Bookmark and Share   Cinevinodam Subscribe
 
‘సంతోషం’ ఫిల్మ్ అవార్డ్స్

సురేష్ కొండేటి ‘సంతోషం’ను ప్రారంభించే సమయానికి నిజంగా నవయువకుడే. అంటే అప్పటికి ఆయన వయసు పాతికేళ్ళు. పాతికేళ్ళ వయసులో ఒక సినిమా పత్రికను స్థాపించడం సాహసమే. స్థాపించి ఎనిమిదేళ్ళపాటు నిర్విరామంగా, నిరంతరాయంగా నిర్వహించడం కత్తిమీదసాము. ఈ కత్తి మీద సాము చేయలేకనే ఎందరో ఉద్దండులు కూడా సినిమా పత్రికలను నడపలేక వదిలేసుకోవడమో, మూసివేయడమో జరిగింది. ఇది సురేష్ కొండేటి గొప్పదనం గురించి చెప్పడం కాదు, ఈ యువకుని యొక్క అసిధారావ్రతం గురించి చెప్పడం.

ఎనిమిదేళ్ళ పాటు ఏ ఒక్క సంచిక కూడా మిస్ కాకుండా మంగళవారం వచ్చే సంతోషం పత్రిక మిస్ కాకుండా ఎనిమిదేళ్ళుగా నడుపుకురావడమన్నది ఆ పత్రికాధిపతికి ఒక ఛాలెంజ్. అలాగే ఎనిమిదేళ్ళుగా జన్మదినవేడుకలను జాతీయ సినీవారపత్రిక ఫిలిం ఫేర్ స్థాయిలో నడపటం సురేష్ యొక్క రెండవ ఘనవిజయం.

‘సంతోషం’ వార్షికోత్సవ ఫిలిం అవార్డుల వేడుకను ఆ పత్రికాధిపతి ఎడిటర్ సురేష్ కొండేటి ఆగస్టు 8వ తేదీన ఎనిమిదవ వండర్ గానే రాజధాని నగరాన గల హైటెక్ సమీపంలోని అత్యంత ఖరీదైన స్టార్ హోటల్ నోవాటెల్ - కన్విక్షన్ హాలులో ప్రేక్షకుల యొక్క ఆనందం ఉరకలు వేసే విధంగా నిర్వహించారు.

వచ్చిన ప్రముఖులలో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు, డా. డి.రామానాయుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలగంధర్వ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎల్.నారాయణ, అల్లుఅరవింద్, శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీమోహన్, కోడిరామకృష్ణ, ఇ.వి.వి.సత్యరానాయణ, టివి9 రవిప్రకాష్, ప్రముఖ సీనియర్ దర్శకులు బి.గోపాల్, డా. కె.వెంకటేశ్వరరావు, కళ్యాణి, సూర్యకిరణ్, శరణ్యామోహన్, అంజలి, సాయికిరణ్, మరియు నేటి క్రేజీ హీరోయిన్లు, రామ్ చరణ్ తేజ్, లీడర్ రానా, ఎం.ఎం.కీరవాణి, శ్రీమతి వల్లీ కీరవాణి, ప్రముఖ దర్శకులు సముద్ర ఉన్నారు. ఇంకా నిన్నటి ప్రముఖ నటి రాధ, ఆమె కుమార్తె కార్తిక ఉన్నారు. కాగా మాగంటి బాబు వంటి ప్రముఖ నిర్మాత మరియు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.

వర్షం పాటల ప్రదర్శనలో నిజంగానే వర్షాన్ని కురిపించడం ఇంతవరకు ఎప్పుడూ, ఎక్కడా ప్రపంచ వేడుకల్లోనే లేదు. ఆ వింత సంతోషం వేడుకల్లో

కనిపించి వేలాది ప్రేక్షకుల్ని ఆశ్చర్యానుబూతిలో ముంచెత్తి, ఆనక మానసికానందాన్ని కలుగజేసి ఆ పై వేదికపై వర్షంలాంటి హర్షధ్వనులు కురిపించాయి. ఈ క్రియేటర్ కు, సంతోషం అధినేతను వక్తలంతా అభినందనలు పరంపరలో ముంచెత్తి వేశాయి.

రఘుబాబు ఆనందం: గొప్ప నటుడు కీ.శే. అల్లురామలింగయ్య పేరిట ఏర్పాటు చేసిన అల్లురామలింగయ్య స్మారక అవార్డులను ఈ సారి ప్రఖ్యాత హాస్యనటులు, క్యారెక్టర్ మరియు విలన్ ఆర్టిస్టు రఘుబాబు గెలుచుకున్నారు.

ప్రభాస్ కూడా తన శుభాకాంక్షలు తెలుపమన్నాడు : భారీ స్టైలిష్ మూవీగా ప్రశంసలందుకున్న ‘బిల్లా’ చిత్ర నిర్మాతలు రెబల్ స్టార్ కృష్ణంరాజు, శ్రీమతి కృష్ణరాజు అవార్డునందుకున్నారు. ఈ సందర్భంగా గోపీకృష్ణామూవీస్ అధినేత కృష్ణంరాఃజు మాట్లాడుతూ ‘చాలా సతోంషం. నాకు ఈ అవార్డును తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 15 ఏళ్ళ తర్వాత గోపీకృష్ణలో తీసిన చిత్రం బిల్లా. ఆ బిల్లాకు అవార్డునిచ్చిన సురేష్ కొండేటి కృతజ్ఞతలు. ప్రభాస్ అవుట్ డోర్ లో ఉన్నాడు. ఆ కారణంగా రాలేకపోయాడు. అయితే తను సంతోషం సురేష్ కు శుభాకాంక్షలు తెలుపమన్నాడు’ అన్నారు.

