడానికి ఓకె చెప్పిందని తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలింస్, యుటివి,
కరణ్ జోహార్, సంజయ్ లీలా బన్సాలి వంటి ప్రముఖుల పేర్లు మాధురితో సినిమా చేసే వారి
స్థానంలో వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ అంటే అంతా ఎగిరిగెంతేస్తారు. మన హీరోయిన్లు అయితే మరీను. అయితే అనూష్క
హిందీలో వచ్చిన అవకాశానికి ‘నో’ చెప్పిందని వార్తలొచ్చాయి. సూర్యతో ఆమె నటించిన
‘యముడు’ హిందీలో రీమేక్ చేస్తూ అజయ్ దేవ్ గన్ సరసన తిరిగి అదే పాత్రను
పోషించమంటే చెయ్యను పొమ్మందట. |
ఆ మూడూ మిస్ కానంటున్న తమన్నా
మంచి కథ, మంచి పాత్ర, మంచి హీరో ఉంటే సినిమా అంగీకరిస్తాను. ‘కొంచం ఇష్టం -
కొంచం కష్టం’ తర్వాత చాలా కథలు తెలుగులో నచ్చలేదు. అప్పుడు తమిళంలో చేశాను.
ఇప్పుడు తెలుగులో కుదిరాయి. అందుకనే మూడు చిత్రాలు అంగీకరించానని అంటోంది
తమన్నా. అల్లు అర్జున్ తో ‘బద్రీనాధ్’, నాగచైతన్యతో ఓ చిత్రం, ఎన్టీఆర్ తో మరో చిత్రం
తమన్నా తెలుగులో చేస్తోంది. |
------------------------------------------------------ |
దాసరి నారాయణరావు ఫిలిం మ్యూజియం
ఈ తరానికి, భావితరాల వారికి సినిమా సమాచారాన్ని అందించేలా ‘ఫిలిం మ్యూజియం’
నెలకొల్పాలనే ఆలోచనతో ఉన్నానని దాసరి నారాయణరావు చెప్పారు. దీని కోసం 25 వేల
పాటల వివరాలు, 10 వేల ‘సినిమా రంగం’, 10 వేల ‘విజయ చిత్ర’ పత్రికలు
సేకరించానని, మరింత సమాచారంతో త్వరలో ఈ మ్యూజియం
ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పారు. సినిమా జర్నలిస్టులందరికీ ఈ మ్యూజియం ఎంతో
ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. |
ప్రభాకర్ ‘ముద్దు బిడ్డ’ 400 ఎపిసోడ్స్ పూర్తి
తెలుగు టివి తెరపై కొత్త వరవడిని సృష్టించిన ప్రభాకర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘ముద్దు
బిడ్డ’ డైలీ సీరియల్ ‘జీ-తెలుగు’ ఛానెల్ లో 400 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.
ఉమ్మడి కుబుంబ వ్యవస్థలోని మమతానురాగాలు, సమస్యలు చూపుతూ సాగుతున్న ఈ
సీరియల్ లో సమీర, అస్మిత, దీప, రవిత్రేయని ప్రధాన పాత్రలు పోషించారు. |
భారతీయ ఇతిహాసాలకు జేమ్స్ కామరూన్ సహకారం
‘అవతార్’తో సినిమా సాంకేతిక సంచలనాన్ని సృష్టించిన జేమ్స్ కామరూన్ మన దర్శక
నిర్మాతలకు సహకరిస్తానని అంటున్నారు. రామాయణ, మహాభారత కథలతో ఎవరైనా చిత్ర
నిర్మాణం చేస్తే, వారికి తను ‘అవతార్’కి వాడిన 3డి కెమేరాలు, ఇతర సామగ్రిని
ఉచితంగా ఇచ్చి సహకరిస్తానని అంటున్నాడు. భారతీయ సంస్కృతి అంటే తనకు ఎంతో
ఇష్టమని, ఆ మధ్య జరిగిన కుంభమేళాలో పాల్గొన్నానని జేమ్స్ చెబుతున్నారు. |
అమీర్ ఖాన్ కావాలంటున్న కత్రీనా, త్రిష
ఎప్పటికైనా అమీర్ ఖాన్ తో నటించాలి. ఆయన ఎంచుకునే కథలే ఎంతో వైవిధ్యంతో
ఉంటాయి. అందుకు తగ్గట్టే అందులో నాయిక పాత్రలూ ఉంటాయి- అని అమీర్ పట్ల తన
ఆసక్తిని వ్యక్తం చేస్తోంది కత్రీనా కైఫ్. ఇక త్రిష ఆ గొప్ప నటుడితో నటించడం తన చిరకాల
వాంఛ అని చెబుతోంది. అతనితో కలిసి నటించడం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తానని
అంటున్న త్రిష కేవలం మాటలతోనే వదిలేయకుండా, అమీర్ తో నటించడానికి తీవ్రంగా
ప్రయత్నిస్తోందట. |
కె.బాలచందర్ కు అక్కినేని జాతీయ పురస్కారం
డా. అక్కినేని తన పేరిట ఏర్పాటు చేసిన ‘ఎఎన్నార్ నేషనల్ అవార్డ్’ను ఇప్పటికే దేశంలోని
ప్రముఖ కళాకారులు పలువురు అందుకున్నారు. ఈ ఏడాది ఈ అవార్డుకు దక్షిణాదిలో
సంచలనాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టి, రజనీకాంత్, కమల్ హసన్ వంటి ప్రముఖ
హీరోలను పరియం చేసిన కె.బాలచందర్ ను ఎంపిక చేశారు. |
------------------------------------------------------ |
ప్రేమలో అనూష్క... రెండేళ్ళలో పెళ్ళి
యువహీరో గోపీచంద్ తో ప్రేమలో మునిగి తేలుతోందంటూ వార్తలకెక్కిన అనూష్క తను
నిజంగానే ప్రేమలో పడ్డానంటూ ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకొంది. అయితే ఆమె బాయ్
ఫ్రెండ్ పేరు ఇప్పుడే చెప్పడానికి ఆమె అంగీకరించలేదు. అతను తనతో గాఢమైన
ప్రేమలో ఉన్నాడని మాత్రం చెప్పగలనని అంటోంది. రెండేళ్ళలో అతనితో తన పెళ్ళి
జరుగుతుందని చెప్పింది. తన ఇంట్లో అంతా డాక్టర్లు, ఇంజనీర్లు కావడం వల్ల తను
నటిని కావడానికి ఎవరూ అభ్యంతర పెట్టలేదని, తను సన్యాసిని కాకుండా ఉంటే
చాలునని వాళ్ళు అనుకుంటుంటారని - గతంలో యోగా గురువుగా చేసిన అనూష్క
చెబుతోంది. |
పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్ సహకారం
తన పనేదో తను చేసుకుంటూ పరిశ్రమలోని ఇతరులతో అంటీ ముట్టనట్లుండే పవన్
కళ్యాణ్ లో మార్పొచ్చిందని అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న సమ్మె సందర్భంగా
సినిమా రంగంలో పెచ్చు పెరిగిపోతున్న నిర్మాణ వ్యయాన్ని అదుపు చేసేందుకు
జరుగుతున్న ప్రయత్నంలో చురుగ్గా పాల్గొంటున్నాడు. పలువురు హీరోలతో చర్చిస్తూ
చిత్ర నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాడు. తన వల్ల ఇబ్బందుల
పాలయిన ‘కిమరం పులి’ నిర్మాతకు కొంత సహాయం చేసేందుకు కూడా పవన్
కళ్యాణ్ ముందుకు రావడం విశేషం. |
శ్రీనువైట్ల ‘‘ఢీ... రెడీ’’... ఎన్టీఆర్ తో చిత్రం
మహేష్ బాబుతో ‘దూకుడు’ చేస్తున్న శ్రీనువైట్ల దీని తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఓ
చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని గణేష్ బాబు నిర్మిస్తారు. గతంలో
విజయవంతమైన ‘ఢీ’, ‘రెడీ’ చిత్రాల పేర్లు కలిసొచ్చేలా ‘ఢీ... రెడీ’
అనే పేరుతో ఓ చిత్రం చేయాలన్న ఆలోచనలో కూడా శ్రీనువైట్ల ఉన్నట్లు తెలుస్తోంది. |
రాయలసీమ పంపిణీలో ఆర్.ఆర్.మూవీమేకర్స్
‘హంగామా’ నుండి ‘డాన్ శీను’ వరకూ ఎన్నో విజయవంతమైన చిత్రాలు
నిర్మించిన ఆర్.ఆర్.మూవీమేకర్స్ వెంకట్ సినిమా పంపిణీ రంగంలోకి
ప్రవేశిస్తున్నారు. రాయలసీమలో సినిమా పంపిణీ చేపడుతున్నారు. 24న
తిరుపతిలో వీరి కార్యాలయం ప్రారంభమైంది. స్వంత చిత్రాలతో పాటు బయటి చిత్రాలు
కూడా పంపిణీ చేస్తామని తాము చేస్తున్న సంక్షేమ, సహాయ కార్యక్రమాలు ఇకపై
మరింత ఎక్కువగా చేపడతామని వెంకట్ చెప్పారు. |
మంచి మార్కులే వచ్చాయంటున్న ఐశ్వర్య
రావణ్, గుజారిష్, యాక్షన్ రీప్లే చిత్రాలు పరాజం పాలయ్యాయి. ‘రోబో’
మాత్రమే విజయవంతమైంది. అయితే అన్ని చిత్రాల్లోనూ నా వరకూ మంచి మార్కులే
వచ్చాయి - అని ఆనందపడిపోతోంది ఐశ్వర్యారాయ్. సినిమా జయాపయాలను
నిర్ణయించేది ప్రేక్షకులే. వారే మహరాజ పోషకులు. తలరాతను మార్చలేనట్లే,
సినిమా పరాజయాన్ని కూడా ఎవరూ ఆపలేరని కొన్ని చిత్రాలు నిరూపిస్తుంటాయని
అంటోంది. |
------------------------------------------------------ |
దక్షిణాది నాయికల్లో నయనతార టాప్
నటి నయనతార దక్షిణాది నాయికల్లో అగ్రస్థానాన్ని
సాధించింది. ఈ ఏడాది తెలుగులో ‘అదుర్స్’,
‘సింహా’, తమిళంలో ‘బాస్ ఎన్ గిర భాస్కరన్’,
మలయాళంలో ‘బాడీగార్డ్’తో దక్షిణాది భాషల్లో
విజయం సాధించింది. కన్నడలో ఉపేంద్రతో చేస్తున్న
చిత్రం కూడా సంచలన విజయం సాధించే అవకాశం
ఉంది. వీటితో పాటు బాలకృష్ణ - బాపుల ప్రతిష్టాత్మక
చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో సీతగా ఎంపిక కావడం నటిగా
నయనతారకు గర్వకారణం. అయితే, వెంకటేష్
సరసన చేయాల్సిన ‘సావిత్రి’ని మాత్రం కారణాంతరాల
వల్ల ఆమె వదులుకుంది. |
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల వివాహం మార్చి 6న...
స్నేహా రెడ్డితో ప్రేమ వివాహం చేసుకుంటున్న అల్లు అర్జున్
మాత్రం -‘‘అబ్బే మాది పెద్దలు కుదిర్చిన
పెళ్ళేనంటూ’’... అతని తండ్రి అల్లు అరవింద్
పద్ధతిలో బుకాయిస్తున్నాడు. ఇటీవలనే నిశ్చితార్థం
జరిగిన ఈ జంట పెళ్ళి మార్చి 6న జరుగుతుంది.
దీనికి ఢిల్లీకి, చెందిన డిజైనర్ ఏర్పాట్లు చూస్తారు.
వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న భారీ చిత్రం
‘బద్రీనాథ్’ కూడా ఇదే నెలలో విడుదలయ్యే అవకాశం
ఉంది. |
జగన్ తో పాటేనంటున్న జీవిత రాజశేఖర్
తమది మొదటి నుండీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబం
- అని అంటూనే ఎన్టీఆర్ వల్ల తాము టి.డి.పిలో
చేరామని, అయినా కొద్ది రోజుల్లోనే బయటి కొచ్చామని
- జీవిత రాజశేఖర్ చెబుతున్నారు. ఆ తర్వాత
వై.ఎస్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ లో చేరామని, ఆయన
మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వై.ఎస్ కుమారుడినే
పట్టించుకోక పోతే, ఇక మమ్మల్ని పట్టించుకోక పోవడం
ఆశ్చర్యకరం కాదని అన్నారు. వై.ఎస్. తర్వాత
అంతటి ప్రజాదరణ గల లీడర్ జగన్ కనుక, కాంగ్రెస్
నుండి బయటి కొచ్చి జగన్ తో పాటే ఉంటామని
అన్నారు. |
మీడియాపై రామ్ చరణ్ కి కోపమొచ్చింది
ఇటీవల విడుదలైన తన ‘ఆరెంజ్’ చిత్రం ఘోర
పరాజయం పాలు అయిన విషయాన్ని రాజకీయాలతో
ముడిపెట్టి ప్రసారం చేసిన ‘సాక్షి’ ఛానెల్ పై రామ్
చరణ్ చిర్రుబుర్రులాడుతున్నాడు. పుండు మీద కారం
జల్లినట్లు ఓ మసాలా వెబ్ సైట్ - ‘ఆరెంజ్’
పరాజయాన్ని తట్టుకోలేక రామ్ చరణ్ పిచ్చి పిచ్చిగా కారు
నడుపుతూ తిరుగుతున్నాడంటూ ఓ వేడివార్త రాసింది.
దాంతో మండిపోయిన రామ్ చరణ్ తప్పుడు రాతలు
రాస్తున్న మీడియా అంతు చూస్తానంటూ ‘ట్విట్టర్’లో
వార్నింగ్ ఇచ్చాడు. |
కృష్ణ భగవాన్ మందు మాటల వివాదం
రచయిత నటుడు కృష్ణ భగవాన్ మందేసి, మాటలతో
చిందేయడంలో దిట్ట. ఈ మధ్య ఆంధ్రాలో ప్రముఖులు
పాల్గొన్న సభలో ఇలాగే మాట్లాడుతూ- ఘనాపాటి
గరికపాటి నరసింహారావు అవధానం గురించి పిచ్చి
జోకులేసి అవమానించాడు. అతని నోటి దూలని అంతా
నిరసించి, స్థాయిలేని వ్యక్తిని వేదికనెక్కించినందుకు
అక్కడి వాళ్ళంతా చెంపలేసుకున్నారు. |
------------------------------------------------------ |
జేమ్స్ బాండ్ గా మెహర్ తో మహేష్ బాబు
‘గూఢచారి 116’ హీరో కృష్ణకు ఎంతో పేరు తెచ్చింది. అదే తరహాలో కృష్ణ తనయుడు
మహేష్ బాబు ఓ చిత్రం చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి ‘శక్తి’ దర్శకుడు
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మెహర్ - మహేష్ కాంబినేషన్ లో ఈ
చిత్రం భారీ చిత్రాల నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. |
కోడిరామకృష్ణతో బాలకృష్ణ... హనుమంతుడు శ్రీహరి
భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించిన పలు సూపర్ హిట్ చిత్రాలు కోడి రామకష్ణ
- బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చినవే. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి
కాంబినేషన్ లో మరో చిత్రం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘అంకుల్ ఆంజనేయస్వామి’
షూటింగ్ లో ఉన్న కోడి, సంక్రాంతికి ‘పరమవీరచక్ర’తో రానున్న బాలయ్య తమ
కలయికలో వచ్చే చిత్రం కోసం ఇప్పటికే చర్చించినట్లు భోగట్టా.
బాలకృష్ణ - నయనతార సీతారాములుగా, అక్కినేని వాల్మీకిగా శ్రీకాంత్ లక్ష్మణుడిగా
బాపు రమణలు రూపొందిస్తున్న ‘శ్రీరామరాజ్యం’లో హనుమంతుడిగా శ్రీహరి చేస్తున్నట్లు
తెలిసింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. |
కె.ఎన్.టి.శాస్త్రి ‘సమత’, ఎస్వీకె కొత్త చిత్రం
అవార్డు చిత్రాల దర్శకుడు కె.ఎన్.టి.శాస్త్రి ఫిబ్రవరి నుండి హిందీలో ‘సమత’ అనే చిత్రం
చేస్తున్నట్లు తెలిసింది. పరేష్ రావల్, ఓంపురి మొదలైన ప్రముఖ నటీనటులతో ఈ
చిత్రాన్ని సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వారు నిర్మిస్తున్నారు.
పలు వినోద, కుటుంబ కథా చిత్రాలను విజయవంతంగా అందించిన ఎస్వీకృష్ణారెడ్డి త్వరలో
మరో భారీ చిత్రంతో మన ముందుకు రానున్నారు. ఓ మంచి కథాంశంతో నిర్మించే ఈ
చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు, దీన్ని ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ
నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. |
రీమాసేన్ కు ప్రమాదం తప్పింది.
పలు తెలుగు చిత్రాల్లో నటించిన రీమాసేన్ ఇటీవల ‘యుగానికొక్కడు’లో ఓ విలక్షణమైన
పాత్ర పోషించింది. హిందీలో ‘ది గ్యాంగ్ ఆఫ్ వాజీపూర్’లో నటిస్తున్న రీమాసేన్
వారణాసిలో షూటింగ్ కి వెళ్ళాల్సింది. అయితే, ముందుగా ‘దసాశ్వమేధ్ ఘాట్’లో
పూజకు వెళ్దామనుకుంది. అయితే కారు అరగంట ఆలస్యం కావడంతో లేట్ గా చేరుకుంది.
అప్పటికే ఇరవై నిముషాల ముందు అక్కడ బాంబు పేలిందని తెలిసి ఆందోళనకు
గురయ్యింది. ఆలస్యం కూడా మంచిదయిందని ఆనందపడింది. |
పూరి ‘దేవుడా’... చౌదరి ‘నిప్పు’... దాసరి ‘రామసక్కని తల్లి’
అమితాబ్ - రేఖ, షారుక్ - కాజోల్ తరహాలో బాలీవుడ్ లో హాట్ హాట్ జంటగా ప్రస్తుతం
ఫిలిం ఛాంబర్ లో కొత్త చిత్రాల పేర్లు కొన్ని ఆసక్తి కరంగా ఉన్నాయి. దాసరి ఫిలిం
యూనివర్సిటీ ‘రామసక్కని తల్లి’, వైష్ణో అకాడమీ ‘దేవుడా’, బొమ్మరిల్లు వారి
‘నిప్పు’, సంతోషం స్టూడియోస్ ‘వాటర్’, స్నేహచిత్ర ‘దండకారణ్యం’ పేర్లు
నమోదు చేసుకున్నారు. |
------------------------------------------------------ |
మహేష్, విజయ్ పోయి సూర్య వచ్చాడు
‘త్రి ఇడియట్స్’ తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్ నటిస్తారన్న వార్తలు నిజం
కాలేదు. కారణాంతరాల వల్ల వారిద్దరూ ఆ చిత్రంలో చేయడం లేదు. ఇప్పుడు రెండు
భాషలకు సరిపోయేలా సూర్యతో చేయించాలని శంకర్ ప్రయత్నిస్తున్నారు. ఇలియానా
హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్కూట్ వారు నిర్మిస్తున్నారు. |
పవన్ కళ్యాణ్ ‘లవ్ లీ’ మార్చి 28న విడుదల
‘లవ్ ఆజ్ కల్’ ఆధారంగా పవన్ కళ్యాణ్ - త్రిష జంటగా జయంత్ దర్శకత్వంలో
నిర్మిస్తున్న ‘లవ్ లీ’ మారి్చ 28న విడుదలవుతుంది. ఇప్పటికే కాశీ, దక్షిణాఫ్రికాలో
షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్స్ హైదరాబాద్, మైసూర్, అమెరికా,
మలేసియా లో జరుగుతుంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాయడం
విశేషం. |
జి.తెలుగులో ‘రాఘవేంద్ర స్వామి మహాత్యం’
భారతీయ ఆద్యాత్మిక జీవన విధానాన్ని ప్రభావితం చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి కథతో
నిర్మించిన ‘రాఘవేంద్ర స్వామి మహాత్యం’ సీరియల్ ‘జి.తెలుగు’ ఛానెల్లో టెలికాస్ట్
అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో రాఘవేంద్ర స్వామిగా నటిస్తున్న దినేష్
నటన ప్రశంసలందుకుంటోంది. గతంలో రాఘవేంద్ర స్వామిగా నటించిన రజనీకాంత్ కూడా ఈ
సీరియల్ లో దినేష్ నటనను అభినందించడం విశేషం. |
సగం పారితోషికానికే నటిస్తున్న అసిన్
నన్ను స్టార్ ని చేసింది దక్షిణాది చిత్రరంగమే. కథ, పాత్ర నచ్చితే పారితోషికాన్ని కూడా
పట్టించుకోకుండా చేయడానికి నేను సిద్ధం. ఇటీవల కథ నచ్చడంతో ఓ తమిళ చిత్రం
చేస్తున్నాను. ప్రస్తుతం నేను తీసుకుంటున్న పారితోషికంలో సగమే ఈ చిత్రానికి
తీసుకుంటున్నాను. బాలీవుడ్ చిత్రాలు, యాడ్ ఫిలింస్ లో బిజీగా ఉన్నా ఈ చిత్రం
అంగీకరించానని అంటోంది అసిన్ తను దక్షిణాదిని మరిచిపోలేదని చెబుతూ. |
మహేష్ తో బెడిసిన సమంత... మోసపోయిన రవితేజ
‘ఏం మాయ చేశావె’, ‘బృందావనం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పరిశ్రమ వర్గాలను
ఆకట్టుకున్న సమంత మహేష్ బాబుతో శ్రీనువైట్ల ‘దూకుడు’లో చేస్తోంది. ఈ చిత్రం కోసం
ఇటీవల టర్కీలో ఓ షెడ్యూల్ జరిగింది. అక్కడ మహేష్ తో తగినంత సాన్నిహిత్యం దొరకని
సమంత నిరాశపడిందట.
దూసుకుపోతున్న యువ హీరో రవితేజ బెల్లంకొండ సురేష్ అనే నిర్మాత చేతిలో
మోసపోయాడని వార్తలొచ్చాయి.బెల్లంకొండ సురేష్ నుండి రవితేజ కూకట్ పల్లిలో ఓ స్థలం
కొన్నారు. అయితే, ఆ స్థలం ఆదాయ పన్ను శాఖ వారు సీజ్ చేసిందని తెలుపుతూ, ఆ
స్థలం కొనుగోలు చెల్లదని చెబుతూ అతనికి నోటీస్ వచ్చింది. దాంతో తను మోసపోయినట్లు
అతనికి అర్థమయింది. గతంలో కూడా తన చిత్రం సాటిలైట్ హక్కులు పలువురికి అమ్మడం
ద్వారా బెల్లకొండ సురేష్ వివాదస్పదం అయ్యారు. |
------------------------------------------------------ |
సినిమా సమ్మె మంచిదేనంటున్న నాగార్జున
సినిమా అనేది అనుకున్న టైమ్ లో పూర్తయితేనే అంతా ఆనందంగా ఉంటారు. ఉదాహరణకి
అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాకి 8 నెలలు చేసినా, 4 నెలలు చేసినా అతనికిచ్చే మొత్తం
ఒక్కటే. అందు వల్ల సినిమా త్వరగా పూర్తయితేనే అందరికీ మంచిది. నిర్మాతకూ
లాభదాయకం అవుతుంది. అదే చిత్ర పరిశ్రమకు అవసరం. ఇప్పుడు జరుగుతున్న
సమ్మెవలన తప్పులు సరిదిద్దు కోవచ్చును. ఈ సమ్మె మంచిదేనని పిస్తోందని అంటున్నారు
నాగార్జున. |
ఇవివి ‘పంబలకిడి జంబ’... రామ్ లక్ష్మణ్ దర్శకత్వం
నరేష్, ఆమని జంటగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబ లకిడి పంబ’
సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘పంబలకిడి జంబ’ పేరుతో మరో
చిత్రం ఇవివి రూపొందిస్తారని వార్తలొస్తున్నాయి. ఇందులో నరేష్ హీరోగా చేస్తారట.
పాపులర్ ఫైట్ మాస్టర్ట్స్ రామ్ - లక్ష్మణ్ త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సహజంగానే యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండే ఈ చిత్రంలో జగపతిబాబు, వైభవ్ హీరోలుగా
నటిస్తున్నారు. జనవరిలో ప్రారంభమయ్యే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. |
గ్రీకువీరుడు కావాలి... సినిమా వాడొద్దంటున్న త్రిష
ఆరడుగుల ఎత్తులో గ్రీకువీరునిలా ఉండాలి. అందంతో పాటు చక్కని వ్యక్తిత్వం కూడా
ఉండాలి. హాయిగా జీవితం గడిచి పోవడానికి అవసరమైన ఆదాయం కలిగిన వాడై ఉండాలి.
సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి... అంటూ తనకు కాబోయే వాడి గురించి వర్ణిస్తోంది త్రిష.
అటువంటి వాడు దొరికతే అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిస్తా... ప్రస్తుతానికైతే నా దృష్టి
అంతా కెరీర్ పైనే. మరో విషయం ఏమిటంటే - సినిమా రంగానికి చెందిన వ్యక్తిని మాత్రం
ఎట్టి పరిస్థితుల్లోను పెళ్ళి చేసుకోనని - అంటోంది. |
గజ గజ బెజవాడ... రవిబాబు ‘మనసారా’ మరో ఫ్లాప్
రామ్ గోపాల్ వర్మ ‘బెజవాడ రౌడీలు’ పేరుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం
తెలిసిందే. విజయవాడలో తను చదువుకున్న ‘సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజి’ ఫంక్షన్ లో
వర్మ ఇటీవల పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొందరు అతనిపై కోడి గుడ్లు విసిరితే, వర్మ
తన సినిమా పాట ‘గజ గజ బెజవాడ’ వినిపించి అభిప్రాయాన్ని కోరాడు. పోలీసుల
వైఫల్యం పైనే ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని వర్మ చెబుతున్నాడు.
