వరలక్ష్మి శరత్ కుమార్ ‘పోలీస్ కంప్లెయింట్’ షూటింగ్ పూర్తి

సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పోలీస్ కంప్లెయింట్’
తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల
హైలైట్‌గా సూపర్‌స్టార్‌ కృష్ణపై స్పెషల్ సాంగ్

గ్లామ‌ర్ పాత్ర‌లతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. లేడీ విలన్ పాత్రలకు పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆడియ‌న్స్‌ను థ్రిల్‌ చేసే క్యారెక్ట‌ర్‌తో రాబోతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ –  నవీన్ చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’  షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ సినిమాలో వరలక్ష్మి ప‌వ‌ర్‌ఫుల్ పాత్రలో కనిపించ‌నుందని, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో నటించడం ప్రత్యేక ఆకర్షణ అని, సూపర్ స్టార్ కృష్ణ గారిపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపోందుతున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ మ‌హరాణా నిర్మిస్తుండగా, అఘోర (తెలుగు–తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి ,సప్తగిరి, జెమినీ సురేష్ ,అమిత్, దిల్ రమేష్, పృథ్వీ (యానిమల్) తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ— “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌పై ‘పోలీస్ కంప్లెయింట్’  సినిమా నిర్మిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో చూపించనున్నాం. చిత్ర‌యూనిట్ అంద‌రి స‌పోర్టుతో షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశాం, సినిమా అవుట్ ఫుట్ బాగా వ‌చ్చింది. ” అని తెలిపారు.

న‌టీన‌టులు: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, రవి శంకర్, శరత్ లోహితాశ్వ, పృథ్వీ (యానిమల్), శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ,జబర్దస్త్ నవీన్, బేబీ తనస్వి (పొట్టేలు ఫేమ్) ,దేవి శ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి,కృతి వర్మ, ప్రీతీ సుందర్, దేవేంద్ర, అనిల్ రాజ్, సత్తన్న, విజయ భాస్కర్..తదితరులు.

బ్యానర్ :  MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్
నిర్మాత‌: బాలకృష్ణ మ‌హరాణా
ద‌ర్శ‌కుడు: సంజీవ్ మేగోటి
సినిమాటోగ్రఫీ: ఎస్ఎన్ హరీష్
ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు
సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి
సాహిత్యం: సాగర్ నారాయణ, సంజీవ్ మేగోటి, చింతల ప్రసన్న రాములు
ఆర్ట్ డైరెక్టర్: మురళీధర్ కొండపనేని
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, రవితేజ
కొరియోగ్రఫీ:- సన్ రేస్ (సూర్య కిరణ్) , రాజ్ పైడి,
కాస్ట్యూమ్ డిజైన్: నల్లపు సతీష్
మేకప్ & స్టైలింగ్: విజయ్-శేఖర్
నిర్మాణ బృందం:
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిజినేపల్లి రాజశేఖర్ రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: టి. సతీష్ బాబు
ప్రొడక్షన్ మేనేజర్స్: రమేష్, కొల్లా గంగాధరం
పీఆర్‌ఓ: అశోక్ దయ్యాల.