యాక్షన్ క్వీన్, లేడీవిలన్ గా… క్రేజీ పాత్రల్లో

వైవిధ్యమైన చిత్రాలతో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది అమలా పాల్..కథ, అందులో తన పాత్ర నచ్చితే చాలు అమల వెంటనే సినిమాకు ఓకే చెప్పేస్తోంది. గత కొంతకాలంగా సినిమాల  రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆమె అవకాశాలను అందుకుంటోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న అమల ఇప్పుడు లేడీ విలన్‌గా మారుతోందట.ఇప్పటికే తెలుగు, తమిళ, మళయాళ భాషలలో 5 సినిమాలు ఓకే చేసిన అమలా ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ కమిట్ అయ్యింది. ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన నిజార్ షఫీ తొలిసారిగా మెగాఫోన్ పడుతూ తెలుగు, తమిళ్లో ఓ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేశాడు.
ఈ సినిమాలో ఇంతకుముందే నలుగురు హీరోయిన్లను ఎంపికచేశారు. నందిత శ్వేత, అదితి ఆర్య, శ్రద్ధ శ్రీనాథ్, అనీషా ఆంబ్రోస్ వంటి హాట్ బ్యూటీలు సినిమాలో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఐదవ హీరోయిన్‌గా అమలాపాల్ ఎంపికైంది. ఐదవ స్థానం అంటే ఏదో గెస్ట్ రోల్ కాదట. సినిమాలో ఆ పాత్రే హైలైట్ అని తెలిసింది. ఎందుకంటే పూర్తిగా విలన్ పాత్రలో ఆమె కనిపిస్తుందట. 1950 దశకం నాటి కాలంలో ఆ పాత్ర కొనసాగుతుందని సమాచారం.

 

పూర్తి స్థాయి యాక్షన్‌ ఓరియంటెడ్ రోల్‌  

ట్రెడిషనల్‌ రోల్స్‌తో పాటు గ్లామరస్‌ రోల్స్‌తో ఇన్ని రోజులు అభిమానులను అలరించిన అమలా పాల్‌ ఇప్పుడు యాక్షన్‌ గాళ్‌లా కనిపించనున్నారు. ‘అదో అంద పరవై పోల’ (‘అదిగో  ఆ పక్షి లాగా..’ అని అర్థం) అనే సినిమాలో ఆమె పూర్తి స్థాయి యాక్షన్‌ ఓరియంటెడ్ రోల్‌  చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆమె అగ్రెసివ్‌ లుక్‌ .. ఇప్పటివరకూ కనిపించిన అమలా పాల్‌ వేరు.. ఇప్పుడు కనిపించబోతున్న అమలా పాల్‌ వేరు అనేలా సినిమాకు సంబంధించిన ఆమె అగ్రెసివ్‌ లుక్‌ ఉంది.  ఇందులో ఫారెస్ట్‌లో చిక్కుకుపోయిన ఆమ్మాయిగా కనిపించనున్నారు అమలా పాల్‌.

సినిమాలో ఎక్కువ పోర్షన్‌ను కేరళ, ఆంధ్ర, తమిళనాడులోని దట్టమైన ఫారెస్ట్‌ ఏరియాలో షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు చిత్రబృందం. ప్రస్తుతం తమిళనాడులో షూటింగ్‌ చేస్తున్నారట. ‘‘ఫారెస్ట్‌లో హీరోయిన్‌ ఎలాంటి సిచ్యూవేషన్స్‌ ఎదుర్కొంది? వాటిని ధైర్యంగా అడ్డుకొని.. అందులోంచి ఎలా బయటపడింది? అనే కథాంశంతో రూపొందిన ఈ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది’’ అని పేర్కొన్నారు దర్శకుడు వినోద్ కేఆర్‌.