‘అనసూయ’, ‘నచ్చావులే’ వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన రవిబాబు
ఆ తర్వాత ‘అమరావతి’, ఇప్పుడు ‘మనసారా’ చేసి పరాజయం పాలయ్యాడు. ఈ
చిత్రాలకి కనీస ప్రచారం కూడా చేయకుండా కేవలం తన దర్శకత్వ ప్రతిభతోనే సినిమాలు
ఆడేస్తాయనే రవిబాబు భ్రమలను ఈ చిత్రాలు పటాపంచలు చేసాయి. |
హాట్ కపుల్ అక్షయ్, కత్రీనా... జయలలితతో విజయ్
అమితాబ్ - రేఖ, షారుక్ - కాజోల్ తరహాలో బాలీవుడ్ లో హాట్ హాట్ జంటగా ప్రస్తుతం
ఎవరున్నారని ఓ ఛానెల్ అభిప్రాయ సేకరణ చేసింది. ఈ మధ్య చాలా సన్నిహితంగా
నటిస్తున్న అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ లు హాట్ హాట్ కపుల్ గా ఎంపికయ్యారు.
గత కొంత కాలంగా రాజకీయాల్లోకి రావాలని ఉర్రూతలూగుతున్న తమిళ యువ హీరో విజయ్
రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం
‘వేలాయుధం’ అనే భారీ చిత్రంలో నటిస్తున్న విజయ్ కు ఇటీవల కాలంలో వరుస
పరాజయాలు వరిస్తున్నారు. జయలలిత అన్నా.డి.ఎం.కె. పార్టీలో విజయ్
చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. |
------------------------------------------------------ |
చిరంజీవితో మాధురి... నీలకంఠతో శ్రీకాంత్
చిరంజీవి హీరోగా భారీ స్థాయిలో నిర్మించే ‘అధినాయకుడు’లో అతని సరసన నాయికగా చాలా
మంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మాధురీ దీక్షిత్ పేరు వార్తల్లో కెక్కింది. పెళ్ళి చేసుకుని
అమెరికాలో ఉంటున్న మాధురి ఇటీవల చేసిన హిందీ చిత్రాలు విజయవంతం కాలేదు.
‘షో’, ‘మిస్సమ్మ’ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచనకు మంచి పేరు సంపాయించిన నీలకంఠ
త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ ఇందులో హీరోగా చేస్తున్నారు.
గతంలో శ్రీకాంత్ మేనేజర్ గా చేసిన అనిల్ దీనికి నిర్మాత.
|
వర్మ కారణంగానే ఇలియానా బాలీవుడ్ కి...
‘ట్విట్టర్’లో వ్యాఖ్యానాలతో సంచలనం సృష్టిస్తున్న రాంగోపాల్ వర్మ ఇటీవల, రానా చిత్రం
‘నేను నా రాక్షసి’ ఫోటోల్లో ఇలియానాను చూసి ముగ్దుడయ్యాడు. ‘ట్విట్టర్’లో ఆమెను తెగ
పొగిడేసాడు. దాన్ని చూసి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇలియానా అందాలను పనిగట్టుకుని
చూశారట. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ ఆఫర్లు రావడంతో, ఇలియానా ఇప్పుడు అనురాగ్
బసు దర్శకత్వంలో ‘సైలెంట్’లో నటించడానికి అంగీకరించింది.
|
కాకినాడ పి.ఆర్.కాలేజీలో ‘ఫిలిం క్లబ్’
కాకినాడ పి.ఆర్. గవర్నమెంట్ కాలేజీలో ఈ నెల 7న ‘ఫిలిం క్లబ్’ ప్రారంభమైంది.
ప్రిన్సిపాల్ డా. ఎం.సత్యనారాయణ అద్యక్షతన జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో ‘ఫెడరేషన్ ఆఫ్
ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ కార్యదర్శి వారాల ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సినిమా ప్రాధాన్యతను వివరించి, సినిమా పుట్టుక పరిణామ క్రమాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
తో విద్యార్థులకు వివరించారు. త్వరలో ఈ కాలేజీలో సినిమా స్క్రిప్టు రైటింగ్ వర్క్ షాప్ ను
నిర్వహిస్తారు.
|
విభిన్న ప్రదేశాల్లో, అత్యంత భారీగా ఎన్టీఆర్ ‘శక్తి’
మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - ఇలియానా జంటగా అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘శక్తి’
అత్యంత భారీ ఖర్చుతో దేశంలోని విభిన్న ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం
హైదరాబాద్ తో పాటు లడక్, జైపూర్, హరిద్వార్, కులుమనాలి, హంపి, బాదామిలో
షూటింగ్ చేశారు. ఈజిప్ట్ లో కూడా కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. మణిశర్మ
సంగీతం, సమీర్ రెడ్డి ఫోటో గ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, సోనూసూద్, పూజాబేడి
ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
|
రామ్ చరణ్ ‘మెరుపు’లో మరో ప్రముఖ నటుడు
రామ్ చరణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా ధరణి దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న
‘మెరుపు’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది. ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో సాగే ఈ
చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ గా ఓ ప్రముఖ నటుడు చేస్తున్నారు. ప్రస్తుతానికి అర్జున్,
నానాపాటేకర్ ల పేర్లు వినిపిస్తున్నాయి.
|
------------------------------------------------------ |
కె.రాఘవేంద్రరావు, రామోజీరావులకు నంది అవార్డులు
2009 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సినిమా అవార్డుల కార్యక్రమం ఈ నెల
12న లలిత కళాతోరణంలో జరుగుతుంది. ఈ ఏడాది బి.ఎన్.రెడ్డి స్మారక అవార్డును
కె.రాఘవేంద్రరావుకు, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డును సి.హెచ్.రామోజీరావుకు ఇస్తారు.
ఎన్టీఆర్ జాతీయ అవార్డును బి.సరోజాదేవికి, రఘుపతివెంకయ్య అవార్డును కె.రాఘవకు
అందజేస్తారు.
|
పవన్ ‘లవ్ లీ’కి ఇబ్బంది... ప్రకాష్ రాజ్ వర్మల ‘కుర్చీ’
‘లవ్ ఆజ్ కల్’ హిందీ చిత్రం ఆధారంగా పవన్ కళ్యాణ్ తో జయంత్ దర్శకత్వంలో నిర్మిస్తున్న
‘లవ్ లీ’కి ఇబ్బంది ఏర్పడింది. సిద్దార్థ హీరోగా ఇటీవల విడుదలైన ‘బావ’లో ‘లవ్ ఆజ్
కల్’ నుండి ప్రధానమైన అంశాలు కాపీ చేశారు. ఇప్పుడు ఆర్య, శ్రియ నటించిన తమిళ చిత్రం
‘చిక్కు - బుక్కు’ విడుదలైంది. అందులోనూ ‘లవ్ ఆజ్ కల్’ నుండి చాలా
సన్నివేశాలు వాడేసుకున్నారు. ఆ చిత్రం త్వరలో తెలుగు డబ్బింగ్ కూడా విడుదలయ్యే అవకాశం
ఉంది.
ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ‘రాజకీయం’ అనే సినిమా తీయాలనిపిస్తోందిని ప్రకటించిన
రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దానికి ‘కుర్చీ’ అనే పేరు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు.
రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది? ముందు ఏం కనబడుతోంది? అనే అంశాలతో
నిర్మించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రధారి.
|
‘జి-తెలుగు’లో వీరనారి ‘ఝాన్సీ లక్ష్మీభాయి’
ఆంగ్లేయుల నుండి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడిన వీరవనిత ‘ఝాన్సీ లక్ష్మీభాయి’.
ఆమె వీరగాధతో ‘జిటివి’ హిందీలో భారీ ఖర్చుతో ఓ సీరియల్ నిర్మించింది. దాన్ని తెలుగులో
‘వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి’ పేరుతో ‘జి.తెలుగు’ ఛానెల్ లో ప్రతిరోజూ సాయంత్రం
ప్రసారం చేస్తోంది. చిన్ననాటి ఝాన్సీ లక్ష్మీభాయిగా ఇందులో ఉల్కా గుప్తా, వీరనారిగా కృత్తికా
సింగార్ నటిస్తున్నారు. |
ప్రేమ కోసం లియోనార్డ్ డికాప్రియో మత మార్పిడి
‘టైటానిక్’, ‘డిపార్టెడ్’ వంటి చిత్రాల హీరో లియోనార్డ్ డికాప్రియో ప్రేమలో పడ్డాడు.
పెళ్ళయ్యి విడాకులు తీసుకున్న ఇజ్రాయిల్ సూపర్ మోడల్ బార్ రెఫేలీ ని ప్రేమించిన లియోనార్డ్
ఆమె కోసం మతం మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు. క్యాథలిక్ అయిన లియోనార్డ్ ఇప్పుడు
యూదమతంలోకి మారుతున్నారు.
|
తొలిసారి జెనీలియా నవ్వకుండా నటిస్తోంది!
‘నవ్వే నా ఆభరణం’ అని చెప్పే జెనీలియా ఇప్పటి వరకూ ఆమె నటించిన అన్ని చిత్రాల్లోనూ
చక్కగా నవ్వే పాత్రలనే పోషించింది. అయితే, ఇప్పుడు అందుకు భిన్నంగా, సీరియస్ గా
కనిపించే పాత్ర చేస్తోంది. సంతోష్ శివన్ దర్శకత్వంలో మలయాళంలో ఆమె నటిస్తున్న
‘ఉరిమి’లో యువ రాణిగా చేస్తోంది. రాణులు గంభీరంగా ఉంటారు కాబట్టి, నేను సినిమా
మొత్తం సీరియస్ గా ఉంటాను. నటిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ‘ఉరుమి’
అని అంటోంది జెనీలియా.
|
------------------------------------------------------ |
మూడవసారి వెంకీ-నయనతార... రామ్ తో ముగ్గురు
వెంకటేష్- నయనతారల కాంబినేషన్లో మరో స్త్రీ నామధేయ చిత్రం త్వరలో రాబోతోంది. గతంలో ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాల్లో నటించిన వీరి తాజా చిత్రం పేరు ‘సావిత్రి’. దీనికి తేజ దర్శకుడు.
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘కందిరీగ’ చిత్రంలో మగ్గురు హీరోయిన్లు వున్నారు. ఆ పాత్రలను హన్సిక, స్వాతి, నిషా అగర్వాల్ పోషిస్తున్నారు. సోనూసూద్ ఇందులో విలన్ గా చేస్తున్నారు.
|
సెల్వ రాఘవన్ తో రానా... ప్రభుదేవాతో విశాల్
‘ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే’ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ ఓ చిత్రం ప్లాన్ చేసింది. అయితే బడ్జెట్ ఎక్కువవుతుందనే కారణంతో పక్కన పెట్టారు. అయితే, ఇప్పుడు సెల్వరాఘవన్ చెప్పిన మరో కథ నచ్చడంతో త్వరలోనే ఈ ప్రేమ కథా చిత్రం ప్రారంభం కానుంది.
ఇటీవల వరుస పరాజయాలు పొందిన విశాల్ త్వరలో ప్రభుదేవా దర్శకత్వంలో ఓ చిత్రంలో చేస్తున్నారు. దీనికి మాజీ నటి, విశాల్ వదిన శ్రియారెడ్డి నిర్మాత కావడం విశేషం.
|
మురుగదాస్ తో శర్వానంద్... నానినతో స్వాతి
‘గమ్యం’, ‘అందరిబంధువయా’ వంటి మంచి చిత్రాల నటుడు శర్వానంద్ కు ఓ మంచి అవకాశం లభించింది. ‘గజిని’ మురుగదాస్ హిందీ, తమిళ్, తెలుగులో నిర్మించే ఓ చిత్రంలో హీరోగా శర్వానంద్ ఎంపికయ్యారు. దీన్ని హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మించడం విశేషం.
‘గాయం-2’ నిర్మించిన ధర్మకర్త త్వరలో నాని, స్వాతి జంటగా ఓ ప్రేమ కథా చిత్రం నిర్మిస్తున్నారు. ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ దర్శకుడు ముళ్ళపూడి వర దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ చిత్రం నిర్మిస్తారు.
|
బాలీవుడ్లో ఇలియానా ‘సైలెంట్’... సిద్దూతో నితిన్
అనురాగ్ బసు దర్శకత్వంలో ఇలియానా బాలీవుడ్ లోకి ప్రవేశిస్తోంది. రణభీర్ కపూర్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ప్రధాన కథానాయికగా చేస్తోంది. దీనికి ‘సైలెంట్’ అని పేరు పెట్టారు.
వరుస పరాజయాలు పొందిన యువ హీరో నితిన్ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో సిద్దార్థ కాంబినేషన్లో రెండో హీరోయిన్ గా చేస్తున్నారు. అమృతారావు హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు..
|
హీరోయిన్లకు జాగ్రత్త చెబుతున్న దీపిక
సినిమారంగంలో సక్సెస్ అయిన హీరోయిన్లు పెళ్ళి విషయంలో జాగ్త్రత్తగా వుండాలి. భార్యాభర్తలు సమానంగా లేకుంటే కలతలొస్తాయి. అందుకనే నాతో సమానంగా సక్సెస్ లో వున్న వ్యక్తినే నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడే ఏ గొడవలు రావు అని చెబుతున్న దీపిక పదుకొనే, తను పెళ్ళి చేసుకోవడానికి ఇంకో ఎనిమిదేళ్ళు పడుతుందని అంటోంది.
|
------------------------------------------------------ |
రాంగోపాల్ వర్మ, లారెన్స్ తో నాగచైతన్య
తమన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య గీతా ఆర్ట్స్ పతాకంపై
చేస్తున్న చిత్రం ఫ్రిబవరిలో విడుదలవుతుంది. కాజల్ హీరోయిన్ గా అజయ్
భూయాన్ దర్శకత్వంలో కామాక్షి కళాచిత్ర పతాకంపై చేస్తున్న చిత్రం వేసవి సెలవుల్లో
విడుదల చేస్తారు. ఆ తర్వాత లారెన్స్ దర్శకత్వంలో ఓ చిత్రం నాగచైతన్య చేస్తారని
అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ - నాగచైతన్య కాంబినేషన్ లో ఓ చిత్రం
సి.కళ్యాణ్ ఫ్లాన్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.
|
హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ లో శ్రియ
ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ నిర్మిస్తున్న ‘పానీ’ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా
చేస్తున్నారు. అతని సరసన శ్రియ నటించడం విశేషం. ధనిక, పేదల మధ్య
నీటికోసం జరిగే పోరాటం కథాంశంగా, సైన్స్ ఫిక్షన్ తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
కమర్షియల్ అంశాలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుందని
అంటున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నిఅందిస్తున్నారు. ఈ చిత్రంలో
నటించే అవకాశం వచ్చినందుకు శ్రియ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.
|
నాగ్ తో సురేందర్... పూరితో వరుణ్ తేజ్
‘కిక్’ దర్శకుడు సురేందర్ రెడ్డికి నాగార్జున అభిమాన నటుడట. త్వరలో
నాగార్జునతో ఓ చిత్రం చేసేందుకు స్క్రిప్టు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి సోదరుడు నాగబాబు ఇటీవల ‘ఆరెంజ్’ నిర్మించిన
విషయం తెలిసిందే. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా రంగ ప్రవేశం
చేసేందుకు శిక్షణ పొందుతున్నాడు. రామ్ చరణ్ ను ‘చిరుత’తో పరిచయం చేసిన
పూరిజగన్నాధ్ దర్శకత్వంలోనే వరుణ్ తేజ్ తొలిచిత్రం ఉంటుందని తెలుస్తోంది. |
రామ్ చరణ్ తో వంశీ... ‘రాజకీయం’పై వర్మ
‘ఆరెంజ్’ చేసిన రామ్ చరణ్ త్వరలో ‘మెరుపు’ ఆ తర్వాత కృష్ణవంశీ చిత్రం
చేస్తున్నారు. ఇటీవల ‘బృందావనం’తో హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో కూడా ఓ
చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు. దీన్ని వంశీ రెండు చిత్రాలు నిర్మించిన దిల్ రాజే
నిర్మించే అవకాశం ఉంది. రాజకీయాలపై మాంచి చిత్రం చేయాలని ఉందని రామ్
గోపాల్ వర్మ చెబుతున్నారు. ‘రాజకీయం’ పేరుతో నిర్మించే ఈ చిత్రంలో ప్రస్తుతం
రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకుల మనస్తత్వాలు ప్రతిబింబిస్తాయని
అంటున్నారు.
|
బూతు చిత్ర పరిశ్రమపై ఇమ్రాన్ హష్మి చిత్రం
చిత్ర పరిశ్రమతో పాటు మన దేశం నీలి చిత్రాల పరిశ్రమ కూడా భారీస్థాయిలో
నడుస్తోంది. యువహీరో ఇమ్రాన్ హష్మి హీరోగా కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వంలో
బూతుచిత్రాలపై ‘ఎక్స్ - ఎక్స్ - ఎక్స్’ అనే చిత్రం చేస్తున్నారు. బ్లూ ఫిలింస్
తీయడం, దాన్ని మార్కెటింగ్ చేయడం మొదలైన అంశాలను ఇందులో విపులంగా
చూపుతారట.
|
------------------------------------------------------ |
నయనతార, నిత్యపెళ్ళికొడుకు, పరమవీరచక్ర వివాదాలు
బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నయనతారను తీసుకున్నందుకు
తమిళనాడులో కొందరు సినిమా అభిమానులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ప్రభుదేవా కుటుంబంలో చిచ్చుపెట్టిన నయనతారను సీత పాత్ర నుండి తొలగించాలని
డిమాండ్ చేశారు.
‘నిత్యపెళ్ళికొడుకు’ చిత్రానికి ‘జగదాంబ సెంటర్’ అనే ట్యాగ్ లైన్
పెట్టుకోవడానికి అనుతించిన ఫిలిం ఛాంబర్ ఇప్పుడు- కొందరి మనోభావాలకు
ఇబ్బందికరంగా వుందంటూ తొలగించడంపై ఈ చిత్ర దర్శక, నిర్మాతలు నిరసన
తెలిపారు.
దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులకు ఇచ్చే ‘పరమవీరచక్ర’ బిరుదును ఓ
వ్యాపార చిత్రానికి పెట్టుకోవడం తగదని తక్షణం దాన్ని మార్చుకోవాలంటూ ‘మాజీ
సైనికుల సంక్షేమసంఘం’ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
|
అమృతారావు ‘ఓ మై ఫ్రెండ్’గా వస్తోంది
‘అతిథి’లో మహేష్ బాబు సరసన నటించిన బాలీవుడ్ నటి అమృతారావు ఇటీవల
చేసిన సినిమాలన్నీ తన్నేయడంతో ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అమృత
తెలుగులో ఓ చిత్రం చేస్తోంది. దిల్ రాజు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ
చిత్రంలో సిద్ధార్థ కాంబినేషన్లో అమృతారావు మరోసారి తెలుగు తెరపై కనిపిస్తోంది.
ఈ చిత్రానికి ‘ఓ మై ఫ్రెండ్’ అని పేరు పెట్టాలనుకుంటున్నారు.
|
రాజమౌళి ‘ఈగ’ కోసం ఏర్పాట్లు
‘మగధీర’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజమౌళికి గ్రాఫిక్స్ అంటే
అభిరుచితోపాటు వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడంలో కూడా అనుభవం
వుంది. ఇప్పుడు గ్రాఫిక్స్ నే ప్రధానంగా చేసుకుని ‘ఈగ’ అనే ప్రయోగాత్మక
చిత్రం చేస్తున్నారు. ఇందులో నాని హీరోగా, సుదీప్ విలన్ గా నటిస్తారని,
హీరోయిన్ గా ఓ ప్రముఖ నటి చేస్తుందని తెలుస్తోంది.
|
డిసెంబర్ 16న వెంకటేష్ ‘నాగవల్లి’
పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నిర్మించిన బెల్లంకొండ సురేష్ నిర్మించిన
‘నాగవల్లి’ డిసెంబర్ 16న విడుదలవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని
చివరిపాటను బాదామిలో చిత్రీకరిస్తున్నారు. ‘చంద్రముఖి-2’గా రూపొందిన
ఈ చిత్రంలో అనూష్క, రిచ, శ్రద్దాదాస్, కమలిని ముఖర్జీ, పూనమ్ కౌర్,
సుజి హీరోయిన్లుగా నటించారు. గురుకిరణ్ సంగీతాని్న అందించారు.
|
ఇలాకాకుంటే... అలా వుండేది త్రిష
ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలని చెబుతోంది అందాల తార త్రిష. ఊరికే
కాలక్షేపం చేసే వాళ్లంటే నాకు నచ్చదు. ఒక్క క్షణం సమయం దొరికినా నేను వృధా
చెయ్యనని అంటోంది. తను హీరోయిన్ కానట్లయితే- క్రిమినల్ సైకాలజీ
చదివేదట. అదికూడా మిస్ అయితే- క్రీడాకారిణి అయ్యేదట.
చిన్నప్పటినుండీ హైజంప్, లాంగ్ జంప్, బాస్కెట్ బాల్ బాగా ఆడేదాన్ని-
అంటూ చెబుతోంది.
|
------------------------------------------------------ |
‘వెల్ కమ్ టుది జంగిల్’తో హిందీలో రామ్ చరణ్?
‘మగధీర’తో సంచలన విజయం సాధించిన రామ్ చరణ్ మూడవ చిత్రం ‘ఆరెంజ్’ 26న విడుదలవుతోంది. రానా లానే రామ్ చరణ్ కూడా హిందీ చిత్రం చేయాలని ఆసక్తిగా వున్నాడట. ఫరూక్ కబీర్ దర్శకత్వంలో ‘వెల్ కమ్ టుది జంగిల్’ అనే చిత్రం మొదటిగా చేయాలనుకుంటున్నాడని వార్తలొచ్చాయి. అమెజాన్ అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా వుంటుందని అంటున్నారు.
|
దర్శకులుగా రోహిణి, అంబిక, జాన్ అబ్రహాం
నటులుగా రాణించి దర్శకత్వం వేపు మొగ్గుచూపిన వారు చాలామంది వున్నారు. దక్షిణాది చిత్రాల్లో ప్రముఖ నటిగా రాణించిన అంబిక త్వరలో తమిళ, మాలయాళ భాషల్లో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
రఘువరన్ ను పెళ్ళిచేసుకున్న నటి రోహిణి కూడా తమిళంలో ‘భంబరం’ అనే చిత్రంతో దర్శకురాలవుతోంది. పలు చిత్రాల్లో ప్రముఖ పాత్రలు చేసిన రోహిణి ఇటీవల కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహించడంతోపాటు, కొన్ని సినిమాలకు రచన చేశారు.
ప్రముఖ బాలీవుడ్ హీరో, బిపాసబసు ప్రియుడు జాన్ అబ్రహాం దర్శకుడు కావాలనుకుంటున్నాడు. సన్నిహితులైన దర్శకులు, రచయితల సహకారంతో మంచి స్క్రిప్టు సిద్ధం చేస్తున్నానని అంటున్నాడు జాన్.
|
జి.తెలుగులో ‘పసుపు-కుంకుమ’ సీరియల్
అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న డైలీ సీరియల్ ‘పుసుపు-కుంకుమ’ ‘జితెలుగు’ ఛానెల్ల్లో ప్రసారం ప్రారంభమైంది. సావిత్రి అనే యువతి పసుపు - కుంకుమలకు ఎటువంటి గౌరవాన్ని కల్పిస్తుందనే కథాంశంతో, మన సంస్కృతి, సంప్రదాయాలను చూపుతూ ఈ సీరియల్ వుంటుందని- అక్కినేని నాగార్జున చెప్పారు. దీనికి విజయభాస్కరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. |
త్వరలో హీరోగా నాగబాబు కుమారుడు
అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో ‘ఆరెంజ్’ నిర్మించిన నాగబాబు, త్వరలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో చిత్రాలు చేస్తానని చెప్పారు. తన కుమారుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం నటనలో శిక్షణ పొందుతున్నాడని, మరో ఏడాదిన్నర తర్వాత అతను హీరోగా రంగప్రవేశం చేస్తాడని చెప్పారు.
|
కమల్ హసన్ మల్టీస్టారర్ చిత్రం మార్చినుండి...
ఇటీవల ‘మన్మథన్ అంబు’లో చేసిన కమల్ హసన్ ఇప్పడు ‘తలైవన్ ఇరుక్కిరాన్’ అనే మల్టీస్టారర్ చిత్రం చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖ నటులు నటిస్తారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించాలని కమల్ అనుకుంటున్నాడు.
|
------------------------------------------------------ |
'నాగవల్లి'లో అభిమానులపై వెంకీ పాట!
'చంద్రముఖి-2' 'నాగవల్లి'లో వెంకటేష్‌పై ఓ స్పెషల్ పాట్ పెట్టారట. అభిమానులు - హీరోల
అనుబంధాన్ని చెప్పే ఈ పాటను వెంకటేష్‌తోపాటు 60మంది డాన్సర్లపై చిత్రీకరించారు. డిసెంబర్ మొదటి
వారంలో విడుదలవుతున్న ఈ చిత్రంలోని ఈ పాట 'అభిమానిలేనిదే హీరోలు లేరులే' అంటూ
సాగుతుంది.
|
త్వరలో 'రాణి రుద్రమదేవి'గా విజయశాంతి
తెలంగాణ రాజకీయాల్లో బిజీ అయిపోయి గత నాలుగేళ్ళుగా సినిమారంగానికి దూరంగా వున్న రాములమ్మ
విజయశాంతి త్వరలో వెండితెరపైకి రానుంది. కాకతీయ వంశస్థురాలైన రాణి రుద్రమదేవి పాత్రలో ఆమె
నటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీస్థాయిలో నిర్మించే ఈ చిత్రం తన నట జీవితంలో మైలురాయిగా
నిలవాలని కోరుకుంటున్నారు.
|
సినిమాలే కొండంత బలమంటున్న నయనతార
గతంలో శింబుతో, ఇప్పుడు ప్రభుదేవాతో ప్రేమలోపడి వార్తలకెక్కిన నయనతార ఇప్పుడు అన్ని
విషయాలనూ పక్కనపెట్టి కెరీర్‌పైనే దృష్టి పెడతానంటోంది. బాధలను మరచిపోవాలంటే వ్యాపకమే మందు.
దక్షిణాది భాషలన్నింటిలో బిజీగా వున్న నాకు సినిమాలే కొండంత బలం- అని అంటోంది.
|
దేవ్ పటేల్, పామెలాతో మొబైల్ సినిమా
'స్లమ్ డాగ్ మిలియనీర్' హీరో దేవ్‌పటేల్, అందాలనటి పామెలా అండర్సన్ కలిసి ఓ ఏడున్నర
నిమిషాల మొబైల్ సినిమాలో నటించారు. ఫిలిప్ దర్శకత్వంలో 12మెగాఫిక్సెల్ సామర్థ్యం వున్న నోకియా
ఎన్-8 సెల్ ఫోన్‌తో ఈ చిత్రం చిత్రీకరించి, మొబైల్ ఫోన్స్‌లోకి ఎక్కించడం విశేషం. బ్రిటన్‌లో సంచలన
విజయం సాధించిన ఈ చిత్రం పేరు 'ది కమ్యూటర్'.
|
అమ్మకి సిమ్రాన్ నో... సెకండ్‌కి స్వాతి 'ఓకె'
దక్షిణాది గ్లామర్ హీరోయిన్‌గా వెలిగిన సిమ్రాన్ ఇప్పుడు సినిమాల్లేక ఖాళీగా వుంది. టీవిలో కూడా
చేసింది. ఇటీవల ఓచిత్రంలో తల్లిపాత్ర ఆఫర్ చేస్తే తిరస్కరించింది. అటువంటి పాత్రలు చేసే వయస్సు
రాలేదని అంటోంది.
'అష్టాచెమ్మా' నటి కలర్స్ స్వాతికి ఇటీవల తమిళంలో విక్రమ్‌తో ఓ చిత్రం వచ్చింది. కానీ, ఆ చిత్రం
ఆగిపోయింది. ఇప్పుడు 'అప్పలరాజు'లో చేస్తోంది. 'కందిరీగ'లో సెకండ్ హీరోయిన్‌గా అవకాశం
వచ్చినా 'ఓకె' చెప్పింది.
|
------------------------------------------------------ |
మహేష్ తో మెహర్ రమేష్.... వేసవికి పవన్ ‘లవ్ లీ’
ఎన్టీఆర్ తో ‘కంత్రీ’, ప్రభాస్ తో ‘బిల్లా’ చేసి, ఇప్పుడు ‘శక్తి’ రూపొందిస్తున్న మెహర్ రమేష్
త్వరలో మహేష్ బాబుతో మరో భారీ చిత్రం చేస్తున్నాడు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం మే
తర్వాత ప్రారంభమవుతుంది.
‘లవ్ ఆజ్ కల్’ ఆధారంగా జయంత్ సి.పర్జానీ దర్శకత్వంలో గణేష్ బాబు నిర్మిస్తున్న ‘పవన్ కళ్యాణ్
లవ్ లీ’ వారణాసిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో మరో షెడ్యూల్కి
సిద్ధమయ్యింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్, కృతి మరో హీరోయిన్ గా చేస్తోంది.
|
ఎన్టీఆర్ ‘యుగానికొక్కడు’ పుస్తకావిష్కరణ 24న
సీనియర్ జర్నలిస్ట్ యు.వినాయకరావు ఎన్టీఆర్ 60ఏళ్ళ నట ప్రస్థానంపై రాసిన ‘యుగానికొక్కడు’
పుస్తకం ఆవిష్కరణ 24న జరుగుతుంది. దాసరి నారాయణరావు, సి.నారాయణరెడ్డి,
బాలకృష్ణతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో సాయంత్రం 6గంటలకు
జరుగుతుంది.
|
యువతకు ‘ఏమైంది ఈవేళ’ నచ్చింది
సంపత్ నంది దర్శకత్వంలో రాధామోహన్ నిర్మించిన ‘ఏమైంది ఈవేళ’ విడుదలై యువతను
ఆకట్టుకుంటోంది. వరుణ్ సందేష్ తో కాజల్ చెల్లెలు నిషా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వినోదమే
విజయాన్ని అందించిందని దర్శకుడు చక్రి అన్నారు. మాటలకు మంచి స్పందన వస్తోంది. దర్శకుడిలో
తపన వుందని నిర్మాత రాధామోహన్ చెప్పారు. |
ఎన్టీఆర్ ‘రచ్చ’ ప్రారంభం... కళ్యాణ్ రామ్ కొత్త చిత్రాలు
ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ ప్రసాద్ నిర్మిస్తున్న ‘రచ్చ’
లాంఛనంగా ప్రారంభమైంది. డిసెంబర్ నుండి షూటింగ్ జరుపుకునే ఈ చిత్రంలో మరో హీరోయిన్
వుంటుంది. ‘కిక్’ శ్యామ్, ప్రకాష్ రాజ్ ప్రధానపాత్రలు పోషిస్తారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్,
ఫొటోగ్రఫీ : రసూల్.
‘కత్తి’ నిర్మించిన కళ్యాణ్ రామ్ విజయాన్ని సాధించలేకపోయాడు. అయినా, తమ సంస్థపై వరుసగా
బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితరులతో చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు.
|
డిసెంబర్ 5న ‘నంది’ అవార్డులు... పైరసీపై కమిటీ
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంది అవార్డుల వేడుక డిసెంబర్ 5న లలితకళా తోరణంలో
జరుగుతుంది. ముఖ్యమంత్రి రోశయ్య, సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొంటారు.
సినిమా పైరసీని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఓ కమిటీనీ
నియమించింది. ఇందులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి, మోపిదేవి
వెంకటరమణ సభ్యులుగా వుంటారు.
|
------------------------------------------------------ |
‘రోబో’ కాపీ అంటున్న తెలుగు, తమిళ రచయితలు
రజనీ - శంకర్ల సూపర్ హిట్ ‘రోబో’ కథను కాపీ కొట్టారంటూ ఒకేసారి తెలుగు, తమిళ రచయితలు
ప్రకటించడం విశేషం. ప్రముఖ తెలుగు నవలా రచయిత మైనంపాటి భాస్కర్ రాసిన ‘బుద్ధిజీవి’ నుండి
యదాతథంగా చాలా సన్నివేశాలు ‘రోబో’లో వాడుకున్నారంటూ ఇటీవల ఓ ప్రతికలో వివరంగా
ప్రచురించారు. ఇక, ‘రోబో’ కథ తనదేనంటూ తమిళ రచయిత్రి ఆర్ణిక నాజర్ చెన్నై పోలీసులకు
ఫిర్యాదు చేశారు. అన్నామలై యూనివర్శిటీలో హెల్త్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆమె, ‘కుముదం’
పత్రికలో రాసిన ‘రోబో తొళిర్ నావై’ను శంకర్ కాపీ చేశారని అంటోంది.
|
22నుండి బాలయ్య - బాపుల ‘శ్రీరామరాజ్యం’
బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో యలమంచిలి
సాయిబాబు నిర్మిస్తున్న ‘శ్రీరామరాజ్యం’ 8పాటలు ఇళయరాజా రికార్డింగ్ పూర్తి చేశారు. శ్రీరాముడు
రాజుగా పరిపాలించిన ఓ ప్రధాన ఘట్టాన్ని కథాంశంగా తీసుకుని బాపు-రమణల సారథ్యంలో ఈ చిత్రం
చేస్తున్నాం. ఈనెల 22నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని నిర్మాత సాయిబాబు
చెప్పారు.
|
వరుడు కోసం ప్రియాంక... రెచ్చిపోయిన కమలిని
చాన్నాళ్ళుగా మా కుటుంబ సభ్యులు పెళ్ళి చేసుకొమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ఏదో చెప్పి
తప్పించుకుంటున్నాను. అయితే, ఇప్పుడు నాకు పెళ్ళి వయసొచ్చిందని అర్థమయ్యింది. అందుకనే
తగినవాడిని వెదకమని ఇంట్లో చెప్పేశా. ఏ క్షణంలో అయినా వరుడు ఓకె కావచ్చునంటూ చెబుతోంది
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. తెలుగులో ఇప్పటివరకూ సంప్రదాయికంగా కనిపించిన కమలిని ముఖర్జీ
‘కుట్టిస్టాంక్’ అనే మలయాళ చిత్రంలో నగ్నంగా నటించిందట. మమ్ముట్టి సరసన పల్లెటూరి
అమ్మాయిగా ఇందులో కమలిని నటిస్తోంది.
|
కమల్ ‘మరుద నాయగమ్’... ఇంటింట ‘అన్నమయ్య’ నాగ్
కొంతభాగం చిత్రీకరించాక ఆగిపోయిన కమల్ హసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరుద నాయగమ్’ మళ్ళీ ప్రారంభం
అవుతోందని వార్తలొస్తున్నాయి. కమల్ తో ‘దశావతారం’ నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ ఈచిత్రం
చేస్తారని తెలుస్తోంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా చేసిన ‘అన్నమయ్య’
విజయంతోపాటు మంచి పేరు కూడా తెచ్చింది. ఇప్పుడు రాఘవేంద్రరావు ‘ఇంటింటా అన్నమయ్య’
పేరుతో ఓ సోసియో ఫాంటసీ చిత్రం చేసే ప్రయత్నంలో వున్నారు. ఇందులోనూ నాగార్జున నటిస్తారు.
|
మనోజ్, వరుణ్ ల చిత్రం... డిసెంబర్ 30న ‘మిరపకాయ్’
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జె.కె.ఫిలిం కార్పొరేషన్ విశాల్ లేకుండా ఓ చిత్రం నిర్మిస్తోంది. మంచు
మనోజ్, వరుణ్ సందేశ్ ఇందులో హీరోలు. ముక్కోణపు ప్రేమకథతో ఈ చిత్రం తిరు దర్శకత్వంలో
డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుందని నిర్మాత విక్రమ్ కృష్ణ చెప్పారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో
రవితేజ, రిచ, దీక్ష కాంబినేషన్లో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ‘మిరపకాయ్’ నిర్మాణం పూర్తి
కావస్తోంది. డిసెంబర్ 30న దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
|
------------------------------------------------------ |
బాలీవుడ్ కు అనూష్క... హిందీ ‘అరుంధతి’ ఐశ్వర్య
తమిళంలో సూర్యతో అనూష్క చేసిన ‘సింగమ్’ (తెలుగులో ‘యముడు’) ఘనవిజయం
సాధించింది. ఆ చిత్రాన్ని హిందీలో ‘గోల్ మాల్ 3’ దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్
హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన అనూష్కనే హిందీలో కూడా తీసుకోవాలని
అనుకుంటున్నారు. తెలుగులో అనూష్క నటించిన ‘అరుంధతి’ని హిందీలో రీమేక్ చేయాలనే
ప్రయత్నాలు జరుగుతున్నాయి. 3డిలో నిర్మించే ఈ భారీ చిత్రంలో నాయికగా ఐశ్వర్యారాయ్ చేసే అవకాశం
కనిపిస్తోంది.
|
నటన మీద అమితాబ్ కు ఎంతో ఆసక్తి
ఓ పక్క సినిమాలు, మరో పక్క బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ వంటి కార్యక్రమాలు, ఇంకో పక్క
పలు వ్యాపార ప్రకటనలు చేస్తూ అమితాబ్ ఫుల్ బిజీగా కనిపిస్తారు. డబ్బు సంపాదన కోసమే ఇదంతా
చేస్తున్నట్లు అనుకునే వారికి అమితాబ్ వివరణ ఇచ్చారు - ‘‘కష్టాన్ని నమ్ముకున్న నాకు కాసుల
లెక్కలు ఎప్పుడూ తెలియవు. డబ్బు కోసమే నేను ఇన్ని చేస్తున్నానని కొందరు అనుకుంటారు. అందులో
నిజంలేదు. నేను చేస్తున్నదంతా నటనమీద నాకున్న ఆసక్తి కొద్దీ మాత్రమే - నని అమితాబ్ చెప్పారు.
|
26న ‘ఆరెంజ్’... నిజామాబాద్ లో ‘బృందావనం’
రామ్ చరణ్ చేసిన యూత్ ఎంటర్ టైనర్ ‘ఆరెంజ్’ 26న విడుదలవుతుంది. జెనీలియా నాయికగా
చేసిన ఈ చిత్రానికి హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రం లోగోను కూడా ఇటీవల మార్చారు.
విజయవంతమైన ఎన్టీఆర్ చిత్రం ‘బృందావనం’ 50 రోజుల వేడుకను నిజామాబాద్ లో జరపడానికి దిల్
రాజు నిర్ణయించడం విశేషం. |
జేమ్స్ కామరూన్ ‘క్లియోపాత్ర’... నమిత డాన్స్ స్కూల్
‘టైటానిక్’, ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామరూన్ త్వరలో ‘అవతార్ -2’, ‘అవతార్-3’
చిత్రాలు చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే, ఆయన ఈజిప్ట్ యువరాణి ‘క్లియోపాత్ర’
పై చిత్రం చేస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా చేయాలనుకుంటున్న ఈ చిత్రంలో క్లియోపాత్రగా ఏంజలినా
జోలి అయితే బాగుంటుందని భావిస్తున్నారు. సెక్సీ నటి నమిత త్వరలో చైన్నైలో డాన్స్ స్కూల్
ప్రారంభిస్తోంది. సల్సా, భరతనాట్యంలో నాకు ప్రవేశం ఉంది. వాటితో పాటు వెస్ట్రన్ డాన్స్లు కూడా మా
స్కూల్ లో నేర్పిస్తామంటూ నమిత ప్రకటనలు ఇస్తోంది.
|
సీరియస్ పాత్రలు చెయ్యొద్దంటున్న పద్మప్రియ
కెరీర్ ప్రారంభంలో తప్పు చేసి తొలిచిత్రంలోనే ఇద్దరు పిల్లల తల్లిగా నటించాను. ఆ తర్వాత కూడా యూత్
ఫుల్ పాత్రలు కాకుండా నటనకు అవకాశం ఉంది కదా అని సీరియస్ పాత్రలు చేశాను. దాంతో పద్మప్రియ
సీరియస్ పాత్రల నటి అనే ముద్ర నాపై పడిపోయింది - అని అంటోంది ‘అందరి బంధువయా’నటి
పద్మప్రియ. ఇప్పుడు రూటు మార్చి గ్లామర్ పాత్రలకు మళ్ళాలని ఆమె ప్రయత్నిస్తోంది. పద్మప్రియ
తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 30కి పైగా చిత్రాలు చేసి పలు అవార్డులు
అందుకుంది.
|
------------------------------------------------------ |
సంక్రాంతికి బాలయ్య, ప్రభాస్, రవితేజ, సునీల్...
దాసరి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘పరమవీరచక్ర’ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో చివరి షెడ్యూల్
జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా అందివ్వాలని ప్రయత్నం జరుగుతోంది. ప్రభాస్
హీరోగా దశరధ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’ సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు
అనుకుంటున్నారు. ఇందులో కాజల్, తాప్సీ నాయికలు. రవితేజ నటిస్తున్న ‘మిరపకాయ్’,
సునీల్ తో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వలో చేస్తున్న ‘అప్పలరాజు’ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల
మందుకొస్తున్నాయి.
|
ఎన్టీఆర్ ‘రచ్చ’... విష్ణు ‘వస్తాడు నా రాజు’
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రానికి ‘అతడే ఆమె సైన్యం’, ‘ఊసరవెల్లి’ పేర్లు
అనుకుని, తాజాగా పక్కా మాస్ టైటిల్ ‘రచ్చ’ అని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తమన్నా
నాయికగా చేస్తున్న ఈ చిత్రం 17న ప్రారంభం అవుతోంది. మంచు విష్ణు, తాప్సి జంటగా హేమంత్
మధుకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘వస్తాడు నా రాజు’ చిత్రం తాజా షెడ్యూల్ ఇటలీలో జరిగింది. ప్రకాష్
రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
|
‘ఢమరుకం’లో నాగ్... విష్ణు వర్థన్ తో పవన్ కళ్యాణ్
‘కిక్’, ‘డాన్ శీను’ వంటి భారీ విజయవంతమైన చిత్రాలు అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్
పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం జనవరి 14న ప్రారంభం అవుతుంది.
అనూష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఢమరుకం’ అని పేరు పెట్టారు. అజిత్ తో తమిళంలో
విజయవంతమైన ‘బిల్లా’ అందించిన విష్ణువర్థన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఆర్కా మీడియా ఓ
చిత్ర నిర్మాణానికి సన్నాహం చేస్తోంది.
|
మూడు భారీ బాలీవుడ్ చిత్రాలు వదులుకున్న అసిన్
‘గజిని’ వంటి సూపర్ హిట్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అసిన్ ఆ తర్వాత పరాజయాలతో
వెనుకబడిందని పరిశ్రమ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే, అటువంటిదేమీ లేదు. నేనే మూడు భారీ
చిత్రాలను వదులుకున్నాను. ఎక్కువ సినిమాల్లో వరుసగా చేసేయాల్సిన అవసరం నాకు లేదు. అలా
చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అందుకనే ఏడాదిగా ఏ చిత్రం అంగీకరించలేదు. త్వరలోనే కొత్త చిత్రం
విశేషాలు చెబుతానని - అంటోంది అసిన్. ఆమె ప్రస్తుతం విజయ్ తో తమిళంలో ఓ చిత్రం చేస్తోంది.
|
రాష్ట్రంలో ‘సినీ పర్యాటక కేంద్రం’ ఏర్పాటు
సినిమా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘సినీ పర్యాటక కేంద్రం’ ప్రారంభించింది. ఈ
కేంద్రం సినిమా చిత్రీకరణకు అనువైన ప్రదేశాలపై అవగాహన కల్పిస్తుంది. షూటింగ్ కు కావాల్సిన
అనుమతులు వెంటనే లభించేలా కృషి చేస్తుంది. సినిమా చిత్రీకరణకు అవసరమైన వసతి, రవాణా,
కేటరింగ్, రక్షణను ఈ కేంద్రం నిర్మాతలకు ప్యాకేజి కింద అందజేస్తుంది.
|
------------------------------------------------------ |
ఫిలిం డైరెక్టర్ గా, స్టూడెంట్ గా పవన్ కళ్యాణ్
భారీ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు క్రీస్తు
చిత్రాన్ని బాలలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. క్రీస్తు
స్ఫూర్తితో చిత్ర నిర్మాణం చేసే దర్శకుడిగా పవన్ ఈ చిత్రంలో చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే,
వినాయక్ దర్శకత్వంలో దానయ్య నిర్మించే చిత్రంలో పవన్ కళ్యాణ్ కాలేజి స్టూడెంట్ గా చేస్తున్నారు.
గతంలో పవన్ స్టూడెంట్ పాత్రలు పోషించిన ‘ఖుషీ’, ‘జల్సా’ మొదలైన చిత్రాలన్నీ విజయవంతం
కావడం విశేషం.
|
అమ్మ రాజశేఖర్ తో రవితేజ... ‘ఈగ’ హీరో నాని
గతంలో మంచి ఫ్లాప్ చిత్రాన్ని అందించిన అమ్మ రాజశేఖర్ - రవితేజ కాంబినేషన్ లో మరో చిత్రం చేసేందుకు
చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందిస్తున్న ‘ఈగ’ చిత్రం త్వరలో
ప్రారంభమవుతుంది. ఇందులో హీరోగా నానిని ఎంపిక చేశారు. ఓ ప్రముఖ నటి ఇందులో హీరోయిన్ గా
చేస్తుంది.
|
తేజ, త్రివిక్రమ్ లతో వెంకటేష్ చిత్రాలు
వెంకటేష్ ‘నాగవల్లి’ డిసెంబర్ 2న విడుదలవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న
చిత్రం డిసెంబర్ 3న ప్రారంభం అవుతుంది. తేజ దర్శకత్వంలో వెంకటేష్ ఓ చిత్రం చేస్తున్నారు.‘సావిత్రి’
పేరుతో నిర్మించే ఈ చిత్రం కూడా డిసెంబర్ లోనే ప్రారంభం అవుతుందని అంటున్నారు. |
రెమ్యునరేషన్ లో రికార్డు సృష్టిస్తున్న ఇలియానా
అందాలనటి ఇలియానా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన ఇమేజ్ ని పెంచుకుంటూ పోతోంది.
రెచ్చిపో, సలీమ్ వంటి సూపర్ ఫ్లాప్ చిత్రాల తర్వాత కూడా కోటి తీసుకున్న ఇలియానా ఇప్పుడు తన
పారితోషికాన్ని కోటిన్నరకి పెంచింది. అందుకు కారణం ఏమిటంటే - అది ద్విభాషా చిత్రం. దాంతో పని
దినాలు బాగు పెరుగుతాయి. శంకర్ దర్శకత్వంలో ‘త్రీ ఇడియట్స్’ తమిళ, తెలుగు వెర్షన్స్ లో
మహేష్ బాబు, విజయ్ లతో ఇలియానా చేస్తోంది. ఈ చిత్రం కోసం కోటిన్నర తీసుకుంటోంది. ఆమె
నటిస్తున్న ‘నేను నా రాక్షషి’ చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది.
|
కరీనా, కత్రీనాలతో అమీర్ ఖాన్
‘త్రి ఇడియట్స్’ వంటి సూపర్ హిట్ తర్వాత అమీర్ ఖాన్ ఓ మంచి కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. ఈ
చిత్రం పూర్తి వివరాలు తెలియనప్పటికీ ఇందులో కరీనా కపూర్, కత్రీనా కైప్ లు హీరోయన్లుగా నటిస్తారని
తెలుస్తోంది.
|
------------------------------------------------------ |
ఫిబ్రవరిలో అల్లు అర్జున్ పెళ్ళి... చిరు చిత్రం ప్రారంభం
స్నేహితురాలు స్నేహారెడ్డితో అల్లు అర్జున్ వివాహం ఖాయమైందని అల్లు అరవింద్ చెప్పారు.
ఫిబ్రవరి మూడవ వారంలో వీరిపెళ్ళి జరుగుతుందని ముఖ్యలైన కొద్దిమంది సమక్షంలో ఓ ప్రత్యేక
ప్రదేశంలో పెళ్ళి చేసుకోవాలని అర్జున్ కోరుకుంటున్నాడని తెలిపారు. చిరంజీవి మళ్ళీ
నటిస్తున్న చిత్రం ఫిబ్రవరి 18న ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. సామాజిక కథాంశంతో
ఉండే ఈ చిత్రానికి పేరు నిర్ణయించే వరకూ ‘అధినాయకుడు’ అనే పేరునే వర్కింగ్ టైటిల్ గా
కొనసాగిస్తామని చిరంజీవి చెప్పారు.
|
‘అమ్మ’ పేరుతో వర్మ అడ్వెంచర్ 3-డి చిత్రం
‘మెకన్నాస్ గోల్డ్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ వంటి భారీ అడ్వెంచర్ చిత్రాన్ని
చేయాలని ఎప్పటి నుండో ఉంది. గుప్త నిధుల కోసం ఆరాటం... అక్కడ కాళీమాత
విగ్రహం నేపథ్యంలో ‘అమ్మ’ 3-డి చిత్రం ఉంటుంది - అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తాం. వివేక్ ఓబెరాయ్,
నజీరుద్దీన్ షా, అర్జున్, జాయేద్ ఖాన్, సోనూసూద్, సుబ్బరాజు, బ్రహ్మానందం ఈ
చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తారు. జనవరిలో ప్రారంభించి ఆగస్టులో ఈ చిత్రం విడుదల చేస్తాం
అని అన్నారు.
|
26న అడివి శేషు ‘కర్మ’ విడుదల
‘కర్మ’ ఆడియోకి చాలా మంచి స్పందన వచ్చింది. ముగ్గురు అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్స్
తో చేసిన ఈ చిత్రం పాటల సిడిలో 6 పాటలు, 6 బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ ట్రాక్స్ ఉండటం ఓ
విశేషం - అని ‘కర్మ’ చిత్రం కథానాయకుడు, దర్శక నిర్మాత అడవి శేషు చెప్పారు.
మధురా ఆడియో శ్రీధర్ సహకారంతో ఈ పాటలు టాప్ 10లో స్థానం సంపాయించాయని
అన్నారు. ఈ చిత్రాన్ని 26న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
|
ట్రాన్స్ పరెంట్ బికినీలో కంగన... ఛార్మి స్లిమ్మింగ్
ఇటీవల ప్రభాస్ తో తెలుగులో చేసిన కంగనా రనౌత్ అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనుకాడని
నటిగా బాలీవుడ్ లో పేరు పొందింది. ఇప్పుడు సురేష్ అహ్లువాలియా దర్శకత్వంలో చేస్తున్న
‘రాస్కేల్స్’ చిత్రంలో మరో అడుగు ముందుకేసి - అందాలనీ కనిపించేలా ట్రాన్స్ పరెంట్
బికినీ ధరిస్తోంది. ‘మంత్ర’ తర్వాత విజయాలు లేక డీలాపడి పోయిన ఛార్మి అవకాశాల
కోసం ఇప్పుడు మరింత స్లిమ్ గా తయారు కావాలని ప్రయత్నిస్తోంది. ఆమె నటించిన
‘మంగళ’ త్వరలో విడుదల కానుంది.
|
ముమైత్ ఖాన్ ‘సుగర్ క్యాండీ’ మీడియా బిజినెస్
సెక్సీనటి, డాన్సర్ ముమైత్ ఖాన్ హీరోయిన్ గా కూడా చేసింది. అయితే, కాలం కలిసి
రాక ప్రస్తుతం ఆమె ఖాళీగా కూర్చునే పరిస్థితి వచ్చింది. అందుకనే ‘సుగర్ క్యాండీ ఎంటర్ టైన్
మెంట్స్’ పేరుతో మీడియా హౌస్ ప్రారంభించి - ఈవెంట్స్, టివి రియాల్టీ షోలు,
ఫిల్మోత్సవాలకి పంపే షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు తీయడానికి సంకల్పించింది. ఈ
సంస్ధపై చేసే చిత్రాల్లో కొత్తవారిని ప్రోత్సహిస్తాను. లాభాలను సేవా కార్య్రక్రమాలకు
వినియోగిస్తానని ముమైత్ చెబుతోంది.
|
------------------------------------------------------ |
బాలకృష్ణ ‘రౌద్రం’... పవన్ కళ్యాణ్ ‘లౌలీ’
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో కుమారచౌదరి నిర్మిస్తున్న చిత్రానికి ‘రౌద్రం’ అనే పేరు పరిశీలనలో వుంది. ఈ చిత్రంలో బాలకృష్న మూడు తరాల పాత్రలు పోషిస్తున్నారు. జయంతి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘లవ్ ఆజ్ కల్’ ఆధారంగా చేస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ‘ఖుషీగా’ అని పేరు అనుకుంటున్నారు. దీని తర్వాత వినాయక్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో చిత్రం చేస్తున్నారు. ఇటీవల ఫిలింఛాంబర్లో పవన్ కళ్యాణ్ ‘లౌలీ’ అనే పేరు రిజిస్టర్ చేశారు. అది ఏ చిత్రం కోసమన్నది త్వరలో తెలుస్తుంది.
|
వెంకీ ‘నాగవల్లి’ డిసెంబర్ 2న, నాగ్ ‘గగనం’ 3న
పి.వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి-2’లో వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియో ఈనెల 17న విడుదలవుతుంది. డిసెంబర్ 2న చిత్రం విడుదల చేస్తారు. రాధామోహన్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘గగనం’ డిసెంబర్ 3న విడుదలవుతుంది. నాగార్జున హీరోగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా ఇందులో నటిస్తున్నారు.
|
శంకర్ ‘జైబోలో తెలంగాణా’లో ప్రముఖ హీరో
ఎన్.శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘జైబోలో తెలంగాణ’ రెండు పాటలు, 60శాతం టాకీ పూర్తి చేసుకుంది. చక్రి సంగీతం, సురేందర్ రెడ్డి ఫొటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో నటిస్తున్నారు. తెలంగాణ రావడానికి కారణమైన సాయుధ పోరాట యోధుల్లో ఒక ముఖ్యమైన నాయకుడి పాత్రను ఆ హీరో చేస్తారు. త్వరలో పూర్తయ్యే ఈ చిత్రం డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. |
హన్సిక, సమంతాలతో రామ్, సెలీనా షూ ఎగ్జిబిషన్
బెల్లంకొండ సురేష్ రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘కందిరీగ’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లుంటారు. హన్సిక ప్రధాన నాయికగా చేస్తోంది. స్రవంతి రవికిషోర్ విక్కీ దర్శకత్వంలో నిర్మించే చిత్రంలో రామ్ సరసన సమంత నటిస్తోంది. బాలీవుడ్ సెక్సీనటి సెలీనా జెట్లీ 1400 జతల చెప్పులు సేకరించి, రికార్డు సృష్టించింది. త్వరలో వాటితో ఎగ్జిబిషన్ పెడుతుందట. పనిలోపనిగా త్వరలో చెప్పుల కంపెనీ కూడా పెట్టాలని ప్రయత్నిస్తోంది. అరుదైన అందమైన చెప్పులు అందుబాటులోకి తేవడమే తన లక్ష్యం అని అంటోంది.
|
డిసెంబర్ 3న వెంకీ చిత్రం... సుమంత్ తో ఆదిత్య
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం ప్రారంభం అవుతోంది. డిసెంబర్ 3నుండి ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. సుమంత్, ప్రియమణి జంటగా విజ్ దర్శకత్వంలో కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న చిత్రం దాదాపు పూర్తికావచ్చింది. ఆ దశలో ఆ చిత్రం నుండి విజ్ ను తొలగించి వి.ఎన్.ఆదిత్యను దర్శకుడిగా పెట్టారు. సుమంత్- ప్రియమణిపై ఘాటైన ముద్దు సీన్ ఈ చిత్రంలో ఓ హైలైట్ పాత్ర.
|
------------------------------------------------------ |
మణిరత్నం, మురుగదాస్ ల భారీ చారిత్రక చిత్రాలు
మహేష్ బాబు, విక్రమ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం త్వరలో ఓ భారీ చారిత్రక కల్పిత కథాచిత్రం ప్రారంభిస్తున్నట్లు
వార్తలొస్తున్నాయి. 10వ శతాబ్దంలో జరిగినట్లు చూపే ఈ కథకు స్క్రీన్ ప్లే ‘నేను దేవుడిని’, ‘షాపింగ్ మాల్’ చిత్రాల రచయిత
జయమోహన్ సమకూరుస్తారు. ‘రోబో’ నిర్మించిన సన్ పిక్చర్స్ దీనికి నిర్మాతలు. 1500ఏళ్ళ నాటి చారిత్రక కథాంశంతో,
అధునాతన సాంకేతికను జోడించి మురుగదాస్ 100కోట్ల భారీ బడ్జెట్తో ఓ చిత్రం చేసే ప్రయత్నంలో వున్నారని అంటున్నారు. ప్రముఖ
నటీనటులు ప్రధానపాత్రలు పోషించే ఈ చిత్రం భారత చలనచిత్ర రంగంలోనే కొత్త ప్రయోగం కావాలని మురుగదాస్ సంకల్పం.
|
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్
చిత్ర నిర్మాణంలో కొత్త తరానికి స్వాగతిస్తూ ‘ఇంజనీరింగ్ స్టూడెంట్స్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో
కరీంనగర్లో జరుగుతుంది. ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఆఫ్ ఇండియా, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ
ఫెస్టివల్ కి డిసెంబర్ 10లోగా ఎంట్రీలు పంపవచ్చునని సొసైటీ కార్యదర్శి వారాల ఆనంద్ చెప్పారు. విజేతలకు 6 నగదు
బహుమతులు వుంటాయి. ఆసకి్తగలవారు techfilms2010@gmail.comని సంప్రదించండి. వెబ్ సైట్ :
www.anandvarala.com.
|
వికటించిన నవదీప్ విచ్చలవిడి యాత్ర
నటుడిగాకన్నా విచ్చలవిడితనానికి మారుపేరుగా పాపులర్ అయిన నటుడు నవదీప్ ఇప్పుడు మరోసారి వార్తలకెక్కాడు. అరుణ్,
శోలన్, స్వాతి, ప్రియాంక, శ్వేతారెడ్డి మొదలైన మిత్రులతో కలిసి కృష్టా రిజర్వాయర్లో విహారయాత్ర కెళ్ళి ఇబ్బందుల్లో పడ్డారు.
హైదరాబాద్ నుండి తీసుకెళ్ళిన స్పీడ్ బోట్లో నాగార్జున సాగర్ వద్ద విహారానికెళ్ళి ఇంధనం అయిపోవడంతో ఇరుక్కుపోయిన నవదీప్
బృందాన్ని మాచర్ల పోలీసులు కాపాడారు. వీరి బృందంలో ఓ మీడియా అధిపతి కుమారుడు కూడా వున్నట్లు సమాచారం.
|
పబ్బు సాక్షిగా అల్లు అర్జున్ ప్రేమలో పడ్డాడు
యువహీరో అల్లు అర్జున్ రెగ్యులర్ గా పబ్ లను సందర్శిస్తుంటాడు. అలా పబ్బుల్లోనే స్నేహారెడ్డి అనే అమ్మాయి అతనికి పరిచయమై
ప్రేమగా మారింది. స్నేహ తండ్రి శేఖర్ రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఈ ప్రేమ విషయంలో ఇరుపక్షాలు అనుకూలంగానే
వుండటంతో త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని అల్లు అరవింద్ చెప్పారు. వేసవిలో వీరి పెళ్ళి జరుగుతుందని అంటున్నారు.
|
దీపికతో బలపడుతున్న సిద్దార్థ మాల్యా స్నేహం
కింగ్ ఫిషర్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త విజయ మాల్య కుమారుడు సిద్దార్థ మాల్యతో నటి దీపిక పడుకొనె ప్రేమలో పడిందనే వార్తలు
ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. ‘‘కింగ్ ఫిషర్ క్యాలెండర్’’ కోసం మోడల్స్ ఎంపిక కార్యక్రమానికి దీపికతో సహా వచ్చిన
సిద్దార్థతో అక్కడ వారంతా- ‘ఈ మోడల్స్ అందరికన్నా దీపికనే బాగుంది’ అంటూ పొగిడేసరికి, ఆగలేక అందరిముందే దీపికను
కావులించేసుకుని తన ప్రేమను స్పష్టం చేశాడట.
|
------------------------------------------------------ |
వేసవి కానుకగా ఎన్టీఆర్ - ఇలియానాల ‘శక్తి’
ఎన్టీఆర్ - ఇలియానా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అత్యంత భారీ
ఖర్చుతో నిర్మిస్తున్న ‘శక్తి’ వేసవిలో విడుదలవుతుంది. మంజరి మరో నాయికగా చేస్తున్న
ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, పూజా బేడీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘క్రికెట్ వరల్డ్ కప్’
తర్వాత ఈ చిత్రం విడుదల చేయాలనుకుంటున్నారు.
|
మహేష్ బాబు ‘వేట’... కాపీ కొట్టిన ‘బావ’
‘పందెం కోడి’, ‘ఆవారా’ చిత్రాల దర్శకుడు లింగుసామితో మహేష్ బాబు చేస్తున్న చిత్రం
పేరు ‘వేట’. తమిళ, తెలుగులో ఒకే సారి చేద్దామనుకుంటున్న ఈ చిత్రం తమిళ్ లో ఆర్య
నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నాను అనుకున్నప్పటికీ, ఆమె కోటి ఇరవై
లక్షలు అడిగే సరికి వేరే హీరోయిన్ ను వెతుకుతున్నారు. హిందీ చిత్రం ‘లవ్ ఆజ్ కల్’
హక్కులు కొని పవన్ కళ్యాణ్ తో ‘ఖుషీగా’ చిత్రం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని ఓ
ప్రధానమైన అంశాన్ని ఇటీవల విడుదలైన సిద్దార్థ ‘బావ’లో కాపీ కొట్టేశారు.
|
రానాతో సమంత... సిద్దుతో త్రిష
‘నేను నా రాక్షసి’ తర్వాత రానా గౌతం మీనన్ చిత్రంలో చేస్తున్నాడు. ఈ రొమాంటిక్
ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హాట్ హీరోయిన్ సమంత నటిస్తోంది. ‘నువ్వొస్తానంటే
నేనొద్దంటానా’ జంట సిద్దార్థ, త్రిష తిరిగి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో
దిల్ రాజు ప్రారంభిస్తున్నారు. |
ఆదిత్యతో రాజుగారి అబ్బాయి... దేవ్ కట్టా ‘బెజవాడ గ్యాంగ్స్’
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ తో నవంబర్ మూడవ వారంలో
చిత్రం ప్రారంభం అవుతోంది. గతంలో తేజ దర్శకత్వంలో అనుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు
వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహిస్తారు. ‘బెజవాడ రౌడీ గ్యాంగ్స్’ కథాంశంతో ‘ప్రస్థానం’
దర్శకుడు దేవ్ కట్టా ఓ మంచి స్క్రిప్టు సిద్ధం చేశారు. దీన్ని రానా హీరోగా కె.ఎల్.నారాయణ
నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు.
|
జంటగా సముద్రఖని - శివకుమార్... శ్రీకాంత్ - తరుణ్
‘అనంతపురం’ దర్శకుడు శివకుమార్, ‘శంభో శివ శంభో’ దర్శకుడు సముద్రఖని
ఇద్దరూ మంచి మిత్రలు. ఇప్పుడు శివకుమార్ దర్శకత్వంలో ‘ఈసన్‘ చిత్రంలో సముద్రఖని
హీరోగా చేస్తుంటే, సముద్రఖని దర్శకత్వంలో ‘పోరాలి’ చిత్రంలో శివకుమార్ హీరోగా
చేయడం విశేషం. అశోక్ అల్లె దర్శకత్వం వహిస్తున్న ‘అనుచరుడు’ చిత్రంలో శ్రీకాంత్,
తరుణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను ప్రవీణ్ బాల నిర్మిస్తున్నారు.
|
------------------------------------------------------ |
కమల్ - రజనితో శంకర్... రామ్ చరణ్ తో శ్రీజ
‘రోబో’తో దేశంలోనే సాంకేతికంగా గొప్ప సినిమా తీసి రికార్డు వసూళ్ళు సాధంచిన శంకర్
ఇఫ్పుడు ‘3 ఇడియట్స్’ (రాస్కెల్స్) చేస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత
శంకర్ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో కమల్
హసన్, రజనీకాంత్ వంటి హేమాహేమీలు నటిస్తారట. చిరంజీవి కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్ళి
చేసుకుని వెళ్ళిపోయాక, తిరిగి ఇటీవల ‘ఆరెంజ్’ ఆడియో ఫంక్షన్ లో కనిపించి అందరినీ
ఆశ్చర్యపరిచింది. సోదరి శ్రీజ నిర్మించే ఓ చిత్రంలో చేసేందుకు రామ్ చరణ్ అంగీకరించినట్లు
చెప్పుకుంటున్నారు.
|
డిసెంబర్ 2న ‘నాగవల్లి’... నవంబర్ 17న ‘ఊసరవెల్లి’
వెంకటేష్ తో నిర్మిస్తున్న ‘చంద్రముఖి-2’ పూర్తి కావచ్చింది. అనూష్క, రిచ,
శ్రద్ధాదాస్, కమలిని ముఖర్జీ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం పాటలు నవంబర్ 10న
విడుదల చేసి చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేస్తారు. ఎన్టీఆర్ - సురేందర్ రెడ్డిల
కాంబినేషన్ లో ‘చత్రపతి’ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నవంబర్ 17న ప్రారంభం అవుతుంది.
‘ఊసరవెల్లి’ పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రం తమన్నా నాయిక.
|
‘అమావాస్య దొంగ’ ప్రభాస్... భాస్కర్ పై చిరు కోపం
దిల్ రాజు - దశరథ్ ల ‘మిస్టర్ పెర్ఫెక్ట్’, లారెన్స్ తో ‘రెబల్’ చిత్రాల్లో నటిస్తున్న
ప్రభాస్ త్వరలో ‘అమావాస్య దొంగ’గా కనిపించనున్నారు. సిద్దార్థతో ‘బావ’ చిత్రాన్ని
అందిస్తున్న రాంబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిస్తారు. ప్రేక్షకులు భారీ అంచనాలు
పెంచుకున్న రామ్ చరణ్ ‘ఆరెంజ్’ నవంబర్ మూడవ వారం విడుదలకానుంది. అయితే,
ఈ చిత్రం బడ్జెట్ ని భారీగా పెంచేసిన దర్శకుడు భాస్కర్ పట్ల చిరంజీవి కోపంగా ఉన్నట్లు
వార్తలొచ్చాయి. ఈ చిత్రం కోసం మలేషియా, ఆస్ట్రేలియాలకు ఈ చిత్రం యూనిట్ పలుసార్లు
వెళ్ళింది. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశారు. మద్యలో కెమేరామెన్ ని మార్చారు.
|
జనవరి 4 నుండి ‘జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’
జహంగీరా బాద్ మీడియా ఇన్సిట్యూట్, సైన్స్ - టెక్నాలజీ విజ్ఞాన్ ప్రసాద్ సంస్థతో కలిసి
‘రాష్ట్రీయ విజ్ఞాన చలన చిత్ర మేళా మరియు పోటీ’ని నిర్వహిస్తున్నారు. చెన్నైలో సైన్స్
కాంగ్రెస్ లో జనవరి 4 నుండి 7 వరకూ జరిగే ఈ కార్యక్రమానికి సైన్స్, టెక్నాలజీ పై మన
దేశంలో నిర్మించిన వీడియో చిత్రాలు పంపవచ్చును. విజేతలకు నగదు బహుమతులు
ఉంటాయి. పూర్తి వివరాలకు www.rvcm.orgను చూడండి.
|
రజనీ నాయిక విద్యాబాలన్... నమిత కిడ్నాప్
రజనీకాంత్ హీరోగా అతని కుమార్తె సౌందర్య నిర్మిస్తున్న భారీ చిత్రం ‘హరా’లో విద్యాబాలన్ ను
నాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ పాత్రకు ఇలియానాను అడిగారు.
అయితే ఏ కారణం చేతనో ఈ చిత్రంలో ఆమె చేయలేదు. ఓ ఫంక్షన్ లో పాల్గొనేందుకు వెళ్ళిన
నమితను తిరుచ్చి ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి నిర్వాహకులే తనను పంపారని చెప్పి కారులో
ఎక్కించుకున్నాడు. తీరా చూస్తే అతను అసలు కారు డ్రైవర్ కాదు. నమిత అభిమాని
కావడంతో ఆమెను ఒక్కసారైనా తన కారులో ఎక్కించుకోవాలనే కోరికతో అలా చేసినట్లు -
అతను పోలీసు విచారణలో చెప్పాడు.
|
------------------------------------------------------ |
అందాల బొమ్మను కానంటున్న సమంత
‘ఏ మాయ చేసావె’, ‘బృందావనం’తో వరుస విజయాలను సొంతం చేసుకున్న సమంత
ఇప్పుడు మహేష్ తో ‘దూకుడు’లో చేస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన మరో భారీ చిత్రంలో
అవకాశం సంపాయించింది. వినాయక్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో ఈ
చిత్రాన్ని దానయ్య ప్రారంభిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు విజయాలతో నన్ను ఆదరించారు.
వారి ఆశీర్వాదంతో నేను మంచి నటిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను.
అంతేతప్ప,వచ్చిన ప్రతి పాత్రనూ అంగీకరించి, ‘అందాల బొమ్మ’లా మిగలాలనుకోవడం
లేదంటోంది సమంత.
|
‘రోబో’ను మించి సంచలనం కోసం ‘హరా’
రజనీకాంత్ కుమార్తె సాందర్య నిర్మిస్తున్న భారీ యానిమేషన్ చిత్రం ‘సుల్తాన్’ ది వారియర్
పేరును ‘హరా’గా మార్చారు. సౌదర్యతో పాటు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం
వహిస్తున్న ఈ చిత్రంలో యానిమేషన్ తో పాటు, నిజమైన రజనీకాంత్ కూడా కనిపిస్తారట.
దీని కోసం ఇప్పుడు రజనీకాంత్ 22 రోజుల పాటు నటించే షేడ్యూల్ లో కొన్ని సన్నివేశాలతో
పాటు 5 పాటలను రవికుమార్ చిత్రీకరిస్తున్నారు. దీన్ని 3డిలోనూ విడుదల చేస్తారు.
|
పోసాని ‘మెంటల్ కృష్ణ’ మళ్ళీ వచ్చాడు
పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం వహించిన ‘మెంటల్ కృష్ణ’ ఆర్థిక
విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘మెంటల్ కృష్ణ మళ్ళీ
వచ్చాడు’ పేరుతో ఓ చిత్రం మోహన్ వడ్లపట్ల ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తో
‘దుశ్శాసన’ చిత్రాన్ని చేస్తున్న పోసాని కృష్ణమురళి త్వరలో జగపతిబాబు హీరోగా మరో
చిత్రం చేసే అవకాశం ఉంది.
|
మాట మార్చి చూస్తానంటున్న వరుణ్ సందేశ్
‘హ్యాపీడేస్’తో పాపులర్ అయిన యువహీరో వరుణ్ సందేశ్ ఇటీవల చేసిన చిత్రాలు ఏవీ
చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అమెరికాలో పుట్టిపెరిగిన వరుణ్ సందేశ్ మాట్లాడే తెలుగు
ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. అందుకనే, మాట్లాడే విధానిన్ని మార్చుకోవడం పైన
వరుణ్ దృష్టి పెట్టాడు. త్వరలో రానున్న అతని చిత్రం ‘కుదిరితే కప్పు కాఫీ’ నుండి మాట
మార్చిన వరుణ్ సందేశ్ ను చూస్తారని అంటున్నాడు.
|
తిరిగి ‘దారిలోకి’ రావాలని త్రివిక్రమ్ తంటాలు
విజయభాస్కర్ కాంబినేషన్ లో మంచి రచయితగా ఆ తర్వాత మంచి దర్శకుడిగా పేరు
తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేసిన మూడేళ్ళ చిత్రం ‘ఖలేజా’
పరాజయంతో పరుగులో వెనుకబడ్డాడు. అందుకనే త్వరలో వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్
దర్శకత్వం వహించే చిత్రాన్ని చాలా తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
తద్వారా తిరిగి ‘దారిలోకి’ రావాలనుకుంటున్నాడు.
|
------------------------------------------------------ |
చిరు చిత్రం వచ్చే అక్టోబర్ కి సిద్ధం
‘మెగస్టార్’ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా సినిమా సరదా తీరలేదు. అందుకనే త్వరలో మళ్ళీ
మేకప్ వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. విదేశాలకు వెళ్ళి సన్నబడ్డ చిరంజీవి తిరుపతిలో
మాట్లాడుతూ- అభిమానులు, ప్రేక్షకుల ఒత్తిడిని తట్టుకోలేక త్వరలో సినిమా
చేయాలనుకుంటున్నాను. ప్రేక్షకుల అంచనాలకి మించే ఈ చిత్రం వుంటుంది. వచ్చే అక్టోబర్ కల్లా
ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది- అంటూ చెప్పారు.
|
రజనీ ‘భాషా-2’... ‘త్రిశూల్’ రీమేక్
‘రోబో’ సూపర్ డూపర్ హిట్ తర్వాత రజనీకాంత్ చేసే చిత్రం ఎలా వుంటుందనే ఆసక్తి అందరిలో
వుంది. రజనీ గతంలో చేసిన సూపర్ హిట్ ‘భాషా’కు సీక్వెల్ చేసే ఆలోచనలో వున్నారని
కొందరు అంటున్నారు. అలాగే రజనీకాంత్ చేసే తదుపరి చిత్రానికి గతంలో అతనితో
విజయవంతమైన చిత్రాలు ఇచ్చిన కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తారని వార్తలొస్తున్నాయి.
అమితాబ్, సంజీవ్ కుమార్ లతో 1978లో సంచలన విజయం సాధించిన ‘త్రిశూల్’ను నటుడు
రాజ్ బబ్బర్ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు, అందుకు తగ్గ నటీనటులను ఎంపికచేస్తున్నట్లు
బాలీవుడ్ భోగట్టా.
|
రామ్ ‘కందిరీగ’... చిరు - వర్మల ‘దొర’
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ‘కందిరీగ’ చిత్రాన్ని
ప్రారంభించారు. సోనూసూద్ విలన్ గా నటించే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు చిరంజీవితో ‘దొర’ (భూస్వామి) అనే
చిత్రం తీయాలనే కోరిక బలంగా కలిగిందట. గతంలో వీరి కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమై
ఆగిపోయింది.
|
సుమంత్, స్వాతిల ‘గొల్కొండ హైస్కూల్’ పూర్తి
‘అష్టాచెమ్మ’ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుమంత్ క్రికెట్ కోచ్గా నటిస్తున్న
చిత్రంలో స్వాతి హీరోయిన్ గా చేస్తోంది. సెంథిల్ కుమార్ ఫొటోగ్రఫీ, కళ్యాణి మాలిక్ సంగీతం
అందిస్తున్న ఈ చిత్రానికి ‘గొల్కొండ హైస్కూల్’ అని పేరు పెడుతున్నారు. ఈ చిత్రం షూటింగ్
పూర్తయ్యింది.
|
షారుక్, హృతిక్ లపై ‘రోబో’ ఎఫెక్ట్
రజనీ ‘రోబో’ ఘనవిజయం షారుక్, హృతిక్ లపై ప్రభావాన్ని చూపింది. సైన్స్ ఫిక్షన్ తో
‘రా-వన్’ పేరుతో షారుక్ నిర్మిస్తున్న చిత్రం ‘రోబో’ ఎఫెక్ట్ తో మొత్తం మార్చుకోవాల్సిన పరిస్థితి
వచ్చింది. హృతిక్ తో రాకేష్ రోషన్ నిర్మించాలని ప్లాన్ చేసిన ‘క్రిష్-2’ కూడా ‘రోబో’
కారణంగా వాయిదా వేసుకున్నారు.
|
------------------------------------------------------ |
‘రాజన్న’లో విజయశాంతి... ‘అధినాయకుడు’లో అనూష్క?
విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెలంగాణ చారిత్రక కథాంశంతో నాగార్జున నిర్మిస్తున్న ‘రాజన్న’
త్వరలో ప్రారంభం అవుతుంది. స్నేహ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ఓ ప్రధాన
పాత్ర పోషిస్తుందని వార్తలొస్తున్నాయి. చిరంజీవి మళ్ళీ నటిస్తున్న చిత్రానికి ‘అధినాయకుడు’
అనే పేరు పరిశీలనలో వుంది. ఇందులో అతని సరసన అనూష్క హీరోయిన్ గా చేస్తుందని
అనుకుంటున్నారు.
|
సిద్దిక్ దర్శకత్వంలో తెలుగు ‘బాడీగార్డ్’ వెంకీ
సిద్దిక్ దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బాడీగార్డ్’ ఇప్పుడు తమిళంలో,
హిందీలో రీమేక్ అవుతోంది. త్వరలో దీన్నితెలుగులో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత వెంకట్రాజు, శివరాజు నిర్మించే ఈ చిత్రంలో వెంకటేష్ ప్రధాన పాత్ర్ర పోషిస్తారు.
|
‘పెళ్ళిచూపుల’కు హీరోయిన్ కావాలి!
