Bookmark and Share   Cinevinodam Subscribe
 
'మా' డైరీ విడుదల

నటీనటులకు సులువుగా ఉంటుందన్న కారణంగా కొన్నేళ్లుగా 'మా' డైరీని విడుదల చేయడం జరుగుతోంది. "నటీనటులకు సులువుగా ఉంటుందన్న కారణంగా కొన్నేళ్లుగా 'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌్‌ అసోసియేషన్‌) డైరీని విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ డైరీలో మా ఫోన్‌ నంబర్లు తెలుసుకుని, మేం నటించిన సినిమాలు టీవీలో ప్రసారమైనప్పుడు ఎంతో ఉద్వేగంగా రాత్రిపూట కూడా అభిమానులు ఫోన్‌ చేసి "మీరు బాగా నటించారు' అని చెబుతుంటారు. కొంతమంది నాగార్జున, సుమంత్‌ ఫోన్‌ నంబర్లు అడుగుతుంటారు.

ఇక నటుడిగా చెప్పాలంటే జీవితాంతం నటించాలనే కోరిక ఉంది. కానీ 'రామదాసు' తర్వాత సినిమాలు చేయలేదు. 'సీతారామయ్యగారి మనవరాలు'లాంటి చిత్రంలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను' అని డా. అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. 2010 'మా' డైరీ ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం అక్కినేని పై విధంగా స్పందించారు. ఈ డైరీని అక్కినేని ఆవిష్కరించి డా.కృష్ణకి ఇచ్చారు.

'మా' అధ్యక్షుడు మురళీమోహన్‌ చెబుతూ - "ఈ అసోసియేషన్‌ ఆరంభించిన నాటి నుంచి నటీనటుల ఫోన్‌ నంబర్లు, పుట్టినరోజు తేదీ వివరాలతో డైరీ ఇస్తే బాగుంటుందని తలచి ప్రతి ఏడాది అది కొనసాగిస్తున్నాం. ఇటీవల వరద బాధితుల సహాయార్థం ఓ కార్యక్రమం నిర్వహించి ఆరు కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్‌ చేయడం జరిగింది' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజయనిర్మల, ఏవీయస్‌, అలీ, రమాప్రభ, గీతాంజలి తదితరులు కూడా పాల్గొన్నారు. సమావేశం చివరిలో ఫైట్‌మాస్టర్‌ రాజు మృతికి నివాళిగా ఒక నిమిషం మౌనం పాటించారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com