‘ఇది క‌దా మ‌న ఏరియా’ అనిపించింది !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ బ్యాన‌ర్‌పై శ్రీమ‌తి సురేఖ కొణిద‌ల స‌మ‌ర్ప‌ణ‌లో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`. సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  చిరంజీవితో ఇంట‌ర్వ్యూ….

మీ సినిమా ఆడియో వేడుక‌కు, గ‌తంలో జ‌రిగిన వాటికి తేడా ?

గ‌తంలో ఏదైనా ఫంక్ష‌న్ చేస్తే అభిమానులు, ప్రేక్ష‌కులు వేల‌ల్లో వ‌చ్చేవారు. ఇప్పుడు ఫంక్ష‌న్ అంటే ల‌క్ష‌ల్లో వ‌స్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి పోలీసుల లెక్క‌ల ప్ర‌కారం రెండు ల‌క్ష‌ల‌కు పైగా జ‌నం వ‌చ్చార‌ని తెలిసింది. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత నా సినిమా ఫంక్ష‌న్ భారీగా జ‌ర‌గ‌డం చాలా హ్యాపీగా అనిపించింది.

కాజ‌ల్ చ‌ర‌ణ్ తో న‌టించిన  త‌ర్వాత మీతో చేసింది ?

న‌వ్వుతూ …ఇలాంటివి సినిమాల్లో జ‌ర‌గ‌లేదు. అరుదుగానే జ‌ర‌గుతుంటాయి. అయితే ఆడియెన్స్ యాక్టెప్టెన్స్ అనేదే ఎలా ఉంటుందోనని  అనుకున్నాం. కానీ. ‘మా పెయిర్ చూడ‌డానికి బాగుంది’ అని అంద‌రూ యాక్సెప్ట్ చేయ‌డం హ్యాపీగా అనిపించింది.

మీ 150వ సినిమాకి రీమేక్ ని ఎంచుకోవ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉందా….?

ముందుగా స్ట్రెయిట్ స్టోరీతో సినిమా చేయాలని క‌థ‌లను చాలా విన్నాను. ఇప్పుడు నేను చేసే సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు సోష‌ల్ మెసేజ్ ఉండాలి అనుకున్నాను. ఠాగూర్, స్టాలిన్ త‌ర‌హాలో ఉండే సినిమా చేయాలి అనుకున్నాను. ఆ టైమ్ లో త‌మిళ మూవీ ‘క‌త్తి’ చూశాను. నాతో పాటు అంద‌రికీ సంతృప్తిక‌రంగా అనిపించింది. ఈ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అనిపించింది చేశాం. అయితే ప‌ర్టికుల‌ర్‌గా ఈ టైమ్ లోనే 150వ సినిమా చేయాలి అని ముందుగా ఏమీ అనుకోలేదు. రాజ‌కీయంగా స్ధ‌బ్ధ‌త ఉన్న టైమ్ లో సినిమాలోకి రమ్మ‌ని మిత్రులు, శ్రేయోభిలాషులు అన‌డం…ముఖ్యంగా అమితాబ్, ర‌జ‌నీకాంత్ లు కూడా న‌న్ను సినిమా చేయ‌మ‌న్నారు. అందరూ ఇంత‌లా చెబుతుంటే ఎందుకు చేయ‌కూడ‌దు అనిపించే సినిమా చేశాను. ‘శంక‌ర్ దాదా జిందాబాద్’ త‌ర్వాత నేను హీరోగా చేసిన సినిమా ఇది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ షూటింగ్ విష‌యంలో పెద్ద‌ తేడా ఏమీ క‌నిపించ‌లేదు. కాక‌పోతే షూటింగ్ కి వెళ్లిన‌ప్పుడు ‘ఇది క‌దా మ‌న ఏరియా’ అనిపించింది. ఫ‌స్ట్ నుంచి చాలా కాన్పిడెంట్ గానే ఉన్నాను కానీ..ఎప్పుడూ టెన్ష‌న్ ఫీల‌వ‌లేదు.

‘క‌త్తి’ కి  ‘ఖైదీ నెం 150’కి ఏమైనా మార్పులు ?

క‌త్తిలో అస‌లు కామెడీ ఉండ‌దు. ఇందులో కామెడీ యాడ్ చేశాం. అలాగే సాంగ్స్ ను కూడా సిట్యూవేష‌న్ త‌గ్గ‌ట్టు ఉండేలా చేశాం.ఇలా మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేసాం. అలాగే డైలాగ్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం.

ఫిట్‌నెస్ విష‌యంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?

నా ఇంట్లోనే ట్రైన‌ర్ ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్. నేను ఎలా ఉండాలో చ‌ర‌ణే కేర్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూస‌ర్ కాబ‌ట్టి త‌న సినిమా హీరో బాగా క‌నిపించాల‌ని ఆ ర‌కంగా కేర్ తీసుకున్నాడు.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో నాగ‌బాబు వ్యాఖ్య‌లు ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ ?

సాధార‌ణంగా అలా అంటే ఎవ‌రైనా హార్ట్ అవుతారు. మేం కూడా హార్ట్ అవుతాం. అలాగే నాగ‌బాబు హార్ట్ అయ్యాడు. ఆ వేదిక పై త‌న అభిప్రాయం చెప్పాడు. ఆ వేదిక క‌రెక్టా అంటే ఇలాంటి సంద‌ర్భాలు, మాట్లాడే సిచ్యువేష‌న్స్ మ‌ళ్లీ ఎప్పుడో రావ‌చ్చు. అందుచేత నాగ‌బాబు అలా రెస్పాండ్ అయ్యాడు

ఖైదీ నంబ‌ర్ 150, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి రిలీజ్ లో  అభిమానుల  పోటీ  ?

బాల‌కృష్ణ సినిమా ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ ప్రారంభోత్స‌వంకు నేను వెళ్లాను. ‘సోద‌రుడు బాల‌కృష్ణ సినిమా విజ‌యం సాథించాలి’ అని చెప్పాను. 100వ సినిమాకి అలాంటి చారిత్రాత్మ‌క క‌థ‌ను ఎంచుకోవ‌డంలోనే తొలి విజ‌యం సాధించిన‌ట్టు అని చెప్పాను. సంక్రాంతికి వ‌చ్చే అన్ని సినిమాలు విజ‌యం సాధించాలి అని కోరుకుంటున్నాను.

సినిమా కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారా..?

నిజం చెప్పాలంటే మా అమ్మాయి పెళ్లి సంద‌ర్భంగా జ‌రిగిన‌ సంగీత్ కార్య‌క్రమంలో ఓ అర‌నిమిషం పాటు డ్యాన్స్ చేశానే త‌ప్పా ఎక్క‌డా చేయ‌లేదు. అయితే ఎక్క‌డ‌న్నా మంచి ట్యూన్ వింటే ‘రేసుగుర్రం’లో శృతిహాస‌న్ లా పైకి డ్యాన్స్ చేయ‌పోయినా, లోప‌ల మాత్రం డ్యాన్స్ చేసేవాడిని. ఖైదీ నంబ‌ర్ 150 చిత్రంలో లారెన్స్ మ‌ళ్లీ వీణ స్టెప్ చేయించాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో  సినిమాలు తెలుగులో ఎందుకు రావ‌డం లేదు..?

వెంక‌టేష్ ‘గురు’ చేస్తున్నాడు క‌దా..! కాక‌పోతే బాలీవుడ్ లో వ‌చ్చినంత‌గా తెలుగులో రావ‌డం లేదు దానికి కార‌ణం ఏమిటంటే…అలాంటి క‌థ‌లు స్టార్స్ కి చెప్ప‌క‌పోవ‌డ‌మే.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం… ?

కోర్టు ఆర్డర్ గురించి తెలుసుకోకుండా ముందు అనుమ‌తి ఇచ్చారు ఆ త‌ర్వాత తెలుసుకోవ‌డంతో క్యాన్సిల్ అయ్యింది. అంతే త‌ప్పా, దీనికి వెన‌క ప్ర‌చారంలో ఉన్న‌ట్టు రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయని నేను అనుకోవ‌డం లేదు.

చ‌ర‌ణ్ కెరీర్ ఎలా ఉంది అనుకుంటున్నారు…?

చ‌ర‌ణ్ కెరీర్ ను బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎంత ఆడింది అనేది కాదు మంచి సినిమాలు డిఫ‌రెంట్ సినిమాలు చేయాలి అనుకుంటున్నాడు. అలా ఆలోచించే ‘గోవిందుడు అంద‌రివాడేలే’ సినిమా చేశాడు. ‘ధృవ’ సినిమాలో చాలా ఇన్‌టెన్స్ యాక్టింగ్‌ నాకు చాలా బాగా న‌చ్చింది. చ‌ర‌ణ్ కెరీర్ విష‌యంలో హ్యాపీ.

ఇంకా చేయాల‌నుకుంటున్న‌పాత్ర‌లు ఏమిటి..?

ఎన్ని పాత్ర‌లు చేసినా ఇంకా ఏదో చేయాల‌ని ఉంటుంది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు చ‌నిపోయే వ‌ర‌కు న‌టిస్తూనే ఉన్నారు. ప్ర‌తి ఆర్టిస్టు చ‌నిపోయే వ‌ర‌కు న‌టించాల‌నే అనుకుంటాడు. అయితే…ప్రేక్షకులు మ‌నం తెర పై క‌న‌ప‌డితే ఎంజాయ్ చేసేలా ఉండాలి కానీ…వీడు ఇంకా న‌టిస్తున్నాడా అనిపించుకోకూడ‌దు.

ఖైదీ నెం 150 ఫ‌స్ట్ డే ఎంత క‌లెక్ట్ చేస్తుంది..?

నేను రికార్డ్స్ గురించి ప‌ట్టించుకోను. ఆ విష‌యంలో నాకు జీరో నాలెడ్జ్. క‌లెక్ష‌న్లు, రికార్డుల లెక్క‌లు చ‌ర‌ణ్ చూసుకుంటాడు.

త‌దుప‌రి చిత్రాలు..?

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ అనే క‌థ రెడీ చేస్తున్నారు. ‘ధృవ’ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఓ డిఫ‌రెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. బోయ‌పాటి శ్రీను 152వ సినిమా కోసం క‌థ రెడీ చేస్తున్నాడు.