పి.కిశోర్ దర్శకత్వంలో కె.సి.పి. ప్రొడక్షన్స్ పతాకంపై ‘తేజం’ ఎస్.రాజశేఖర్ తో
సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పెళ్ళిచూపులు’ చిత్రంలో చేసేందుకు హీరోయిన్ తో పాటు, ప్రధాన
పాత్రలకు నటీనటులు రావాలి. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో
చేసేందుకు ఆసక్తి వున్నవారు pellichoopulu2010@gmail.com కు తమ
ఫొటోలు, వివరాలు పంపవచ్చును.
|
‘మిరపకాయ్’ తర్వాత ‘మాస్ రాజా’గా రవితేజ
హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ‘మిరపకాయ్’ ప్రస్తుతం బ్యాంకాక్ లో
షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన రిచ, దీక్ష నాయికలుగా చేస్తున్నారు.
దీని తర్వాత రవితేజ హీరోగా ‘మాస్ రాజా’ అనే చిత్రం ప్రారంభం అవుతుంది. దీన్ని ప్రముఖ
నటుడు కృష్ణంరాజు తమ బ్యానర్ పై నిర్మిస్తారని, ‘డాన్ శీను’ దర్శకుడు మలినేని గోపీచంద్
దీనికి దర్శకత్వం వహిస్తారని వార్తలొస్తున్నాయి.
|
సునీల్ తో కళ్యాణ్ రామ్... వేశ్యగా నమిత
‘ఒకరికి ఒకరు’, ‘నేను మీకు తెలుసా’ చిత్రాల ఛాయాగ్రహకుడు సునీల్ రెడ్డి దర్శకత్వంలో
కళ్యాణ్ రామ్ ఓ చిత్రం చేస్తున్నారు. మంచి పాత్రల కోసం చూస్తున్నానంటున్న నమిత త్వరలో ఓ
చిత్రంలో ఖరీదైన కాల్ గర్ల్ గా పవర్ ఫుల్ పాత్ర చేస్తోంది. కరుణానిధి స్క్రిప్టు సమకూరుస్తున్న ఈ
చిత్రంలోని తన పాత్ర కోసం నమిత ముంబై, చెన్నై రెడ్ లైట్ ఏరియాల్లోని కాల్ గర్ల్స్ వ్యవహార శైలిని
పరిశీలించే పనిలో వుంది.
|
------------------------------------------------------ |
సినిమా పేర్లతో ‘కత్తి’ యుద్ధం
తను రిజిస్టర్ చేసుకున్న ‘కత్తి’ టైటిల్ కు ‘కళ్యాణ్ రామ్ కత్తి’ పేరుతో తీస్తున్న చిత్రం వల్ల అన్యాయం
జరుగుతోందని- గుణశేఖర్ అంటున్నారు. మూడేళ్ళ కిందటే ఈ పేరు దానయ్యగారి బ్యానర్ పై రిజిస్టర్
చేసాను. ఇప్పుడు రవితేజ హీరోగా ప్రారంభిస్తున్నాను. ‘కళ్యాణ్ రామ్ కత్తి’ పేరుతో ఓ చిత్రం పేరు పెట్టుకుని
కళ్యాణ్ రామ్ పేరు చిన్నగా వేసి ‘కత్తి’ని ప్రధానంగా చూపుతూ ప్రచారం చేసుకోవడం ద్వారా నా టైటిల్ కి
అన్యాయం జరుగుతోంది- అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘కళ్యాణ్ రామ్ కత్తి’ ఆడియో త్వరలో
విడుదల కానుంది.
|
మహేష్ తో సోనియా... రామ్ తో సమంత..
‘హ్యాపీడేస్’ నటి సోనియాకు ఆశించిన స్థాయిలో పాత్రలు లభించలేదు. అయితే, ఇప్పుడు ఆమెకు ఓ గొప్ప
అవకాశం దొరికింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘దూకుడు’లో సెకండ్ హీరోయిన్
గా సోనియా ఎంపికయ్యింది. ఇందులో సమంత నాయికగా చేస్తోంది. సమంత రామ్ జంటగా కూడా ఓ చిత్రం
అంగీకరించింది. స్రవంతి రవికిషోర్ విక్రమ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నిర్మించే చిత్రంలో సమంత నాయికగా
చేస్తోంది.
|
శంకర్, లింగుసామితో త్వరలో మహేష్ చిత్రాలు
శంకర్ దర్శకత్వంలో ‘3ఇడియెట్స్’ దక్షిణాది రీమేక్ త్వరలో ప్రారంభం అవుతుంది. తమిళంలో విజయ్,
తెలుగులో మహేష్ బాబు ప్రధాన పాత్రలు పోషించే ఈ చిత్రంలో నాయికగా ఇలియానా చేస్తోంది. ప్రకాష్ రాజ్ ఓ
ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రం ఆరునెలల వ్యవధిలోనే వేగంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. లింగుసామి
దర్శకత్వంలో కె.ఎల్.నారాయణ, మంజుల నిర్మించే ద్విభాషా చిత్రంలో మహేష్ బాబుతోపాటు మాధవన్
నటిస్తారు.
|
త్రిష బాలీవుడ్ బాధలు... బాలీవుడ్ లోకి ప్రకాష్ రాజ్
అక్షయ్ కుమార్ ‘కట్టామీఠా’తో హిందీరంగంలోకి వెళ్ళిన త్రిషకు పెద్ద పరాజయం ఎదురైంది. ఆ తర్వాత
‘ఏమైంది ఈవేళ’ హిందీ వెర్షన్లో నటించడానికి సిద్ధపడ్డ త్రిషకు మరోషాక్ తగిలింది. కథలో మార్పుల
కారణంగా అందునుండి త్రిషను తప్పించి మరో హీరోయిన్ ను పెట్టుకున్నారు. మొదటి భార్యను వదులుకుని
ఇటీవల బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనివర్మను పెళ్ళి చేసుకున్న ప్రకాష్ రాజ్ త్వరలో బాలీవుడ్లోకి నిర్మాతగా రంగ
ప్రవేశం చేసే ప్రయత్నంలో వున్నాడు. ‘ఆకాశమంత’ చిత్రాన్ని కన్నడలో స్వీయ దర్శకత్వంలో నిర్మించిన
ప్రకాష్ రాజ్ అదే చిత్రాన్ని హిందీలో చేయాలనుకుంటున్నాడు. బాలీవుడ్లో అవకాశాల కోసం అర్రులుచాస్తున్న త్రిష
ఇందులో నటించే అవకాశం వుంది.
|
‘పిల్ల జమిందార్’గా నాని.... విక్రమ్ తో నితిన్
‘అష్టాచెమ్మా’ హీరో నాని త్వరలో ‘పిల్ల జమిందార్’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘ఆకాశరామన్న’
దర్శకుడు అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ‘ద్రోణ’ నిర్మాత డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని
నిర్మిస్తారు. గోదావరి జిల్లాలో ఈ చిత్రం గ్రామీణ వాతావరణంలో చిత్రీకరిస్తారు.
|
------------------------------------------------------ |
తొలివారం 117 కోట్ల ‘రోబో’ రికార్డ్
రజనీ, ఐశ్వర్య, శంకర్ ల ‘రోబో’ భారత చలన చిత్ర చరిత్రలో కొత్త అద్యాయాన్ని సృష్టిస్తోంది. ఈ చిత్రం
మొదటివారం 117 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘3 ఇడియట్స్’, ‘దబాంగ్’లను
అధిగమించింది. తమిళ నాడులో 60 కోట్లు, ఆంధ్రాలో 30 కోట్లు, హిందీలో 15 కోట్లు, కర్నాటకలో
8 కోట్లు, కేరళలో 4 కోట్లు ఈ చిత్రం మొదటివారం వసూలు చేసింది. ‘దబాంగ్’ రెండు వారాల వసూళ్ళు
‘రోబో’ ఒక్కవారంలోనే సాధించింది.
|
చిరు మేనల్లుడితో వై.వి.ఎస్.చౌదరి చిత్రం
చిరంజీవి సోదరి విజయ కుమారుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రంగ ప్రవేశం చేస్తున్నాడు. వై.వి.ఎస్.చౌదరి
స్వీయ దర్శకత్వంలో నిర్మించే చిత్రంలో అతను హీరోగా నటిస్తున్నాడు. కొత్త నటీనటులు, భారీ సాంకేతిక
విలువలతో ఈ చిత్రం ఉంటుందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చౌదరి చెప్పారు.
|
రవితేజ - కాజల్ జంటగా ‘వీర’ ప్రారంభం
శాన్వి ప్రొడక్షన్ పతాకంపై ‘రైడ్’ చిత్రం దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ, కాజల్, తాప్సి ప్రధాన
పాత్రల్లో ‘వీర’ చిత్రం 10-10-10 ఉదయం ప్రారంభమైంది. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్
జరుపుకునే ఈ చిత్రానికి సంగీతం : తమన్, ఫోటోగ్రఫీ : ఛోటా కె నాయుడు, నిర్మాత : గణేష్
ఇందుకూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : రమేష్ వర్మ.
|
బాలయ్య ‘హర హర మహదేవ’... హృతిక్ ‘పానీ’
సూపర్ హిట్ చిత్రాల కాంబినేషన్ బాలకృష్ణ - బి.గోపాల్ తో బెల్లంకొండ సురేష్ ఓ చిత్రం చేస్తున్నారు. దీనికి
‘హర హర మహదేవ’ అని పేరు పెడుతున్నారు. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి ఎదిగిన దర్శకుడు శేఖర్
కపూర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ ‘పానీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. భవిష్యత్ లో నీటి అవసరాలు
పెరిగిపోయి, దాని కోసం జరిగే యుద్ధాలను ఊహాత్మకంగా చూపించే ఈ చిత్రం త్వరలో ప్రారంభమై, వచ్చే
ఏడాది విడుదలకు సిద్ధమవుతుంది.
|
గద్దె సిధూర పెళ్ళి... దీపిక ద్విపాత్రాభినయం
‘మిస్ ఇండియా వరల్డ్’గా ఎన్నికై, మోడల్ గా, నటిగా మారిన గద్దె సింధూర పెళ్ళి డిసెంబర్ 10న
న్యూజిలాండ్ లో జరుగుతోంది. జోనాధన్ వార్డ్ తో జరిగే ఆమె వివాహానికి హైదరాబాద్ నుండి పలువురు
హాజరయ్యే అవకాశం ఉంది. ‘బ్రేక్ కె బాద్’, ‘ఖేలే హమ్ జీ జాన్ సే’ రెండు చిత్రాల షూటింగ్స్ ను దీపిక
పదుకొనే ఒకేసారి చేసింది. ఉదయం ఒక సినిమా మధ్యాహ్నం ఒక సినిమా... ఒక దాంట్లో సీరియస్ పాత్ర,
మరో దాంట్లో కెమెడీ పాత్రతో రెండు విభిన్న పాత్రలు ఒకే సారి చేయడం మాటలు కాదు. అయితే రెండింటికీ నేను
న్యాయం చేసానని అంటోంది దీపిక.
|
------------------------------------------------------ |
‘ఆరెంజ్’ నవంబర్ 10, ‘బద్రీనాథ్’ మార్చి 27 విడుదల
రామ్ చరణ్ చిత్రం ‘ఆరెంజ్’ నవంబర్ 10న, ఈనెల 17న పాటలు విడుదల చేస్తారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో జెనీలియా, షాదన్ పదంసీ, మధురిమ నాయికలు. అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ మార్చి 27న విడుదల చేస్తారని తెలుస్తోంది. తమన్నా నాయికగా చేస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, పీటర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తున్నారు.
|
రవితేజతో కాజల్... ఎన్టీఆర్తో తమన్నా
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘వీర’లో అనూష్క బదులు కాజల్ నటిస్తోంది. మంజరి, తాప్సీ కూడా ఇందులో చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో తమన్నా నాయికగా ఎంపికైంది. దీనికి ‘అతడే ఆమె సైన్యం’ అనే పేరు పెట్టాలనుకుంటున్నారు.
|
పులిపిల్లను దత్తత తీసుకున్న కార్తి
‘ఆవారా’ హీరో కార్తి పులిపిల్లను దత్తత తీసుకున్నారు. చెన్నై వండలూరు జూలోని తెల్లపులి పిల్లను చూసి అన్నయ్య కూతూరు దియా ఎంతో ఆనందపడింది. నాకూ అడవులు వన్యమృగాలు అంటే చాలా ఇష్టం. అందుకే అరుదైన తెల్లపులి పిల్లను దత్తత తీసుకున్నానని- కార్తి చెబుతున్నాడు.
|
కమల్ మల్టీస్టారర్... సునీల్ ‘నెపోలియన్’
కమల్ హసన్ ఓ భారీ దక్షిణాది మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కమల్ హసన్ తో మోహన్ లాల్, సూర్య, రవితేజ హీరోలుగా, త్రిష, జెనీలియా, దీపిక పదుకొనె హీరోయిన్లుగా చేస్తారట. కమల్, త్రిష నటిస్టున్న ‘మన్మథన్ అంబు’ చిత్రం తర్వాత ఈ చిత్రం తయారవుతోంది. రాజమౌళి అసోసియేట్ కోటి దర్శకత్వంలో సునీల్ హీరోగా ఓ చిత్రం తయారవుతోంది. దీక్షాసేథ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ‘నెపోలియన్’ అని పేరు పెడుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో రాజస్తాన్లో షూటింగ్ జరుపుకుంటుంది.
|
వంశీకి కె.వి.రెడ్డి స్మారక అవార్డు
ప్రముఖ దర్శకుడు వంశీకి కె.వి.రెడ్డి స్మారక అవార్డును అందుకుంటున్నారు. ‘యువకళావాహిని’ ఆధ్వర్యంలో ఈ నెల 21న రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు సినిమా, రాజకీయ, సాంస్కృతిక రంగ ప్రముఖులు పాల్గొంటారు.
|
------------------------------------------------------ |
సినిమా కోసం చిరంజీవి చిక్కిపోయాడు
ఎవరేమనుకున్నా సినిమాలు చేయడమే తన ఉనికికి ముఖ్యం అని నిర్ణయించుకున్న చిరంజీవి త్వరలో ఓ భారీ
చిత్రానికి సిద్ధమవుతున్నారు. శంకర్, రాజమౌళి, త్రివిక్రమ్ వంటి ప్రముఖ దర్శకులొకరు ఈ చిత్రానికి
దర్శకత్వం వహిస్తారని, ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేస్తోందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం కోసం సన్నబడే
పనిలో ఇప్పుడు చిరంజీవి ఉన్నారు. దానికి ఇటీవల ‘లిపోసెక్టమీ’ చికిత్స ఇప్పటికే పూర్తయ్యిందని
తెలుస్తోంది. త్వరలో స్లిమ్ అయిన చిరంజీవిని మనం చూస్తాం.
|
ప్రభుదేవాకు భార్యతో సెటిల్ మెంట్ చెడింది
నయనతారతో వివాహానికి సిద్ధమైన ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ కు విడాకులిచ్చేందుకు ప్రయత్నించి
విఫలమయ్యాడు. సెటిల్ మెంట్ కోసం దాదాపు 6 కోట్లు రమాలత్ కి ఇవ్వాలని చూసినా ఆమె
తిరస్కరించింది. తాజాగా ఆమె చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘విల్లు’ చిత్రం తర్వాత
నుండి ప్రభుదేవా నన్ను నా పిల్లల్ని పట్టించుకోవడంలేదు. ఖర్చులకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు. నా
భర్త నాతోనే ఉండేలా ఆదేశించాలి - అంటూ ఆమె కోర్టును కోరారు.
|
సిల్క్ స్మిత కథతో విద్యా ‘డర్టీ పిక్చర్’
చేదు అనుభవాలతో చివరికి విషాదాంతం అయిన దక్షిణాది నటి, నర్తకి సిల్క్ స్మిత జీవిత కథతో బాలీవుడ్ లో
ఓ చిత్రం వస్తోంది. ఇందులో విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్ర పోషిస్తోంది. సిల్క్ స్మిత తరహా పాత్ర పోషణ కోసం
ఆమె ప్రత్యేకంగా శిక్షణ పొందుతోందట. ఆ మధ్య హత్యకు గురైన జెస్సికాలాల్ కథతో నిర్మిస్తున్న ‘నో వన్ కిల్డ్
జెస్సికా’లోనూ విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం.
|
లేడీ ఓరియంటెడ్ కి ‘నో’ అంటున్న హన్సిక
బాలనటి నుండి అందాల హీరోయిన్ గా ఎదిగిన హన్సిక ఇప్పట్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయదట.
మొన్ననే నాకు 18 ఏళ్ళు నిండాయి. ఇప్పడు నా వయసుకి తగ్గ పాత్రలే చేయడం కరెక్ట్. ఆ తర్వాత లేడీ
ఓరియంటెడ్ చేస్తే బాగుంటుంది. అప్పటికి నాలో మెచ్యూరిటీ కూడా వస్తుంది. ఎప్పుడు నేను ఆ తరహా
పాత్రలకి సరిపోతానో అప్పుడే చేస్తాను. ఇప్పుడు చేస్తే అతిగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అటువంటి ఆఫర్లు
వస్తే ‘నో’ చెప్తాను అని అంటోంది.
|
మల్లిక పాముల చిత్రం... కత్రీనా అభిషేకం
మగాళ్ళని రెచ్చగొట్టే ‘మర్డర్’ నటి మల్లికా శెరావత్ ఇప్పుడు ఇంగ్లీషులో ఓ పాముల చిత్రం చేసింది. 22న
విడుదలవుతున్న ఈ ‘హిస్ స్ స్’ చిత్రంలో మల్లిక పాముగా నటించింది. ఈ చిత్రం తెలుగు అనువాదానికి
‘రగులుతోంది మొగలు పొద’ అని పేరు పెడతారట. బాలీవుడ్ అగ్రనటి కత్రీని కైఫ్ కి అభిషేక్ బచ్చన్ తో
రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించాలని ఉందట. అభిషేక్ తో నేను నటించడానికి వచ్చిన అవకాశాలను
ఐశ్వర్య చెడగొట్టిందని పుకార్లు పుట్టించారు. అభిషేక్ గొప్ప వ్యక్తి. త్వరలో అతనితో ఓ చిత్రం చేయడానికి నేను
డేట్స్ కూడా కేటాయించేశాను - అంటూ సంబరంగా చెబుతోంది కత్రీనా.
|
------------------------------------------------------ |
కళ్యాణ్ రామ్ ‘కత్తి’ ఆడియో దసరాకి...
కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై మల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రానికి ‘కళ్యాణ్ రామ్ కత్తి’ అని పేరు ఖాయం
చేశారు. సనాఖాన్ హీరోయిన్గా, శరణ్యామోహన్ హీరో చెల్లెలిగా నటిస్తున్న ఈ చిత్రం పాటలు దసరాకి
విడుదలవుతాయి. నవంబర్లో చిత్రంవిడుదలవుతుంది.
|
ప్రకాష్ రాజ్ యాక్టింగ్ స్కూల్, నటుడిగా అతని తమ్ముడు
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో యాక్టింగ్ అకాడమీని బెంగుళూరులో ప్రారంభిస్తున్నారు. దీనికోసం అమెరికాలోని
ఓ భారత వ్యాపారవేత్తతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రకాష్ రాజ్ తమ్ముడు ప్రసాద్ రాజ్ కూడా నటుడిగా
పరిచయం అవుతున్నారు. ఓ కన్నడ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా నెగెటివ్ పాత్రను అతను పోషిస్తున్నాడు.
|
వరుణ్ ‘జిల్..జిల్..జిగా’, ప్రకాష్ తో నారా రోహిత్
వరుణ్ సందేష్ నటిస్తున్న కొత్త చిత్రానికి అతని సూపర్ హిట్ చిత్రం ‘హ్యాపీడేస్’లో పాపులర్ అయిన
‘జిల్..జిల్..జిగా’ను పేరుగా పెట్టుకుంటున్నాడు. దీనికి శ్రావణ్ దర్శకత్వం వహిస్తారు. ‘బాణం’ హీరో నారా
రోహిత్ సుకుమార్ శిష్యుడు ప్రకాష్ తో ఓ చిత్రం చేస్తున్నారు. దీన్ని ‘సింహా’ నిర్మించిన పరుచూరి శివరామప్రసాద్
నిర్మిస్తారు.
|
పవన్ ‘ట్రాఫిక్ జామ్’.... రాజమౌళి ‘ఈగ’
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బహుభాషల్లో క్రీస్తు చిత్రం చేస్తున్న పవన్ కళ్యాణ్ సింగీతం స్క్రిప్టు సిద్ధం చేసుకున్న
సాంఘిక చిత్రం ‘ట్రాఫిక్ జామ్’లో కూడా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘మర్యాద రామన్న’
విజయం తర్వాత ప్రభాస్ తో చిత్రం చేయడానికి ముందుగా రాజమౌళి ‘ఈగ’ చిత్రం నిర్మిస్తున్నారు. నవంబర్
1నుండి ప్రారంభమయ్యే ఈ చిత్రం ‘ఈగ’ ప్రధాన పాత్రగా గ్రాఫిక్స్ తో వినూత్నంగా వుంటుంది. దీన్ని రాజమౌళి
నిర్మించడం మరో విశేషం.
|
బాలయ్య-జయంత్, పవన్-వినాయక్, విక్రమ్-అనూష్క
పవన్ కళ్యాణ్, త్రిషలతో ‘ఖుషీగా’ చేస్తున్న జయంత్ సి పర్జానీ త్వరలో బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం చేసే ప్రతిపాదన
జరుగుతోంది. ప్రముఖ నిర్మాత దానయ్య పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. దీనికి వినాయక్
దర్శకత్వం వహిస్తారు. ఆర్య హీరోగా తమిళంలో విజయవంతం అయిన ‘మదరాసు పట్టణం’ దర్శకుడు విజయ్ తో
విక్రమ్ ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. తెలుగులో విజయవంతం అయిన ‘వేదం’
తమిళ వెర్షన్ ‘వానం’లోనూ అనూష్క అదే పాత్రను పోషిస్తోంది.
|
------------------------------------------------------ |
హృతిక్ - కత్రీనా... వరుణ్ - నిషాల ముద్దు ముచ్చట్లు
హృతిక్ రోషన్ తో తొలిసారి కత్రీనా కైఫ్ ‘‘జిందగీ మిలేగీ నా దొబారా’’ చిత్రాలో నటిస్తోంది. ఇందులో వీరిద్దరి మధ్య
మంచి ముద్దల సన్నివేశం ఉందట. లేడీ డైరెక్టర్ జోయా అక్తర్ కాస్త మొహమాట పడినప్పటికీ - ముద్దు ముచ్చట్లలో
సీనియర్లు హృతిక్, కత్రీనాలు మాత్రం రిహార్సల్ తో పనిలేకుండానే షాట్ ఓకె చేశారట. ఇక మగధీర హీరోయిన్ కాజల్
సోదరి నిషా అగర్వాల్ ఇప్పుడు వరుణ్ సందేష్ తో ‘ఏమెంది ఈ వేళ’లో వెండితెరకు పరిచయం అవుతోంది.
తొలిచిత్రంలోనే ఆమెకు వరుణ్ తో ముద్దు సన్నివేశం చేసే సందర్భం వస్తే, ఎటువంటి ఇబ్బందీ లేకుండా హ్యాపీగా
చేసేసింది.
|
‘పోరా - పోవే’తో హీరోగా ‘వారెవా’ దర్శకుడు మహి
బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా ‘వారెవా’ చిత్రం స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న మహి త్వరలో ‘పోరా -
పోవే’ అనే యూత్ ప్రేమకథా చిత్రం ప్రారంభిస్తున్నారు. ఇందులో హీరోగా మహి నటిస్తారని తెలుస్తోంది. దసరాకు
ప్రారంభమయ్యే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తామని మహి చెబుతున్నారు.
|
మెగాస్టార్ చిరంజీవితో అందాల ఐశ్వర్య?
ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాలు చేయడానికి ఉవ్విళ్ళూరుతున్న విషయం
తెలిసిందే. త్వరలోనే చిరంజీవి నటించే చిత్రం ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో
కథానాయికగా ఐశ్వర్యారాయ్ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఐశ్వర్య ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్
లాల్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ లతో నటించింది.
|
సంక్రాంతికి నాగచైతన్య... బాల ‘వాడే వీడు’
సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య - తమన్నా జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఓ చిత్రం నిర్మిస్తున్న
విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ‘శివ పుత్రుడు’ మొదలైన
చిత్రాలు రూపొందించిన బాల దర్శకత్వంలో ‘అవన్ ఇవన్’ అనే చిత్రం వస్తోంది. దీన్ని తెలుగులో ‘వాడే వీడు’
పేరుతోవిడుల చేస్తారు. ఆర్య, విశాల్, జనని అయ్యర్, మధుశాలిని నటిస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలో మంచి
అంచనాలున్నాయి.
|
‘రోబో’పై ఫిలింనగర్ దుష్ప్రచారం
ఎవరైనా తమ సమర్థతతో గొప్పవాళ్ళవుతారు. అంతే కానీ, వేరొకరిపై దుష్ప్రచారం చేయడం ద్వారా కాదు. సినిమా
రంగంలో కొందరు అవతలివారి చిత్రాలు ‘‘చెత్తగా ఉన్నాయంటూ’’ పని కట్టుకుని ప్రచారం చేసి, తద్వారా తమ
చిత్రాలకు అనుకూల ఫలితాలను ఆశించే నీచమైన స్థితిలో ఉన్నారు. దేశమే గర్వపడదగ్గ స్థాయిలో రజనీ - శంకర్ ల
కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’ గురించి కూడా అటువంటి ప్రచారమే భారీ స్థాయిలో జరిగింది. అయితే అభిరుచిగల
వీళ్ళ చిల్లర బుద్ధికి చెప్పుతో కొట్టినట్లు మంచి ఫలితాన్నిచ్చారు.
|
------------------------------------------------------ |
‘ప్రేమాభిషేకం’ పాట రీమిక్స్ లో నాగచైతన్య
పాత పాటలు రీమిక్స్ చేయడం ఇటీవల బాగా పెరిగి పోయింది. సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న
చిత్రంలో ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని పై చిత్రీకరించిన ‘నీ కళ్ళు చెబుతున్నాయి’ పాటను మనవడు నాగచైతన్యపై తిరిగి
చిత్రీకరిస్తున్నారు. అతనితో నాయిక తమన్నా జతకడుతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని
నాగచైతన్య చెబుతున్నారు.
|
తాప్సీ బికినీ... శ్రద్ధాదాస్ డేటింగ్
‘ఝుమ్మంది నాదం’తో తెరంగ్రేట్రం చేసిన అందాల నటి తాప్సీ పాత్ర పరంగా బికినీ ధరించడానికైనా సరేనంటోంది. స్విమ్మింగ్
ఫూల్ సన్నివేశంలో జీన్ ప్యాంట్ వేసుకుంటానంటే ఎలా? అని జోకు వేస్తోంది. ఈ మద్య తెలుగులో వరుసగా చిత్రాలు చేసి
ఇప్పుడు కాస్త వెనుకబడ్డ శ్రద్ధాదాస్ - తనకు సల్మాన్ ఖాన్, నాగార్జునలతో డేటింగ్ చేయాలంటే ఇష్టం అంటూ చెబుతోంది.
