మే 20 న డా.రాజశేఖర్ ఫ్యామిలీ ఎమోషనల్ ‘శేఖర్’

డా. రాజశేఖర్ “శేఖర్”. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు.ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు.

దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… మాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా “శేఖర్”. కోవిడ్ తరువాత ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషనల్ బాధలను ఇందులో చూస్తారు.  ప్రేక్షకులు ఎప్పుడు ఎమోషన్ ఫిలిమ్స్ ఆదరిస్తూ వస్తున్నారు.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్ గా అవుతారు. ఈ సినిమా లో రాజశేఖర్ గారి కూతురు పాత్రలో శివాని నటించింది,  వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా సెంటిమెంటల్ గా ఉంటాయి.  మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ… గరుడవేగ, కల్కి వంటి మంచి హిట్ సినిమాలు చేసిన తరువాత, మేము ఒక సినిమా చూశాము. చాలా బాగుంది. అని జీవిత గారు చెప్పినప్పుడు…  నా పార్టనర్ బీరం సుధాకర్ తో కలిసి ఈ సినిమాను మేమే ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారి డిఫరెంట్ గెటప్ తో ఎమోషన్, యాక్షన్,సెంటిమెంట్ ఉన్న మంచి సినిమా చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర్ గారికీ  హెల్త్ సహకరించకపోయినా ఈ సినిమాకు ఎంతో ప్రాణం పెట్టి పని చేశారు. ఈ సినిమా చూసిన ముత్యాల రాందాస్ గారు ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు అన్నారు.

ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. నాకు రాజశేఖర్ గారు అంటే ఎంతో ఇష్టం. ఈ సినిమాను చూపించమని అడిగిన వెంటనే జీవిత గారు, నిర్మాతలు ఈ సినిమాను చూపించారు.సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను మే 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాను అన్నారు.

రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
రైటర్: లక్ష్మీ భూపాల. సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని.