నాగ‌శౌర్య‌, షామిలి `అమ్మ‌మ్మ‌గారిల్లు` ఫస్ట్ లుక్

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. కాగా ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ని  విడుద‌ల చేశారు.
హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ, ` తొలిసారి  చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నా.  షూటింగ్  చేస్తున్నంత‌ సేపు సెంట్ లో పండ‌గ వాతావార‌ణంలా కోలాహాలంగా ఉంది. కుటుంబ అనుబంధాలు..ఆప్యాయ‌త‌లు..అనురాగాలు.. అందులో వ‌చ్చే చిన్న చిన్న మ‌నస్ప‌ర్ధ‌లు..ఆవేద‌న ఎలా ఉంటుంద‌నేది ద‌ర్శకుడు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. క‌థ‌ను న‌మ్మి సినిమా చేశాం. నిర్మాణ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఉంటాయి. క్వాలిటీగా సినిమా చేసిన నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి ఈ సినిమాతో నేను మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాను` అని అన్నారు.
హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ` `ఓయ్` సినిమా త‌ర్వాత స‌రైన క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతోనే మ‌రో సినిమా చేయ‌లేదు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ `అమ్మమ్మ‌గారిల్లు` క‌థ న‌చ్చ‌డంతో సినిమాకు వెంట‌నే ఒప్పుకున్నాను. నా క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఉంటుంది. నాగ‌శౌర్య తో సినిమా చేయ‌డం సంతోషంగా  ఉంది. అలాగే ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.
ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ, ` రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని  రాసిన క‌థ ఇది. ద‌ర్శ‌కుడిగా నాకిది తొలి సినిమా.  తెర‌పై సినిమా  చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ కు  థియేట‌ర్ లో ఉన్నామ‌న్నా ఫీలింగ్ కాకుండా పండ‌గ వాతావ‌ర‌ణంలో త‌మ కుటుంబంతో గ‌డుపుతున్న అనుభూతి క‌ల్గుతుంది. నాగ‌శౌర్య అద్భుతంగా న‌టించాడు. ఎమోష‌న్ స‌న్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగ‌తా న‌టీన‌టులంతా కూడా త‌మ పాత్ర‌ల ఫ‌రిది మేర అద్భుతంగా న‌టించారు. ఇంత‌ మంచి సినిమా చేసే అవ‌కాశం ఇచ్చి నిర్మాతలు  రాజేష్, ఆర్ .కె గారికి కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.
చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ, ` సినిమా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ప్ర‌తీ స‌న్నివేశాన్ని హృద‌యానికి హ‌త్తుకునేలా తెర‌కెక్కించారు. అలాగే నాగ‌శౌర్య  న‌ట‌న సినిమాకు హైలైట్ గా ఉంటుంది. న‌ట‌న‌పై ఆయ‌న క‌మిట్ మెంట్..డెడికేష‌న్ చాలా బాగున్నాయి. భ‌విష్య‌త్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము  సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో….సినిమా చూసిన త‌ర్వాత అంతే అనుభూతి ప్రేక్ష‌కులు పొందుతారు` అని అన్నారు.
ఇత‌ర పాత్ర‌ల్లో రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ మురళి, సుమ‌న్, శివాజీ రాజా, ష‌క‌లక శంక‌ర్, సుమిత్ర‌, సుధ‌, హేమ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: క‌ళ్యాణ్ ర‌మ‌ణ‌, ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్, పాట‌లు:  సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తి, భాస్క‌ర‌భ‌ట్ల‌,  ఎడిటింగ్:  జె.పి, కొరియోగ్ర‌ఫీ: స‌్వ‌ర్ణ‌, ఫైట్స్: మ‌ల్లేష్ షావెలెన్, స‌హ నిర్మాత‌:  కె.ఆర్,  క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  సుంద‌ర్ సూర్య‌.