Bookmark and Share   Cinevinodam Subscribe
 
 
త్రీ డి యానిమేషన్ లో ఛార్లీ చాప్లిన్‌!

మాటలు లేని పాత సినిమాలు.. పైగా నలుపుతెలుపువి.. అయినా సరే ఛార్లీ చాప్లిన్‌ చిత్రాలంటే చూడనిదెవరు? చూసి కడుపుబ్బా నవ్వుకోనిదెవరు? అలా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న చాప్లిన్‌ కథ ఆధారంగా యానిమేషన్‌ టీవీ సీరియల్స్‌ను రూపొందిస్తున్నారు. డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కంపెనీ తీస్తున్న వీటిలో చాప్లిన్‌ సినిమాల్లోని సన్నివేశాలు కూడా ఉంటాయి. ఆరేసి నిమిషాల నిడివి ఉండే 104 చిత్రాలను సుమారు 50 కోట్ల రూపాయల ఖర్చుతో తీస్తున్నారు.

* నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడిగా రాణించిన ఛార్లీ చాప్లిన్‌ 1914 నుంచి 1967 వరకూ మొత్తం 81 చిత్రాలు రూపొందించాడు.
* 1972లో ఆస్కార్‌ అవార్డు అందుకున్నాడు.
* ప్రఖ్యాత టైమ్‌ పత్రిక ముఖచిత్రంపై కనిపించిన మొదటి సినీ నటుడు ఇతడే.
* చాప్లిన్‌ జీవిత కథ పుస్తకం 20 లక్షల కాపీలపైనే అమ్ముడైంది.
* చార్లీ చాప్లిన్‌ వాడిన చేతి కర్ర, టోపీ 1987లో వేలం వేస్తే లక్షా యాభైవేల డాలర్లు పలికాయి.
* రష్యా వ్యోమగాములు కనుక్కున్న ఓ గ్రహశకలానికి చాప్లిన్‌ పేరు పెట్టారు.
* ఓ సారి చార్లీ చాప్లిన్‌ వేషధారణ పోటీలు జరుగుతుంటే అందులో పాల్గొన్న చాప్లిన్‌ మూడో స్థానంలో నిలిచాడు.
* గుజరాత్‌లో మారుమూల గ్రామమైన ఆదిపూర్‌లో చార్లీచాప్లిన్‌ను దేవుడిలాగే కొలుస్తారు తెలుసా. అక్కడ 1973లో ఏర్పాటైన చార్లీ సర్కిల్‌లో చాప్లిన్‌ పుట్టిన రోజు వేడుకలు జరుగుతాయి.
* 1889లో పుట్టిన చాప్లిన్‌ 1977లో మరణించాడు. చిన్నప్పుడు ఐదేళ్ల వయసులో తల్లి పాట పాడుతున్న సభలో గలాభా జరిగితే చాప్లిన్‌ ధైర్యంగా వేదికపైకి వచ్చేసి పాట పాడాడు. ఆపై ఎన్నో వేదికలపై ఆడిపాడాడు.

 


 

 
Copy right reserved for www.cinevinodam.com 2005