ఒక చరిత్రను లిఖించుకున్న దర్శకరత్న డా. దాసరికి ఈ వేడుకకు విచ్చేసిన మొత్తం ప్రముఖుల సమక్షంలో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్ ను ప్రధానం చేయడం జరిగింది.

రామ్ చరణ్ నా మునిమనవడు: దర్శకరత్న ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఇక్కడకొచ్చిన ప్రేక్షకుమహాశయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు పాటు ఒక సినిమా వారపత్రికను నడపడమేగాక, అవార్డులను కూడా ఇవ్వడమనేది అపూరపమైన విషయం. ఈ సందర్భంలో సురేష్ కొండేటిని మనసారా అభినందిస్తున్నాను. ఈ అవార్డులు మాకెంతో సంతోషాన్నిస్తాయి. ఇవ్వాళ యంగ్ స్టర్స్ అంతా ఎంతో క్రియేటివిటీతో ముందుకు దూసుకుపోతోంది. కానీ ఇటువంటి ఫంక్షన్ లు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటివి. గత ఏడాది ‘మగధీర’, ‘అరుంధతి’ చిత్రాలు చరిత్రను సృష్టించాయి. ఆ రెండు చిత్రాలు ఎక్కువ అవార్డులను పొందటం సముచితం.

ఇవాళ బెస్ట్ హీరోగా అవార్డు తీసుకుంటున్న రామ్ చరణ్ నా మునిమనవడు. ఆ చిత్రంలో మంచి నటనను ప్రదర్శించి పేరు తెచ్చుకున్నాడు. బెస్ట్ ప్రొడ్యూసర్స్ అల్లుఅరవింద్, శ్యాంప్రశాద్ రెడ్డిగార్లకు శుభాకాంక్షలు. గీతఆర్ట్స్ నా చేతులతో ఆరంభమైంది. కొత్త తారలతో మన చిత్ర పరిశ్రమ ముందుకు వెళ్ళాలి.

అయితే అందరినీ నేను కోరుకునేది ఒక్కటే. తెలుగు వారిని గౌరవించండి తెలుగు చిత్రాలను చూడండి. తెలుగు వారితో చిత్రాలు నిర్మించండి. లేదా... కొన్నాళ్ళకు తెలుగు పరిశ్రమ తమిళ పరిశ్రమైపోతుంది’ అన్నారు హర్షధ్వనుల మధ్య.

సంతోషం బర్త్ డే కేక్ కట్ చేసిన దర్శకరత్న, రామ్ చరణ్ : అనంతరం ‘సంతోషం’ 8వ, బర్త్డే కేక్ ను దర్శకతర్న డా. దాసరి, మెగా యంగ్ హీరో రామ్ చరణ్ కట్ చేసి సురేష్ కు తినిపించారు.

అంతకు ముందు ఉత్తమ నిర్మాత (మగధీర) అల్లుఅరవింద్ దర్శకరత్న డా.డి.రామానాయుడు చేతుల మీదుగా అవార్డునందుకున్నారు. ఉత్తమ ఫ్యామిలీ చిత్రాల నిర్మాత శ్యాంప్రశాద్ రెడ్డి కూడా దర్శకరత్న ద్వారా అవార్డునందుకున్నారు. ఉత్తమ నటి అనూష్క డా. రామానాయుడు, లీడర్ రానాల ద్వారా అవార్డునందుకున్నారు. ఉత్తమ హీరో (మగధీర) అవార్డును మెగా రామ్ చరణ్ కు దర్శకరత్న అవార్డునందజేశారు. ఉత్తమ నూతన నటి అవార్డును కార్తీకి రామ్ చరణ్ అవార్డునందజేశారు.

ఈలలు వేయించిన రామ్ చరణ్ ప్రసంగం : చివరగా బెస్ట్ హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ - ఈ సందర్భంలో ముఖ్యంగా ముగ్గురికి రుణపడి ఉంటాను. మొదటి వ్యక్తి చిత్ర నిర్మాత మామయ్య అల్లుఅరవింద్ గారు. ఆయన చేయకపోతే ఈ చిత్రం అనేది లేదు. రెండో వ్యక్తి దర్శకులు రాజమౌళిగారు. ఈ క్యారెక్టర్ కు నేను బాగుంటానని నన్ను ఎన్నుకుని చేయించినందుకు కృతజ్ఞతలు. మూడు అశేష ప్రేక్షక జనం. ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆడించారు ప్రేక్షకజనం. నిన్ననే చెన్నైలో ఫిలింఫేర్ అవార్డునందుకుని వచ్చాక ఇవాళ సంతోషం అవార్డును అందుకుంటున్నాను. - అని అన్నారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com