Bookmark and Share   Cinevinodam Subscribe
 
వైభవంగా బాలల చలనచిత్రోత్సవాలు ప్రారంభం

బాలల చలనచిత్రోత్సవాలకు శాశ్వత వేదిక అయిన హైదరాబాద్‌లో బాలల దినోత్సవం నాడు ‘అంతర్జాతీయ 16వ బాలల చలనచిత్సోత్సవం’ శనివారం వైభవంగా ప్రారంభమయింది. హైదరాబాద్‌ పబ్లిక్‌గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ చిత్రోత్సవానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య, రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి జె.గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావుతోపాటు పలువురు చలనచిత్ర, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య,గాన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హీరో వెంకటేష్‌, యువహీరో రామ్‌చరణ్‌ తేజ, బోర్నవిటా గర్ల్‌ హాన్సిక ఈ చిత్రోత్సవాల్లో సందడి చేసారు. అలాగే దర్శకరత్న దాసరి నారాయణ రావు, తమ్మారెడ్డి భరద్వాజ, రేవతి, ఆశీష్‌ విద్యార్ధి తదితర సినీ రంగ ప్రముఖులు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్‌.సత్యనారాయణ రావు సహా పలువురు నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నందితాదాస్‌ ఆహుతులను ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేసారు. ఈ బాలల చలనచిత్రోత్సవ పోటీకి మొత్తం అన్ని దేశాల నుంచి 70 చిత్రాలు వచ్చినట్లు ఆమె చెప్పారు. అలాగే వివిధ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యూరీ సభ్యులను సభకు పరిచయం చేసారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com