అందుకు కారణం నటిగా నేను మారడమే !

‘కెరీర్‌ మొదట్లో బబ్లీ రోల్స్‌ చేశాను. అలాంటి పాత్రల విషయంలో రియలైజ్‌ అయ్యాను. ఇకపై నటనకు స్కోప్‌ ఉన్న శక్తివంతమైన పాత్రలకే ప్రయారిటీ ఇస్తాను’ అని అంటోంది అనుష్క శర్మ. 2008లో ‘రబ్‌ నే బనా ది జోడి’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనుష్క ఆ తర్వాత ‘బద్మాష్‌ కంపెనీ’, ‘బ్యాండ్‌ బాజా బారత్‌’, ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ వంటి చిత్రాల్లోని బబ్లీ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ మధ్య విడుదలైన ‘సుల్తాన్‌’, ‘ఎన్‌హెచ్‌10’, ‘బాంబే వాల్వెట్‌’, ‘ఫిల్హౌరి’ వంటి చిత్రాల్లో శక్తివంతమైన పాత్రలు పోషించి తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజాగా షారూఖ్‌తో నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్రం ఇటీవల విడుదలయ్యింది.

ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ…. ‘మన గురించి మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో చాలా వరకు శక్తివంతమైన నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు కనిపించాలి. అలాంటి సినిమాలు, పాత్రలు నాకు ఇప్పుడొస్తున్నాయి. అందుకు కారణం నటిగా నేను మారడమే. బబ్లీ రోల్స్‌ విషయంలో నేను రియలైజ్‌ అయ్యాను. అవి ఎక్కువ చేయకూడదనిపించింది. అయితే ఈ మార్పును చూసి నా చుట్టూ ఉన్నవాళ్ళు మరోలా అర్థం చేసుకుని కన్‌ఫ్యూజన్‌లో తప్పుగా భావిస్తున్నారు. ఇది నాలో సడన్‌గా వచ్చిన మార్పు కాదు. అనుభవంతో సహజంగానే వచ్చిన మార్పు’ అని తెలిపింది. అనుష్క ప్రస్తుతం ‘పరి’, సంజయ్ దత్‌ బయోపిక్‌ , ఆనంద్‌ ఎల్‌.రాయ్  దర్శకత్వంలో తెరకెక్కబోయే
చిత్రంలోనూ నటిస్తోంది.