Bookmark and Share   Cinevinodam Subscribe
 
 
2008 టివి నంది అవార్డులు

తెలుగు టివి ఛానెల్స్‌లో 2008లో ప్రసారమైన కార్యక్రమాల్లో ఉత్తమమైన వాటికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను ప్రకటించారు. సీనియర్‌ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు చైర్మన్‌గా 14 మంది కమిటీ ఈ కార్యక్రమాలను చూసి అవార్డుకు అర్హమైన వాటిని ఎంపిక చేశారు. అవార్డు గ్రహీతలకు ఇచ్చే నగదు పారితోషికాన్ని పెంచినట్లు రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్థసారధి చెప్పారు. ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం ఏప్రిల్‌ చివరివారంలో చేస్తామని చెప్పారు. 2008 సినిమా నంది అవార్డుల ఉత్సవాన్ని ఉగాది రోజు మార్చి 16న లలితకళాతోరణంలో నిర్వహిస్తామని చెప్పారు.

అవార్డుల వివరాలు :

* ఉత్తమ టెలీ ఫిల్మ్‌ : 'విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు'
* ద్వితీయ ఉత్తమ టెలీ ఫిల్మ్‌ : 'గంటల బండి'
* ఉత్తమ టివి ఫీచర్‌ : తెలుగు - వెలుగు
* ద్వితీయ ఉత్తమ టివి ఫీచర్‌ : సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ - 2008
* ఉత్తమ మెగా సీరియల్‌ : తరిగొండ వెంగమాంబ
* ద్వితీయ ఉత్తమ మెగా సీరియల్‌ : సృష్టి
* ఉత్తమ డైలీ సీరియల్‌ : చిన్నారి
* ద్వితీయ ఉత్తమ డైలీ సీరియల్‌ : శైలు
* ద్వితీయ ఉత్తమ పిల్లల చిత్రం : బాలల హక్కులు
* ఉత్తమ డాక్యుమెంటరీ : మహాకవి శ్రీశ్రీ
* ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ : మెదక్‌ జిల్లా పరిశోధనా చిత్రం
* ఉత్తమ సామాజిక చిత్రం : కచరా
* ద్వితీయ ఉత్తమ సామాజిక చిత్రం : చేనేత వరదాయిని పోచంపల్లి
* ఉత్తమ విజ్ఞాన చిత్రం : వేద గణితం
* ద్వీతీయ ఉత్తమ విజ్ఞాన చిత్రం : లేజర్‌

* ఉత్తమ దర్శకుడు : పి.ఉదయ భాస్కర్‌ (తరిగొండ వెంగమాంబ)
* ఉత్తమ నటుడు (అచ్యుత్‌ అవార్డ్‌) : కళ్యాణ్‌ (లయ)
* ఉత్తమ నటి : మీనా (తరిగొండ వెంగమాంబ)
* ఉత్తమ సహాయనటుడు : మనోజ్‌ (రాధామధు)
* ఉత్తమ సహాయనటి : లహరి (రాధామధు)
* ఉత్తమ హాస్యనటుడు: చలపతిరాజు (ఋనానందలహరి)
* ఉత్తమ హాస్యనటి : మధుమణి (యువ)
* ఉత్తమ విలన్‌ : రంగనాధ్‌ (సృష్టి)
* ఉత్తమ బాలనటుడు : అభిషేక్‌ రామ (కచరా)
* ఉత్తమ బాలనటి : గాయత్రి (గంటల బండి)
* ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : మీర్‌ హుస్సేన్‌ (స్రవంతి)
* ఉత్తమ స్క్రీన్‌ప్లే దర్శకుడు : చంద్రశేఖర్‌ ఆజాద్‌ (రాధామధు)
* ఉత్తమ కథా రచయిత : ఆకెళ్ళ సూర్యనారాయణ(నీలో సగం)
* ఉత్తమ సంభాషణల రచయిత : సి.ఎస్‌.రావు (విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు)
* ఉత్తమ గేయ రచయిత : అనంత్‌ శ్రీరామ్‌ (తూర్ప వెళ్ళే రైలు)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : కన్న కూనపురెడ్డి (యువ)
* ఉత్తమ సంగీత దర్శకుడు : నల్లూరి సుధీర్‌ కుమార్‌ (శ్రీనివాస మందారం)
* ఉత్తమ నేపధ్య గాయకుడు : విజయ్‌ జేసుదాస్‌ (చిన్నారి)
* ఉత్తమ నేపధ్య గాయని : ప్రణవి (తూర్పు వెళ్ళే రైలు)
* ఉత్తమ ఎడిటర్‌ : వాసు (చిన్నారి)
* ఉత్తమ కళాదర్శకుడు : భాస్కర రాజు (తరిగొండ వెంగమాంబ)
* ఉత్తమ యాంకర్‌ : సంతోష్‌ కుమార్‌ శాస్త్రి (గురుదేవోభవ)
* ఉత్తమ మహిళా యాంకర్‌ : దీప్తి వాజ్‌పాయ్‌ (మహాకవి శ్రీశ్రీ)
* ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ : ఆర్‌.సి.ఎమ్‌.రాజు (పురాణగాధలు)
* ఉత్తమ మహిళా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ : హరిత (రాధామధు)
* ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ : రామ్‌సూరి (స్రవంతి)
* ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : ప్రకాశరావు (సృష్టి)
* ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ : నాగేశ్వరరావు (శైలు)
* ఉత్తమ గ్రాఫిక్స్‌ : బాల శంకర్‌రెడ్డి (సృష్టి)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు :
* డా|| రామకృష్ణ శాస్త్రి (విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు)
* విశ్వంభర (కె.ముఖర్జీ)
* హేమారావు (సరిగమ సంకీర్తనలు)

 


 

 
Copy right reserved for www.cinevinodam.com 2005