నాని-నిత్యామీనన్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రంజిత్‌మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదరప్రసాద్ నిర్మించిన ‘అలా మొదలైంది’
27కేంద్రాల్లో 100రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన శతదినోత్సవ వేడుకలో చిత్రయూనిట్ సహా రమేష్
ప్రసాద్, డాకె.ఎల్.నారాయణ, రాఘవేంద్రరావు, హీరో సుమన్, కె.ఎల్.ప్రసాద్, రాఘవ, మురళీమోహన్, ప్రసన్న
కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, కోదండరామిరెడ్డి, కైకాల సత్యనారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, కుమార్‌చౌదరి, జగదీష్
ప్రసాద్, సాగర్, శైలేంద్రబాబు, వరుణ్‌సందేశ్, ఎస్.గోపాలరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సినీప్రముఖుల చేతులమీదుగా చిత్రయూనిట్ సహా పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు షీల్డ్స్ అందుకున్నారు.
అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- ‘తన తండ్రి గురించి చూపించడం అతని మంచి తనం. అలామొదలైంది టీమ్ను కూడా గౌరవించారు. ఈ సినిమా మొదలైనప్పుడే వద్దని దాముతో అన్నాను. ప్రూవ్ చేసుకుంటాను అన్నాడు. రెండు సంవత్సరాల తర్వాత సినిమా చూసి సాధించావు అని అభినందించాను. నాలాంటి వారికి ఆశ చూపించావు. సినిమా పరిశ్రమకు ఊపిరినిచ్చావు. సినిమా బాగా తీస్తే తప్పకుండా చూస్తారు. ఈ సినిమా టీమ్ వర్క్ కు ప్రతీతి’ అన్నారు.
సుమన్ మాట్లాడుతూ- ‘అనుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చాను. నేను తెలుగు సినిమా పరిశ్రమకు రావడానికి ఇద్దరు కారణం. ఒకరు రాఘవ గారు, మరొకరు భరద్వాజ గారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు తెలుగురాదు. తరంగిణి తెలుగులో విడుదలైన నా తొలి సినిమా. దాము నాకు చాలాకాలంగా తెలుసు. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో కూడా సినిమా తీసి విజయాన్ని సాధించాడు. నందినీరెడ్డి సినిమాను చక్కగా తీర్చిదిద్దారు’ అని అన్నారు.
నందినిరెడ్డి మాట్లాడుతూ- ‘సంగీతదర్శకుడు కళ్యాణిమాలిక్ వల్ల నిర్మాత దాముకి పరిచయమయ్యాను. ఆయన నన్ను, నా స్క్రిప్టుని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో ప్రయాసలకోర్చి రిలీజ్ చేశారు. సినిమా కష్టాలన్నీ మా సినిమాకొచ్చాయి. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాం. నేను అమ్మాయిని అయినా అవకాశమివ్వడం ఓ గొప్ప విషయం.ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన వివేక్ కూడా ఈ సినిమా విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు’ అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ- ‘ప్రేక్షకులు సినిమాకెళ్లేముందు బడ్జెట్ ఎంత అనేది చూడరు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా కూడా చూడరు. విభజన రేఖను పరిశ్రమ వాళ్లే కల్పించారు. జనాల్లో ఆ విభేదమే లేదు. నేను ఓ ప్రేక్షకుడిగా ఈ సినిమా చూడడానికి చాలా ఇష్టపడతాను. ఇలాంటి కథలనే మరిన్ని చేయాలనుకుంటున్నా. టీమ్‌వర్క్ వల్ల దక్కిన పెద్ద విజయమిది’ అన్నారు. వక్తలు
మాట్లాడుతూ రంజిత్‌మూవీస్ నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరారు.
|