| |
| |
|
'మల్లీశ్వరి' 60 ఏళ్ల పండుగ |
‘మల్లీశ్వరి’ తెలుగు చిత్ర సీమకు చుక్కానిలాంటిదని , ఎన్నటికి వన్నె తగ్గని అద్భుత కళాఖండమని ... జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.' యువ కళావాహిని' ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన ‘వాహిని వారి మల్లీశ్వరి 60 ఏళ్ల పండుగ’ సభకు సినారె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభ, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వర్‌రావు సంగీతం' మల్లీశ్వరి' ని చిరస్థాయిగా నిలబెట్టాయని సినారె పేర్కొన్నారు. ఎన్టీఆర్, భానుమతి పాత్ర లు, ‘ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు’, ‘మనసున మల్లెల’ పాటలు నేటికీ మరుపురానివన్నారు. దేవులపల్లి సాహిత్య ప్రతిభకు మల్లీశ్వరి పాటలు తార్కాణమన్నారు.
సభలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ- 1951లో వచ్చిన' మల్లీశ్వరి' తెలుగు చలన చిత్ర పరిశ్రమకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. బీఎన్‌రెడ్డి దర్శకత్వ ప్రతిభకు చిత్రంలోని సన్నివేశాలే నిదర్శనమన్నారు.బి .యన్ .రెడ్డి వంటి ఉన్నత స్థాయి దర్శకుల స్ఫూర్తి తోనే తను చిత్ర నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన సారిపల్లి కొండల రావు ప్రసంగిస్తూ- బీఎన్‌రెడ్డి లాంటి దర్శకులు అరుదుగా లభిస్తారన్నారు. ఫిల్మీడియా సౌజన్యం తో ఈ కార్యక్రమం జరిగింది.
సభలో ప్రముఖ రచయిత, నటులు రావి కొండల రావు, నిర్మాత, దర్శకులు అల్లాణి శ్రీధర్, ప్రముఖ రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, సాహితీ వేత్త ఓలేటి పార్వతీశం, లంకా లక్ష్మీనారాయణ, వై.కె. నాగేశ్వర్‌రావు, మళ్లీ ఖార్జునరావు, నరసింహారావు, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు . సినిమాలోని సన్ని వేశాలను, కథను, పాటలతో పాటు రసవత్తరం గా ఎస్.వి. రామారావువివరించారు . సభకు ముందు వీకే దుర్గ , శరత్ చంద్ర' మల్లీశ్వరి' చిత్రంలోని పాటలను మధురంగా ఆలపించారు.
|
| |
|
| |
|