ఏడాదికి 4 సినిమాలు.. సినిమాకి 135 కోట్లు !

స్టార్‌‌ హీరోలు ఏడాదికి ఒక‍్క సినిమా విడుదల చెయ్యడమే కష్టంగా భావిస్తుంటే.. అక్షయ్‌ మాత్రం మూడు, నాలుగు సినిమాలు హ్యాపీ గా చేస్తాడు. అక్షయ్‌ సినిమాలకు సక్సెస్‌ రేటు ఎక్కువ. అతని  సినిమాలు అంటే ‘మినిమం గ్యారంటీ సినిమాలు’ అనే భావన దర్శక నిర్మాతల్లో ఉంది. ఇక రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా అక్షయ్ ‌టాప్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 117 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. అక్షయ్‌ మరోసారి తన రెమ్యూనరేషన్‌ని పెంచనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 2022లో చేయబోయే చిత్రాల కోసం అక్షయ్‌ ఏకంగా 135 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకోనున్నట్లు బీటౌన్‌ టాక్.

అక్షయ్‌ సినిమాల శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ కోసం 80-90 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రొడక్షన్‌ బడ్జెట్‌ వచ్చి 35-45 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక ప్రింట్‌, పబ్లిసిటీ కోసం మరో 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  రెమ్యూనరేషన్‌ కాకుండా అక్షయ్‌ సినిమా ఒవర్‌ ఆల్‌ బడ్జెట్‌ చూసుకుంటే 185-200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక ప్రతి సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మినిమం గ్యారంటీగా నిలుస్తూ.. సుమారు 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోంది. దాంతో‌ తన రెమ్యూనరేషన్‌ని భారీగా పెంచారు. ఇక అక్షయ్‌ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్‌ చేతిలో ‘సూర్యవంశి’, ‘అత్రాంగి రే’, ‘బెల్ బాటమ్’, ‘బచ్చన్ పాండే’, ‘రక్షా బంధన్’, ‘పృథ్వీరాజ్’, ‘రామ్ సేతు’ సినిమాలు ఉన్నాయి.

2020 అక్షయ్‌ సంపాదన 356 కోట్లు!…  అక్షయ్ కుమార్ ఎప్పుడూ సినిమాలు, బ్రాండ్‌ ప్రమోషన్లు అంటూ  ఫుల్‌ బిజీగా ఉంటారు. ఆయన సంపాదన కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. బాలీవుడ్‌ ‌లో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లో అక్షయ్‌ పేరు ఎప్పుడూ ఉంటుంది. ఏ స్టార్‌ సంపాదన ఎంత? టాప్‌ టెన్‌ ఎవరు? .. అంటూ ‘ఫోర్బ్స్‌ ‘మేగజీన్‌ ప్రతీ ఏడాది సర్వే నిర్వహిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆర్జిస్తున్న 100 సెలబ్రిటీలు అంటూ ఓ జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. ఈ జాబితాలో ఆయనది 52వ స్థానం. 2020కిగాను అక్షయ్‌ సంపాదన సుమారు 48.5 మిలియన్‌ డాలర్లు… అంటే 356 కోట్లు. ఈ జాబితాలో అమెరికా మేకప్‌ దిగ్గజం, రియాలిటీ టీవీ స్టార్‌ కైలీ జెన్నర్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆమె సంపాదన 590 మిలియన్‌ డాలర్లు.