Bookmark and Share   Cinevinodam Subscribe
 
హాస్యనటులకు గురుప్రసాద్ అవార్డులు

‘యువ కళావాహిని’ సంస్థ ప్రతి ఏటా సినీ ప్రముఖులను గురుప్రసాద్ ఎక్సలెన్సీ ఫిలిం అవార్డులతో సత్కరిస్తోంది. రవీంద్రభారతిలో ప్రముఖ హాస్య నటీనటుల గురుప్రసాద్ ఎక్సలెన్సీ ఫిలిం అవార్డులను ముఖ్యఅతిథి, సినీనటులు కైకాల సత్యనారాయణ, సభాధ్యక్షులు శాంతా బయోటెక్నిక్ అధినేత డా.కె.ఐ.వరప్రసాద్ రెడ్డి ప్రదానం చేశారు. సినీ హాస్యనటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, ఎల్బీ శ్రీరామ్, హాస్యనటి గీతాంజలిలను పురస్కారాలలో భాగంగా శాలువ, జ్జాపిక, హాసం ప్రతికలో రూపొందించిన బాపు చిత్రాన్ని కూడా అతిథులు అందజేశారు. ముఖ్యఅతిథి సత్యనారాయణ తమ ప్రసంగంలో వై.కె.నాగేశ్వరరావు కుమారుని సంస్మరణగా హాస్యనటీలను ‘యువకళావాహిని’ సంస్థ సత్కరించడం అభినందనీయమని, హాస్యనటులు విషాధంలో కూడా హాస్యాన్ని పండింగగల శ్రేష్టులని కొనియాడారు.

సభాధ్యక్షత వహించిన వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ- సమాజ ధోరణులను సునిశిత హాస్యంతో, చురకతో మందులాగా అందించవచ్చునని, మన హాస్యనటులు గత నాలుగు దశాబ్దాలుగా అలాంటి మంచి హాస్యాన్ని అందించారని ప్రశంసించారు. కాలానుగుణంగా వెకిలితత్వం వచ్చినా కందరు నటులు హాస్యాన్ని పండిస్తూనే వున్నారని, ఉదాత్తతా ప్రధానంగా హాస్యనటుడు నటించాలని ాయన సూచించారు. ఈరోజు సన్మానం అందుకున్న నలుగురు ప్రతిభావంతమైన హాస్యనటులేనని ఆయన కొనియాడారు. తాను సంగీతాన్ని, హాస్యాన్ని ప్రేమిస్తానని, హాస్యం క్లబ్ లను కూడా ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా హాస్య వాతావరణానికి తోడ్పడుతున్నానని, జీవితంలో తగుమాత్రపు హాస్యం అందరికీ అవసరమేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సినీనటులు టి.చలపతిరావు అతిథిగా పాల్గొని ఈనాటి హాస్యనటులు హారోలతో సరిసమాన నటన, ప్రతిభా కలవారని కితాబిచ్చారు. కార్నేషన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డా. రామ్, లైన్ జి.హనుమంతరావు అతిథులుగా పాల్గొన్నారు. అవార్డు కమిటీ అధ్యక్షులు వాసిరాజు ప్రకాశం కూడా హాస్యనటులను ప్రశంసించారు. సన్మానితులు కృతజ్జతా ప్రసంగాలు చేయగా, సినీనటి గీతాంజలి తాను నటించిన చిత్రాల్లోని గీత చరణాలను వినిపించి ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధరశాస్త్రి కొన్ని శ్లోకాలను ఘంటశాల బాణీలో సుశ్రావ్యంగా అందించగా, గాయని సురేఖమూర్తి కొన్ని సినిమా గీతాలను సుమధురంగా గానం చేశారు. వ్యాఖ్యాతగా అశాశ్రీలత వ్యవహరించగా, వై.కె.నాగేశ్వరరావు, లంకా లక్ష్మీనారాయణ, మల్లికార్జునరావు తదితర కార్యవర్గ సభ్యుల సహకారంతో అవార్డుల సభ వైభవంగా జరిగింది.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com