వాస్తవికత, వినోదాల ‘బ్రాందీ డైరీస్’ ట్రైలర్ లాంచ్ !

వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే “బ్రాందీ డైరీస్”. వ్యక్తిలోని వ్యసన స్వభావం , దానివల్ల వచ్చే సంఘర్షణ, సహజమైన సంఘటనలు, పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ..  గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా  కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మిత్ర బృందం నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా  జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇచ్చారు. సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ లాంచ్  కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ హాజరయ్యారు.
దర్శకుడు శివుడు మాట్లాడుతూ… “ఆల్కహాల్ తాగితే  వచ్చే ఇబ్బందులు ఏమిటి, ఎంత  నస్టం జరుగుతుందనే  విషయాన్ని ఈ చిత్రం ద్వారా  తెలియజేస్తున్నాం.ఈ సినిమా కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని “బ్రాందీ డైరీస్” టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు  బ్రాందీ(అల్కాహాల్) మీదనే కథ నడుస్తుంది .  నటీనటులు  అందరూ 60 రోజులు వర్క్ షాప్ చేశారు. పెంచల్ దాస్ గారు రాసి పాడిన పాట బాగా పాపులర్ అయ్యింది. మూడు పాటలు ఉంటాయి” అన్నారు.
నిర్మాత లేళ్ల శ్రీకాంత్  మాట్లాడుతూ.. “సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది.  కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా   ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
“బ్రాందీ డైరీస్ మంచి కథబలం ఉన్న సినిమా. ఇది అర్జున్ రెడ్డి లాంటి సినిమా. డైరెక్టర్ విసుగు రాకుండా ఆడియన్స్ ని  కూర్చోబెట్టేలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. యూత్ కోసం తీసిన సినిమా ఇది. వైజాగ్ లో చిన్న సినిమాలకు శంకర్ బెస్ట్ డిస్ట్రిబ్యూటర్. అతను ఈ సినిమాను వైజాగ్ , ఈస్ట్ లో విడుదల చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ రిలీజ్ రోజే సినిమాను రిలీజ్ చేయమని సలహా ఇచ్చాను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది”అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… ” సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. అద్భుతమైన టైటిల్ ఇది. చిన్న సినిమాల మధ్య వచ్చి ఇబ్బంది పడకుండా పెద్ద సినిమాతో వస్తే కొన్ని థియేటర్స్ లభిస్తాయి. ఏప్రిల్ 10 న వస్తే బెటర్ గా ఉంటుందని నా సలహా “అన్నారు.
హీరో శేఖర్, హీరోయిన్ సునీత సద్గురు, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంగీతం : ప్రకాష్ రెక్స్, సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్ ,ఎడిటర్: యోగ శ్రీనివాస్