Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘బెండు అప్పారావు’ సక్సెస్ మీట్

అల్లరి నరేష్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకుడిగా డాక్టర్ డి.రామానాయుడు నిర్మించిన ‘బెండు అప్పారావు’ సినిమా ఇటీవల విడుదలైన విషయం విదితమే. కాగా ఆ సినిమా సక్సెస్ మీట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్, ఆహుతి ప్రసాద్, డాక్టర్ డి.రామానాయుడు, ఎ.వి.ఎస్.చలపతిరావు, రఘుబాబు, అనంత్, నటుడు గౌతంరాజు, ఎడిటర్ గౌతంరాజు, చంద్రబోస్, అనితలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ- ‘నాకు ఎన్ని విజయాలు వచ్చిన ఈ సినిమా విజయం ప్రత్యేకమైందిగా భావిస్తున్నాను. ఈ సినిమా మౌత్ టాక్ తో ఆడుతోంది. టికెట్లు బ్లాక్లో అమ్ముడవుతున్నాయని తెలిసింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో నేను చెప్పిన విధంగానే నరేష్ కెరియర్లో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నట్లు ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి పెట్టనుంది. సినిమా విజయం సాధించినందుకు ఆనందంగా వుంది‘ అన్నారు.

నరేష్ మాట్లాడుతూ - ‘రామానాయుడు గారు మా కుటుంబానికి గాడ్ ఫాదర్. మా నాన్నకు, మా అన్నయ్యకు, నాకు ఆయన బ్రేక్ నిచ్చారు. అలాంటి ఆయన నాతో నిర్మించిన సినిమా మంచి విజయాన్ని సాధించడం ఆనందంగా వుంది. నా సినిమాల్లో భారీగా ఓపెనింగ్ వచ్చిన సినిమా ఇదే’ అన్నారు. ఆహుతి ప్రసాద్ మాట్లాడుతూ- ‘రామానాయుడు గారు కమిట్మెంట్ వున్న నిర్మాత. ఈ సినిమాలో నాది చందమామలో నేను చేసిన పాత్ర తరహాలో మంచి పేరు తెచ్చే విధంగా వుండే పాత్ర ’ అన్నారు. ఎ.వి.ఎస్. మాట్లాడుతూ- ‘మగధీర’ సినిమా తరువాత పెద్ద విజయం దూసుకుపోతున్న ఈ సినిమాను కామెడీ ‘మగధీర’గా చెప్పవచ్చు. సినిమా మంచి విజయం సాధించినందుకు ఆనందంగా వుంది‘ అన్నారు. ఈ కార్యక్రకమంలో పాల్గొన్నవారందరూ సినిమా విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com