Bookmark and Share   Cinevinodam Subscribe
 
ఆగస్టు 8న ‘సంతోషం’ అవార్డుల ఉత్సవం

‘సంతోషం’ సినిమా వారప్రతిక గత ఏడు సంవత్సరాలుగా ఇస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా ‘సంతోషం’ ఫిలిం అవార్డులను ఇవ్వనుంది. ఈ వివరాలను వెల్లడించడానికి కంకీస్ హోటల్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ‘సంతోషం’ పత్రిక సంపాదకుడు సురేష్ కొండేటి, ఓరియన్ మొబైల్స్ ప్రభాకర్, నర్సింహారావు, టివి9 వైస్ ప్రెసిడెంట్ మూర్తి, ‘ఝుమ్మందినాదం’ ఫేం తాప్సీ, ‘లీడర్’ ఫేమ్ రిచాగంగోపాధ్యాయ, కంకీస్ రెస్టారెంట్ ఓనర్ వాసులు పాల్గొన్నారు. ఈ అవార్డుల బ్రోచర్ ను తాప్సీ విడుదల చేయగా, రిచా ట్రైలర్స్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి మాట్లాడుతూ- ‘ఆగస్టు8కి ఈ అవార్డులు అందజేయడానికి కారణం సంతోషం పత్రిక స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖున ఎయిత్ వండర్ లాగా ఈ అవార్డుల ఫంక్షన్ నొవోటెల్ లోని హెచ్ఐసిసిలో జరుగనుంది. ఈరోజు ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గ్రూప్ నర్తించనుంది. ప్రముఖ హీరోలు హీరోయిన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఏడాది నుండి వేటూరి స్మారక అవార్డును ఇవ్వనున్నాము. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ కెమెరామెన్ అవార్డులను కూడా ఇవ్వనున్నాము. ఈ ఏడాది నుండినెలకు ఒకవారం హీరోయిన్ కవర్ పేజీతో ‘సంతోషం’ పత్రిక ప్రచురింపబడనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయడానికి టీవీ9 వారు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించడానికి ఓరియన్ మొబైల్స్ వారు కలిసి వచ్చారు. వారితోపాటు క్రియేటివ్ ఐ వారు కూడా ముందుకు వచ్చరని’ అన్నారు.

తాప్సీ మాట్లాడుతూ- ‘‘సంతోషం’ కవర్ పేజీలు ఇన్ని వచ్చినా ఒక్క హీరోయిన్ ఫొటో కూడా కవర్ పేజీగా రాలేదు. ఇదే విషయాన్ని సురేష్ గారిని అడిగితే అతను ఇక నుండి వేస్తానని చెప్పడం ఆనందాన్ని కలిగించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుందని రిచా గంగోపాధ్యాయ అన్నారు.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com