|
‘ప్రేమకావాలి’సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్న సాయికుమార్
కుమారుడు ఆది పుట్టినరోజువేడుక ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ
కార్యక్రమంలో సాయికుమార్, కె.అచ్చిరెడ్డి, విజయభాస్కర్, అనూప్
రూబెన్స్, ఆది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ- ‘ఈ సినిమా ఆడియో త్వరలో
విడుదల కానుంది. మా అబ్బాయిని వెంకట్ గారు చూసి చాలా బాగున్నాడని,
విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఆది ఇన్ యాక్షన్,
యువర్స్ ఆది అనే వెబ్ సైట్స్ను ప్రారంభిస్తున్నాము.నేను హీరోగా ప్రిపేర్ కాకుండా
హీరో అయ్యాను. అయితే మా అబ్బాయికి మంచి శిక్షణ ఇచ్చి రంగ ప్రవేశం
చేయిస్తున్నాము. ఆది పుట్టిన రోజు సందర్భంగా శ్రీవిద్యా సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్
కు ఒక లక్ష రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది’ అన్నారు.
విజయభాస్కర్ మాట్లాడుతూ-‘ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లోచాలామంది ఆల్ రౌండర్స్ వున్నారు. ఆది కూడా ఒక ఆల్ రౌండర్ కావాలని ఆశీర్వదిస్తున్నాను’
అన్నారు.
అచ్చిరెడ్డి మాట్లాడుతూ- ‘తెలుగు సినిమా పరిశ్రమకు ఆహ్వానం పలుకుతోంది
మొదటి పుట్టినరోజుతో. సినిమా నిర్మాణంలో వుండగానే సాయికి తెలిసిన వారందరూ
వందలాదిగా వచ్చి ఆదికి శుభాకాంక్షలు తెలిపారు. విజయభాస్కర్ తయారు చేసిన
స్ర్కిప్టు ఆదిని పరిచయం చేయడానికి బాగుండడంతో ఈ సినిమాను నేను నిర్మాతగా
రూపొందిస్తున్నాము. ఆది రెగ్యులర్ హీరోలాగా చేశాడు. సినిమా మొత్తం
మూడు పాటలు మినహా పూర్తయ్యింది’ అన్నారు.
అనూప్ రూబెన్ మాట్లాడుతూ- ‘ఆది మంచి టాలెంటెడ్. తొలి సినిమా మంచి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.
ఆది మాట్లాడుతూ- ‘సినిమా పరిశ్రమలోకి వచ్చిన తరువాత తొలి పుట్టినరోజు
జరుపుకోవడం ఆనందంగావుంది. నాకు సినిమా అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి,
దర్శకుడు విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.తొలిసినిమా
మంచి సంస్థ ద్వారా చేయడం, నా పుట్టినరోజు ఇంతమంది పెద్దల మధ్య
జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమా ద్వారా నిలబడతాననే నమ్మకం
వుంది’ అన్నారు.
|