వర్మ దర్శకత్వంలో కొండా మురళి, సురేఖ జీవిత కథ ‘కొండా’ 

వరంగల్  కొండా మురళి, కొండా సురేఖ గార్ల జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న ‘కొండా’  చిత్రం వరంగల్ లో కొండా మురళి సొంతఊరు వంచనగిరి లో ఘనంగా ప్రారంభం అయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యో యో టాకీస్ పతాకం పై మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలు గా అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో ‘కొండా’ రూపొందిస్తున్నారు. వంచనగిరి కోట గండి మైసమ్మ దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది.
పేదవాడిని ప్రేమించే  మనసున్న వ్యక్తి !
కొండా సురేఖ మాట్లాడుతూ … మురళి గారు సైకిల్ మీద టమోటాలు పెట్టుకొని వరంగల్ మార్కెట్ కెళ్ళి అమ్మిన వ్యక్తి . ఎవరి సపోర్ట్ లేకుండా రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ఆయన ప్రజాభిమానం తోటే ఎదిగాడానేది  అందరికీ తెలుసు. మా జీవితాల వెనుక ఒక చరిత్ర ఉంది .మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరందరూ కూడా పెత్తందార్లు , భూస్వాములు, బడుగు బలహీన వర్గాల లను అణగదొక్కేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ,ఎంతసేపు  పక్క వాళ్ళను ఎదగనీయకుండా చేసేటటువంటి గుణం ఉన్న వాళ్ళు కానీ..  పేదవాడిని ప్రేమించే  మనసున్న వ్యక్తి మురళి గారు. పేదవాడిని  పైకి తీసుకువచ్చే గొప్ప వ్యక్తి  మురళి గారు .ప్రతి ఒక్కరికి కాదనకుండా దానమిచ్చే వ్యక్తి మురళీ గారు. డబ్బుకు ఆశించకుండా తన భూమిని కూడా ఇచ్చేసి నటువంటి వ్యక్తి మురళి. ఆర్.జి.వి గారు మమ్మల్ని గుర్తించి ముందుకొచ్చి కొండా సినిమా చేస్తానని ధైర్యంగా చెప్తున్నారు. అన్నిటికంటే మంచి కథను ఇస్తున్నాం అని చెబుతున్నాడు. అటువంటి లక్షణాలు మురళి గారి లో ఉన్నాయి కాబట్టి ఆర్జివి గారు ముందుకు వచ్చారు అని అన్నారు
ఇలాంటి సినిమా  మీరు లైఫ్ లో చూసి ఉండరు!
రామ్ గోపాల్ వర్మ  మాట్లాడుతూ…  “నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. విజయవాడ లో చదువుకున్నాను, ఆంధ్ర లో జరిగిన చరిత్ర అంత తెలుసు. కానీ తెలంగాణ చరిత్ర అంతగా తెలీదు. కొండా మురళి గారి చరిత్ర చాలా గొప్పగా నచ్చింది. ‘వాళ్ళ జీవిత కథ అందరికి తెలియాలి’ అని ‘కొండా’ చిత్రాన్ని  నిర్మిస్తున్నాము. కొండా మురళి మామూలు మనిషి కాదు అని చాలా చెప్పారు. ప్రత్యేకమైన మనుషులు ప్రత్యేకమైన పరిస్థితుల్లో  పుడతారు.  మంచి కోసం, న్యాయం కోసం  ఎదురు తిరిగే దమ్ము చాలా తక్కువ మందికి ఉంటుంది. మిగిలిన వారంతా  బానిసలుగా వుంటారు. నేను వీరి కథ, జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత ‘మహా దమ్మున్నోడు’ కొండ మురళి అని తెలుసుకున్నాను.నేను ఒక ఫిల్మ్ మేకర్ ని. నేను కొంతమంది ద్వారా తెలుసుకొని  దాంట్లో నుంచి నాకు అర్థం అయిన సారాంశాన్ని తీయడం జరుగుతుంది. నాకు కొండ మురళి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏ డైరెక్టర్ కైనా తన కథ ఎంత ఫెంటాస్టిక్ గా ఉందనేది ముఖ్యం. కథ బాగా లేకపోతే ఏమి చేయలేడు.నేను శివ నుంచి స్టార్ట్ అయ్యి బాంబే నుంచి తీసిన సినిమాల నుంచి కావచ్చు.. నా సినీ చరిత్రలో విన్న మోస్ట్ ఎక్స్ట్రార్డినరీ కథ ‘కొండా’ . కొండా మురళి, కొండా సురేఖ గార్ల కథను  నేను నా టాలెంట్ తో వారి జీవిత చరిత్ర ను టెన్ పర్సెంట్ సినిమాలో పెట్ట గలిగినా కూడా నా ప్రయత్నం సక్సెస్ అయి.. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. కొండ మురళి తో కలిసి నేను తిరిగిన తర్వాత నేను సురేఖమ్మ గారి కంటే మురళిని ఎక్కువ ఇష్టపడుతున్నాను. నేను చూసిన అందరిలో కంటే వీరు బెస్ట్ కపుల్. ఇలాంటి  రిలేషన్ షిప్ తో ఉన్న ఫ్యామిలీ నేను ఇప్పటి వరకు చూడలేదు.అందుకే వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. కొండా అనేది ఒక్క తెలంగాణకే పరిమితం కాకూడదని,  యూనివర్సల్ కావాలని ఈ సినిమా తీస్తున్నాను. కొండా లాంటి సినిమా ఇప్పటివరకు మీరు లైఫ్ లో చూసి ఉండరని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత ముకుంద్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు వర్మ గారు చరిత్ర సృష్టించే సినిమాలు తీశాడు. తన సినీ చరిత్రలో ఇంకో చరిత్ర సృష్టించే సినిమా కొండా అవుతుంది.  ఈ సినిమాతో  ఊరిలో తిరిగే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా ఇది కొండన్న మూవీ అని కచ్చితంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఇది సినిమా కాదు నిజజీవితంలో మీ మధ్యలో ఉన్న కొండా దంపతులు.. ఎటువంటి  ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొని దేనికి భయపడకుండా ఎలా దైర్యంగా నిల్చున్నారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు .ఈ సినిమాతో కొండా దంపతులు సెన్సేషన్ క్రియేట్ చేయబో తున్నారు . సాధారణంగా ఒక మగ వాడి వెనక మహిళ ఉంటుంది అంటారు. కానీ ఒక మహిళ వెనక కొండన్న ఉన్నాడు.ఈ సినిమా విడుదల తర్వాత ‘ప్రతి మహిళ  ధైర్యంగా మా వెంట కొండన్న ఉన్నాడు’ అనే విధంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అన్నారు.