Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘కళామందిర్’ ఫౌండేషన్

వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టి కేవలం 4 వసంతాలు మాత్రమే అయినా ఆధునిక వస్త్ర ప్రపంచంలో రారాజుగా దూసుకుపోతూ భారతదేశవ్యాప్తంగా 9మెగా షోరూమ్ లను ఏర్పాటు చేసుకున్నది. అలాగని కేవలం వస్త్ర వ్యాపారం మాత్రమే కాకుండా ‘కళామందిర్’ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొని తన ధాతృత్వాన్ని చాటుకుంటోంది. ప్రతి మనిషీ వున్నన్ని రోజులు తనకోసం మాత్రమే జీవించకుండా ఎదుటివారికి కూడా ఉపయోగపడేలా జీవించాలనే నానుడి ‘కళామందిర్’ పాటిస్తోంది. కాగా సమాజంలోని పేదలకు అంధులకు, మానసిక వికలాంగులకు తమ వంతు సాయం చేయడానికి ‘కళామందిర్’ ఫౌండేషన్ ఇటీవల హైదరాబాద్లోని కూకట్ పల్లి ‘కళామందిర్’ పక్కనున్న వన్ ప్లేస్ హోటల్లో కూకట్ పల్లి శాసనసభ్యులు డా.జయప్రకాష్ నారాయణ్ ఆవిష్కరించారు. ఈ బృత్తరమైన కార్యక్రమంలో డా.జయప్రకాష్ నారాయణ్, వరల్డ్ నెం.3 బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, హీరోయిన్లు తాప్సీ, భూమిక, భరత్ ఠాకూర్, లగడపాటి శ్రీధర్, మధుర శ్రీధర్ రెడ్డి, ప్రసాద్ (కళామందిర్), సిరాశ్రీ, అనిత సుకుర, కూకట్ పల్లి కార్పొరేటర్ భాను, కళామందిర్ సిఇవో కళ్యాణ్, భావ్ సింగ్ ఇంకా అనాథ పిల్లలు మొదలైనవారు పాల్గొన్నారు. సేవ్ వాటర్ పై రూపొందించిన పాటను సైనా నెహ్వాల్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ- ‘కళామందిర్’ ఫౌండేషన్ ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశ్యం బ్లడ్ డొనేషన్, హెచ్.ఐ., ఎన్.ఐ. వైరస్, ఐ డొనేషన్, టెర్రరిజమ్ ఫైట్, క్రిస్మస్ కాంపైన్, సేవ్ ఆర్ట్ అండ్ కల్చర్, అనాథ పిల్లలకు సేవ చేయడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం’ అన్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ ఆర్గనైజేషన్ సంస్థకి జయప్రకాష్ నారాయణ్ చేతుల మీదుగా 15వేల చెక్కును అందజేశారు. సైనా నెహ్వాల్ చేతుల మీదుగా దిల్ షుక్ నగర్లోని అనాథ పిల్లలకు గ్రాసరీ కంటైనర్ అందజేశారు. హీరోయిన్ తాప్సీ, భూమికలు, లిటిల్ యాంగిల్స్ స్కూల్ పిల్లలకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సైనాను జెపి, తాప్సీ, భూమిక, కళామందిర్ బృందం ఘనంగా సత్కరించారు.

జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ- ‘మన డబ్బు సంపాదన సమాజానికి ఉపయోగపడాలని స్థాపించిన ‘కళామందిర్ ఫౌండేషన్’ వారికి అభినందనలు. ఒక సమాజం మనుగడ సాధించడానికి కేవలం కొంచెం స్వేచ్ఛ కొంచెం అభివృద్ధి, ఎన్నికలు గట్రా జరిగితే సరిపోదు. తన కాళ్ళమీద తాను నిలబడేలా చేయగలగాలి. అప్పుడే నిజమైన సమాజం అభివృద్ధి చెందినట్లు, సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యత వుండాలి. సహాయం అనేది ఎదుటివారి పట్ల సానుభూతి, భయంతో చేయాలి. అలాగే కేవలం డబ్బు మాత్రమే కాదు. మనసును దానం చేయండి. సేవారంగంలో కూడా వ్యాపార దృక్పథం పెంచుకోండి. మంచి సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టిన కళామందిర్ కళ్యాణ్ బృందానికి అభినందనలు’ అన్నారు.

సైనా నెహ్వాల్ మాట్లాడుతూ- ‘ఈరోజు అద్భుతమైన దినం. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రజలు చాలా విధాలుగా కష్టాలుపడుతున్నారు. వారికి సహాయం చేయడానికి స్థాపించిన ‘కళామందిర్ ఫౌండేషన్’కి ధన్యవాదాలు. నేను ఈ రోజు వరల్డ్ నెం.3గా కావడానికి కారణం చాలా ఫౌండేషన్లు నన్ను ఆదుకున్నాయి. అలాంటి సపోర్ట్ పిల్లలందరికీ కావాలి. ప్రతి భారతీయుడూ ఎదుటి వారికి తనకు తోచిన సహాయం చేయాలి’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు తాప్సీ, భూమిక, భరత్ ఠాగూర్, భావ్ సింగ్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా కళామందిర్ ఛైర్మన్ ప్రసాద్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకోగా, కళామందిర్ కళ్యాణ్ విచ్చేసిన అతిథులకు షీల్ట్స్ అందించారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com