15న ఎం.ఎం. అర్జున్‌ ‘ప్రేమపందెం’

ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థల అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా, ‘జబర్‌దస్త్‌’ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబశివ హీరోగా, మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌ వారి నుండి ‘యు.ఎ’ సర్టిఫికెట్‌ పొందింది. ఈనెల 15వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియాకు వివరాలు తెలియజేశారు.
ముందుగా నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారినీ అలరించే కంటెంట్‌తో నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. దర్శకుడు అర్జున్‌ ప్రతి క్యారెక్టర్‌ పట్ల చాలా శ్రద్ధ తీసుకుని డిజైన్‌ చేశారు. అలాగే కామెడీతో పాటు ఎమోషన్స్‌, ఫ్యామిలీడ్రామా, ప్రేమ ఇలా నవరసాలను సముపాళ్లలో రంగరించి కథను తయారు చేశారు. నాకు ఏది.. ఎలా చెప్పాడో అలాగే తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు వెంకట్‌ యస్‌.యు.వి. అద్భుతమైన స్వరాలు ఇచ్చారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. యూత్‌ వాటికి బాగా కనెక్ట్‌ అయ్యారు. సినిమా మీద ఉన్న నమ్మకంతోనే స్వంతంగా విడుదల చేస్తున్నాం. లాభ, నష్టాలను కాకుండా మంచి సినిమా తీయానే ఆకాంక్షతో మేం చేసిన ప్రయత్నం ‘ప్రేమపందెం’. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ‘యు.ఎ’ సర్టిఫికెట్‌ వచ్చింది. ఈనెల 15న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదల చేస్తున్నాం అన్నారు.
హీరోల్లో ఒకరైన ‘జబర్ధస్త్‌’ వినోద్‌ మాట్లాడుతూ.. ఇందులో నాది ఫుల్‌లెంగ్త్‌ కామెడీ రోల్‌. నలుగురు హీరోల్లో ఒకరిగా చేస్తున్నాను. ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మాయి వేషంలో వెళ్లి విలన్‌ చేతిలో చిక్కే పాత్ర. ప్రతి సీన్‌ ఉత్కంఠను రేపుతూ ఉంటాయి. నిర్మాత లక్ష్మీనారాయణగారు మంచి వ్యక్తి. ‘మంచి సినిమా తీయాలి’ అన్నది ఆయన తపన. ఆయన తపనకు తగ్గట్టుగా దర్శకు ఎం.ఎం. అర్జున్‌ గారు మంచి కంటెంట్‌ను తీసుకున్నారు. అందరితోనూ కలిసి మెలిసి ఉండే సౌమ్యుడు. ఒక్క ముక్కలో చెప్పాంటే ఈ సినిమా యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అన్నారు.
దర్శకుడు ఎం.ఎం. అర్జున్‌ మాట్లాడుతూ.. ‘ప్రేమపందెం’ అంటే కేవం యూత్‌ సినిమానే కాదు. ఇందులో అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. నా కథను నమ్మి స్వంతంగా విడుదల చేసేంత వరకూ వచ్చిన నిర్మాత లక్ష్మీనారాయణ గారికి  కృతజ్ఞతలు. యూనిట్‌ అందరికీ మంచి బ్రేక్‌ను ఇస్తుందని ఖచ్చితంగా చెప్పగలను అన్నారు.
హీరో సాంబశివ, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తమకు ఈ చిత్రంలో అవకాశం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి కథ, కథనాలతో కూడిన ‘ప్రేమపందెం’ చిత్రం తమ కెరీర్‌కు మంచి పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శ్రవణ్‌ కీలక పాత్రలో నటిస్తుండగా, సునీత, చైతన్య, దేవిక, శ్రీలేఖ, కోట శంకర్రావు, బస్టాప్‌ కోటేశ్వరరావు, సీనియర్‌ వినోద్‌, సుజాత, ధర్మతేజ, హాసిని, ఓబయ్య మొదలగువారు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటు: ఓబుయ్య, ఎడిటింగ్‌: సంతోష్‌, సంగీతం: వెంకట్‌ ఎస్‌.వి.యు., రీరికార్డింగ్‌: మహీధన్‌, కొరియోగ్రఫీ: శామ్యూల్‌, కెమెరా: అమర్‌ జి., సహకారం శరత్‌సాగర్‌, కో ప్రొడ్యూసర్‌: ఓబయ్య సోమిరెడ్డిపల్లె, కో డైరెక్టర్‌: గణేష్‌ ముత్యాల. పి.ఆర్‌.ఓ: ‘సింహాసనం’ సురేష్‌, నిర్మాత: ఎం. లక్ష్మీనారాయణ, కథ, కథనం, దర్శకత్వం: ఎం.ఎం. అర్జున్‌.