బాలకృష్ణ, బోయపాటి ‘అఖండ’ ఆఖరు షెడ్యూల్‌!

బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్‌లో  తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  బాలకృష్ణను అఖండగా పరిచయం చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇంకా సోషల్ మీడియలో దూసుకెళ్తోంది.

హైద్రాబాద్‌లో ‘అఖండ’ చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌తో అఖండ షూటింగ్ పూర్తి కానుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.  రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా  వ్యవహరిస్తున్నారు. సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : సీ రాం ప్రసాద్, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు