‘టాప్ టెన్’ లో మన వాళ్ళు ముగ్గురు !

ప్ర‌ముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ‌జైన్ పత్రిక ‘ఫోర్బ్స్’ ప్ర‌తి ఏడాది అత్య‌ధిక పారితోషికం అందుకున్న న‌టుల జాబితాను విడుద‌ల చేస్తుంది. ఈ ఏడాది కూడా టాప్ 10 జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో 68 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.435కోట్లు)తో మార్క్‌ వాల్‌బర్గ్ టాప్ పొజిష‌న్ లో ఉండ‌గా , బాలీవుడ్ హీరోలు షారుక్‌ ఖాన్‌- 38 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.243 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌- 37 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.237 కోట్లు), అక్షయ్‌కుమార్‌- 35.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.227 కోట్లు) తో 8,9, 10 స్థానాల‌లో ఉన్నారు. ‘దంగ‌ల్’ చిత్రంతో దాదాపు 2000 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన అమీర్ ఖాన్ ఇందులో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

2016 జూన్ 1 నుండి సేక‌రించిన నివేదిక ప్ర‌కారం ఫోర్బ్స్ ఈ జాబితాని విడుద‌ల చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక  డ్వెయిన్‌ జాన్సన్‌- 65 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.416 కోట్లు), విన్‌ డీజిల్‌- 54.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.349 కోట్లు), ఆడమ్‌ శాండ్లర్‌- 50.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.323 కోట్లు) , జాకీ చాన్‌- 49 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.314 కోట్లు), జూ.రాబర్ట్‌ డౌనీ- 48 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.307 కోట్లు), టామ్‌ క్రూజ్‌- 43 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.275 కోట్లు) లు 2,3,4,5,6,7 స్థానాల‌లో ఉన్నారు.