|
సరిహద్దులో కాపుకాసే సైనికుల వల్లే మనం కంటినిండా నిద్రపోతున్నాం. అలాంటి వీరులు యుద్ధంలో మరణిస్తే వారి
పిల్లలు అనాధలవుతున్నారు. ప్రతి పుట్టినరోజుకీ ఏదో ఒకటి చేయాలని తపిస్తుంటాను. ఈసారి వారి పిల్లలను దత్తత
తీసుకుని చదివించాలని తల పోశాం. వందకోట్ల భారతీయులుండగా వారెలా అనాధలవుతారు?’ అని ప్రశ్నించా
రుడు శ్రీహరి. ఆయన పుట్టిన రోజు ఆదివారం స్వాతంత్య్ర పర్వదినాన అభిమానులు, బంధుమిత్రులు,
శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ‘భైరవ’ విడుదలకు సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో
ఆయన మరిన్ని విశేషాలు మాట్లాడుతూ ‘ఈ కొత్త ఆలోచన ఇచ్చింది నా భార్య శాంతి. ‘భైరవ’ చిత్రంలో కూడా
ఈ రకమైన ఎపిసోడ్ ఒకటి ఉంది. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో, హైదరాబాద్‌లో..ఇలా అన్నిచోట్లా జనసంఖ్యను
గణిస్తే.. అందులో ఎ-క్లాస్, మధ్యతరగతి, బీద, బక్క అందరూ తేలగా చివరికి రెండు శాతం జీవులతోనే
సమస్య వచ్చింది. వారే అనాధలు. వారిని పట్లించుకోకపోతే..పెను ఉత్పాతమే. లాడెన్ లాంటి తీవ్రవాదుల్లా
తయారైతే ఆ పాపం మనదే. అక్కున చేర్చుకుంటే అబ్దుల్ కలాం అంత ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేం చేస్తున్న
పనివల్ల అందరూ ఇలాంటి మంచి ఆలోచనలు చేస్తారు’ అన్నారాయన.
‘భైరవ’ నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ ‘దాసరి, శ్రీహరి పుట్టినరోజులు నాకు పండుగలాంటివి. నా మీద
నమ్మకంతో శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ను పరిచయం చేసే అవకాశమిచ్చారు. ‘అక్షర ఫౌండేషన్’ ద్వారా సేవ
చేస్తున్న శ్రీహరికి ధన్యవాదాలు. ‘భైరవ’ తొలిరోజు వసూళ్లను ఈ ఫౌండేషన్‌కి ఇచ్చేస్తున్నాను’ అన్నారు.
‘భైరవ’ దర్శకుడు గులాబీ శ్రీను మాట్లాడుతూ త్వరలోనే ఓ సక్సస్ సినిమాతో మీ ముందుకొస్తాం’ అన్నారు.
వేడుకలో శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి, శ్రీలేఖ, కె.అచ్చిరెడ్డి, శ్రీధర్ (శ్రీహరి తమ్ముడు) తదితరులు
పాల్గొన్నారు.
|