‘వరుడు కావలెను‘ కథ వినగానే సూపర్‌హిట్‌ అని ఫిక్స్‌ అయ్యా !

లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నాగశౌర్య, రీతూవర్మ జంటగా  తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను రానా దగ్గుబాటి ట్రైలర్‌ను విడుదల చేశారు.
నాగశౌర్య మాట్లాడుతూ… ‘చలో ‘ సక్సెస్‌ పార్టీలో సౌజన్య వచ్చి ‘తమ్ముడు నీకో కథ చెబుతా చేస్తావా’ అని అడిగింది. లైన్‌ నచ్చి వెంటనే ఓకే చేశా. కథ వినగానే సూపర్‌హిట్‌ అని ఫిక్స్‌ అయ్యా. ఇలాంటి కథను ఎంత చెడగొట్టాలన్నా చెడగొట్టలేము.  మొదట చిన్న సినిమా అనుకున్నా. సితార బ్యానర్‌ తోడు అవ్వడంతో సినిమా స్థాయి పెరిగింది. చినబాబు గారు , నాగవంశీ గారు ఫలానా హీరోకి ఇంతే బడ్జెట్‌ పెట్టాలనుకునే నిర్మాతలు కారు. ‘డబ్బు ఎలా రాబట్టాలి అనే దానికంటే కథకు ఎంత పెట్టాలి’ అని ఆలోచన ఉన్న వారిని మేకర్స్‌ అంటారు. అలాంటి వారే చినబాబు గారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. గణేష్‌ రావూరి చక్కని సంభాషణలు రాశారు. నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం మా డిఓపీ వంశీ పచ్చిపులుసు.  విశాల్‌ చంద్రశేఖర్‌ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. ఈ సినిమాతో సౌజన్య అక్క కల నెరవేరబోతోంది’ అని అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ… ‘‘నాగశౌర్యని చూస్తే ‘రాముడు మంచి బాలుడు’ అన్న సామెత గుర్తొస్తుంది. ఈ సినిమాకు హీరో ఎవరనేది చెప్పకపోయినా టైటిల్‌ని బట్టి నాగశౌర్య హీరో అని చెప్పగలను. ట్రైలర్‌ బావుంది.ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్‌  బ్యాక్‌ అని చెప్పగలను. ఈరోజు ఇక్కడికి గెస్ట్‌లా రాలేదు. మా ‘భీమ్లా నాయక్‌’ నిర్మాత కోసం వచ్చాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’’ అని అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… మా సంస్థ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది. మాకు అవే బాగా కలిసొచ్చాయి. ఇది ఫ్యామిలీ, కమర్షియల్‌ సినిమా. సెకెండాఫ్‌లో ఒక సస్పెన్స్‌ ఉంది. అది యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నారు.
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ… ‘బిజీ షెడ్యూల్‌లో కూడా రానాగారు ట్రైలర్‌ లాంచ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ… ‘‘నా కామెడీని మిస్‌ అయిన అందరినీ ఇందులో నవ్వులతో చీల్చి చెండాడతా. సెకెండాఫ్‌లో అంతగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. ఈ పాత్ర నేనే చేయాలి అని దర్శకనిర్మాతలు నాకీ అవకాశం ఇచ్చారు’’ అని అన్నారు.
మాటల రచయిత గణేష్‌ రావూరి మాట్లాడుతూ… ‘‘భూమిలాంటి అమ్మాయిని ఇంప్రెస్‌ చేయాలంటే ఆకాష్‌లాంటి అబ్బాయి కావాలి. ఈ చిత్రంలో మా హీరోహీరోయిన్ల పాత్రలు అంత ప్లజెంట్‌గా ఉంటాయి. ఫన్‌, ఎమోషన్స్‌, అద్భుతమైన సంగీతం అన్ని ఉన్న చిత్రమిది. నాగశౌర్య కథ వినగానే బ్లాక్‌బస్టర్‌ అవుతుందని చెప్పారు. బయటి టాక్‌ కూడా అలాగే వినిపిస్తుంది. రీతువర్మ ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. నదియా పాత్ర సినిమాకు చాలా కీలకం. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ… ‘‘మంచి పాటలు కుదిరాయి. సింగర్స్‌, మ్యుజిషియన్స్‌ చాలా సపోర్ట్‌ చేశారు. తమన్‌ సంగీతం అందించిన రెండు పాటలూ నాకు నచ్చాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
గేయ రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ… “ఈ చిత్రంలో ‘కోల కళ్లే ఇలా’ పాట రాశాను. పాటకు చక్కని పదాలు కుదిరాయి. అంతే అద్భుతంగా సిద్‌ శ్రీరామ్‌ పాడారు. ఈ పాటలో నాగశౌర్య, రీతు చాలా గ్లామర్‌గా కనిపిస్తారు. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.