అనుష్క శెట్టి ‘నిశ్శ‌బ్దం’ ఏప్రిల్ 2న

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ `నిశ్శ‌బ్దం` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ సినిమా చిత్రీకరణ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.
ఈ క్రాస్ జోన‌ర్ చిత్రంలో సాక్షి అనే డిఫ‌రెంట్ పాత్ర‌లో అనుష్క మెప్పించ‌నున్నారు. అలాగే మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల , మైకేల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ పాత్ర‌ల లుక్స్‌తో పాటు ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచింది.
 
అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల