అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ‘నిశ్శ‌బ్దం’ జ‌న‌వ‌రి 31న

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ `నిశ్శ‌బ్దం` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ గా నిలిచిన అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో..హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31, 2020లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.
 
నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ… “ఈ క‌థ హేమంత్ మ‌ధుక‌ర్ రూపంలో న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చింది. ‘నిన్నుకోరి’ సినిమా విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. క‌థ మ‌నల్ని క‌దిలిస్తే .. అది సినిమా అవుతుంది. హేమంత్ చెప్పిన పాయింట్ వింటే ..అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నిపించింది. మా ప్ర‌యాణంలో అనుకోని మంచి ఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి…ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు విశ్వ‌ప్ర‌సాద్‌గారు దొరికారు. మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించిన తొలి తెలుగు సినిమా ఇదే. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ కూడా పనిచేశారు. ఇదొక ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్ట్ అని చెప్ప‌లేను కానీ.. ఎగ్జాంపుల‌ర్ ప్రాజెక్ట్.
 
అనుష్క చాలా సెల‌క్టివ్‌గా సినిమాలు చేస్తుంది. ముందు ఈ సినిమాలో వేరే హీరోయిన్‌ను అనుకున్నాం. ముంబై నుండి వ‌స్తున్న స‌మ‌యంలో అనుష్క ఫ్లైట్‌లో క‌న‌ప‌డింది. ఆ స‌మ‌యంలో నేను అనుష్క‌కి ఈ క‌థ చెప్తే .. చాలా ఎగ్జ‌యిట్ అయ్యింది. అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడ‌లేదు. చెవులు విన‌ప‌డ‌వు. త‌న యాంగిల్‌లో క‌థ ర‌న్ అవుతుంది కాబ‌ట్టే.. ఈ సినిమాకు `నిశ్శ‌బ్దం` అనే పేరు పెట్టాం. `నిన్నుకోరి` త‌ర్వాత గోపీసుంద‌ర్ గొప్ప ఆల్బ‌మ్‌ను ఈ సినిమాకు ఇచ్చాడు. ఈ క్రెడిట్ అంతా హేమంత్‌కే ద‌క్కుతుంది“ అన్నారు.
 
నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ…“నిన్నుకోరి` సినిమా నుండి కోన వెంక‌ట్‌గారితో అనుబంధం ఉంది. టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాష‌న్‌తో ఈ రంగంలోకి వచ్చా. హాలీవుడ్ రేంజ్‌లో ఓ సినిమా చేయాల‌నుకునేవాడిని. నేను ఇదే విష‌యాన్ని కోన‌వెంక‌ట్‌గారితో కలిసి డిస్క‌స్ చేశాను. ఇండియన్ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్‌తో సినిమా తీయాల‌ని అనుకున్నాం. హాలీవుడ్ స్టైల్‌లో ఉండే ఇండియ‌న్ మూవీ ఇది. జ‌న‌వ‌రి 31న దీన్ని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
 
డైరెక్ట‌ర్ హేమంత్ మ‌ధుక‌ర్ మాట్లాడుతూ – “నేను, కోన‌గారు క‌లిసి ప్రయాణించే క్ర‌మంలో విశ్వ‌గారితో ప‌రిచ‌య‌మైంది. అంత కో ఆప‌రేటివ్ ప్రొడ్యూస‌ర్ నాకు దొర‌క‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనుష్కగారు మూడు నాలుగు నెల‌లు క‌ష్ట‌ప‌డి సైన్ లాంగ్వేజ్‌, పెయింటింగ్ నేర్చుకున్నారు. హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్‌గారు.. ట‌ఫ్ కాప్ రోల్అంజ‌లిగారు …వైర‌టీ పాత్ర‌లో సుబ్బ‌రాజుగారు చ‌క్క‌గా చేశారు.. టెక్నిక‌ల్‌గా ఇదొక కొత్త చిత్రం, ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.
 
అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్.