ఎదుగుతున్న రచయితలకు ఇది సువర్ణావకాశం !

‘సినీస్తాన్ ఇండియాస్‌ స్టోరీ టెల్లర్‌ స్క్రిప్ట్‌ కాంటెస్ట్‌’ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలిపొందిన మొదటి విజేతకు రూ.50లక్షలు, రెండో విజేతకు రూ.25లక్షలు నగదును బహుమతిగా ఇవ్వనున్నారు. దర్శకులు కావాలని కలలు కని… కథలు రాసి సిద్ధంగా ఉన్నవారికి, కథా రచయితగా కెరీర్‌ను కోరుకునేవారికి ఓ సువర్ణ అవకాశం.ఇప్పటికే మొదటి ఎడిషన్‌ పూర్తయింది. ఇప్పుడు రెండో ఎడిషన్‌కు ఎంట్రీలు ఆహ్వానిస్తున్నారు. భారత దేశంలో ఇటువంటి పోటీలు ఇప్పటి వరకూ ఎవ్వరూ పెట్టలేదు. ఇదే దేశంలో అతి పెద్ద కాంటెస్ట్‌ కూడా. దీనికి విశేష స్పందన లభిస్తోంది. మొదట ఎడిషన్‌కు దేశం మొత్తం మీద నాలుగు వేల ఎంట్రీలు వచ్చాయి. రెండో దఫా ఎంట్రీలకు ఆహ్వానిస్తున్నట్టు జ్యూరీ సభ్యుడైన అమిర్‌ ఖాన్‌ ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు… ఈ పోటీల్లో గెలిపొందిన మొదటి విజేతకు రూ.50లక్షలు, రెండో విజేతకు రూ.25లక్షలు నగదును బహుమతిగా ఇవ్వనున్నారు. కంటెంట్‌ రైటర్‌కు మాత్రం ఇదో పెద్ద సువర్ణావకాశం అని చెప్పాలి.నటుడు అమిర్‌ ఖాన్‌, దర్శకుడు రాజ్‌ హిరాణి, స్క్రీన్‌ రైటర్‌ జుహి చతుర్వేది, అంజుమ్‌ రజబలీ ఈ కాంటెస్ట్‌కు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
అమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ… ” కంటెంట్‌ రైటర్స్‌ కోసం గత ఏడాది ఈ పోటీలను ప్రకటించారు. విశేషమైన స్పందన లభించింది. దేశం మొత్తం రచయితల నుంచి ఎంట్రీలు వచ్చాయి. రెండో ఎడిషన్‌ కాంటెస్ట్‌ను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కంటెంట్‌ రైటర్‌గా నిరూపించుకోవానుకునేవారందరికీ ఇదే అవకాశంగా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నా’ అని అన్నారు.
ఈ కాంటెస్ట్‌ ఛైర్మన్‌ రోహిత్‌ ఖత్తర్‌ మాట్లాడుతూ… ” ఇప్పటి వరకూ పాల్గొన్న రచయితలకు ధన్యవాదాలు. దేశంలో రచయితలను పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ కాంటెస్ట్‌ పెడుతున్నాం’ అని అన్నారు.
జ్యూరీ చైర్‌పర్సన్‌ అంజుమ్‌ రజబలీ మాట్లాడుతూ… ” ప్రస్తుతం మొదటి ఎడిషన్‌కు సంబంధించి స్క్రిప్ట్‌ షార్ట్‌ లిస్టును తయారు చేసే పనిలో ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం చాలా పారదర్శకంగా జరుగుతుంది’ అని చెప్పారు. స్క్రిప్ట్‌ రైటర్స్‌ తమ కథలను సినీస్తాన్‌.కామ్‌ వెబ్‌సైట్‌కు పంపాలని తెలిపారు.
                                       https://scriptcontest.cinestaan.com/