‘అవతార్‌’ను దాటి వసూళ్ళలో ‘అవెంజర్స్‌’ కొత్త రికార్డు

‘అవెంజర్స్‌ ఎండ్ గేమ్’  కొత్తరికార్డులను సృష్టించింది.బాక్సాఫీస్‌ వద్ద భారీ ఎత్తున కాసులు కురిపించింది. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.ఇప్పటి వరకూ ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన ‘అవతార్‌’ రికార్డులను తిరగరాసి అవెంజర్‌ తనకో కొత్త పేజీని లిఖించుకుంది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కూడా ఈ చిత్రమే ఎక్కువగా కాసులు కురిపించిన చిత్రంగా నిలివడం విశేషం.
సూపర్‌ హీరోల సినిమాలకు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉంటుందో ‘అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌’ రికార్డు చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా ఒక్కటే కాదు ఈ ప్రాంచైజీలో వచ్చిన చిత్రాలన్నీ ఇంచుమించు ఇటువంటి కలెక్షన్లే రాబట్టాయి. కానీ మొదటి మూడు సూపర్‌ హీరోల చిత్రాలనూ మించి ‘ఎండ్‌గేమ్‌’ కాసులు కురిపించింది. ‘అవెంజర్‌ ఎండ్‌గేమ్‌’ తొలిసారి విడుదలైనప్పుడు ‘అవతార్‌’ చిత్రం రికార్డులను తిరగరాయడం అంత తేలిక్కాదని విశ్లేషకులు అంతా చెప్పారు. కానీ ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాలను జత చేసి జూన్‌ 14న ఈ సినిమాను మారోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతుంది.
2.790 మిలియన్‌ డాలర్ల వసూళ్లు
మోజో బాక్సాఫీస్‌ లెక్కలు ప్రకారం తాజాగా ‘అవెంజర్స్‌’ 2.790 మిలియన్‌ డాలర్ల కలెక్ట్‌ చేసింది. అవతార్‌ లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ 2.788 బిలియన్‌ డాలర్లు. ఈ చిత్రాన్ని అవెంజర్స్‌ : ఇన్ఫిటినీ వార్‌, క్యాప్టెన్‌ అమెరికా : సివిల్‌ వార్‌, క్యాప్టెన్‌ అమెరికా : ది వింటర్‌ సోల్డర్స్‌ వంటి చిత్రాలను రూపొందించిన జోయీ, అంటోని రుస్సో దర్శకత్వం వహించారు. అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌తో కలపి మొత్తంగా నాలుగు భాగాలుగా ఈ ప్రాంచైజీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌’లో రోబర్ట్‌ డోనీ, క్రిస్‌ ఈవెన్స్‌, మార్క్‌ రఫలో, క్రిస్‌హేమస్‌వర్త్‌, స్కార్‌లెట్‌ జాన్స్‌న్‌, జెరెమీ రెన్నార్‌, డన్‌ చీడ్లె, పాల్‌ రుడ్‌, బ్రియీ లార్సన్‌, కరీన్‌ జిలాన్‌, దనై గురియా, బ్రాడ్లీ కూపర్‌(వాయిస్‌ రోల్‌), జోష్‌ బ్రోలిన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
ప్రపంచంలోనే అత్యధికం : ‘అవెంజర్స్‌ :ఎండ్‌గేమ్‌’ ‘అవతార్‌’ కలెక్షన్లు దాటి కొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రపంచం వ్యాప్తంగా ‘అవతార్‌’కి 2.788 బిలియన్‌ డాలర్లు వస్తే ‘అవెంజర్స్‌ :ఎండ్‌గేమ్‌’ 2.790 బిలియన్లు డాలర్లు రాబట్టింది. అవెంజర్స్‌ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ఇంకా ప్రదర్శితమవుతోంది.
భారత్‌లోనూ అవెంజర్స్‌ : ‘బాలీవుడ్‌ హంగామా’ లెక్కలు ప్రకారం మన దేశంలో అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌దే అత్యధిక కలెక్షన్లు. తొలి రోజు నుంచి భారీ ఎత్తున బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించింది. ఏకంగా రూ.373.22 కోట్లు కలెక్ట్‌ చేసింది. రూ. 227.43 కోట్లతో రెండో స్థానంలో ‘అవెంజర్స్‌ : ఇన్పినిటీ వార్‌ నిలిచింది.
స్టార్స్‌ వార్స్‌ : ది ఫోర్స్‌ అవెకన్‌ అత్యధికంగా 119 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లతో నార్త్‌ అమెరికాలో ఇప్పటి వరకూ తొలి సినిమాగా నిలిస్తే… ఆ రికార్డులను ‘అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌’ 156 మిలియన్‌ డాలర్లతో రికార్డు సృష్టించింది.
 
దేశీయంగా మొదటి స్థానం : హాలీవుడ్‌ చిత్రమైన ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ నార్త్‌ అమెరికాలో దేశీయంగా 357 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసి ముందు స్థానంలో నిలిచింది. 100 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉన్న ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌ను వెనక్కి నెట్టేసింది.
 
ప్రపంచ వ్యాప్తంగా కొత్త చరిత్ర : ఈ సినిమా విడుదల నాడు భారీ ఎత్తున ఓపినింగ్స్‌ లభించాయి. తొలి రోజు 1.2 బిలియన్‌ డాలర్ల కలెక్షన్లతో ఈ చిత్రం అత్యధిక కాసులు కురిపించిన సినిమాగా రికార్డుకెక్కింది. అంతేగాకుండా అత్యంత వేగంగా 500 మిలియన్‌, 1 బిలియన్‌, 1.5 బిలియన్‌, 2 బిలియన్‌, 2.5 బిలియన్‌ డాలర్లు మైలురాయిలను 20 రోజుల్లో దాటిని సినిమాగానూ కొత్త చరిత్రలెక్కించింది. ఈ రికార్డులను ‘అవతార్‌’ సాధించడానికి 72 రోజులు పట్టింది.