బాల‌కృష్ణ.. కె.ఎస్‌.ర‌వికుమార్ `రూల‌ర్‌` డిసెంబ‌ర్ 20న

`రూల‌ర్‌`… ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు శ‌క్తిమంత‌మైన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ‘జై సింహా’ వంటి హిట్ చిత్రం త‌ర్వాత బాల‌కృష్ణ‌.. కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌కావ‌డంతో ‘రూల‌ర్‌’పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. సినిమాను డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌మోష‌న్ల‌ను కూడా భారీగా చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘పాట‌ల లిరిక‌ల్ వీడియో’ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న`రూల‌ర్‌`లో ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ లుక్స్.. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సోనాల్ చౌహన్, వేదిక‌, ప్రకాశ్ రాజ్‌, జ‌య‌సుధ‌, భూమిక చావ్లా,ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
కో- ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు, కథ: పరుచూరి మురళి