డిసెంబర్‌ 22న అఖిల్‌ సినిమా విడుదల !

అఖిల్‌ హీరోగా ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ పై  అక్కినేని నాగార్జున ఓ  భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం  తెలిసిందే . అఖిల్ మొదటి చిత్రం ఫ్లోప్ కావడం తో ఈ చిత్రం విషయం లో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు .  ఈ చిత్రం లో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వార్తల్లోకి వచ్చినా, ఇంకా ఎవరినీ అధికారికం గా సెలెక్ట్ చెయ్యలేదు. డిసెంబర్‌ అంటే నాగార్జునకు ఎంతో ఇష్టం. ఎందుకంటే… ఆ నెలలో రిలీజైన ఆయన సినిమాలన్నీ దాదాపు హిట్టే! ఆ సెంటిమెంట్‌ ఏమో..  అఖిల్‌ హీరోగా నటిస్తున్న రెండో సినిమాను కూడా అదే నెలలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసినిమాను డిసెంబర్‌ 22న రిలీజ్‌ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘సినిమాలో చిన్న బిట్‌ చూశా. విక్రమ్, వినోద్‌ (సినిమాటోగ్రాఫర్, ‘మనం’కి కూడా వర్క్‌ చేశారు) మళ్లీ మేజిక్‌ రిపీట్‌ చేస్తారు’’ అని నాగార్జున పేర్కొన్నారు.