ఆగష్టు 3న అడవిశేష్ “గూడాచారి”

అడవి శేష్, శోభిత ధూలిపాళ్ళ హీరో హీరోయిన్స్ గా నటించిన “గూడాచారి” సినిమా ట్రైలర్, పాటలు త్వరలో రిలీజ్ చేసి ఆగష్టు 3న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ద్వారా  శశికిరణ్ తిక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సినిమా చిత్రీకరణ అధికభాగం అమెరికా, హిమాచల్ ప్రదేశ్, పూణే, న్యూ ఢిల్లీ, చిట్టిగాంగ్ హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రేదేశాల్లో జరిగింది.  “గూడాచారి” సినిమా బడ్జెట్ విషయంలో  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హైటెక్నీకల్ వాల్యూస్ రూపొందించబడింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాతో వెండితెరపై రీ ఎంట్రి ఇవ్వబోతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు శనీల్ డియో సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశారు. “అభిషేక్ పిక్చర్స్”, “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ”, “విస్టా డ్రీమ్ మర్చెంట్” బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
నటీనటులు:
అడవిశేష్, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రియ యార్లగడ్డ, అనిష్ కురివెళ్ల, రాకేష్ వర్రీ.
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: శశికిరణ్ తిక్కా
స్టోరి: అడవి శేష్,మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల,డైలాగ్స్: అబ్బూరి రవి
సినిమాటోగ్రఫి: షనీల్ డియో,ఎడిటర్: గ్యారీ బి.హెచ్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావ్,పి. ఆర్.ఓ.: వంశీ – శేఖర్