శ్రద్ధాదాస్ తెలుగులో ప్రస్తుతం వెంకటేష్ ‘చంద్రముఖి’ - 2 లో నటిస్తోంది.
|
సంక్రాంతికి నాగ్ చిత్రం... వర్మ ‘బెజవాడ రౌడీలు’
శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించే సోషియో ఫాంటసీ చిత్రం సంక్రాంతికి ప్రాపంభం అవుతోంది.
ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై దీన్ని వెంకట్ నిర్మిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ‘బెజవాడ రౌడీలు’ పేరుతో ఓ చిత్రం
చేస్తున్నారు. ‘రౌడీ’ అనే మాటకు బెజవాడలోనే పాపులారిటీ వచ్చింది. నేను అక్కడ చదువుకుంటున్నపుడు
రౌడీయిజాన్ని సమీపం నుండి చూసాను. ముప్పై ఏళ్ళ నుండి నా మనసులో ఉన్న ఈ అంశంతో త్వరలో సినిమా చేస్తానని
వర్మ చెబుతున్నారు.
|
బాలయ్య చిత్రం ప్రారంభం... సింక్ సౌండ్ తో పవన్
బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శకత్వంలో కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో
ప్రారంభమైంది. బాలయ్య ఇందులో 3 పాత్రలు చేయడం విశేషం. ఒక హీరోయిన్ గా భూమిక చేస్తోంది. షూటింగ్
తర్వాత డబ్బింగ్ చెప్పే విధానం ప్రస్తుతం మన సినిమా రంగంలో ఉంది. షూటింగ్ తర్వాత డబ్బింగ్ చెప్పే విధానం ప్రస్తుతం
మన సినిమారంగంలో ఉంది. షూటింగ్ జరుగుతున్నప్పుడే సంభాషణలు రికార్డ్ చేసే ‘సింక్ సౌండ్ సిస్టమ్’ ఇప్పుడు కొత్తగా
వచ్చింది. ‘జానీ’లోనే ఈ విధానంలో సౌండ్ రికార్డ్ చేసిన పవన్ ప్రస్తుతం జయంత్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఖుషీగా’
చిత్రంలోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు.
|
కొత్త అందాల ప్రదర్శనకు శ్రియ సిద్ధం
శ్రియ చిత్రరంగానికొచ్చి పదేళ్ళు పూర్తయ్యాయి. అయినా, నాకింకా పాతికేళ్ళేనని శ్రియ అంటోంది. వయసు
మీదపడుతున్న శ్రియ ఇప్పుడు ప్రేక్షకులను కొత్త అందాలతో ఆకట్టుకునే పనిలో ఉంది.అందుకే ‘డాన్ శీను’లో మరింత
చురుకుగా చేసింది. ‘కొమరం పులి’ పాటలో రెచ్చిపోయింది. రాబోయే చిత్రాల్లో మరింతగా అందాల ప్రదర్శనకు శ్రియ
సిద్ధమవుతోంది.
|
------------------------------------------------------ |
రంగుల్లోకి ‘మిస్సమ్మ’, ‘జగదేకవీరుని కథ’
‘మాయాబజార్’ను రంగుల్లో అందించి ప్రేక్షకులను అలరించిన ‘గోల్డ్ స్టోన్’ వారు ఇప్పుడు వరుసగా తెలుగువారు
అమితంగా అభిమానించే చిత్రాలను రంగుల్లోకి మారుస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్, ఎఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి
నటించిన ‘మిస్సమ్మ’ను రంగుల్లో అందించే ప్రయత్నంలో వున్నారు. ‘జగదేకవీరుని కథ’, ‘పాతాళభైరవి’ వంటి
సూపర్ హిట్ చిత్రాలను కూడా త్వరలో రంగుల్లోకి మారుస్తారు.
|
అమెరికాలో ‘జోష్’ డాన్స్ టాలెంట్ హంట్
ప్రణబ్ క్రియేషన్స్ అధినేత్రి పద్మజారెడ్డి నేతృత్వంలో త్వరలో అమెరికాలో ‘జోష్’ డాన్స్ టాలెంట్ హంట్ జరుగుతుందని
డి.రామానాయుడు తెలిపారు. అమెరికాలో 40నగరాల్లో జరిగే ఈ కార్యక్రమంలో 2000మంది నుండి 10మందిని ఎంపిక
చేసి, హైదరాబాద్లో గ్రాండ్ ఫైనల్ జరుపుతారని చెప్పారు. దీన్ని జెమినీలో ప్రసారం చేస్తారని తెలిపారు. ఇందులో
ఎంపికైన ఓ అమ్మాయి, అబ్బాయిని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రంలో వెండితెరకు పరిచయం చేస్తామని చెప్మీపారు.
|
మీడియాను ముప్పుతిప్పలు పెట్టిన మహేష్
‘ఖలేజా’ ఆడియో విడుదలను ‘రేడియో మిర్చి’ వారి చిన్న ఆఫీసులో పెట్టారు. ఆ ఆఫీసు ముందు కనీసం పార్కింగ్
స్థలం కూడా లేదు. పోలీసులు వచ్చి బళ్లు తీసుకుపోతామంటూ బెదిరిస్తుంటే, ఏదోవిధంగా నచ్చచెప్పి
‘రేడియోమిర్చి’లోకి వెళ్తే, అక్కడా స్థలంలేక చాలామంది బయటనే వుండిపోయారు. చాలా ఆలస్యంగావచ్చిన మహేష్
బాబు మీడియాతో మాట్లాడకుండా సరాసరి ‘రేడియోమిర్చి’ శ్రోతలతో పిచ్చాపాటీ పెట్టుకున్నారు. అప్పటివరకూ
పడిగాపులు పడ్డ మీడియావారితో ఆ తర్వాతనైనా మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడంతో అంతా నిరసన వ్యక్తం చేశారు.
మీడియా పట్ల ‘రేడియోమిర్చి’ వారు వ్యవహరించిన తీరుకూడా ఘోరంగా వుంది.
|
ఒకే ఇమేజ్ ఇష్టంలేదంటున్న రామ్ చరణ్
ఏదో ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టంలేదు. అందుకే ఏరికోరి ‘ఆరెంజ్’ చేస్తున్నాను. ‘బొమ్మరిల్లు’
భాస్కర్ ని స్వయంగా కలిసి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చేలా చేసాను. ‘మగధీర’ చేస్తున్నప్పుడే నా తదుపరి చిత్రం
ఆహ్లాదకరమైన ప్రేమకథతో చేయాలని నిర్ణయించుకున్నాను. ‘ఆరెంజ్’ వినోదానికి పెద్దపీట వేస్తూ, విజ్ఞానదాయకంగా
రూపొందించిన విభిన్న ప్రేమకథా చిత్రం. అక్టోబర్ మూడవవారంలో ఆడియో, నవంబర్ మొదటి వారంలో సినిమా విడుదల
చేయాలనుకుంటున్నాం అన్నారు ‘మగధీర’ హీరో రామ్ చరణ్ ‘ఆరెంజ్’ గురించి చెబుతూ...
|
ప్రియాంకకు పెరుగుతున్న ప్రేమికుల బెడద
గ్లామర్ నటి ప్రియాంక చోప్రాకు ప్రేమికులు ఇక్కడే కాదు, విదేశాల్లోనూ పెరిగిపోతున్నారు. ఓ రియాలిటీ షో షూటింగ్ కోసం
బ్రెజిల్ వెళ్ళిన ప్రియాంకకు తిరుగు ప్రయాణంలో ఓ ప్రేమికుడు తగిలాడు. ఆమె అందాన్ని చూసి తలతిరిగిపోయిన ఆ బ్రెజిల్
వ్యాపారవేత్త తనని పెళ్ళి చేసుకోమంటూ ఆమెను వెంటాడి వేధించాడు. తాను భారతీయుడినే పెళ్ళి చేసుకుంటానని ప్రియాంక
కరకుగా చెబితేతప్ప అతను ఒదిలిపెట్టలేదట...
|
------------------------------------------------------ |
ఆస్కార్కు నామినేట్ అయిన అమీర్ ఖాన్ ‘పీప్లీ లైవ్’
ప్రేక్షకులతోపాటు విమర్శకుల మన్ననలు పొందిన అమీర్ ఖాన్ చిత్రం ‘పీప్లీ లైవ్’ ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.
మనదేశం నుండి ఆస్కార్కు నామినేషన్ కోసం వచ్చిన 27 చిత్రాల నుండి కమిటీ ‘పీప్లీ లైవ్’ను ఎంపిక చేసింది. ఆస్కార్
అవార్డుల ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ చిత్రం మన దేశం నుండి అధికారికంగా నామినేషన్ పొందింది. ‘మన దేశం
తరఫున నా చిత్రంతో ప్రాతినిథ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు’ అమీర్ ఖాన్ పేర్కొన్నారు.
|
హ్యాట్రిక్ హీరోలు అమితాబ్, కమల్, మమ్ముట్టీ...
జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా హ్యాట్రిక్ సాధించిన హీరోలుగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, మమ్ముట్టి నిలిచారు.
‘అగ్నిపథ్’, ‘బ్లాక్’, ‘పా’ చిత్రాలకు అమితాబ్ జాతీయ అవార్డులు అందుకున్నారు. ‘ముండ్రాంపిరై’,
‘నాయకన్’, ‘ఇండియన్’ చిత్రాలకు కమల్ హసన్, ‘బాబా సాహెబ్ అంబేద్కర్’, ‘ఒరువడక్కన్ వీరగాథ’,
‘విధేయన్’ చిత్రాలకు మమ్ముట్టి అవార్డులు అందుకున్నారు.
|
అయిదు పాత్రలు పోషిస్తున్న అర్జున్
‘జెంటిల్ మెన్’ అర్జున్ ఇప్పుడు ఓ చిత్రంలో అయిదుపాత్రలు పోషిస్తున్నారు. ‘వల్ల కొట్టాయ్’ పేరుతో వెంకటేష్
దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇందులో అర్జున్ పాత్ర పవర్ ఫుల్ గా వుంటుందని,
అతను పోషించే ఇతర పాత్రలు కూడా థ్రిల్లింగ్ గా కొత్త తరహాలో వుంటాయని దర్శకుడు చెబుతున్నాడు.
|
బోయపాటి చిత్రంలో ఎన్టీఆర్ తో జెనీలియా?
‘సింహా’ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రం రానుంది. దీనికి సంబంధించి కథా చర్చలు
జరుగుతున్నాయి. ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటించే అవకాశం వుంది.
|
అనాథ బాలల కోసం ‘బైరవ’ నిర్మాత నట్టికుమార్ వితరణ
శ్రీహరితో ‘భైరవ’ చిత్రం నిర్మించిన నట్టికుమార్ ఈ చిత్రం విడుదల సందర్భంగా అనాథ బాలల కోసం ఆర్థిక సహాయాన్ని
ప్రకటించారు. శ్రీహరి నిర్వహిస్తున్న ‘అక్షయ ఫౌండేషన్’కు 5లక్షల 20వేల రూపాయలు విరాళాన్ని అందించారు.
‘భైరవ’కు మంచి స్పందన లభించడం వల్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే, థియేటర్ దగ్గర జరిగిన తోపులాటలో
నట్టికుమార్ పర్స్ ను ఎవరో దొంగిలించారు.
|
------------------------------------------------------ |
త్రిష ముద్దుకు ‘నో’... ప్రియాంక ముద్దు సంచలనం
‘లవ్ ఆజ్ కల్’ ఆధారంగా జయంత్ సి.ఫర్జానీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఖుషీగా’ చిత్రం షూటింగ్ రామోజీ
ఫిలింసిటీలో ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ గా మొదట ఇలియానాను అనుకుని తర్వాత త్రిషను ఖాయం చేసారు.
హిందీలో దీపిక, సైఫ్ అలీఖాన్ లపై ఉన్న ముద్దు సన్నివేశాలను తెలుగులో కూడా పవన్ త్రిషలపై చెయ్యాలనుకుంటే త్రిష
‘ఓకె’ అన్నా, పవన్ ‘నో’ చెప్పారని భోగట్టా. ఇక, ‘అంజానా అంజానీ’ చిత్రంలో ప్రియాంక, రణబీర్ కపూర్
ల పై చిత్రీకరించిన ముద్దు సన్నివేశం సంచలనం సృష్టిస్తోంది. ఈ ముద్దు సుదీర్ఘంగానూ, చాలా వేడిగానూ ఉందట.
|
నాకు నలుగురు గురువులంటున్న తమన్నా
సినిమా రంగంలో శేఖర్ కమ్ముల, బాలాజీ శక్తివేల్, ‘జయం’రాజా, లింగుసామిని నేను గురువులుగా భావిస్తాను.
వారి దర్శకత్వంలో చేసినపుడు సినిమాకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నానని తమన్నా అంటోంది. ప్రస్తుతం
తమన్నా తెలుగులో అల్లు అర్జున్, నాగచైతన్యల చిత్రాల్లోనూ, తమిళంలో కార్తి సరసన ఓ చిత్రంలోనూ నటిస్తోంది.
|
ప్రభుదేవా భార్యకు 6 కోట్ల సెటిల్ మెంట్
ప్రభుదేవా - నయనతారల పెళ్ళి వార్త ఖరారు అయిన నేపథ్యంలో ప్రభుదేవా భార్య రమాలత్ నిరాహార దీక్షకు పూనుకుంది.
అయితే సినిమా ప్రముఖుల మాటకు కట్టుబడి వాయిదా లేసుకుంది. ఆమెకు ప్రభుదేవా 4 కోట్లు చేసే బంగళా, 2 కోట్ల
నగదు సెటిల్ మెంట్ కోసం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
|
శ్రీకాంత్ ‘దుశ్శాసన’... రెహమాన్ ‘సంగీత ప్రభంజనం’
పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో శ్రీకాంత్ నటించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ సంచలన విజయం సాధించింది. వీరి
కలయికలో ‘దుశ్శాసన’ అనే మరో చిత్రం వస్తోంది. ఇందులోనూ శ్రీకాంత్ కొత్తగా కనిపిస్తారట. సంజన ఒక నాయికగా
చేస్తోన్న ఈ చిత్రంలో మరో నటి కూడా ఉంటుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ పై కామినీ మత్తయ్ ఓ పుస్తకం
రాసారు. దాన్ని ‘సంగీత ప్రభంజనం’ పేరుతో సరోజా ప్రసాద్, కృష్ణసాయిరామ్ లు తెలుగులోకి అనువదించి విడుదల
చేశారు.
|
ప్రేమ వివాహంపైనే నమ్మకం అంటున్న త్రిష
ప్రస్తుతం నా కెరీర్ స్పీడ్ గా ఉంది. కానీ ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాల్సిందే కదా! నేను చేసుకునే వ్యక్తి పెద్ద అందగాడు
కానవసరం లేదు. చక్కగా మాట్లాడేవాడు, అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాడు అయితే చాలు. నేను ఖచ్చితంగా ప్రేమ
వివాహమే చేసుకుంటా. దానిపైనే నాకు నమ్మకం. ప్రస్తుతానికి ఎవరూ లేరు కానీ, ఎవరో నా కోసం పుట్టే
ఉంటాడుగా... అంటూ చెబుతోంది త్రిష.
|
------------------------------------------------------ |
‘ఖలేజా’, ‘బృందావనం’ పోటీ నిజమేనా?
భారీ చిత్రాలు ‘ఖలేజా’ అక్టోబర్ 7న, ‘బృందావనం’ అక్టోబర్ 8న విడుదల చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించారు.
అయితే, ఇప్పటికే ఘోరపరాజయాలతో ఇబ్బంది పడుతున్న చిత్రరంగానికి భారీ ఖర్చుతో చేసిన చిత్రాలు ఇలా పోటా పోటీగా
విడుదల కావడం మంచిదా? అని పరిశ్రమ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్ళ తర్వాత విడుదలవుతున్న మహేష్ చిత్రం పట్ల
అంతటా ఆసక్తి ఉన్నప్పటికీ ఇది కూడా ‘కొమరం పులి’లానే తుస్సుమంటుందన్న నమ్మకం కలిగాకనే దిల్ రాజు
‘బృందావనం’ డేట్ ప్రకటించారని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా దిల్ రాజు ‘బృందావనం’ మరో వారం వెనక్కి
వెళ్ళడం ద్వారా మంచి సంప్రదాయాన్ని పాటించాలని పలువురు కోరుతున్నారు.
|
రవితేజ హీరోగా వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’
రాజేంద్రప్రసాద్ హీరోగా అప్పట్లో వంశీ రూపొందించిన ‘లేడీస్ టైలర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల అల్లరి
నరేష్ తో వంశీ నిర్మించిన ‘సరదాగా కాసేపు’ విజయవంతం అయిన నేపథ్యంలో వంశీ, ఫ్లాన్ చేస్తున్న ‘లేడీస్ టైలర్’
-2 ను ఇప్పుడు చేస్తున్నారు. ‘ఫ్యాషన్ డిజైనర్’ (సన్ ఆఫ్ లేడీస్ టైలర్) అనే పేరుతో చేసే ఈ చిత్రం రవితేజ హీరోగా
నటిస్తారని తెలుస్తోంది. హీరో తండ్రిగా రాజేంద్రప్రసాద్ చేస్తారు.
|
వర్మ - గుణశేఖర్ ల చిత్రం... త్వరలో ‘గమ్యం - 2’
‘వరుడు’తో పెద్ద ఫ్లాప్ ఇచ్చిన గుణశేఖర్ ఇప్పుడు వర్మతో కలిసి ఓ చిత్రం కోసం స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్మ
నిర్మించే ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తారు.ఇటీవల ‘గాయం - 2’ నిర్మించిన దుబాయ్ పారిశ్రామిక వేత్త
ధర్మకర్త తమ బ్యానర్ పై ‘గమ్యం - 2’ అనే పేరు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారు. అలాగే, ముళ్ళపూడి వర
దర్శకత్వంలో కె.రాఘవేద్రరావు పర్యవేక్షణలో ఓ చిత్రం నిర్మిస్తామని ప్రకటించారు.
|
అక్టోబర్ 3న ‘ఆరెంజ్’ ఆడియో విడుదల
‘మగధీర’ తర్వాత రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మిస్తున్న‘ఆరెంజ్’ పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా, షాజన్ పదంసీ, మధురిమ హీరోయిన్లుగా
చేస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం పాటల విడుదల అక్టోబర్ 3న జరుగుతుంది.
హ్యారీస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
|
తెలుగింటి ఆడపడుచుగానే అనూష్క ఉంటుందట
మహేష్ తో ‘ఖలేజా’, వెంకటేష్ తో ‘చంద్రముఖి - 2’, నాగార్జునతో కామాక్షి మూవీస్ చిత్రంతో పాటు తమిళం
‘వేదం’లోనూ నటిస్తూ అనూష్క ఫుల్ బిజీగా ఉంది. ఎన్ని భాషల్లో నటించినప్పటికీ - తెలుగు సినిమాతో సమానంగా ఏ
భాషా చిత్రాన్ని చూడనని అనూష్క అంటోంది. అనూష్కను తెలుగు నటిగా అన్ని భాషల వారూ గుర్తించడమే నాకు ఇష్టం.
నేను కన్నడ అమ్మాయిని, తమిళంలోనూ చేస్తున్నాను. అయినా, నేను సెటిల్ అయ్యేది తెలుగు నేలపైనే. తెలుగింటి
ఆడపడుచులానే జీవితం సాగించాలని నా కోరిక - అని చెబుతోంది.
|
------------------------------------------------------ |
మహేష్ ‘ఖలేజా’ ఆడియో 26న, విడుదల 7న
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ ఈ నెల 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే, ‘రోబో’ అక్టోబర్ 1న విడుదల అవుతుండడంతో వారం గ్యాప్ తో అక్టోబర్ 7న విడుదల చేయాలనుకుంటున్నారు. మహేష్ ఆటో డ్రైవర్ గా, అనూష్క సంపన్నుల అమ్మాయి ‘బంగారం’గా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈనెల 26న విడుదలవుతుంది.
|
అక్టోబర్ 9న నాగార్జున - శ్రీనివాసరెడ్డి చిత్రం ప్రారంభం
‘కిక్’, ‘డాన్ శీను’ వంటి ఘనవిజయాలు అందించిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ అక్కినేని నాగార్జున హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ కథాంశంతో, గ్రాఫిక్స్ ప్రాధాన్యతతో వుంటుంది. ఇందులో అనూష్క నాయికగా చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
|
ఆదాయపు పన్ను చెల్లింపులో షారుఖ్ టాప్
బాలీవుడ్లో ాదాయపు పన్ను చెల్లింపులో షారుఖ్ ఖాన్ ప్రథమ స్థానంలో నిలిచారు. 2011 సంవత్సరానికిగాను రూ.5కోట్లు ముందస్తు పన్ను చెల్లించారు. అక్షయ్ కుమార్ రూ.4.5కోట్లు, అమీర్ ఖాన్ రూ.4కోట్లు, సైఫ్ అలీఖాన్, రణబీర్ కపూర్ చెరో 2.5కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.2కోట్లు, హృతిక్ రోషన్ రూ.50లక్షలు చెల్లించారు. హీరోయిన్స్ల్ లో కత్రినాకైఫ్ రూ.1.3కోట్లు, కరీనాకపూర్ కోటి చెల్లించారు.
|
ఇలియానా ఐటమ్ కి 30లక్షలు, ‘ఆరెంజ్’లో మధురిమ
తెలుగులో అగ్రశ్రేణి నాయిక ఇలియానా ఓ కన్నడ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. దీనికి ఆమె పుచ్చుకున్న పారితోషికం అక్షరాలా రూ.30లక్షలు. ఇలియాన పాటతో సినిమాకి వచ్చే క్రేజ్ కన్నా రూ.30లక్షలు ఎక్కువ కాదంటున్నారు ఈ చిత్ర నిర్మాత. ‘సరదాగా కాసేపు’లో అందాలు చిందించిన నటి మధురిమకు రామ్ చరణ్ సరసన భలే ఛాన్స్ దొరికింది. జెనీలియా, షాజీ పదంసీలు నటిస్తున్న ఈ చిత్రంలో మరో నాయికగా మధురిమ ఎంపికయ్యింది.
|
బాలయ్య ‘అధినాయకుడు’... పవన్ తో విష్ణువర్థన్
పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య త్రిపాత్రాభినయంతో రూపొందిస్తున్న చిత్రానికి ‘అధినాయకుడు’ అనే పేరు పరిశీలిస్తున్నారు. తమిళంలో ‘బిల్లా’ వంటి విజయవంతమైన చిత్రం అందించిన విష్షువర్థన్ త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ తెలుగు చిత్రం కోసం కథను సిద్ధం చేసేపనిలో వున్నారు. విష్ణువర్థన్ త్వరలో అజిత్ హీరోగా తమిళంలో ‘బిల్లా-2’ చేస్తున్నారు.
|
------------------------------------------------------ |
లారెన్స్ తో ప్రభాస్ ‘రెబెల్’... ‘రాస్కెల్’గా 3 ఇడియట్స్
లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా త్వరలో ఓ చిత్రం ప్రారంభం అవుతోంది. కృష్ణంరాజును ‘రెబల్ స్టార్’గా భావించే
అభిమానులు ప్రభాస్ ని ‘యంగ్ రెబల్ స్టార్’ అని పిలుచుకోవడం మనకు తెలిసిందే. దానికి అనుగుణంగానే లారెన్స్
దర్శకత్వంలో వచ్చే చిత్రానికి ప్రభాస్ చిత్రానికి ‘రెబెల్’ అని పేరు పెడుతున్నారు. శంకర్ దర్శకత్వంలో హిందీ సూపర్
హిట్ ‘3 ఇడియట్స్’ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో విజయ్,
తెలుగులో మహేష్ బాబు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. దీనికి ‘రాస్కెల్’ అనే
పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు.
|
‘గగనం’, ‘కాందహార్’ ఒక్కటే, మళ్ళీ ‘యాదోంకి బారాత్’
తెలుగు, తమిళ భాషల్లో రాధామోహన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గగనం’(తమిళంలో ‘పయనం’)లో నాగార్జున,
ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం కథాంశం, మలయాళ చిత్రం ‘కాందహార్’ కథాంశం ఒక్కటేనని
తెలుస్తోంది. ఇందులో అమితాబ్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. అప్పట్లో సూపర్ డూపర్ హిట్
అయిన మ్యూజికల్ సెంటిమెంట్ చిత్రం ‘యాదోంకి బారాత్’ను మళ్ళీ రీమేక్ చేస్తారట. ‘ఖయామత్ సే ఖయామత్
తక్’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన మన్సూర్ ఖాన్ దీనికి దర్శకత్వం వహిస్తారు. అమితాబ్, అమీర్
ఖాన్, రణబీర్ కపూర్, మన్సూర్ ఖాన్ హీరోలుగా నటిస్తారు.
|
హీరోయిన్ ఓరియంటెడ్ గా త్రిష... దర్శకురాలిగా ఏంజలీనా
మంచి పాత్రలభిస్తే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో చేయడానికి సిద్ధం అంటూ చాలా సార్లు చెప్పిన త్రిష ఇప్పుడు ప్రముఖ
నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాజల్ తో ‘చండి’ గ్రాఫిక్స్ ప్రధానంగా
నిర్మించాలనుకున్న రాజు ఆ చిత్రాన్ని వదిలేసి ఇప్పుడు త్రిషతో ఈ చిత్రం చేస్తున్నారు. గతంలో త్రిష రాజు నిర్మించిన
‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో చేసింది. హాలీవుడ్ చిత్రాల్లో అగ్రనాయిక
ఏంజలీనా జోలి త్వరలో దర్శకురాలు కానుంది. బోస్నియా యుద్ధం నేపధ్యంలో ఓ అందమైన ప్రేమకథను ఆమె తన తొలి
చిత్రంగా రూపొందించే ప్రయత్నంలో ఉంది.
|
నష్టపోయిన్ ప్రకాష్ రాజ్, యాంకర్స్ బారిన వంశీ
నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా కూడా తమిళంలో పలు చిత్రాలు నిర్మించారు. ఇటీవల దర్శకుడిగా కూడా మారి
‘ఆకాశమంత’ చిత్రాన్ని కన్నడలో స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది కానీ
నిర్మాతగా ప్రకాష్ రాజ్ కు 60 లక్షల నష్టాన్ని మిగిల్చింది. ప్రముఖ దర్శకుడు వంశీ తన తాజా చిత్రం ‘సరదాగా
కాసేపు’ ప్రమోషన్ పనిలో భాగంగా పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే, ఆ ఇంటర్వ్యూలు చేసిన
యాంకర్స్ మిడిమిడి జ్ఞానంతో, అర్థం పర్థం లేకుండా వేసే ప్రశ్నలకు చాలా ఇబ్బంది పడ్డారు.
|
జాతీయ అవార్డుకై మహేష్... బాలయ్యతో భూమిక
నేను నటించిన చిత్రం విడుదలకు మూడేళ్ళు విరామం రావడం నా అభిమానులను నిరాశ పరిచి ఉండవచ్చు. అయితే
ఒక నటుడిగా, వ్యక్తిగా నేను పరిణితి సాధించడానికి ఈ మూడేళ్ళు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి - అని
అంటున్నారు మహేష్ బాబు. నేషనల్ అవార్డు అందుకోవాలన్నది నా కోరిక. నా కల... ఎప్పటికైనా అది
తీరుతుందో లేదో నాకు తెలీదు. అయితే, కలగనడంలో తప్పు లేదు కదా! అని అంటున్నారు. నటి భూమిక
తొలిసారిగా బాలకృష్ణ సరసన నటిస్తోంది. పరుచూరి మురళి దర్శకత్వంలో బాలకృష్ణ తాత, కొడుకు, మనవడుగా
మూడు పాత్రలు పోషిస్తున్న చిత్రంలో ఓ పాత్ర సరసన భూమిక చేస్తోంది.
|
------------------------------------------------------ |
మోహన్ లాల్ తెలుగు పాట - ప్రియమణి ముద్దులాట
‘ఏ మాయ చేసావె’లో ఒక పూర్తి మలయాళ గీతం ప్రయోగాత్మకంగా పెట్టారు. దాన్ని ప్రేక్షకులు బాగానే స్వీకరించారు.
