Bookmark and Share   Cinevinodam Subscribe
 
శ్రీనువైట్లకు కేవీరెడ్డి అవార్డు

అలనాటి మేటి చిత్రాలు వర్థమాన దర్శకులకు పాఠ్యవుస్తకాలని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా.సి.నారాయణరెడ్డి అన్నారు. యువకళావాహిని ఆధ్వర్యంలో ప్రముఖ దర్శకులు శ్రీనువైట్లకు నాటి ప్రఖ్యాత దర్శకులు కె.వి.రెడ్డి అవార్డు ప్రదానోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినారె మాట్లాడుతూ- ‘కె.వి.రెడ్డి తెలుగు చలనచిత్ర రంగంలో అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరని కీర్తించారు. ఆయన ఆవిష్కరించిన అపురూప చిత్రాల్లో ‘మాయాబజార్‌’ ఒకటని తెలిపారు. దర్శకత్వంలోని లోతుల్ని గమనించి చిత్రాలను తీసే దర్శకులు చివరిదాకా రాణిస్తారన్నారు. ఈతరం సినీ దర్శకుల్లో శ్రీనుపైట్ల, వి.వి.వినాయక్‌లు తమదైన వ్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారని’ వ్రశంసించారు.

దర్శకులు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ- ‘‘నేను సినీరంగంలో అడుగుపెట్టిన తొలిరోజుల్లో చేరదీసి, నాకు క్లావ్‌ కొట్టడం నేర్పింది శ్రీను వైట్ల. మా బావ.. అని వినాయక్‌ ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీనుది వూలబాట కాదు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడ్డాడని అన్నారు. నాటి ‘మాయాబజార్‌’ చిత్రం గురించి ఈ రోజుల్లో కూడా చర్చించుకున్నట్లే.. భవిష్యత్తులో మా బావ తీసిన ‘ఢీ’, ‘రెఢీ’ చిత్రాలను గురించి మాట్లాడుకుంటారని’’ అన్నారు.

ప్రముఖ హాస్యనటులు డా.బ్రహ్మానందం మాట్లాడుతూ- ‘శ్రీనుపైట్ల, వి.వి.వినాయక్‌లు రేసు గుర్రాల్లాంటిపారని అన్నారు. నిరంతర కృషితో అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. అటువంటి శ్రీనువైట్లకు కె.వి.రెడ్డి అవార్డు ఇవ్వడం సముచితంగా ఉందని’ అన్నారు.

పురస్కార గ్రహీత, దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ- ‘తాను ఆరాధించే, అనుసరించే దర్శకులు కె.వి.రెడ్డి పేరిట అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తొలిరోజుల్లో నాకు, వినాయక్‌కు చాలా తక్కువ జీతం ఉండేది. అప్పుడు మా పరిస్థితిని తలుచుకుంటే భయమేస్తుందన్నారు. ఈరోజు హైదరాబాద్‌ సెంటర్‌లో నా ముఖచిత్రంతో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు చూస్తున్నప్పుడు గర్వంగా ఉంటుందని’ అన్నారు.

సభకు సారివల్లి కొండలరావు అధ్యక్షులుగా వ్యవహరించారు. నటి గీతాంజలి, వాస్తుశిల్పి డా.బి.ఎన్‌.రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు వాశిరాజు ప్రకాశం, డా.చాట్ల శ్రీరాములు తదితరులు శ్రీను వైట్లను ఆశీర్వదించారు. అంతకు ముందు రిషిక నృత్యవిభావరి అలరించింది.

 


 

Copy right reserved for www.cinevinodam.com 2005 :: mail to:rambabu_adla@cinevinodam.com