తెలుగులో తొలి త్రీడీ హర్రర్ అంజలి ’లిసా‘

అంజలి టైటిల్ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘లిసా’. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో వీరేశ్ కాసాని సమర్పణలో ఈ చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అతిథిగా విచ్చేసిన ’మా‘ మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ట్రైలర్‌ని విడుదల చేశారు. అనంతరం హీరోయిన్ అంజలితో కలిసి చిత్ర ఆడియో బిగ్ సీడీని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ’ఇది నా కెరీర్‌లో ప్రత్యేకమైన, ముఖ్యమైన సినిమా ఇది. మొదటిసారి 3డీలో హర్రర్ సినిమా చేస్తున్నా. ఇదొక భిన్నమైన అనుభూతినిచ్చింది. ఇందులో ఉన్న పాట నా కెరీర్ బెస్ట్ సాంగ్. సాంకేతికంగానూ ది బెస్ట్‌గా ఉంటుంది. ఆడియెన్స్‌కి ఖచ్చితంగా నచ్చే చిత్రమవుతుంది. సురేష్ కొండేటి నా సినిమాలని తెలుగులో విడుదల చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమా కూడా వాటి తరహాలోనే ఘనవిజయం సాధించాలి‘ అని అన్నారు.
అంజలి నటించిన ’షాపింగ్‌మాల్‘, ’జర్నీ‘ సినిమాలను తెలుగులో విడుదల చేయమని అంజలినే సూచించారు. ఆయా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమా కూడా ఆమెనే చెప్పారు. హర్రర్ జోనర్‌లో త్రీడీ సినిమా రావడం ఇదే తొలిసారి. తెలుగు ఆడియెన్స్‌కి బాగా నచ్చుతుందని, వారు ఎంజాయ్ చేస్తారని ఈ చిత్ర హక్కులు తీసుకున్నా.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది. ఈ సమ్మర్‌కి మరో బ్లాక్ బస్టర్ అవుతుంది‘ అని నిర్మాత సురేష్ కొండేటి చెప్పారు.
శివాజీరాజా మాట్లాడుతూ.. ’అంజలి తెలుగమ్మాయి కావడం మన అదృష్టం. ఆమె తమిళంలో బాగా రాణిస్తున్నారు. మన తెలుగమ్మాయిని మనం కూడా ఆదరించాలి. సురేష్ కొండేటి 25 ఏండ్లుగా తెలుసు. అప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలానే ఉన్నాడు. తను ఎందులోకి అడుగు పెట్టినా సక్సెస్ అవుతాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి‘ అన్నారు.
’తెలుగులో నాకిది మొదటి సినిమా. అంజలి టైటిల్ పాత్రలో ఆకట్టుకుంటారు. రియల్ త్రీడీలో చేసిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. పి.జి.ముత్తయ్య కెమెరా వర్క్, సంతోష్ దయానిధి సంగీతం హైలైట్‌గా నిలుస్తాయి‘ అని చిత్ర దర్శకుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముప్పలనేని శివ, చిట్టిబాబు, జే.కే.భారవి, వాసు తదితరులు పాల్గొన్నారు.
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నఈ చిత్రానికిసినిమాటోగ్రాఫర్: పి.జి.ముత్తయ్య,మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి’ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,కోరియోగ్రఫీ: సురేష్,ఆర్ట్ డైరెక్టర్: వినోద్,ఈ చిత్రానికి నిర్వహణ : , శ్రీనివాస్ గొండేల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రహాస్ ఇప్పలపల్లి, సమర్పణ వీరేశ్ కాసాని , నిర్మాత సురేష్ కొండేటి, కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్,