ఇప్పుడు మలయాళ చిత్రంలో ఓ తెలుగు పాటను పెట్టారు. మోహన్ లాల్ హీరోగా చేస్తున్న ‘శిఖర్’లో ‘ప్రతిఘటించు’
అంటూ సాగే ఈ పాటను ఎస్.పి.బాలు పాడారు. విజయాలు లేక నీరసపడ్డ సుమంత్, ప్రియమణి ఇప్పుడు ‘రిమ్
జిమ్’ అనే చిత్రంలో జంటగా చేస్తున్నారు. బికినీ ధరించినా సినిమాని సక్సెస్ చేయలేక పోయిన ప్రియమణి ఈ చి త్రంలో సుమంత్ తో ముద్దు సన్నివేశానికి ఓకె చెసిందట.
|
బాలీవుడ్ బాటలో చక్రి... షకీరా కాళిక
ప్రముఖ యువ సంగీత దర్శకుడు చక్రి బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ‘రాజ్ నీతి’ వంటి
చిత్రాలను అందించిన ప్రకాష్ ఝా ను కలిసి తను స్వరపరిచిన రాగాలను వినిపించి ఆనందపరిచాడు. త్వరలో ప్రకాష్ ఝా
చేసే కొత్త చిత్రానికి చక్రి సంగీతాన్ని అందించే అవకాశం ఉంది. హాట్ పాప్ సింగర్ షకీరాను కాళికాదేవిగా ఓ చిత్రంలో
చూపించాలని కరణ్ అరోరా ఆలోచిస్తున్నారు. ‘కాళి - ది వారియర్ గాడెస్’ పేరుతో 3డిలో నిర్మించే ఈ చిత్రంలో
చేసేందుకు షకీరా అంగీకరించిందని, యూరప్ లో ఈ చిత్రం షూటింగ్ చేస్తామని ఆయన అంటున్నారు.
|
రంభ, మీనా తల్లులవుతున్నారు... సీత రెండో పెళ్ళి
దక్షిణాది ప్రముఖ హీరోయిన్లు రంభ, మీనా ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు
గర్భవతులు. కొద్ది నెలల్లోనే వీరు తల్లులు కాబోతున్నారు. ప్రముఖ నటి సీత రెండవ పెళ్ళి చేసుకుంది. నటుడు
పార్తీపన్ ను వివాహం చేసుకున్న సీతకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొద్ది కాలం కిందటనే స్పర్దల కారణంగా వీరు
విడిపోయారు. దాంతో సీత టివి నటుడు సతీష్ ను రెండవ పెళ్ళి చేసుకుంది.
|
అనూష్క దగ్గర అందమే కాదు... త్రిష ఆనందం
‘‘అనూష్క చాలా అందమైన అమ్మాయి. ఆమె హాట్ గర్ల్ కూడా. అంతకన్నా మించి మంచి మనుసున్న
అమ్మాయి’’- అంటూ అనూష్క పట్ల తనకున్న సదభిప్రాయాన్ని అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో పేర్కొన్నారు. దాంతో
పాటు వారిద్దరి అన్యోన్యానికి గుర్తుగా ఓ ఫోటోను కూడా జత చేశారు. చేతి దాకా వచ్చిన సినిమా రకరకాల కారణాల వల్ల
మిస్ అయినప్పుడు ఎందుకిలా జరిగిందని బాధ కలగడం సహజం. త్రిష ఈ విషయంలో మాత్రం ఆనందంగా ఉంది. తను
మిస్ అయిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కనుక, తనకు అంతా మంచే జరిగిందని ఆమె సంతోషిస్తోంది.
|
‘రోబో’ విడుదలతో వాయిదాపడుతున్న చిత్రాలు
సెప్టెంబర్ 24న విడుదలవుతుందనుకున్న ‘రోబో’ ఇప్పుడు అక్టోబర్ 1న విడుదలవుతోంది. దాంతో విడుదలకు సిద్ధంగా
ఉన్న మహేష్ బాబు ‘ఖలేజా’, ఎన్టీఆర్ ‘బృందావనం’ విడుదల వాయిదాపడే అవకాశం ఉంది. ‘రోబో’ ట్రైలర్
చూశాక ఆ చిత్రంతో పోటీ పడేంత ధైర్యం ఏ నిర్మాత చేయలేరు. అక్టోబర్ లో విడుదలవుతుందనుకుంటున్న వెంకటేష్
‘చంద్రముఖి - 2’ కూడా వాయిదా పడుతుంది. ఈ నేపధ్యంలో చిన్న చిత్రాల నిర్మాతల పరిస్థితి అడకత్తెరలో పోక
చెక్కలా మారింది.
|
------------------------------------------------------ |
అక్టోబర్ లో ‘చంద్రముఖి - 2’... తమిళంలో అజిత్
కన్నడలో ఘనవిజయం సాధించిన ‘చంద్రముఖి - 2’ను తెలుగులో వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో
నిర్మిస్తున్నారు. దాదాపు పూర్తయిన ఈ చిత్రం అక్టోబర్ రెండవ వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అనూష్క,
కమలిని ముఖర్జీ, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్, రిచా గంగోపాద్యాయ ఈ చిత్రంలో నాయికలు. ఇదే చిత్రాన్ని తమిళంలో
పి.వాసు రజనీకాంత్ హీరోగా చేయాలనుకున్నారు. అయితే, రజనీకాంత్ అజిత్ పేరు సూచించడంతో త్వరలో ఈ చిత్రం
అజిత్ తో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
|
రానా ‘నేను నా రాక్షసి’... గోపీచంద్ ‘రౌద్రం’
పూరిజగన్నాధ్ దర్శకత్వంలో రానా హీరోగా ఇలియానా హీరోయిన్ గా నిర్మిస్తున్న చిత్రానికి ‘నేను నా రాక్షసి’ అని పేరు
పెడుతున్నారు. ఈ చిత్రం కోసం రానా వ్యాయమంతో శరీర సౌష్టవాన్ని బాగా పెంచాడు. శ్రీవాసు దర్శకత్వంలో గణేష్
ఇందుకూరి గోపీచంద్ హీరోగా ఓ చిత్రం త్వరలో ప్రారంభిస్తున్నారు. దీనికి ‘రౌద్రం’ అని పేరు పెడుతున్నారు.
|
త్రివిక్రమ్ తో వెంకటేష్... లింగుసామితో మహేష్
‘జల్సా’, ‘ఖలేజా’ దర్శకుడు త్రివిక్రమ్ తో వెంకటేష్ ఓ చిత్రం చేస్తున్నారు. పలువిజయవంతమైన చిత్రాలు నిర్మించిన
దానయ్య దీనికి నిర్మాత. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్
నిర్మిస్తున్న చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ‘పందెం కోడి’, ‘ఆవారా’ దర్శకుడు లింగుసామి దీనికి
దర్శకుడు.
|
ఆఖరు దశలో నయనతార విజయపరంపర
ప్రభుదేవా ప్రేమలో తలమునకలై ఉన్న నయనతార ప్రస్తుతం కొత్త సినిమాలు అంగీకరించడం లేదు. ప్రభుదేవాతో పెళ్ళి తర్వాత
బహుశా ఆమె సినిమాల్లో నటించే అవకాశం కనిపించడం లేదు. నటిగా ఈ ఆఖరు దశలో నయనతారకు వరుస విజయాలు
రావడం విశేషం. తమిళంలో సూర్యతో ఆమె నటించిన ‘అదవన్’ (ఘటికుడు), మలయాళంలో పృధ్వీరాజ్ తో ఆమె
చేసిన ‘బాడీగార్డ్’, తెలుగులో ఎన్టీఆర్ తో చేసిన ‘అదుర్స్’, బాలకృష్ణతో చేసిన ‘సింహా’ విజయవంతం అయ్యాయి.
తాజాగా తమిళంలో ఆర్యతో ఆమె చేసిన ‘బాస్ ఎంగిర భాస్కరన్’ చిత్రం కూడా విజయ పథంలో నడుస్తోంది.
|
సల్మాన్ ‘దబాంగ్’ విజయం... ముంబై దాడులు వివాదం
సల్మాన్ ఖాన్ తన తమ్ముడు అర్బాజ్ ఖాన్ నిర్మాతగా చేసిన ‘దబాంగ్’ ఘనవిజయం సాధించింది. శతృఘ్న సిన్హా కుమార్తె
సోనాక్షి సిన్హా హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిత్రం ప్రారంభ వసూళ్ళు ‘త్రీ ఇడియట్స్’ని మించిపోయి 48 కోట్లకు
చేరుకుంది. అయితే, ముంబై దాడులపై అతను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వాటికి క్షమాపణలు
చెప్పినప్పటికీ, ఇప్పటి వరకూ సల్మాన్ పై మన ప్రేక్షకులకు ఉన్న మంచి అభిప్రాయం దెబ్బతిన్నడం మాత్రం వాస్తవం.
|
------------------------------------------------------ |
రానా - పూరి చిత్రానికి ముగ్గురి సంగీతం
రానా హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం అధిక భాగం బ్యాంకాక్, ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం
కోసం ప్రత్యేకంగా దుబాయ్ నుండి కాస్ట్యూమ్స్ తెప్పించడం విశేషం. ఈ చిత్రానికి ముగ్గురు సంగీతాన్ని అందించడం మరో
విశేషం. దీనికి విశాల్ - శేఖర్, విశ్వ, శంకర్-ఇషాన్-లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
|
హాలీవుడ్ లో జానీడెప్ దే ఎక్కువ సంపాదన
‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ హీరో జానీ డెప్ హాలీవుడ్ లో అత్యధికంగా సంపాయిస్తున్న హీరోగా ‘ఫోర్బ్స్’ పత్రిక
ప్రకటించింది. గత ఏడాది ఈ జాబితాలో పదవ స్థానం సంపాయించుకున్న జానీడెప్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు. ఆ
తర్వాత స్థానంలో వరుసగా బెన్ స్టిల్లర్, టామ్ హ్యాంక్స్, సాండ్లర్, లియోనార్డ్ డికాష్రియో నిలిచారు.
|
‘వేదం’ రాధాకృష్ణతో రామ్ చరణ్ చిత్రం
‘గమ్యం’, ‘వేదం’ దర్శకుడు రాధాకృష్ణతో రామ్ చరణ్ ఓ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్
‘ఆరెంజ్’, ‘మెరుపు’ చిత్రాలు చేస్తున్నారు. రాధాకృష్ణ తమిళంలో ‘వేదం’ రీమేక్ చేస్తున్నారు. వీటి తర్వాత
ప్రారంభమయ్యే రామ్ చరణ్ - క్రిష్ ల చిత్రం కూడా పరిమిత బడ్జెట్ లో ప్రయోజనాత్మక కథాంశంతోనే ఉంటుందని
తెలుస్తోంది.
|
సిమ్రాన్, తమన్నా, సమంతల అభిమాని త్రిష
నాకు సిమ్రాన్ అంటే ఇష్టం. ఇప్పుడు తమన్నా, సమంతలకు అభిమానిని అయ్యాను - అని అంటోంది అందాల నటి
త్రిష. తన అభిమాన నటుడు కమల్ హసన్ తో త్రిష నటిస్తున్న చిత్రం ప్రస్తుతం జెనీవాలో జరుగుతోంది. ఈ షూటింగ్
తర్వాత తల్లితో కలిసి జెనీవా పరిసరాల్లోని అందమైన ప్రదేశాలన్నీ చూసిన తర్వాతనే ఇండియాకు వస్తానని అంటోంది త్రిష.
|
‘మా’ ఎన్నికల్లో మురళీమోహన్ ప్యానెల్ విజయం
‘మూవీ ఆర్టిస్టుల సంఘం’ ‘మా’ ఎన్నికల్లో మురళీమోహన్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది. అద్యక్షుడిగా
మురళీమోహన్, ఉపాద్యక్షులుగా నాగబాబు, శివకృష్ణ, సంయుక్త కార్యదర్శులుగా ఎ.వి.ఎస్., మహర్షి రాఘవ
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ ఉపాద్యక్షుడిగా విజయచందర్ రాజారంవీందర్ పై 108 ఓట్ల ఆధిక్యంతో
గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ఆహుతి ప్రసాద్ గణేష్ పై 61 ఓట్ల ఆధిక్యంతో, కోశాధికారిగా శివాజీ రాజా కోట
శ్రీనివాసరావుపై 9 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
|
------------------------------------------------------ |
బహు పాత్రా చిత్రాలకు బాలయ్య సై
‘సింహా’తో మరో ఘనవిజయాన్ని బాలయ్య స్వంతం చేసుకున్నారు. ఇందులో బాలకృష్ణ తండ్రీ కొడుకులుగా
ద్విపాత్రాభినయం చేశారు. రాబోయే చిత్రాల్లో కూడా బహు పాత్రలకు బాలయ్య ప్రాధాన్యతనిస్తున్నారని
తెలుస్తోంది. దాసరి ‘పరమవీరచక్ర’లో మిలిటరీ అధికారిగా, సినిమా హీరోగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం
చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వంలో కుమారచౌదరి నిర్మిస్తున్న చిత్రంలో ఏకంగా మూడు పాత్రలు
పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
|
మ్యాచ్ ఫిక్సింగ్ బుకీలతో నీతూచంద్ర సంబంధాలు
స్పాట్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు పట్టుబడిన విషయం తెలిసిందే. మహ్మద్ అసిఫ్
మొబైల్ సమాచారాన్ని పరిశీలిస్తే నీతూచంద్ర విషయం బయటపడింది. మ్యాచ్ ఫిక్సింగ్ సూత్రధారులైన భారత
బుకీలతో నీతూచంద్రకు మంచి సంబంధాలున్నాయని కనుగొన్నారు. ఈ విషయమై ఆమెను వివరించారు.
అయితే, ఈ విషయంలో తనకే సంబంధం లేదంటూ - నీతూచంద్ర సినిమా కథలు చెబుతోంది.
|
ముక్కోటి ఏకాదశికి ‘రగడ’, దీపావళికి ‘ఆరెంజ్’
వీరూపోట్ల దర్శకత్వంలో నాగార్జున, అనూష్క, ప్రియమణి నటిస్తున్న ‘రగడ’ డిసెంబర్ 15న ముక్కోటి
ఏకాదశికి విడుదలవుతుందని నాగార్జున ‘ట్విట్టర్’లో చెప్పారు. ఈ చిత్రం కోసం నాగ్, ఛార్మిలపై ఓ పాటను
ఇటీవల అన్నపూర్ణా స్టూడియోస్ లో చిత్రీకరించారు. రాధామోహన్ దర్శకత్వంలో నాగార్జున, ప్రకాష్ రాజ్ లు
నటించిన ‘గగనం’ అక్టోబర్ చివరి వారంలో విడుదలవుతుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రామ్
చరణ్, జెనీలియా నటిస్తున్న ‘ఆరెంజ్’ దీపావళికి విడుదలవుతుంది. మలేసియాలో ఈ వారంలో పూర్తయ్యే
షెడ్యూల్ తో ఒక పాట, ప్యాచ్ వర్క్ మినహా చిత్రం పూర్తవుతుంది.
|
మనాలిలో ‘బద్రీనాధ్’... నెలాఖరులో ‘రోబో’
అల్లు అర్జున్, తమన్నా జంటగా వినాయక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం ‘బద్రీనాధ్’ మనాలిలో
షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం అక్కడ పెద్ద సెట్ నిర్మించి ప్రధాన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
పీటర్ హెయిన్స్ నేతృత్వంలతో చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. రజనీకాంత్ -
ఐశ్వర్య జంటగా శంకర్ దర్శకత్వంలో నిర్మించిన ‘రోబో’ ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. దేశంలోనే
అత్యంత భారీ చిత్రం తెలుగు హక్కులు తీసుకోవడం ఆనందంగా ఉందని - తోట కన్నారావు చెప్పారు. రెహమాన్
సంగీతం ఇందులో ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అన్నారు.
|
‘మృగం’, ‘నేటి చరిత్ర’ దర్శకుడు సామిపై దాడి?
గతంలో ‘మృగం’, ఇటీవల ‘నేటి చరిత్ర’ చిత్రాలకు దర్శకత్వం వహించిన సామిపై ఇటీవల చెన్నైలో కొందరు
దాడి చేసి కొట్టినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ వివాదాస్పద చిత్రాలను నిర్మించడమే కాకుండా, ఓ చిత్రం షూటింగ్ లో
నటి పద్మప్రియను చెంపదెబ్బ కొట్టడం ద్వారా సామి వార్తల్లో వ్యక్తి అయ్యారు. మేనమామతో అక్రమ సంబంధం
పెట్టుకునే అమ్మాయి కథతో సామి చేసిన ‘నేటి చరిత్ర’ తమిళ వెర్షన్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని
నిషేధించాలని పలువురు కోరుతున్న నేపధ్యంలో సామిపై కొందరు దాడి చేసి కొట్టారు.
|
------------------------------------------------------ |
నరేష్ ‘అహనా పెళ్ళంట’... దిల్ రాజు ‘రోటీ కపడా ఔర్ రొమాన్స్’
‘బిందాస్’ నిర్మించిన అనిల్ సుంకర వీరభద్ర చౌదరి దర్శకత్వలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం ప్రారంభించారు.
ముంబై మోడల్ రీతు బర్ మేచా నాయికగా నటించే ఈ చిత్రానికి రఘు కుంచె సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి
‘అహనా పెళ్ళంటా’ అని పేరు పెడుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించే కొత్త చిత్రం కోసం తన
రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా ‘‘రోటీ కపడా ఔర్ రొమాన్స్’ అని పేరు పెడుతున్నారు.
|
‘‘కొమరం పులి’’ విడుదల కష్టాలు
పవన్ కళ్యాణ్ హీరోగా సూర్య దర్శకత్వంలో నిర్మించిన ‘కొమరం పులి’ ఈ నెల 9న విడుదల అవుతుందని
అన్నారు. అయితే, రకరకాల ఆర్థికపరమైన కేసుల కారణంగా ఈ చిత్రం విడుదలపై అనిశ్చితి కొనసాగుతోంది.
రెండేళ్ళుగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం ఓవర్ బడ్జెట్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొటోంది.
|
జానపదం ‘అనగనగా ఒక ధీరుడు’గా సిద్దార్థ
సిద్ధార్థ హీరోగా వాల్ట్ డిస్నీతో కలిసి కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్న చిత్రానికి మొదట ‘యోధ’ అని పేరు
అనుకున్నా, ఇప్పుడు ‘అనగనగా ఒక ధీరుడు’ అనే పేరు ఖాయం చేశారని తెలుస్తోంది. శృతిహసన్
నాయికగా చేస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న ప్రతినాయికగా నటించడం విశేషం. ఈ జానపద చిత్రానికి
రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశరావు దర్శకత్వం వహిస్తున్నారు.
|
పవన్ తో‘ఖుషీగా’ త్రిష... కృష్ణవంశీతో రామ్ చరణ్
‘లవ్ ఆజ్ కల్’ చిత్రం ఆధారంగా జయంత్ సి పర్జానీ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న ‘ఖుషీగా’లో
ఇలియానాను నాయికగా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆ స్థానంలో త్రిషను తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘మగధీర’ ఘనవిజయం తర్వాత ‘ఆరెంజ్’, ‘మెరుపు’ చిత్రాలు చేస్తున్న రామ్ చరణ్, వచ్చే ఏడాది
కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ప్రజారాజ్యం’ పార్టీ ఎమ్మెల్యే గంటా
శ్రీనివాసరావు దీన్ని నిర్మిస్తారు.
|
ఇప్పటికీ టాప్ లోనే ‘డాన్ శీను’, ‘మర్యాదరామన్న’
ఇటీవల విడుదలైన చిత్రాల్లో ఇప్పటికీ వసూళ్ళపరంగా ముందు వరసలో ‘డాన్ శీను’, ‘మర్యాదరామన్న’లే
నిలిచాయి. ఇటీవల విడుదలైన ‘మా అన్నయ్య బంగారం’, ‘ఝుమ్మంది నాదం’, ‘ఏం పిల్లో ఏం
పిల్లడో’, ‘బ్రహ్మలోకం’, ‘హ్యాపీహ్యాపీగా’ మొదలైన చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ‘కోతి
మూక’, ‘శుభప్రదం’, ‘సై ఆట’ వంటి చిత్రాలు పెద్ద ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు విడుదలైన ‘తకిట
తకిట’ కూడా అదే కోవలోకి చేరుతోంది. ‘గాయం -2’ కూడా ప్రేక్షకాదరణ పొందే అవకాశం లేదు.
|
------------------------------------------------------ |
‘కొమరంభీమ్’గా బాలకృష్ణ... కృష్ణుడిగా ఎన్టీఆర్
దాసరి ‘పరమవీరచక్ర’లో బాలయ్య సినిమా హీరోగా ఓ పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రలో బాలకృష్ణను విభిన్న
గెటప్స్ లో దాసరి చూపే ప్రయత్నంలో ఉన్నారు. రావణబ్రహ్మగా బాలయ్య కనిపిస్తారని ఇప్పటికే తెలిసింది.
ఆదివాసి పోరాట యోధుడు ‘కొమరం భీమ్’ గెటప్ లో కూడా బాలయ్య కనిపిస్తారని తాజా వార్త. తాతయ్య
ఎన్టీఆర్ లానే పౌరాణిక పాత్రలంటే జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మక్కువ. ‘దాన వీర శూర కర్ణ’ రీమేక్ చేసి
అందులో ప్రధాన పాత్రలన్నీ పోషించాలని కోరిక. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘బృందావనం’లో కృష్ణుడి గెటప్ లో
కాసేపు కనిపిస్తారని సమాచారం.
|
పూరి ‘ఇడియట్’... పోసాని ‘మెంటల్ కృష్ణ’ సీక్వెల్స్
రవితేజతో పూరిజగన్నాధ్ చేసిన ‘ఇడియట్’ మంచి విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా ‘ఇడియట్
- 2’ రూపొందించే పనిలో పూరి ఉన్నారు. ఇందులో హీరోగా అతని తమ్ముడు సాయిరాం నటిస్తారు.
పోసాని కృష్ణమురళి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన ‘మెంటల్ కృష్ణ’ నిర్మాతకు ఆర్థిక విజయాన్ని
ఇచ్చింది. దానికి కూడా సీక్వెల్ నిర్మించే ప్రయత్నం జరుగుతోంది.
|
టివిలో రాజమౌళి... కేసులో రాంగోపాల్ వర్మ
‘మగధీర’, ‘మర్యాదరామన్న’లతో దర్శకుడిగా మంచి జోరుమీదున్న రాజమౌళి ఓ టివి షోలో
పాల్గొంటున్నారు. ‘కమాన్ ఇండియా’ పేరుతో ఓ వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ కార్యక్రమం
హెట్.ఎం.టివిలో త్వరలో టెలీకాస్ట్ అవుతుంది. ‘డార్లింగ్’ చిత్రంలో నటించినందుకు తనకు రావల్సిన
పారితోషికం 13 లక్షలు రామ్ గోపాల్ వర్మ ఇంకా ఇవ్వలేదంటూ - హేమామాలిని కుమార్తె ఇషాడియోల్ వర్మపై
కేసు పెట్టారు. ‘సినీ అండ్ టివి ఆర్టిస్ట్ అసోసియేషన్’కు కూడా ఆమె ఏడాది కిందటనే ఈ విషయమై ఫిర్యాదు
చేశారు.
|
నిర్మాతలుగా మారుతున్న మురుగదాస్, మీరా జాస్మిన్
‘గజిని’తో సంచలన విజయాన్ని దేశ వ్యాప్తంగా సాధించిన మురుగదాస్ సూర్య, శృతిహసన్ లతో ప్రస్తుతం ఓ
చిత్రం తమిళంలో చేస్తున్నారు. త్వరలో నిర్మాతగా మారి ఓ దేశభక్తి చిత్రం చేసే ప్రయత్నంలో మురుగదాస్
ఉన్నారు. దీనికి అతని అసిస్టెంట్ శరవణన్ దర్శకత్వం వహిస్తారని, జై, విమల్ హీరోలుగా నటిస్తారని
తెలుస్తోంది. దక్షిణాది చిత్రాలన్నింటిలో చేసిన నాయిక మీరా జాస్మిన్ త్వరలో నిర్మాత కావాలనుకుంటోంది.
మొదటిగా తన మాతృభాష మలయాళంలో చిత్రాల నిర్మాణం చేయాలనే ప్రయత్నంలో ఉంది.
|
డ్రగ్స్, వ్యభిచారం నిందితులపై పరిశ్రమ నిషేధం
ఇటీవల చిత్ర పరిశ్రమలో డ్రగ్స్, వ్యభిచారం కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. కొందరు చేసే తప్పులకు పరిశ్రమ
అంతా నిందలపాలు కావాల్సి వస్తోదని పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. అందుకనే డ్రగ్స్, వ్యభిచారం వంటి చట్ట
వ్యతిరేక కార్యకలాపాల విషయంలో పట్టుబడ్డవారిపై నిషేధం విధించాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ విషయమై
త్వరలో నిర్ణయం తీసుకుంటారు.
|
------------------------------------------------------ |
సెప్టెంబర్ 24 నుండి మహేష్ - శ్రీను వైట్ల చిత్రం
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నిర్మిస్తున్న చిత్రం సెప్టెంబర్
24 నుండి గుజరాత్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి
‘దూకుడు’ అని పేరును పరిశీలిస్తున్నారు.
|
ప్రభుదేవా - నయనతారల పెళ్ళి డిసెంబర్ లో
నయనతార ఈ మధ్య సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. తెలుగులో కూడా ఓ అగ్రహీరోతో మంచి అవకాశం వచ్చినా
అంగీకరించలేదు. ప్రభుదేవాతో ఆమె పెళ్ళి డిసెంబర్ లో జరగ నుండటం వల్లనే ఆమె సినిమాలు
వదులుకుంటోందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ - పోని వర్మల పెళ్ళి వల్ల, ఇంతవరకూ
డైలమాలో ఉన్న ప్రభుదేవా ఇప్పుడు ధైర్యం చేసి పెళ్ళికి సిద్ధమయ్యాడని అంటున్నారు.
|
‘రగడ’లో నాగార్జునతో కలిసి ఛార్మి డాన్స్
‘మాస్’లో నాగార్జునతో కలిసి చేసిన ఛార్మి ఇప్పుడు మరో సారి అతనితో ఓ పాటలో డాన్స్ చేస్తోంది. వీరు పోట్ల
దర్శకత్వంలో కామాక్షి పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో అనూష్క, ప్రియమణి హీరోయిన్లు. ఈ చిత్రంలోని ఓ
పాటలో ఛార్మి నాగార్జున సరసన నటిస్తోంది. రాయలసీమ నేపధ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్
గా రూపొందుతోంది.
|
‘శివం’గా సునీల్... నరేష్ తో నాగేశ్వరరెడ్డి
‘ప్రవరాఖ్యుడు’ చిత్రం నిర్మించిన గణేష్ ఇందుకూరి సునీల్ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి రాజమౌళి
అసిస్టెంట్ కోటి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఈ చిత్రానికి ‘శివం’ అని పేరును
పెట్టాలనుకుంటున్నారు. ‘సీమశాస్త్రి’ చేసిన అల్లరి నరేష్, నాగేశ్వరరెడ్డి త్వరలో మరో చిత్రం చేస్తున్నారు.
గతంలో నరేష్ తో విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సంస్థ ఈ చిత్రాన్ని చేస్తుంది.
|
ఇకపై తప్పుడు నిర్ణయాలుండవంటున్న నమిత
శృంగార నటి నమిత తను ఇప్పుడు రూటు మార్చానని అంటోంది. ఇప్పటి వరకూ ఒకే తరహా పాత్రలు చేయడంతో
నాకూ, ప్రేక్షకులకూ బోర్ కొట్టేసింది. ఇకపై డిఫరెంట్ పాత్రలనే చేయాలని నిర్ణయించుకున్నానని అంటోంది.
కొత్త తరహా పాత్రలతో వస్తే దాని కోసం శృంగార పరంగా ఎంతైనా అభినయంచడానికి సంశయించనంటోంది నమిత.
ఇకపై తప్పుడు నిర్ణయాలు తీసుకోనని ఖరాఖండీగా చెబుతోంది.
|
------------------------------------------------------ |
నాగార్జున ‘రాజన్న’కు కె.సి.ఆర్ సూచనలు
తెలంగాణలో గతంలో జరిగిన రజాకార్ల సంఘటనలను ఆధారంగా చేసుకుని నాగార్జున ‘రాజన్న’ అనే
చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించే ఈ
చిత్రంలో యాక్షన్ సన్నివేశాలను అతని కుమారుడు రాజమౌళి నేతృత్వంలో చిత్రీకరిస్తారు. నాగార్జున
సరసన ఇందులో స్నేహ నటిస్తుంది. ఇటీవల ఓ చోట కలిసినపుడు నాగార్జున కె.సి.ఆర్ కి ఈ కథ
విషయం చెబితే, చారిత్రాత్మక కథాంశాల విషయంలో జాగ్రత్త వహించాలని అంటూ - ఈ చిత్రం
విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కె.సి.ఆర్. సంసిద్ధత వ్యక్తం చేశారు.
|
దాసరితో శ్రీను వైట్ల... రానాతో ఇలియానా
దర్శకులు కూడా సినిమాల్లో కనిపించడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇటీవల ‘ఏ మాయ
చేశావె’లో పూరిజగన్నాధ్ కూడా కనిపించారు. ఇప్పుడు దాసరి దర్శకత్వం వహిస్తున్న
‘పరమవీరచక్ర’లో శ్రీనువైట్ల కనిపిస్తారు. ఇందులో సినిమా హీరోగా చేస్తున్న బాలకృష్ణను డైరెక్ట్ చేస్తూ
దర్శకుడిగా శ్రీనువైట్ల నటిస్తున్నారు. రానా హీరోగా పూరిజగన్నాధ్ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి
నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇందులో ఇలియానా హీరోయిన్ గా
అనుకుంటున్నారు.
|
మమత మ్యూజిక్... సోహా వీడియో క్లిప్పింగ్స్
నటి మమతామోహన్ దాస్ మంచి గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తన మాతృభాష
మలయాళంలో నటిగా బిజీగా ఉన్న మమత త్వరలో ఓ తెలుగు సినిమాకి సంగీత దర్శకత్వం
వహిస్తుందట. సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ అర్థనగ్న దృశ్యాలు ముంబై సెల్ ఫోన్స్ లో విరివిగా
కనిపిస్తున్నాయట. ఆమె ఓ బ్యూటీ పార్లర్ లో ఉన్నపుడు రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
|
‘జోకర్’గా, హాలీవుడ్ చిత్ర నిర్మాతగా అక్షయ్ కుమార్
త్వరలో ఫరాఖాన్ నిర్మించే చిత్రంలో ‘జోకర్’గా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. గతంలో రాజ్ కపూర్
‘మేరా నామ్ జోకర్’లో జోకర్ పాత్రతో ప్రేక్షకులను స్పందింప జేసినట్లుగానే ‘జోకర్’ చిత్రంలో అక్షయ్
కుమార్ కూడా ఆకట్టుకుంటాడని ఫరాఖాన్ చెబుతోంది. అక్షయ్ కుమార్ నిర్మాతగా ఓ హాలీవుడ్ చిత్రం
నిర్మిస్తున్నారు. వినయ్ విర్శాని హీరోగా నటించే ఈ చిత్రానికి ‘బ్రేక్ అవే’ అని పేరు పెడుతున్నారు.
కామిల్లా బెల్లేను హీరోయిన్ గా ఎంపిక చేశారు.
|
అర్జున్, చక్రవర్తి ‘కాంట్రాక్ట్’, విద్యాబాలన్ మోహిని అట్టం
జె.డి.చక్రవర్తి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అమీర్ దర్శకత్వంలో ‘కాంట్రాక్ట్’ అనే చిత్రం ప్రారంభం
కానుంది. అర్జున్, జె.డి.చక్రవర్తి ఇందులో హీరోలు. జానీలాల్ సినిమాటోగ్రఫీ అందిస్తారు.
సంతోష్ శివన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న మలయాళ చిత్రం ‘ఉరిమి’లో విద్యాబాలన్ మోహినీ అట్టం డాన్స్
లో అతిథిగా కనిపిస్తుంది. 1498లో కేరళ లో అడుగుపెట్టిన వాస్కోడిగామాను చంపడానికి
ప్రయత్నించిన కేలు నాయర్ గా పృథ్విరాజ్, పోర్చుగీసు యువరాణిగా జెనీలియా, హీరో అనుచరుడిగా
ప్రభుదేవా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
|
------------------------------------------------------ |
‘ఖలేజా’తర్వాత మహేష్ బాబు చిత్రం సుకుమార్ తోనే
రెండున్నరేళ్ళుగా ‘ఖలేజా’ చిత్రాన్ని చేస్తున్న మహేష్ బాబు ఇకపై అభిమానులను ఆనందింపజేసేందుకు సంవత్సరానికి రెండు చిత్రాలు చేస్తానని మాటిచ్చారు. దాని ప్రకారమే శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్, సుకుమార్, రాజమౌళి వంటి వారి కథలు విన్నారు. ఆయా చిత్రాలకు సంబంధించిన వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ తో సినిమా చేయడానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నాగచైతన్యతో సుకుమార్ చేసే గీతా ఆర్ట్స్ చిత్రం కూడా మహేష్ బాబు చిత్రం తర్వాతనే వుండవచ్చు.
|
కళ్యాణ్ రామ్ చిత్రానికి ‘కత్తి’ దక్కేలాలేదు!
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రానికి ‘కత్తి’ అని పేరు పెట్టాలనుకున్నారు. అయితే ఆ టైటిల్ పవన్ కళ్యాణ్, వినాయక్ లతో దానయ్య నిర్మించే చిత్రం కోసం ఇంతకుముందే రిజిస్టర్ చేయడంతో ఇబ్బంది ఏర్పడింది. ‘మహేష్ ఖలేజా’ టైప్లో కళ్యాణ్ రామ్ ‘కత్తి’ అని రిజిస్టర్ చేసే ప్రయత్నంలో కూడా విఫలం కావడంతో కొత్త పేరు కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
|
ఎన్టీఆర్ ‘బృందావనం’ అక్టోబర్ 1 విడుదల
‘కొమరం పులి’, ‘రోబో’ చిత్రాల విడుదలలో ఏర్పడిన అస్పష్టత వల్ల తెలుగు సినిమాల విడుదల పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. ఎన్టీఆర్ - వంశీ పైడిపల్లితో నిర్మించిన ‘బృందావనం’ మాత్రం అక్టోబర్ 1న విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన రాజల్, సమంతా నాయికలుగా నటిస్తున్నారు.
|
ఫ్లాప్ కి తోడు డ్రగ్స్ అభియోగంలో త్రిష
ఎప్పటి నుండో ఎదురుచూసిన బాలీవుడ్ చిత్రం ‘కట్టామీటా’ చేదు పలితం ఇవ్వడంతో ఇబ్బందిపడుతున్న త్రిష బయటికి మాత్రం - ఇలాంటి చిన్న విషయాలకు బాధపడను- అంటూ బింకాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఇటీవల హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బయటపడటం అందులో త్రిష పేరు కూడా వినిపించడం కొత్త సమస్యగా మారింది. ‘నన్ను చూసి ఓర్వలేని వారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఎదిగేవారిని కిందికి లాగాలనుకోవడం బాధాకరం’ అని అంటున్న త్రిష ఈ విషయంలో న్యాయపోరాటానికి కూడా సిద్ధమని చెబుతోంది.
|
సమీరాకు యాక్సిడెంట్... హాలీవుడ్ కే ఫ్రిదాపింటో
ప్రియదర్శన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘బుల్లెట్ ట్రెయిన్’ హిందీ చిత్రం షూటింగ్ లో సమీరారెడి్డ ప్రమాదానికి గురయ్యింది. బైక్ నడిపే సీన్లో బండి బ్యాలెన్స్ తప్పింది. ప్రమాదం జరిగినా కూడా ఫస్ట్ ఎయిడ్ తర్వాత సమీరా ఆ సీన్ పూర్తిచేయడం విశేషం. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ప్రపపంచ దృష్టిని ఆకట్టుకున్న ఫ్రిదా పింటో ఇప్పుడు అయిదు ఇంగ్లీష్ చిత్రాల్లో చేస్తోంది. బాలీవుడ్లో మాత్రం ఆమెను తీసుకోలేదనే అసంతృప్తితో వున్న ఫ్రిదా ఆవేపు కూడా ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది.
|
------------------------------------------------------ |
30న పవన్ క్రీస్తు చిత్రం జెరూసలెంలో ప్రారంభం
‘శ్రీరామదాసు’ నిర్మించిన కొండా కృష్ణంరాజు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ క్రీస్తు చిత్రం నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జెరూసలెంలో ఈనెల 30న ప్రారంభం అవుతుంది.
|
బిగ్ బితో శ్రీదేవి... ఇందిరగా ప్రియాంక
బోనీకపూర్ ని పెళ్ళి చేసుకుని సినిమాలు మానుకున్న శ్రీదేవి ఇప్పుడు ఆర్.బల్కి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుందని వార్తలొచ్చాయి. ఇందులో అమితాబ్ బచ్చన్ హీరోగా చేస్తున్నారు. గతంలో ‘ఆఖ్రీరాస్తా’, ‘ఇంక్విలాబ్’, ‘ఖుదాగవా’ చిత్రాల్లో అమితాబ్ తో శ్రీదేవి జంటగా నటించారు. బల్కి అమితాబ్ తో ‘చీనీకమ్’, ‘పా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తారు. భారతీయ సంతతికి చెందిన హాలీవుడ్ దర్శకుడు గతంలో ‘షాలిమార్’ వంటి భారీ చిత్రాలు నిర్మించారు. ఇప్పుడు ‘మదర్ -ద ఇందిరాగాంధీ స్టోరీ’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర కోసం గతంలో మాధురీ దీక్షిత్ ను అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇందిర పాత్రకు ప్రియాంక చోప్రాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
|
టీవి తెర చాలా పెద్దదంటున్న జగపతిబాబు
ప్రముఖ హీరో జగపతిబాబు ‘ఈటీవి’లో ‘రాజు-రాణి-జగపతి’ పేరుతో ఓ గేమ్ షో ప్రెజెంటర్ గా చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- టీవిని మనం బుల్లితెర అని అంటాం కానీ, నిజానికి ఇది చాలా పెద్ద తెర. ఎక్కువమందికి చేరువచేసే మాద్యమం టీవి. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జంటలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరచిపోలేను- అని అంటున్నారు.
|
‘ఈగ’ చేయాలనేది ఆలోచన మాత్రమే...
యానిమేషన్ చిత్రం ‘ఈగ’ చేయాలనేది ఆలోచన దశలోనే వుందని రాజమౌళి ట్విట్టర్లో స్పష్టం చేశారు. ప్రభాస్ చేయబోయే భారీ చిత్రానికి ముందు ఈ చిత్రం చేయాలా? లేదా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. ఇది సాంకేతిక ప్రధాన చిత్రం కనుక డిస్నీతో కలిసి చేస్తే బాగుంటుందని వుంది. రొటీన్ కి భిన్నంగా, చిన్న బడ్జెట్ లో చేసే ఈ చిత్రం ఎంపిక చేసే థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయాలనేది మా ఆలోచన- అని ఆయన అన్నారు.
|
వర్మ ‘డిపార్ట్ మెంట్’.... కిమ్ శర్మ రహస్య వివాహం
‘రణ్’ పేరుతో మీడియా మీద సినిమా తీసి పరాజయాన్ని పొందిన వర్మ కన్ను ఇప్పుడు పోలీసు శాఖపై పడింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్, ప్రదీప్ సావంత్ ల ప్రేరణతో అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ లతో రాంగోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్నాడు. ‘ఖడ్గం’, ‘మగధీర’, ‘యాగం’ చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి కిమ్ శర్మ రహస్య వివాహం చేసుకుంది. ఇటీవల యువ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడ్డట్టు వార్తలకెక్కిన కిమ్ ఇప్పుడు ఆప్రికాకు చెందిన ఓ యువకుడిని గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుందని బాలీవుడ్ సమాచారం.
|
------------------------------------------------------ |
ముగ్గురు హీరోయిన్లతో బాలకృష్ణ రెండు పాత్రలు
దాసరి ‘పరమవీరచక్ర’లో బాలకృష్ణ మిలిటరీ ఆఫీసర్ గానూ, సినిమా హీరోగానూ రెండు
పాత్రలుపోషిస్తున్నారు. దీనితో పాటు గతంలో ఎన్టీఆర్ చేసిన తరహాలో పలు గెటప్స్ లో బాలకృష్ణ
కనిపిస్తారు. ఇందులో అమీషాపటేల్, షీలా, నేహా ధూపియా హీరోయిన్లుగా చేస్తున్నారు.
|
ఆగ్రాలో రవితేజలో ‘మిరపకాయ్’, 27 నుండి ‘వీర’
‘డాన్ శీను’తో మరో మంచి విజయం సాధించిన రవితేజ ఇప్పుడు ‘మిరపకాయ్’గా బిజీ షూటింగ్ లో
ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆగ్రాలో జరుగుతోంది.
రిచా గంగోపాద్యాయ, దీక్షా సేథ్ ఇందులో హీరోయిన్లు, రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న
‘వీర’ ఈ నెల 27 నుండి షూటింగ్ జరుపుకుంటుంది. అనూష్క, తాప్సీ ఇందులో హీరోయిన్లు.
|
‘మర్యాదరామన్న’ సునీల్ హీరోగా బిజీ
‘అందాల రాముడు’, ‘మర్యాదరామన్న’లతో హీరోగా విజయపథంలో ఉన్న సునీల్ ఇప్పుడు
వరుసగా చిత్రాలు చేస్తున్నారు. వర్మ దర్శకత్వంలో ‘కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం = అప్పలరాజు’
త్వరలో ప్రారంభం అవుతుంది. రాజమౌళి కో-డైరక్టర్ కోటి దర్శకత్వంలో సునీల్ మరో చిత్రం
చేస్తున్నాడు. ఇది సెప్టెంబర్ 3 నుండి ప్రారంభం అవుతుంది. వినాయక్ దర్శకత్వంలో యాక్షన్ చిత్రం
చేయాలని ఉందంటున్న సునీల్ కోరిక కూడా త్వరలో తీరే సూచనలు కనిపిస్తున్నాయి.
|
వై.వి.ఎస్.చౌదరి చిత్రంలో చిరు మేనల్లుడు ‘రే’
చిరంజీవి మేనల్లుడు తేజ హీరోగా వై.వి.ఎస్.చౌదరి స్వీయదర్శకత్వంలో ‘రే’ అనే చిత్రం
చేస్తున్నారు. మిస్ ఎర్త్ అమృతా పట్టి, మోడల్ శుభ్రా అయ్యప్ప ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు.
చక్రి సంగీతాన్ని అందిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజున ఈ చిత్రం విశేషాలను వెల్లడించే అవకాశం
ఉంది.
|
ప్రియాంక పబ్లిక్ ముద్దులు... హాలీవుడ్ కి దీపిక
ప్రియాంక చోప్రా, షాహిద్ కపూర్ లు ఇప్పుడు మంచి ప్రేమలో ఉన్నారట. ఇప్పటివరకూ రూమర్ల
స్థాయిలోనే ఉన్న వీరు ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ లో పబ్లిక్ గా కెమేరాలకు దొరికిపోయారు. షూటింగ్
కోసం విదేశాలకు వెళ్తున్న ప్రియాంకకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన షాహిద్ ‘మళ్ళీ ఎప్పుడు కలుస్తామో’
అంటూ ఎయిర్ పోర్ట్ లోనే ఆమెను ముద్దులాడిన దృశ్యాలు ఛానెల్స్ ప్రసారం చేశాయి. దీపికా పదుకొనే కు
ఓ హాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చిందట. అయితే, అందులో రెండు సన్నివేశాల్లో ఆమె నగ్నంగా
నటించాలట. అందుకనే, దీపిక ఈ మద్య - సందర్భానికి అనుగుణంగా నగ్నంగా నటిస్తే
తప్పేముంది? ‘టైటానిక్’లో కేట్ విన్ స్లెట్ చేయలేదా? - అంటూ ప్రకటనలిస్తోంది.
|
------------------------------------------------------ |
మహేష్ ‘దూకుడు’... త్వరలో జంటగా మహేష్ - జెన్నీ
శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సెప్టెంబర్ 3 నుండి షూటింగ్ జరుపుకుంటుంది.
పోలీసు అధికారిగా తొలిసారి మహేష్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘దూకుడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో
సమంత హీరోయిన్ గా చేస్తోంది. త్వరలో మహేష్ హీరోగా చేస్తున్న ఓ చిత్రంలో జెనీలియా నాయికగా నటించే
అవకాశం ఉంది. ఇటీవల ‘ఖలేజా’ షూటింగ్ లో మహేష్ ని జెనీలియా కలిసినపుడు ఈ జంట తమ కాంబినేషన్
ప్రేక్షకులను మెప్పింస్తుందనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.
|
కార్తితో భాస్కర్... చంద్రమహేష్ తో నిఖిల్, అరవింద్
‘ఆవారా’ హీరో కార్తితో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఓ చిత్రం చేస్తున్నారు. ‘చత్రపతి’ ప్రసాద్ దీనికి నిర్మాత.
రెండుభాషల్లో నిర్మించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ప్రేయసి రావే
చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రమహేష్ మరో చిత్రం చేస్తున్నారు. ‘యంగ్ ఇండియా’,‘యువ రాజ్యం’
చిత్రాల్లో నటించిన, ప్రభుత్వ అధికారి శర్మ కుమారుడు అరవింద్ కృష్ణతో పాటు ‘హ్యాపీ డేస్’ నిఖిల్ ఇందులో
హీరోలుగా చేస్తారు. ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
|
రామ్ చరణ్ పెళ్ళి... కన్నారావు ‘రోబో’ కబుర్లు
రామ్ చరణ్ కు త్వరలో పెళ్ళి కానుందని కామినేని హాస్పిటల్స్ కుటుంబం నుండి ఉపాసనా కామినేనితో అతని పెళ్ళి
నిశ్చితార్థం జరిగిందని ముంబై పాపులర్ ప్రతిక ‘మిడ్ డే’ ఓ వార్తతో సంచలనం సృష్టించింది. అయితే,
అటువంటిది ఏమీ లేదంటూ చిరు కుంటుంబం చెబుతోంది. ‘రోబో’ తెలుగు డబ్బింగ్ 25 నుండి 30 కోట్ల
ధరకు గోదావరి జిల్లాకు చెందిన కన్నారావు కొన్నారు. సినిమా రంగానికి సంబంధించని కన్నారావు ఇంత డబ్బుతో
ఎలా కొన్నాడని పరిశీలిస్తే - అతను దర్శకుడు వినాయక్ కి దగ్గరివాడని, చిరంజీవి బృందంలోని వ్యక్తి అని, అల్లు
అరవింద్ కి సన్నిహితుడని తెలుస్తోంది.
|
శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’
అభ్యుదయ భావాలు, చక్కటి అభిరుచిగల దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లీడర్’ తర్వాత ఏం చేయబోతున్నారనే
ఆసక్తి ప్రేక్షకులలో ఉంది. శేఖర్ త్వరలో హిందీ లో ఓ భారీ చిత్రం ప్రముఖ నటీనటులతో చేసే ప్రయత్నంలో ఉన్నట్లు
వార్తలొచ్చాయి. తెలుగులో మళ్ళీ కొత్త వారితో ఓ చిన్న బడ్జెట్ చిత్రం చేసే ఆలోచన కూడా ఉందని అంటున్నారు.
అతని బ్యానర్ పై ఇక్కడి ఫిల్మ్ ఛాంబర్ లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే పేరు రిజిష్టర్ చేసి పెట్టారు.
|
జీవిత రాజశేఖర్ లపై చిరు సైన్యం అసహనం
రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ చిరంజీవి బృందానికి సహనం అలవడలేదు. ఇప్పటికీ విమర్శకులపై
విరుచుకుపడటం, అదిరించి బెదిరించడం చేస్తూనే ఉన్నారు. ఇటీవల తమని విమర్శించిన జీవిత రాజశేఖర్ ల
నాలుకలు చీలుస్తామంటూ అల్లుఅరవింద్ ప్రెస్ మీట్ లోనే వార్నింగ్ ఇచ్చారు. గతంలో చిరు బృందం జీవిత రాజశేఖర్
లపై చేసిన రాళ్ళ దాడిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా, చిరు అభిమానులు జీవిత రాజశేఖర్ లను
మానవబాంబులతో పేల్చేస్తామంటూ ఫోన్ లు, ఎస్సెమ్మెస్ లు చేసి బెదిరిస్తున్నారు.
|
------------------------------------------------------ |
| |